4-12-2025 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పతిని నమ్మి భామ భంగపడెను”(లేదా...)“పతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్”
కలహభోజనుండు కలికి సత్యాంబతో.....ఆటవెలదిమీరజాలడంచుఁ గూరిమిఁ జూపితే!రుక్మిణమ్మయింటి రుచులఁ దేలిపారిజమ్ము నొసఁగె వరముగ! సత్యాంబ!పతిని నమ్మి భామ భంగపడెను!మత్తేభవిక్రీడితముసతిగా నన్నెపుడైన మీరడనుచున్ జక్రిన్ సమర్థించితే!జతగాడౌచును రుక్మిణీ సతికి పుష్పమ్మున్ ప్రసాదించెనే!కతలన్ జెప్పెదనంచుఁ జూడకుమ! నిక్కంబెంచ సత్యాంబ! యీపతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్!
*(శకుంతల దుష్యంతులు)*పరిణయమ్ము నాడి భార్యగా చేకొందు ననుచు నమ్మ పలికి నట్టి వాడు ప్రభువటంచు నెరగి ప్రశ్రయ మందు భూ పతిని నమ్మి భామ భంగపడెను.యతినందంతి శకుంతలన్ గనుచు నా యందమ్ముకే ముగ్దుడై సతిగా చేకొని రాణి సేతునని దుశ్యంతుండె యా యాశ్రమున్ ప్రతినన్ బూనితి నంచు చెప్పగనె నా వాల్గంటి యావేళ భూ పతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్.
అందమైన వాని నార్యునిగ నొసగ ప్రార్థ న నిడె విధికీ బగితి తోడకూరె మగని గ నొక కుడిపి ,య టుల ప్రజాపతిని నమ్మి భామ భంగపడెను
భార్య బిడ్డలన్న పట్టకుండిన వాడుబానిసత్వమునను వ్యసనములకుబాగుపడితి నేను బంగారమిమ్మన పతిని నమ్మి భామ భంగపడెను
కణ్వుని కొమరితను గనిన దుష్యంతుడేమనసు దోచితివని మగువను గొనెసుతుని బడసి కడకు పతినిరాదరణతోపతిని నమ్మి భామ భంగపడెనుమతి పోకార్చిన తమ్మికంటి వనుచున్ మారాజు దుష్యంతుడేకృతకృత్యుండయె లేమ మానసమునన్ గెల్పొందగా పిమ్మటన్బతినేచేర శకుంతలే వెడలెగా! పర్యావసానంబుగాఁబతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్
నిన్నుఁ దప్ప నొరుల నెన్నఁడు గూడనునన్ను నమ్ముమనుచు నెన్నొ బలికిసవతిని గొనిదెచ్చి యవమతి యొనరించుపతిని నమ్మి భామ భంగపడెను
అతులంబౌ యనురాగమున్నది సఖీ యన్యాయముం జేతునాసతతంబున్ నినుఁగూడి యుందుననుచున్ సత్యమ్ము నమ్మంచు తానతిగా బాసలు చేసి తెచ్చె సవతిన్ హా దైవమా యివ్విధిన్పతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్
శకుంతల దుష్యంతుల కథఆ॥ ఆదరమ్ముఁ జూపి యవనీశుఁడాశ్రమవాసిని సతిగ కొనె బాళి యెగియపిదప మరచిపోయి ముదితఁ గాదనె సతి పతిని నమ్మి భామ భంగ పడెనుమ॥ అతి సద్వర్తనఁ జూపి రాజటుల నత్యంతాదరం బుంచుచున్సతి నీవంచును స్వీకరించి మరి దుష్యంతుండు పోనాడెనేమతి వీడంగ శకుంతలన్ గనుచు నమ్మంజాలకన్ బత్నిగాఁబతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్బాళి కాంక్ష పోనాడు నిందించుమరొక పూరణ అండి (నేటి దేశ కాల పరిస్థితుల కన్వయించి జరుగుతున్న కథ)మ॥ స్థితి మంతుండని నిర్ణయించి మనువున్ జేయంగ మోదమ్ముతోన్మతి హీనుండుగ మద్య పానమును సమ్మానించి భార్యామణిన్వెతలన్ బెట్టి నిరంతరమ్ము ధరలో వేధించ దుర్మార్గుఁడైపతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్
ఆ.వె:స్థాయి మించు వాడు తనను బ్రేమించిననమ్ము మగువ యాశ వమ్మె యగునుముని కుమార్తె యయ్యు, భూపతిన్ ,దుష్యంతు,పతిని నమ్మి భామ భంగపడెను”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కోరి నట్టి నగను కొన గల నని జెప్పి మాయ మాట తోడ మనసు దోచి శూన్య మైన చేయి చూప గానె పతిని నమ్మి భామ భంగ పడెను
మ:సతి యే కోర విడాకులన్ మదిని బశ్చాత్తపమున్ బొంది యాపతి దైవమ్మును దల్చి యిట్లనెను" నా పాపమ్మె యిట్లయ్యె, నాసతినిన్ గొట్టితి,దిట్టితిన్, దనను హింసలు వెట్టు నే నర్హునౌపతినే! నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్
ఆ॥వెపిలువనిదిదియనుచు పెనుజోగి వలదన్ననేగి పుట్టినిల్లు నెనరు మీరకన్నతండ్రి కూర్మి కరుగదంచు ప్రసూతిపతిని నమ్మి భామ భంగపడెను!(ప్రసూతి పతి: దక్షప్రజాపతి)
కలహభోజనుండు కలికి సత్యాంబతో.....
రిప్లయితొలగించండిఆటవెలది
మీరజాలడంచుఁ గూరిమిఁ జూపితే!
రుక్మిణమ్మయింటి రుచులఁ దేలి
పారిజమ్ము నొసఁగె వరముగ! సత్యాంబ!
పతిని నమ్మి భామ భంగపడెను!
మత్తేభవిక్రీడితము
సతిగా నన్నెపుడైన మీరడనుచున్ జక్రిన్ సమర్థించితే!
జతగాడౌచును రుక్మిణీ సతికి పుష్పమ్మున్ ప్రసాదించెనే!
కతలన్ జెప్పెదనంచుఁ జూడకుమ! నిక్కంబెంచ సత్యాంబ! యీ
పతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్!
రిప్లయితొలగించండి*(శకుంతల దుష్యంతులు)*
పరిణయమ్ము నాడి భార్యగా చేకొందు
ననుచు నమ్మ పలికి నట్టి వాడు
ప్రభువటంచు నెరగి ప్రశ్రయ మందు భూ
పతిని నమ్మి భామ భంగపడెను.
యతినందంతి శకుంతలన్ గనుచు నా యందమ్ముకే ముగ్దుడై
సతిగా చేకొని రాణి సేతునని దుశ్యంతుండె యా యాశ్రమున్
ప్రతినన్ బూనితి నంచు చెప్పగనె నా వాల్గంటి యావేళ భూ
పతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్.
అందమైన వాని నార్యునిగ నొసగ
రిప్లయితొలగించండిప్రార్థ న నిడె విధికీ బగితి తోడ
కూరె మగని గ నొక కుడిపి ,య టుల ప్రజా
పతిని నమ్మి భామ భంగపడెను
భార్య బిడ్డలన్న పట్టకుండిన వాడు
రిప్లయితొలగించండిబానిసత్వమునను వ్యసనములకు
బాగుపడితి నేను బంగారమిమ్మన
పతిని నమ్మి భామ భంగపడెను
కణ్వుని కొమరితను గనిన దుష్యంతుడే
రిప్లయితొలగించండిమనసు దోచితివని మగువను గొనె
సుతుని బడసి కడకు పతినిరాదరణతో
పతిని నమ్మి భామ భంగపడెను
మతి పోకార్చిన తమ్మికంటి వనుచున్ మారాజు దుష్యంతుడే
కృతకృత్యుండయె లేమ మానసమునన్ గెల్పొందగా పిమ్మటన్
బతినేచేర శకుంతలే వెడలెగా! పర్యావసానంబుగాఁ
బతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్
నిన్నుఁ దప్ప నొరుల నెన్నఁడు గూడను
రిప్లయితొలగించండినన్ను నమ్ముమనుచు నెన్నొ బలికి
సవతిని గొనిదెచ్చి యవమతి యొనరించు
పతిని నమ్మి భామ భంగపడెను
అతులంబౌ యనురాగమున్నది సఖీ యన్యాయముం జేతునా
రిప్లయితొలగించండిసతతంబున్ నినుఁగూడి యుందుననుచున్ సత్యమ్ము నమ్మంచు తా
నతిగా బాసలు చేసి తెచ్చె సవతిన్ హా దైవమా యివ్విధిన్
పతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్
శకుంతల దుష్యంతుల కథ
రిప్లయితొలగించండిఆ॥ ఆదరమ్ముఁ జూపి యవనీశుఁడాశ్రమ
వాసిని సతిగ కొనె బాళి యెగియ
పిదప మరచిపోయి ముదితఁ గాదనె సతి
పతిని నమ్మి భామ భంగ పడెను
మ॥ అతి సద్వర్తనఁ జూపి రాజటుల నత్యంతాదరం బుంచుచున్
సతి నీవంచును స్వీకరించి మరి దుష్యంతుండు పోనాడెనే
మతి వీడంగ శకుంతలన్ గనుచు నమ్మంజాలకన్ బత్నిగాఁ
బతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్
బాళి కాంక్ష పోనాడు నిందించు
మరొక పూరణ అండి (నేటి దేశ కాల పరిస్థితుల కన్వయించి జరుగుతున్న కథ)
మ॥ స్థితి మంతుండని నిర్ణయించి మనువున్ జేయంగ మోదమ్ముతోన్
మతి హీనుండుగ మద్య పానమును సమ్మానించి భార్యామణిన్
వెతలన్ బెట్టి నిరంతరమ్ము ధరలో వేధించ దుర్మార్గుఁడై
పతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్
ఆ.వె:స్థాయి మించు వాడు తనను బ్రేమించిన
రిప్లయితొలగించండినమ్ము మగువ యాశ వమ్మె యగును
ముని కుమార్తె యయ్యు, భూపతిన్ ,దుష్యంతు,
పతిని నమ్మి భామ భంగపడెను”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికోరి నట్టి నగను కొన గల నని జెప్పి
రిప్లయితొలగించండిమాయ మాట తోడ మనసు దోచి
శూన్య మైన చేయి చూప గానె
పతిని నమ్మి భామ భంగ పడెను
మ:సతి యే కోర విడాకులన్ మదిని బశ్చాత్తపమున్ బొంది యా
రిప్లయితొలగించండిపతి దైవమ్మును దల్చి యిట్లనెను" నా పాపమ్మె యిట్లయ్యె, నా
సతినిన్ గొట్టితి,దిట్టితిన్, దనను హింసలు వెట్టు నే నర్హునౌ
పతినే! నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్
ఆ॥వె
రిప్లయితొలగించండిపిలువనిదిదియనుచు పెనుజోగి వలదన్న
నేగి పుట్టినిల్లు నెనరు మీర
కన్నతండ్రి కూర్మి కరుగదంచు ప్రసూతి
పతిని నమ్మి భామ భంగపడెను!
(ప్రసూతి పతి: దక్షప్రజాపతి)