సృక్ సృష్టించునది, సృష్టికర్తా తక్ పరిహసించుట (సృష్టి కర్త ఎన్నో మానవుల ఆనందానికి సృజించాడు. వాటిని చూసి ఆనందించాలి కాని పరిహసించే పలుకులు కూడదు అనే భావమండి) వాక్ ను సంధి చేసినట్టుగా దృక్, సృక్, తక్ సంధిచేసానండి.
శా:దృగ్వ్యాప్తమ్మగు దాని నెల్ల కవితన్ దీపింప గా జేయ, స మ్యగ్వ్యాసావళిలో విమర్శకుల ప్రేమన్ బొంద, దైవేచ్ఛ చే వాగ్వ్యాపారము కృష్ణ శాస్త్రిని విడెన్,వ్రాయించ వాగ్దేవి యే వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందెన్ గదా! (కృష్ణశాస్త్రి గారికి స్వర పేటిక పోయింది.ఆయనకి వాగ్దేవి రూప మైన వాక్కు పోయింది కానీ వాగ్దెవి కవిత్వం వ్రాయించింది.)
కం:దృగ్వ్యాపారము తో స మ్యగ్వ్యక్తీకరణ జేయు నధికారి సదా వాగ్వ్యర్థము జేయ, డతిగ వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ” ( సమర్థు డైన అధికారి ఎప్పుడూ అతిగా వాగడు.కంటి చూపుల తోనే భావాలు వ్యక్తం చేస్తాడు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండివాగ్వ్యాపారమధిక మవ
వాగ్వ్యాపారులను గాంచి బర్బరు లనరే
వాగ్వ్యాపారులు మొకరులు
వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ.
ఈ గ్వ్యా ప్రాసను గూర్చి పద్యముల నేనేరీతిగా వ్రాయుదున్
వాగ్వ్యాపారపు పాటవమ్మదియె లుప్తంబైన వాడన్ గదా
వాగ్వ్యాపారము సేయనట్టి మునులే ప్రఖ్యాతు లై వెల్గిరే
వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందెన్ గదా.
వాగ్వ్యసనము విడకుండిన
రిప్లయితొలగించండివాగ్వ్యాధిని నొందుట యలవాటగుచుండున్ ,
వాగ్వ్యవధానమె మంచిది
వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ”
శా॥ సృగ్వ్యాపారముఁ జేసి మానవులకై సృష్టించె నాదైవమే
రిప్లయితొలగించండిదృగ్వ్యాపారము తోడఁ దుష్టిఁ బడయన్ దేదీప్య మానంబుగన్
దగ్వ్వాపారము వీడి భక్తిఁ గనుచున్ ధ్యానించకన్ మూర్ఖమౌ
వాగ్వ్యాపారము లేని వాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందెన్ గదా
సృక్ సృష్టించునది, సృష్టికర్తా
తక్ పరిహసించుట
(సృష్టి కర్త ఎన్నో మానవుల ఆనందానికి సృజించాడు. వాటిని చూసి ఆనందించాలి కాని పరిహసించే పలుకులు కూడదు అనే భావమండి)
వాక్ ను సంధి చేసినట్టుగా దృక్, సృక్, తక్ సంధిచేసానండి.
తప్పైతే విజ్ఞులు తెలిపితే, నేర్చుకుంటానండి.
తక్ శబ్దము ధాతువు. అనఁగాఁ గ్రియకు మూలరూపము. దీనికిఁ గ్విప్ప్రత్యము మృగ్యము. త ప్రత్యయము కలదు – తక్త. కావునఁ దగ్వ్వాపారము సంశయాత్మకము.
తొలగించండిఅయితే యెల్ల ధాతువులకుఁ గర్తృ కర్మ కరణ భావార్థాదులందుఁ గ్విప్ప్రత్యయము వచ్చును.
ఈ సూత్రముచే నుండవచ్చును. అప్పుడు “తగ్వ్యాపారము” సాధువే యగును.
స్రజ్ ధాతువునకుఁ గ్విప్ప్రత్యయము పరమయిన స్రక్ గా మారును.
కావున “స్రగ్వ్యాపారము” సాదు వని నా యభిప్రాయము.
కేవల ధాతు పదములు సమాసమున కనర్హములు.
శా:దృగ్వ్యాప్తమ్మగు దాని నెల్ల కవితన్ దీపింప గా జేయ, స
రిప్లయితొలగించండిమ్యగ్వ్యాసావళిలో విమర్శకుల ప్రేమన్ బొంద, దైవేచ్ఛ చే
వాగ్వ్యాపారము కృష్ణ శాస్త్రిని విడెన్,వ్రాయించ వాగ్దేవి యే
వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందెన్ గదా!
(కృష్ణశాస్త్రి గారికి స్వర పేటిక పోయింది.ఆయనకి వాగ్దేవి రూప మైన వాక్కు పోయింది కానీ వాగ్దెవి కవిత్వం వ్రాయించింది.)
కం:దృగ్వ్యాపారము తో స
రిప్లయితొలగించండిమ్యగ్వ్యక్తీకరణ జేయు నధికారి సదా
వాగ్వ్యర్థము జేయ, డతిగ
వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ”
( సమర్థు డైన అధికారి ఎప్పుడూ అతిగా వాగడు.కంటి చూపుల తోనే భావాలు వ్యక్తం చేస్తాడు.)
కందం
రిప్లయితొలగించండివాగ్యాపకమెందులకయ
దృగ్వ్యాపకమవసరమను దెసలందున స
మ్యగ్వ్యూహానుసరణమున
వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ
శార్దూలవిక్రీడితము
వాగ్వ్యాపారము బోధనాపరులకున్ భావ్యమ్ము నిత్యమ్మనన్
దృగ్వ్యాపారపు సైనికాళివలనే దేశమ్ము భద్రమ్మగున్
దృగ్వ్యాసంగము మౌనివర్యులమనోనేత్రాల రాణించనన్
వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందెన్ గదా!
రుగ్వ్యంజన రాసుల స
రిప్లయితొలగించండిమ్యగ్వ్యయము కరమ్ము భావ్య మైన విధమునన్
ధిగ్వ్యర్థ భాషణమ్ములు
వాగ్వ్యాపారమ్ము లేని వాఁడె బుధుండౌ
ధిగ్వ్యంగ్యార్థ వచో విరాజి సిరులం దేలంగ వీక్షింపమే
లుగ్వ్యాయాముఁడు భాసిలం గనమె యే లోపమ్ము లేకుండఁగా
దిగ్వ్యాకీర్ణ దివాకరప్రభలు ఖ్యాతిం గాంచి వర్ధిల్లవే
వాగ్వ్యాపారము లేని వాఁడె బుధుఁడై ప్రఖ్యాతి నందెన్ గదా
[వాగ్వ్యాపారము = వాక్కుల యమ్మకము]
వా గ్వ్యా పార ము గలిగిన
రిప్లయితొలగించండివా గ్ వ్యాపార మె జరుపును వ్యవహార ములన్ వా గ్వ్యాధు o డె ట్టుల
వా గ్వ్యాపారమ్ము లేని వా డె బుధు o డౌ?
దృగ్వ్యాపారమ్ము గలిగి
రిప్లయితొలగించండిదిగ్వ్యాకీర్ణతను బొందు దేశానకవుల్
వాగ్వ్యాపార ధురీణా!
వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ
దృగ్వ్యాపారము కూర్చుగాదె కవికిన్ దివ్యానుభూతమ్ములే
దిగ్వ్యాకీర్ణులు గాదె శిష్టకవులే దేశాన వెల్గొందగా
వాగ్వ్యాపారము చేయగల్గు విభుధుల్ వాచాలురేనందువా
వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందెన్ గదా