26-12-2025 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“గణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్”(లేదా...)“గణపతి పుత్రి ప్రెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్”('అవధాన పుష్కరిణి' మాస పత్రిక నుండి)
కందంగుణవతిగ సేవలిడ, సురగణంపు వినతిని, నపర్ణఁ గాలుఁడు నొప్పన్ప్రణతుల హిమశైలప్రాంగణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్
గణపతి యనుఒక బాపడుపణములు సమకూర్చెనుసుత పరిణయమునకైరుణములు స్నేహితు లివ్వగ గణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్
వినుడు సుజనులార గిరిజమనువాడగ పరమశివుని మదిఁగోరినదైచనుదెంచఁగ హిమశైలాంగణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్
*(గణపతి అను శిష్యునికి అతని గురువు చెబుతున్న మాటలుగా )*ఫణి భూషణు డొప్పెను సుర గణమ్ము వేడ మనువాడ కాళిని యా స ద్గుణశీలి తండ్రి పిలువగ గణపతి, సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్.ఫణిధరు జేరిదేవతలు ప్రార్థన జేయ తపమ్ము వీడి స ద్గుణవతి కొండచూలిదగు కోరిక దీర్చుట కొప్పుకొన్న భీ షణునకు దారకర్మమది శాంభవి తోనని తండ్రి పిల్వగా గణపతి, పుత్రి ప్రెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్.
అనిమిషుల యీశుడింద్రుని యనువగు స్థానీయమయిన యమరావతి నందన వనమందున యా సురగణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్”
గణపతి సాధకుండతడు కాళికి పూజలు సేయుభక్తుడున్ గణపతి కూతురౌసరళ కమ్మనిగాత్రము గల్గియున్నదిన్గణపతి అగ్నిహోత్రమును గైకొన వేడగ వైదికమ్ముగన్గణపతి పుత్రి ప్రెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్
కందం
రిప్లయితొలగించండిగుణవతిగ సేవలిడ, సుర
గణంపు వినతిని, నపర్ణఁ గాలుఁడు నొప్పన్
ప్రణతుల హిమశైలప్రాం
గణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్
గణపతి యనుఒక బాపడు
రిప్లయితొలగించండిపణములు సమకూర్చెనుసుత పరిణయమునకై
రుణములు స్నేహితు లివ్వగ
గణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్
వినుడు సుజనులార గిరిజ
రిప్లయితొలగించండిమనువాడగ పరమశివుని మదిఁగోరినదై
చనుదెంచఁగ హిమశైలాం
గణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్
రిప్లయితొలగించండి*(గణపతి అను శిష్యునికి అతని గురువు చెబుతున్న మాటలుగా )*
ఫణి భూషణు డొప్పెను సుర
గణమ్ము వేడ మనువాడ కాళిని యా స
ద్గుణశీలి తండ్రి పిలువగ
గణపతి, సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్.
ఫణిధరు జేరిదేవతలు ప్రార్థన జేయ తపమ్ము వీడి స
ద్గుణవతి కొండచూలిదగు కోరిక దీర్చుట కొప్పుకొన్న భీ
షణునకు దారకర్మమది శాంభవి తోనని తండ్రి పిల్వగా
గణపతి, పుత్రి ప్రెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్.
అనిమిషుల యీశుడింద్రుని
రిప్లయితొలగించండియనువగు స్థానీయమయిన యమరావతి నం
దన వనమందున యా సుర
గణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్”
గణపతి సాధకుండతడు కాళికి పూజలు సేయుభక్తుడున్
రిప్లయితొలగించండిగణపతి కూతురౌసరళ కమ్మనిగాత్రము గల్గియున్నదిన్
గణపతి అగ్నిహోత్రమును గైకొన వేడగ వైదికమ్ముగన్
గణపతి పుత్రి ప్రెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్