1, మార్చి 2026, ఆదివారం

సమస్య - 5395

2-3-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రావణు లక్ష్మణుఁ డడఁచె నరణ్యమునందున్”
(లేదా...)
“రావణు గెల్చె లక్ష్మణుఁ డరణ్యమునన్ ఖరదూషణుల్ గనన్”

3 కామెంట్‌లు:


  1. రావణుడెటుల కడచెనో
    యావేదించుమని సుతుని యడిగిన తోడన్
    తీవరముగ నుడివె నిటుల
    "రావణు లక్ష్మణుఁ డడఁచె నరణ్యమునందున్”

    రిప్లయితొలగించండి

  2. తావిషమును దాటుచు నట
    నావహమున నా దనుజుని యంతము చేసెన్
    జేవగల రాము డెప్పుడు
    రావణు లక్ష్మణుఁ డడఁచె నరణ్యమునందున్?


    చేవను జూపి రాఘవుడు సీతను బంధ విముక్తి కోసమై
    యావహ మందు రావణుని యంతమొనర్చెను వానరాళియున్
    బావని చూచుచుండ నది వాస్తవ మందురు కాదె యెప్పుడా
    రావణు గెల్చె లక్ష్మణుఁ డరణ్యమునన్ ఖరదూషణుల్ గనన్?

    రిప్లయితొలగించండి
  3. దీవికిఁ బాలకుడెవ్వడు?
    రావణ సుతుడింద్రజిత్తుఁ మ్రక్కిడెనెవరో?
    పావని రామునెచట గనెఁ?
    రావణు; లక్ష్మణుఁ డడఁచె; నరణ్యమునందున్

    పావనుడైన రాముడనిఁ బాల్గొని లంకను గెల్చెనెవ్వనిన్?
    బోవక నున్న శూర్పణఖ ముక్కునుఁ జెవ్వులుఁ గోసె నెవ్వడో?
    ఆవహమందు దాశరథి యార్భటమెవ్వరు చూచుచుండగా?
    రావణు గెల్చె; లక్ష్మణుఁ డరణ్యమునన్; ఖరదూషణుల్ గనన్

    రిప్లయితొలగించండి