1-3-2026 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు”(లేదా...)“హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు పుత్రునిఁ జంప నొప్పఁడే”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతిఅతిథి జంగమదేవర యడిగినంతవారి సాక్షాత్తు హరునిగన్ భక్తిఁ దలఁచివండి వడ్డించె సుతుఁజంపి బంతిలోన!హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు?
చంపకమాలసరగున వచ్చి తా నతిథి జంగమదేవర కోరినంతటన్ సరెయని పుత్రునిన్ దునిమి సాంబునికర్పణ జేసినట్లుగన్ వెరువక విందుఁజేసెకద! విజ్ఞత వీడియు పల్కు వ్యాఖ్యయే,"హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు పుత్రునిఁ జంప నొప్పఁడే"
“హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు"తలచకుమటుల శివునికై తన కొమరునివండి వడ్డించుటెరుగవో ! పరమ భాగ వతుడతడని దెలుసుకొని వక్కణించు
అతిథి దేవుడె పరమేశు డంచు నమ్మియతడు కోరిన రీతిని యంగభవునివండి వడ్డించెకద కడు భక్తితోడహరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు? అరయగ ప్రాఘుణుండనగ నాపరమేశ్వర తుల్యుడంచు నాపురరిపు వేను కోరెనని పుత్రుడటంచు దలంచకుండనే పొరిగొని వండెగాదె మరి మూర్ఖుడ యెట్లు వచింతు వెప్పుడాహరునిఁ దృణీకరించె సిరియాళుఁడు, పుత్రునిఁ జంప నొప్పఁడే?
కోరెఁ బ్రాణముల్ గాపాడు కొమ్మటంచు నాగహారుడా భక్తునిఁ నంబి సుతుడుహరుని లెక్క సేయఁడు; సిరియాళుఁ డెపుడుగుండె నిబ్బరమొప్పగ నుండువాడుగురుని గృహంబునన్ జదువు గొప్ప మనస్కుని హెచ్చరించెనాహరకుడు మాయరూపమునఁ హాయిగ ప్రాణము నిల్చునట్లుగాహరునిఁ దృణీకరించె సిరియాళుఁడు; పుత్రునిఁ జంప నొప్పఁడేనరుఁడయినన్ మహామహులు నమ్మిన సత్యము నాలకింపుమా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండిఅతిథి జంగమదేవర యడిగినంత
వారి సాక్షాత్తు హరునిగన్ భక్తిఁ దలఁచి
వండి వడ్డించె సుతుఁజంపి బంతిలోన!
హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు?
చంపకమాల
తొలగించండిసరగున వచ్చి తా నతిథి జంగమదేవర కోరినంతటన్
సరెయని పుత్రునిన్ దునిమి సాంబునికర్పణ జేసినట్లుగన్
వెరువక విందుఁజేసెకద! విజ్ఞత వీడియు పల్కు వ్యాఖ్యయే,
"హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు పుత్రునిఁ జంప నొప్పఁడే"
“హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు"
రిప్లయితొలగించండితలచకుమటుల శివునికై తన కొమరుని
వండి వడ్డించుటెరుగవో ! పరమ భాగ
వతుడతడని దెలుసుకొని వక్కణించు
రిప్లయితొలగించండిఅతిథి దేవుడె పరమేశు డంచు నమ్మి
యతడు కోరిన రీతిని యంగభవుని
వండి వడ్డించెకద కడు భక్తితోడ
హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు?
అరయగ ప్రాఘుణుండనగ నాపరమేశ్వర తుల్యుడంచు నా
పురరిపు వేను కోరెనని పుత్రుడటంచు దలంచకుండనే
పొరిగొని వండెగాదె మరి మూర్ఖుడ యెట్లు వచింతు వెప్పుడా
హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు, పుత్రునిఁ జంప నొప్పఁడే?
కోరెఁ బ్రాణముల్ గాపాడు కొమ్మటంచు
రిప్లయితొలగించండినాగహారుడా భక్తునిఁ నంబి సుతుడు
హరుని లెక్క సేయఁడు; సిరియాళుఁ డెపుడు
గుండె నిబ్బరమొప్పగ నుండువాడు
గురుని గృహంబునన్ జదువు గొప్ప మనస్కుని హెచ్చరించెనా
హరకుడు మాయరూపమునఁ హాయిగ ప్రాణము నిల్చునట్లుగా
హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు; పుత్రునిఁ జంప నొప్పఁడే
నరుఁడయినన్ మహామహులు నమ్మిన సత్యము నాలకింపుమా