28-12-2025 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దారికి నమస్కరించిన దక్కుఁ బరము”(లేదా...)“దారికి మ్రిక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్”('అవధాన విద్యా సర్వస్వము' నుండి)
ఉ.చారు తపః క్రియా కలిత సంయమి సంభృత శైల పుత్రికం బేరు వెలుంగు గిత్తపయి వెల్గెడు సామిని గొల్చి ప్రీతితో జేరిన భక్త పుంగవుల శ్రీమయమౌ ఘన పూర్ణ భక్తి రాదారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్ !
ఎట్టి యాపద మనుజున కెదురయినను కోరగనె రక్ష ణను సమకూర్చు చుండుపాంచ జన్యధరుడయిన పచ్చవలువ“దారి కి నమస్కరించిన దక్కుఁ బరము”
అల్పమైనట్టి సుఖముల కాశ పడక పరమ పదమును గోరెడి భక్తు లెపుడు సత్యమునెపుడు విడకుండ నిత్యము నెల దారికి నమస్కరించిన దక్కుఁ బరము.ధారుణి నేలు వారలకు దాసుడ వైచరి యించ నేమిరా కోరిన రీతి సంపదలు కూడిన కూడగవచ్చు కాని ని స్థారము దక్క బొదనుట సత్యము, చిత్తము నందు నిల్పి మా దారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్.*(మా = చంద్రుడు)*
తేటగీతిగరళకంఠుఁడై కల్యాణ కారకునిగప్రజకు మేలొనరించెడు ప్రభువనంగసాంబమూర్తికి శివునికి జాబిలిజడదారికి నమస్కరించిన దక్కుఁ బరముఉత్పలమాలక్షీరజలాంబుధిన్ జెలఁగ క్ష్వేళము మ్రింగియు నీలకంఠుఁడైగౌరికి మోదమున్ గరపి కాచెను లోకుల, భక్త సత్క్రియాకారక సాంబమూర్తికి, దిగంబర శూలి, పురారి, గట్టువిల్దారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్
నీరమే మన మనుగడ కారణమ్ముపాఱు నదుల జలంబులే ఫలములొసగుపుణ్య ఫలము నాశించి 'గో' పూర్వకమగు దారికి నమస్కరించిన దక్కుఁ బరమునీరము లేనిచోట మననేరదు మానవ జాతి యెన్నడున్దూరము నుండివచ్చి మదిదోచెడి సింధువు లోన మున్గగాఁదీరును కోర్కెలంద్రు మన దేశములోగల వృద్ధులెల్ల గోదారికి మ్రిక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్
-మ్రొక్కులను దీర్చు నా స్వామి మ్రోల చేరుదారి అదిగొ అల్లదిగొ! పద పద వేగిరమ్ము శ్రీవారి మెట్టు ప్రార్థన యొనరిచిదారికి నమస్కరించిన దక్కు బరము
ఉ.
రిప్లయితొలగించండిచారు తపః క్రియా కలిత సంయమి సంభృత శైల పుత్రికం
బేరు వెలుంగు గిత్తపయి వెల్గెడు సామిని గొల్చి ప్రీతితో
జేరిన భక్త పుంగవుల శ్రీమయమౌ ఘన పూర్ణ భక్తి రా
దారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్ !
ఎట్టి యాపద మనుజున కెదురయినను
రిప్లయితొలగించండికోరగనె రక్ష ణను సమకూర్చు చుండు
పాంచ జన్యధరుడయిన పచ్చవలువ
“దారి కి నమస్కరించిన దక్కుఁ బరము”
రిప్లయితొలగించండిఅల్పమైనట్టి సుఖముల కాశ పడక
పరమ పదమును గోరెడి భక్తు లెపుడు
సత్యమునెపుడు విడకుండ నిత్యము నెల
దారికి నమస్కరించిన దక్కుఁ బరము.
ధారుణి నేలు వారలకు దాసుడ వైచరి యించ నేమిరా
కోరిన రీతి సంపదలు కూడిన కూడగవచ్చు కాని ని
స్థారము దక్క బొదనుట సత్యము, చిత్తము నందు నిల్పి మా
దారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్.
*(మా = చంద్రుడు)*
తేటగీతి
రిప్లయితొలగించండిగరళకంఠుఁడై కల్యాణ కారకునిగ
ప్రజకు మేలొనరించెడు ప్రభువనంగ
సాంబమూర్తికి శివునికి జాబిలిజడ
దారికి నమస్కరించిన దక్కుఁ బరము
ఉత్పలమాల
క్షీరజలాంబుధిన్ జెలఁగ క్ష్వేళము మ్రింగియు నీలకంఠుఁడై
గౌరికి మోదమున్ గరపి కాచెను లోకుల, భక్త సత్క్రియా
కారక సాంబమూర్తికి, దిగంబర శూలి, పురారి, గట్టువి
ల్దారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్
నీరమే మన మనుగడ కారణమ్ము
రిప్లయితొలగించండిపాఱు నదుల జలంబులే ఫలములొసగు
పుణ్య ఫలము నాశించి 'గో' పూర్వకమగు
దారికి నమస్కరించిన దక్కుఁ బరము
నీరము లేనిచోట మననేరదు మానవ జాతి యెన్నడున్
దూరము నుండివచ్చి మదిదోచెడి సింధువు లోన మున్గగాఁ
దీరును కోర్కెలంద్రు మన దేశములోగల వృద్ధులెల్ల గో
దారికి మ్రిక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్
-
రిప్లయితొలగించండిమ్రొక్కులను దీర్చు నా స్వామి మ్రోల చేరు
దారి అదిగొ అల్లదిగొ! పద పద వేగి
రమ్ము శ్రీవారి మెట్టు ప్రార్థన యొనరిచి
దారికి నమస్కరించిన దక్కు బరము