17-9-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడును”
(లేదా...)
“చెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్”
ఉ.చిప్పిలు కావ్యతామృతము చెన్నెసలారును పద్యమందు చే త్రిప్పుచు వ్రాయ పండితులు తెల్లముగా నెదలందు మెత్తురే మెప్పుల మోజు లేదు కన మేల్బిరుదుల్ ప్రకటించి కీర్తి తా చెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్ !
ఆటవెలదిసంఘసంస్కరణకు చక్కని కథ వ్రాయదర్శకోత్తముండు దపన తోడచిత్రమొకటిఁ దీయ జేబు చిల్లిపడఁగచెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడునుఉత్పలమాలమెప్పును పొందెడున్ గథను మిన్నగ వ్రాసియుఁ జూప దర్శకుండొప్పియుఁ దీయ జిత్రము సమున్నత బోధల రాణకెక్కగన్ముప్పుగ జేబు చిల్లిపడ బొత్తిగ ప్రేక్షకులాదరింపకేచెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్
పెక్కుమంది విదులు విచ్చేసిరనుచు నా కవులచయము నచట కలుసు కొనగవట్టి కాళ్ళ తోడ బయనమ గుట గని చెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడును
చదువరులకు వలయు జ్ఞానమిడుట కంటె నెలగ తోడ జేబు నింపు కొనుటెముఖ్య మితనికనుచు పురజనులెల్లరుచెప్పుకొనఁగ , సుకవి సిగ్గుపడును
జనులు మెచ్చి కొట్టు చప్పట్ల మ్రోతలుకడుపు నింప వనుట కల్లకాదుదుడ్డు లేని బ్రతుకు దుర్లభమంచును చెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడును.అప్పది నిప్పువంటిదని యార్యుల మాటలెఱుంగ నేమిరాతప్పనె లేదు చేయకను దారసుతాదుల పోష ణార్థమై మెప్పులె తప్ప కైతలకు మేదిని కాసులు రాల వంచు తాచెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్.
చొప్పడుచుండ భావములు సుందర మైనవి మానసంబునన్కుప్పల కొద్ది కావ్యములు గొప్పగ యెప్పగు నట్లు వ్రాయుచున్ మెప్పును పొందుచుండినను మేటి కవిత్వము కాసు కూర్చకన్తిప్పలు యక్కజంబుగను తిండికి యయ్యెను మాకు నంచు తాచెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్
కవిత వ్రాసి సభను గానమ్ము సేయగా సభను మెఛ్చి నారు సకల జనులు సత్కరించ కుండ సభను ముగించ గా చెప్పు కొనగ సుకవి సిగ్గు పడును
సత్కవీంద్రులున్న సాహిత్య సభలోనతనదు రచన పైన తనరు చర్చ లోన తాను దూరి దానిని ఘనముగాచెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడునుచెప్పక చేరుకొన్నను విశిష్టులదౌ కవితాసదస్సులోకుప్పలు తెప్పలైన తతి కోరిన కావ్య సమీక్ష చేయుటేతప్పని సన్నివేశమున తాను స్వకావ్యపు వైభవమ్మునేచెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్
గొప్ప కవియతండు గుణములందున మిన్నస్వాతిశయము లేని సద్గుణుండుసభలయందు నెన్నొ సత్కారములనొందెచెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడునుగొప్ప కవీశ్వరుండతఁ డకుంఠితమాతనిదీక్ష వ్రాతలం,దెప్పుఁడు దాను దెప్పరము లేమఱిపాటుననైన వల్కడేమెప్పును కోరడెవ్వరికి మేలొనగూర్చిన, స్వంత గొప్పలన్చెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్
ఆ.వె:సమత గూర్చి యెపుడు చక్కగా రచియించుకవిని "మార్క్సిజమున గలదె నీకుప్రజ్ఞ?" యనగ "నేను పఠియింప లే"దనిచెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడును”(ఆథునిక కాలం లో సమానత్వం గూర్చి కవిత్వం వ్రాసే వాడికి మార్క్సిజం లో కనీస పరిచయం ఉండాలి.)
ఆ॥ సుమపు సౌరభమ్ము సుమతి వేమన పద్యమధురిమ చవి చూడ మనము మురియుఁజదివి తెలిసి కొనఁగ మదిని నిలుచు ననిచెప్ప కొనఁగ సుకవి సిగ్గు పడునుఉ॥ చెప్పఁగ నేలనో పకృతి చిత్రముఁ జూచిన మోదమొందరే!చెప్పఁగ నేలనో సొబగు శిల్పములన్ గన సంతసించరే!చెప్పఁగ నేల పద్య సిరి చెప్పుట మేల పఠించ స్పష్టమౌ!చెప్ప కొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్(కాని నేడు విషయం కంటే ప్రచారమే ముఖ్యం)
ఉ:ఎప్పుడు జూడ "తెల్గు నశియించుచు నున్నది దాని రక్ష యన్గొప్ప ప్రయత్నమున్ సలుప గోరితి" నంచు వచించు సత్కవిన్"చెప్పవె యచ్చ తెల్గుననె చిన్నగ పద్య" మనంగ తిప్పలున్జెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్”(తెలుగుని ఉద్ధరిద్దాం అనే కవులలో చాలా మంది అచ్చ తెనుగు లో ఒక పద్యం చెప్ప లేరు.అది సిగ్గు పడ వలసిన విషయమే.)
తాను మున్ను గాంచ లేనియట్టి దురవస్థ నెడఁదఁ దలపోసి జనులఁ గాంచి తనదు కావ్య మందుఁ దప్పులను బరులు చెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడును చెప్పక యున్న నెవ్వరును సిగ్గు వహింపఁడు సుంత యాత్మలోఁ జెప్పుకొనంగ నా కుకవి స్వీయ కవిత్వ పటుత్వముల్ సతం బొప్పును జెప్ప నన్యులు యథోక్తము స్వీయ యశమ్ము నింతయుం జెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్
సమస్య: “చెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్”ఉ.మా :గొప్ప కవిత్వమున్ మునుపుఁగోరియు వ్రాసిరి యాత్మతృప్తికైమెప్పును గోరరైరి మును మెచ్చగ వాణియు చాలుచాలనిన్ చెప్పిన చాలు గొప్పగను జేసిరి నూతన పద్య గద్యముల్ “చెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్”
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కొన్ని శతకములను గొప్పగా రచియించపండితులును మెచ్చె వాసిగానుకవుల మెప్పులేవి కడుపు నింపవనుచుచెప్పుకొనగ సుకవి సిగ్గుపడును.
ఉ.
రిప్లయితొలగించండిచిప్పిలు కావ్యతామృతము చెన్నెసలారును పద్యమందు చే
త్రిప్పుచు వ్రాయ పండితులు తెల్లముగా నెదలందు మెత్తురే
మెప్పుల మోజు లేదు కన మేల్బిరుదుల్ ప్రకటించి కీర్తి తా
చెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్ !
ఆటవెలది
రిప్లయితొలగించండిసంఘసంస్కరణకు చక్కని కథ వ్రాయ
దర్శకోత్తముండు దపన తోడ
చిత్రమొకటిఁ దీయ జేబు చిల్లిపడఁగ
చెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడును
ఉత్పలమాల
మెప్పును పొందెడున్ గథను మిన్నగ వ్రాసియుఁ జూప దర్శకుం
డొప్పియుఁ దీయ జిత్రము సమున్నత బోధల రాణకెక్కగన్
ముప్పుగ జేబు చిల్లిపడ బొత్తిగ ప్రేక్షకులాదరింపకే
చెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్
పెక్కుమంది విదులు విచ్చేసిరనుచు నా
రిప్లయితొలగించండికవులచయము నచట కలుసు కొనగ
వట్టి కాళ్ళ తోడ బయనమ గుట గని
చెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడును
చదువరులకు వలయు జ్ఞానమిడుట కంటె
రిప్లయితొలగించండినెలగ తోడ జేబు నింపు కొనుటె
ముఖ్య మితనికనుచు పురజనులెల్లరు
చెప్పుకొనఁగ , సుకవి సిగ్గుపడును
రిప్లయితొలగించండిజనులు మెచ్చి కొట్టు చప్పట్ల మ్రోతలు
కడుపు నింప వనుట కల్లకాదు
దుడ్డు లేని బ్రతుకు దుర్లభమంచును
చెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడును.
అప్పది నిప్పువంటిదని యార్యుల మాటలెఱుంగ నేమిరా
తప్పనె లేదు చేయకను దారసుతాదుల పోష ణార్థమై
మెప్పులె తప్ప కైతలకు మేదిని కాసులు రాల వంచు తా
చెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్.
చొప్పడుచుండ భావములు సుందర మైనవి మానసంబునన్
రిప్లయితొలగించండికుప్పల కొద్ది కావ్యములు గొప్పగ యెప్పగు నట్లు వ్రాయుచున్
మెప్పును పొందుచుండినను మేటి కవిత్వము కాసు కూర్చకన్
తిప్పలు యక్కజంబుగను తిండికి యయ్యెను మాకు నంచు తా
చెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్
కవిత వ్రాసి సభను గానమ్ము సేయగా
రిప్లయితొలగించండిసభను మెఛ్చి నారు సకల జనులు
సత్కరించ కుండ సభను ముగించ గా
చెప్పు కొనగ సుకవి సిగ్గు పడును
సత్కవీంద్రులున్న సాహిత్య సభలోన
రిప్లయితొలగించండితనదు రచన పైన తనరు చర్చ
లోన తాను దూరి దానిని ఘనముగా
చెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడును
చెప్పక చేరుకొన్నను విశిష్టులదౌ కవితాసదస్సులో
కుప్పలు తెప్పలైన తతి కోరిన కావ్య సమీక్ష చేయుటే
తప్పని సన్నివేశమున తాను స్వకావ్యపు వైభవమ్మునే
చెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్
గొప్ప కవియతండు గుణములందున మిన్న
రిప్లయితొలగించండిస్వాతిశయము లేని సద్గుణుండు
సభలయందు నెన్నొ సత్కారములనొందె
చెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడును
గొప్ప కవీశ్వరుండతఁ డకుంఠితమాతనిదీక్ష వ్రాతలం,
దెప్పుఁడు దాను దెప్పరము లేమఱిపాటుననైన వల్కడే
మెప్పును కోరడెవ్వరికి మేలొనగూర్చిన, స్వంత గొప్పలన్
చెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్
ఆ.వె:సమత గూర్చి యెపుడు చక్కగా రచియించు
రిప్లయితొలగించండికవిని "మార్క్సిజమున గలదె నీకు
ప్రజ్ఞ?" యనగ "నేను పఠియింప లే"దని
చెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడును”
(ఆథునిక కాలం లో సమానత్వం గూర్చి కవిత్వం వ్రాసే వాడికి మార్క్సిజం లో కనీస పరిచయం ఉండాలి.)
ఆ॥ సుమపు సౌరభమ్ము సుమతి వేమన పద్య
రిప్లయితొలగించండిమధురిమ చవి చూడ మనము మురియుఁ
జదివి తెలిసి కొనఁగ మదిని నిలుచు నని
చెప్ప కొనఁగ సుకవి సిగ్గు పడును
ఉ॥ చెప్పఁగ నేలనో పకృతి చిత్రముఁ జూచిన మోదమొందరే!
చెప్పఁగ నేలనో సొబగు శిల్పములన్ గన సంతసించరే!
చెప్పఁగ నేల పద్య సిరి చెప్పుట మేల పఠించ స్పష్టమౌ!
చెప్ప కొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్
(కాని నేడు విషయం కంటే ప్రచారమే ముఖ్యం)
ఉ:ఎప్పుడు జూడ "తెల్గు నశియించుచు నున్నది దాని రక్ష యన్
రిప్లయితొలగించండిగొప్ప ప్రయత్నమున్ సలుప గోరితి" నంచు వచించు సత్కవిన్
"చెప్పవె యచ్చ తెల్గుననె చిన్నగ పద్య" మనంగ తిప్పలున్
జెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్”
(తెలుగుని ఉద్ధరిద్దాం అనే కవులలో చాలా మంది అచ్చ తెనుగు లో ఒక పద్యం చెప్ప లేరు.అది సిగ్గు పడ వలసిన విషయమే.)
తాను మున్ను గాంచ లేనియట్టి దురవ
రిప్లయితొలగించండిస్థ నెడఁదఁ దలపోసి జనులఁ గాంచి
తనదు కావ్య మందుఁ దప్పులను బరులు
చెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడును
చెప్పక యున్న నెవ్వరును సిగ్గు వహింపఁడు సుంత యాత్మలోఁ
జెప్పుకొనంగ నా కుకవి స్వీయ కవిత్వ పటుత్వముల్ సతం
బొప్పును జెప్ప నన్యులు యథోక్తము స్వీయ యశమ్ము నింతయుం
జెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్
సమస్య:
రిప్లయితొలగించండి“చెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్”
ఉ.మా :
గొప్ప కవిత్వమున్ మునుపుఁగోరియు వ్రాసిరి యాత్మతృప్తికై
మెప్పును గోరరైరి మును మెచ్చగ వాణియు చాలుచాలనిన్
చెప్పిన చాలు గొప్పగను జేసిరి నూతన పద్య గద్యముల్
“చెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్”
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కొన్ని శతకములను గొప్పగా రచియించ
పండితులును మెచ్చె వాసిగాను
కవుల మెప్పులేవి కడుపు నింపవనుచు
చెప్పుకొనగ సుకవి సిగ్గుపడును.