కందం పరమాత్మ సమానుడనన్ గురువందు త్రిమూర్తులెల్ల గోచరమగుచున్ గరపఁగ విద్యాదుల, నే గురు ధనము హరింపనొప్పు గుజనుల్ మెచ్చన్?
చంపకమాల కరపుచు విద్యలన్ హృదికి గంధమునద్దెడు పూజ్యునట్లుగన్ గురువు త్రిమూర్తి రూపుడనఁ గొల్చిరి రాముడు కృష్ణమూర్తియున్ నిరతము వారి సేవలను నిల్చుటనొప్పు! వితండవాది! యే గురు ధనమున్ హరింపఁగఁ దగున్ జనులెల్లరు సూచి మెచ్చఁగన్?
చ.
రిప్లయితొలగించండిపరులను మోసగించి పెనుభారము మోప ప్రభుత్వ గర్వమున్
విరివిగ దెల్పి పన్నులను వేయుచు సొమ్ములు దోచె వాడు రా
త్రి రయము తెచ్చెదం బలుక లేను రహస్యము నాదు గొంతు బొం
గురు, ధనమున్ హరింపగ దగున్ జనులెల్లరు సూచి మెచ్చగన్ !
కందం
రిప్లయితొలగించండిపరమాత్మ సమానుడనన్
గురువందు త్రిమూర్తులెల్ల గోచరమగుచున్
గరపఁగ విద్యాదుల, నే
గురు ధనము హరింపనొప్పు గుజనుల్ మెచ్చన్?
చంపకమాల
కరపుచు విద్యలన్ హృదికి గంధమునద్దెడు పూజ్యునట్లుగన్
గురువు త్రిమూర్తి రూపుడనఁ గొల్చిరి రాముడు కృష్ణమూర్తియున్
నిరతము వారి సేవలను నిల్చుటనొప్పు! వితండవాది! యే
గురు ధనమున్ హరింపఁగఁ దగున్ జనులెల్లరు సూచి మెచ్చఁగన్?
కొరమాలు నీతుల నేర్పిరి ,
రిప్లయితొలగించండిజరుగుబడిని యిక్కుపాటు సలుపుచు దానున్
విరివిగ సంపాదించిన
గురు ధనము హరింపనొప్పు గుజనుల్ మెచ్చన్
సహదేవుడు ధర్మరాజుతో పలుకుట:-
రిప్లయితొలగించండికురు కులమందు పుట్టితిమి, కూరిమి కౌరవులయ్యె వారలే!
పరులను రీతి లోకమున పాండవులైతిమి! పోయె సంపదల్!
పరువది పోయె! కానలకు వచ్చితిమిట్టుల! బాధ తగ్గగన్
గురు ధనమున్ హరింపఁగఁ దగున్ జనులెల్లరు సూచి మెచ్చఁగన్!!
తగ్గగన్ + కురు ధనము = తగ్గగన్ గురు ధనము
రిప్లయితొలగించండిఅరయగ త్రిమూర్తుల సముడు
ధరణిని పూజ్యుండనుచును తలచెడి వానిన్
దరిజేరుచు జ్ఞానమనెడి
గురు ధనము హరింపనొప్పు గుజనుల్ మెచ్చన్.
హరిహర ధాతతుల్యులని యక్షరమౌ యవభాస మిచ్చుచున్
ధరణిని గౌరవింపదగు దక్షులటంచును వారలన్ సదా
సురలుగ నెంచి కొల్వవలె సువ్రతులెప్పుడు జ్ఞానమంచనే
గురు ధనమున్ హరింపఁగఁ దగున్ జనులెల్లరు సూచి మెచ్చఁగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికఱకులు దుష్టవర్తనులు కామమదాదులు దోచినారుగా
రిప్లయితొలగించండికరుకు కరంబు లందు చురకత్తులు పట్టి ధనంబు మిక్కిలిన్
మరిమరి జొచ్చి వాసములు మానక చౌర్యము దోచినట్టి యా
గురు ,ధనమున్ హరింపగ దగున్ జనులెల్లరు సూచి మెచ్చగన్
గురు= మిక్కిలెక్కువ