23, సెప్టెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5252

24-9-2025 (బుధవారం)
కవి మిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కారుం గని మ్రొక్కఁగ శుభకామన లిచ్చెన్"
లేదా
"కారునుఁ జూచి మ్రొక్క శుభకామన లిచ్చె నపూర్వరీతిగన్"

21 కామెంట్‌లు:

  1. ఉ.
    శ్రీ రమణీయ వాగమృత శేవధి భాసిత కావ్య పద్ధతిం
    జేరి ప్రసన్న సంస్తుతుల జెన్నెసలారగ వ్రాసి భక్తితో
    ధీర సుసేవితుం వరదు దివ్యనదీధరు శంకరుం శుభా
    కారును జూచి మ్రొక్క శుభ కామనలిచ్చె నపూర్వ రీతిగన్ !

    రిప్లయితొలగించండి
  2. కందం
    తీరిచి విప్రుని బంపఁగ
    నేరిచి రుక్మిణి తలఁపును నిర్ద్వందముగన్
    శౌరికిఁ దెలుపుచు దివ్యా
    కారుం గని మ్రొక్కఁగ శుభకామన లిచ్చెన్

    ఉత్పలమాల
    తీరిచి విప్రునిన్ దనదు దృక్పథమేర్పడ జెప్పిపంపగన్
    నేరిచి కార్యనిర్వహణ నీరజ నేత్ర విదర్భరాట్సుతన్
    గూరిచి స్వాంతమున్ దెలిపి గోకుల కృష్ణుని దివ్య మోహనా

    రిప్లయితొలగించండి
  3. కారణ జన్ము o డగుచు ను
    తోరపు సేవల నొనర్చు దోహద పరుడై
    ధారుణి మె లిగెడి యా సం
    స్కా రు o గని మ్రొ క్క గ శుభ కామన లి చ్చె న్

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. సైరిక సోదరుండు వ్యవసాయము నందు శ్రమించు మిక్కిలిన్
      భారమదంచు నెంచకను పంటలు పండగ జేయు చుండు తా
      జోరుగ వర్షమిచ్చుచును శోభను మిక్కిలి గూర్చు నట్టి క్రొ
      *క్కారును జూచి మ్రొక్క శుభకామన లిచ్చె నపూర్వరీతిగన్*

      తొలగించండి

  5. నేరంబది యని తండ్రియె
    వారించిననేమి సుతుడు ప్రహ్లాదుండే
    భారూపముగొల్చి నిరా
    కారుం గని మ్రొక్కఁగ శుభకామన లిచ్చెన్.


    చేరి నుతించినంత సురశ్రేణి యవస్థల తీర్చనెంచుచున్
    గౌరిని బెండ్లియాడి విషకంఠుడు తాను తపమ్ము వీడుచున్
    తారక ఘస్మరున్ గనెను, దల్మియె బర్హియుడైన షణ్ముఖా
    కారునుఁ జూచి మ్రొక్క శుభకామన లిచ్చె నపూర్వరీతిగన్.

    రిప్లయితొలగించండి
  6. సారములేని జీవితము సాగుచు
    నుండగ చింత జెందియున్
    గోరిన చిత్తశుద్ధిమెయి కోర్కలు
    దీర్చెడి సర్వసాక్షిపై
    భారము వేసి తిర్గుచును బావన
    కాశికి జేరి నే శివా
    కారును జూచి మ్రొక్క శుభ కామన
    లిచ్చె నపూర్వ రీతిగన్

    రిప్లయితొలగించండి
  7. వారాంతపు యనుగలమున
    కోరిక దీర్చమని వేడ గోవెల కేగన్
    సారంగుడనబడెడి లయ
    కారుం గని మ్రొక్కఁగ శుభకామన లిచ్చెన్

    రిప్లయితొలగించండి
  8. కోరిన వర సాధనకై
    తారకు డొనరించె గాదె దారుణ తపమున్
    జేరగ వచ్చిన భవ్యా
    కారుం గని మ్రొక్కఁగ శుభకామన లిచ్చెన్

    ఘోరతపస్సుతో మునుల కోర్కెలు తీరుట సుప్రసిద్దమే
    కోరినవెల్ల పొందుటకు ఘోరతపంబొన రించె బ్రహ్మకై
    తారకుడే ప్రసన్నుడయి దర్శనమిచ్చిన దివ్య మంగళా
    కారునుఁ జూచి మ్రొక్క శుభకామన లిచ్చె నపూర్వరీతిగన్

    రిప్లయితొలగించండి
  9. కోరిన వరములనొసగును
    తీరుగ గమ్యమునుఁజేర్చు తేరుగ నిలుచున్
    పౌరులు భక్తిగ శాంతా
    కారుం గని మ్రొక్కఁగ శుభకామన లిచ్చెన్

    రిప్లయితొలగించండి
  10. చీరలు మ్రుచ్చిలించెనట చిన్మయరూపుఁడు కృష్ణమూర్తి తా
    చీరలొసంగి ద్రోవతికి శీలముఁగాచె సభాంగణమ్మునన్
    శౌరి దయామయుండు మనసార దలంచుచు దివ్యమంగళా
    కారునుఁ జూచి మ్రొక్క శుభకామన లిచ్చె నపూర్వరీతిగన్

    రిప్లయితొలగించండి
  11. కం॥ సారస నేత్రుని భావన
    మీరఁగ భక్తినిఁ దనరుచు మెలఁపుగ ధరలో
    ధారణఁ జేయుచు విశ్వా
    కారుం మ్రొక్కఁగ శుభకామన లిచ్చెన్

    ఉ॥ సారము నెంచి వేదముల సారస నేత్రుని విశ్వరక్షకున్
    నేరిచి భక్తి భావమును నెమ్మిని నిత్యము విశ్వరూపునున్
    ధారణఁ జేయుటే భువిని తారక మంత్రమ టంచునే నిరా
    కారునుఁ జూచి మ్రొక్క శుభకామన లిచ్చె నపూర్వ రీతిగన్

    రిప్లయితొలగించండి
  12. కం:మీ రచన యౌ "నశోక్" కడు
    తీరగు చిత్రణల నొప్పె, దివ్య, మని పుర
    స్కార మిడుచు విద్యాలం
    కారుం గని మ్రొక్కఁగ శుభకామన లిచ్చెన్"
    (చంద్ర గుప్త విద్యాలంకార్ అనే రచయిత హిందీ లో అశోక్ అనే నాటకం వ్రాసాడు.ఆయన కొక పురస్కార మిచ్చి నమస్కరిస్తే ఆయన దీవించాడు.)

    రిప్లయితొలగించండి
  13. ఉ:కారుకు నిమ్మకాయలను గట్టి ,యలంకరణమ్ము జేయ బూ
    జారి యనేకమంత్రముల జక్కగ బల్కుచు భక్తి తో నమ
    స్కారము జేయ జెప్పె ,నది చాలక "కారుకు మ్రొక్కు" డం చనెన్
    కారునుఁ జూచి మ్రొక్క శుభకామన లిచ్చె నపూర్వరీతిగన్"
    (వాహనపూజ)

    రిప్లయితొలగించండి
  14. ఘోర తరమ్ముగ నిల గం
    భీర గతి నరులకు వచ్చు వెత లెల్లం బో
    కారుప సద్ధిమ లింగా
    కారుం గని మ్రొక్కఁగ శుభకామన లిచ్చెన్


    మూరిన భక్తి సాంబ శివు భూతగ ణేశు నిజాంగ భస్మ సం
    స్కారుని నంతకారి విష కంఠుని సంతత సర్వ దేవ స
    త్కారుని నిర్వికారుని నితాంత వినాశ మొసంగు నట్టి క్రొ
    క్కారునుఁ జూచి మ్రొక్క శుభకామన లిచ్చె నపూర్వరీతిగన్

    రిప్లయితొలగించండి
  15. చిన్న వ్యాకరణ విశేషము:
    ఇక్కడ చాలా మంది కవులు “కారునుఁ” శబ్దమును ....ఆకారునుఁ గా గ్రహించి పూరించితిరి. ఈ ప్రయోగము సాధువు కాదు. “ఆకారునిఁ / ఆకారుం “ ప్రయోగములు సాధువు లగును. కాని సమస్యలో నట్లు లేదు. దీనినిఁ బరిశీలింపఁ గోరెదను.

    రిప్లయితొలగించండి
  16. సమస్య:
    కారునుఁ జూచి మ్రొక్క శుభకామన లిచ్చె నపూర్వరీతిగన్ !

    ఉ.మా :

    తీరుగ దిద్ద చందనము దీటుగ కుబ్జను యంపె కంసుడే
    పేరిమి భూషణల్ నిడగ ప్రేముడి నెన్నిక చేసె నేలనో
    మీరిన ప్రేమ స్వాగతము మిమ్ముల గొంపొదు మామ సన్నిధన్
    కోరెను కృష్ణుడే నగల కూరిమి గడ్డము బట్టు సుందరా
    కారునుఁ జూచి మ్రొక్క, శుభకామన లిచ్చె నపూర్వరీతిగన్ !

    ఊరును బేరు లేదు మరి యూహలు రేపెడి రూపు లేనిదే
    తీరని కోరికల్ సలుప తీరగు దేహము లేని కుబ్జ నే
    తీరుగ దిద్ద చందనము తీరున దెమ్మనె కంసుడే, శుభా
    కారునుఁ జూచి మ్రొక్క, శుభకామన లిచ్చె నపూర్వరీతిగన్ !

    రిప్లయితొలగించండి
  17. ఊరందఱు నొక్కటియై
    నేరంబులనెంచుకొనక నియమము తోడన్
    మీరనిభక్తిని చిన్మయ
    కారుం గని మ్రొక్కఁగ శుభకామన లిచ్చెన్"

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    శ్రీరాముని మది తలచుచు
    నారాధన చేయుచుండి యనుదినమందున్
    భారము నీదనుచు శుభా
    కారుంగని మ్రొక్కగ శుభ కామనలిచ్చెన్.

    రిప్లయితొలగించండి