మ:గురుబోధన్ విన ద్వైతభావచయమే కూలంగ, నద్వైతభా స్కరతేజమ్ముదయింప ,నంత మయి యజ్ఞానమ్ము,వా రిద్దరన్ పరతత్త్వమ్మున నొక్క రైన స్థితిలో భాషింప నేముండు? నా గురువే శిష్యుఁడు శిష్యుఁడే గురువుగాఁ గూర్చుండి రాశ్చర్యమే (గురుబోధతో శిష్యుడు అద్వైతానుభూతి పొందాడు. ఇక ఇద్దరూ బ్రహ్మస్వరూపులే కనుక భాషణలు,బోధలు ఉండవు."గురువు శిష్యుండాయె శిష్యుడే గురు వాయె,గురువు శిష్యుల మధ్య గురి యొక్క టాయె" అని పూర్వం బైరాగి తత్త్వాలలో ఒక పాట ఉన్నది.)
తేటగీతి
రిప్లయితొలగించండిశిష్యుని నిబద్ధతయు భక్తి చేపడంగ
గురువుకున్ జ్ఞానమున్ బంచుకొనఁగఁ జేయ
నొకరినుండియు ప్రేరణలొకరునొంది
గురువె శిష్యుండు శిష్యుఁడే గురువునైరి!
తేటగీతి
భరతుడే కోరినంతట పట్టమొందు
ధర్మము వశిష్టముని చెప్ప దాశరథికి
చూపి తండ్రిమాటగ ధర్మసూక్ష్మమచట
గురువె శిష్యుండు శిష్యుఁడే గురువునైరి
మత్తేభవిక్రీడితము
భరతుండొప్పగ రామమూర్తికిడగన్ పట్టమ్ము సద్భక్తిమై
వరుసన్ మౌని వశిష్టుడున్ బలుకగన్పట్టమ్ము సేపట్టగన్
సరియే తండ్రినిధిక్కరించుటనుచున్ సంధించి సూక్ష్మమ్మునే
గురువే శిష్యుఁడు శిష్యుఁడే గురువుగాఁ గూర్చుండి రాశ్చర్యమే!
గురుదేవులకు ప్రణామములు.
తొలగించండిమొదటి తేటగీతి లో
రెండవ పాదము:
"గురువునకు జ్ఞానమున్ బంచుకొనఁగఁ జేయ"
అని చదువుకొన ప్రార్థన
మ.
రిప్లయితొలగించండిసురసేనాధిప వాఙ్మహత్వ గుణ విస్ఫురత్ప్రశస్తైక సుం
దర పూజ్య ప్రణవ ప్రతత్త్వమును వాత్సల్యంబుతో చేరె నా
హరి సూనాస్త్ర హరుండు తానెరుగగా నజ్ఞానదూరుండె పో
గురువే శిష్యుడు శిష్యుడే గురువుగా కూర్చుండి రాశ్చర్యమే !
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'విస్ఫురత్' అన్నచోట గణభంగం.
నవ్య పరికరము నెపుడు నడప కుండి
రిప్లయితొలగించండివాడుటందున శిష్యుని ప్రాపు కొరకు
వేడు మకొన దలంచెనపుడు వృద్ధ గురువు
గురువె శిష్యుండు శిష్యుఁడే గురువునైరి”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి*(శ్రీకృష్ణుడు అర్జునునకు మిత్రుడు బావనే కాదు గురువు కూడా కదా...)*
చక్రి యాదేశమున్ గొని సవ్యసాచి
సంయుతుని వేష మందున సఖి సుభద్ర
బెండ్లియాడగ వచ్చిన వేళ కనగ
గురువె శిష్యుండు శిష్యుఁడే గురువునైరి.
నరుడేతెంచెను మారువేషమున కృష్ణాదేశ బద్ధుండుగా
తరుణిన్ బెండిలి యాడు దీక్షగొని యుత్సుంగుండుగా జేర నీ
వరుడంచున్ పరమాత్మ తుల్యుడనుచున్ వార్ష్ణేయుడే చేరుచున్
గురువే శిష్యుఁడు శిష్యుఁడే గురువుగాఁ గూర్చుండి రాశ్చర్యమే.
నిత్య విద్యార్థు లగుదురు నియతి గలుగ
రిప్లయితొలగించండికలుగు జ్ఞానము వారల కర్మ ఫలము
ఫలము నందించు ఛాత్రుడె పరమ గురువు
గురువె శిష్యుండు శిష్యుఁడే గురువునైరి”
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅతడు సంగీతమును నేర్చెనాతతముగ
రిప్లయితొలగించండితనకు విద్యలు నేర్పు నధ్యాపకుండు
సలుప సంగీత సాధన ఛాత్రుని కడ
గురువె శిష్యుండు శిష్యుఁడే గురువునైరి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాఠముల్ జెప్పె పాఠికి పంతులయ్య
రిప్లయితొలగించండిపంతులయ్యకు గానంబు పాఠి జెప్పె
ఇద్దరిట్లు చెప్పుకొనుచు ముద్దుగాను
గురువె శిష్యుండు శిష్యుడే గురువునైరి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితారు మారైన పాత్రల తీరునెఱుగ
రిప్లయితొలగించండితారసిల్లు సంఘటనలు ధరణిపైన
నూత్న బోధనాంశమ్ములఁ నుడిగినపుడు
గురువె శిష్యుండు శిష్యుఁడే గురువునైరి
ధరలో సంభవమైన సంగతులకే తార్కాణముల్ మెండుగా
మరి చిన్నప్పుడు విద్యనేర్పు గురువే మారంగ విద్యార్థిగా
గురువై బోధన సల్పె నాటి శిశువే కొంగ్రొత్త పాఠ్యాంశమే
గురువే శిష్యుఁడు శిష్యుఁడే గురువుగాఁ గూర్చుండి రాశ్చర్యమే
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండినూతన చరవాణి ని కొని చేత బట్టి
రిప్లయితొలగించండిదాని వాడుట దెలియక దరికి జేరి
శిష్యు నడుగగ నాతడు చెప్పె నపుడు
గురువు శిష్యుండు శిష్యుడే గురువు నైరి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువై కౌశికుడిచ్చె నస్త్రవితతుల్ కూలంకషంబౌ గతిన్
రిప్లయితొలగించండిశిరమున్ దాల్చెను రాఘవుండు వినతిన్ శిష్యుండు తానంతటన్
హరి చాపంబునుఁ బూన రాముడు వివాహంబైన కాలంబునన్
గురువే శిష్యుఁడు శిష్యుఁడే గురువుగాఁ గూర్చుండి రాశ్చర్యమే!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితే.గీ:తాత మనుమనికిన్ సంస్కృతమును నేర్పు,
రిప్లయితొలగించండిమనుమడును ముఖపుస్తకమును గరపును
తాత, కీ గురుశిష్య బంధమును గనగ
గురువె శిష్యుండు శిష్యుఁడే గురువునైరి
మ:గురుబోధన్ విన ద్వైతభావచయమే కూలంగ, నద్వైతభా
రిప్లయితొలగించండిస్కరతేజమ్ముదయింప ,నంత మయి యజ్ఞానమ్ము,వా రిద్దరన్
పరతత్త్వమ్మున నొక్క రైన స్థితిలో భాషింప నేముండు? నా
గురువే శిష్యుఁడు శిష్యుఁడే గురువుగాఁ గూర్చుండి రాశ్చర్యమే
(గురుబోధతో శిష్యుడు అద్వైతానుభూతి పొందాడు.
ఇక ఇద్దరూ బ్రహ్మస్వరూపులే కనుక భాషణలు,బోధలు ఉండవు."గురువు శిష్యుండాయె శిష్యుడే గురు వాయె,గురువు శిష్యుల మధ్య గురి యొక్క టాయె" అని పూర్వం బైరాగి తత్త్వాలలో ఒక పాట ఉన్నది.)
మ:"త్వరగా! రా గురువా !"యటంచతడు పిల్వన్,వీడు లుంగీని తొం
రిప్లయితొలగించండిదరతో సద్దుక, "వచ్చుచుంటిని గురూ! త్రాగింతునా చాయి?" యం
చరుదెంచున్,గురు వెవ్వడో! యెవని శిష్యత్వమ్మొ! పేకాటలో
గురువే శిష్యుఁడు శిష్యుఁడే గురువుగాఁ గూర్చుండి రాశ్చర్యమే”
(వాడు వీణ్ని గురూ! అంటాడు.వీడూ వాణ్ని గురూ అంటాడు.ఎవడు గురువో ఎవడు శిష్యుడో.ఇద్దరూ పేకాటకి కూర్చొన్నారు.)
తే॥ తనరుచు సతము ముదముగఁ దత్పరతను
రిప్లయితొలగించండిశిష్యుఁడు పరిశోధించి విశిష్ట ఫలిత
మొందఁగ వివరించ నటుల నుత్సహిల్లి
గురువె శిష్యుండు శిష్యుఁడె గురువునైరి
మ॥ పరఁగన్ నిష్ఠగ శ్రద్ధ వీడకను బెంపారంగ నుత్సాహమే
పరిశోధించుచు శిష్యుఁడావిధిని సౌభాగ్యమ్ము నేపారఁగన్
జరితార్థంబగు సిద్ధిఁ బొంద ఫలితాంశమ్ముల్ నివేదించఁగన్
గురువే శిష్యుఁడు శిష్యుఁడే గురువుగాఁ గూర్చుండి రాశ్చర్యమే
సమస్య
రిప్లయితొలగించండి“గురువే శిష్యుఁడు శిష్యుఁడే గురువుగాఁ గూర్చుండి రాశ్చర్యమే”
మత్తేభవిక్రీడితము:
హరసూనుండు గణేశుడే పలికెనే హర్షంబుతో వ్రాయగా
సరిగా ఘంటము నాపకే లిఖితమన్ సవ్యంబుగా జెప్పగన్
భరతాగ్రంపు కథే లిఖింపగ మహాబాగున్ ద్విజన్మంబుతో
“గురువే శిష్యుఁడు శిష్యుఁడే గురువుగాఁ గూర్చుండి రాశ్చర్యమే”
(వేదవ్యాస ముని మహాభారత కథ దంతి ఏకదంతముతో వ్రాయడం గుర్తొచ్చి)
ఓడలే బం డ్లకట బండ్లె యోడ లైన
రిప్లయితొలగించండిచందము ననుకరింపంగఁ జాలి నట్లు
కాల మేతేర నిప్పు డక్కజముగాను
గురువె శిష్యుండు శిష్యుఁడే గురువు నైరి
పుర విద్వాంసు లలంకరింపఁ దమి సంపూర్ణప్రమోదాస్యులై
కర మాసక్తినిఁ జేయఁ దర్కమును శంకాహీన మానస్కులై
పరికింపంగ సభా స్థలమ్మునను విద్వత్స్వీయ పుత్రుండునున్,
గురువే శిష్యుఁడు, శిష్యుఁడే గురువుగాఁ గూర్చుండి రాశ్చర్యమే
[గురువే శిష్యుఁడు శిష్యుఁడే గురువు = తఁడ్రి (యొకప్పుడు) శిష్యుఁ డా శిష్యుఁడే (ఇప్పుడు) గురువు]
మీ పూరణలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
తొలగించండిధరలో ఛాత్రుడొకండు వేదవిదికిన్ దాస్యమ్ము సల్పంగనా
రిప్లయితొలగించండిగురువే శిష్యుని గోరె నేర్పమని సంకోచింపకన్ గానమున్
సరవిన్ ఛాత్రుకు విద్యనేర్పు తన యాచార్యుండె శిష్యుండయెన్
గురువే శిష్యుఁడు శిష్యుఁడే గురువుగాఁ గూర్చుండి రాశ్చర్యమే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పాఠశాలలో వేసిన నాటకమున
శిష్యుడు గురువు పాత్ర పోషించగాను
గురువు శిష్యుని పాత్రను ధరణమొందె
గురువె శిష్యుండు శిష్యుడే గురువునైరి.
గురువు రానట్టి వేళలో గోలచేయు
రిప్లయితొలగించండిఛాత్రులకుపాఠములనెల్ల చక్కగాను
బోధచేయుచుతరగతిన్ భూరిగాను
*“గురువె శిష్యుండు శిష్యుఁడే గురువునైరి”*