చం:చిలిపిగ బూతు శబ్దమును జేర్చి యిడంగ సమస్య యేదియో సులభమె యయ్యు పూరణము చూపక నెట్టి యసభ్యతన్ కటా! సులు వొనరింప ధారణను జూచెడు వారికి తిక్క రేగగా పలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్” (ఎవరో బూతు పదం తో సమస్య ఇచ్చారు. దాన్ని అసభ్యత లేకుండా పూరించటం సులువే కానీ ధారణ తేలిక కావటానికి ఆ అవధాని ఆ బూతు సమస్యని మళ్లీ మళ్లీ చదివాడు. )
తేటగీతి
రిప్లయితొలగించండిభాష భూషణమౌనను భావనమున
వైరివర్గమ్ము చెలరేగి వాగెననిన
విజ్ఞుఁడన సభామర్యాద వెలయ, వీడి
బండబూతులఁ, బలికెను పండితుండు
చంపకమాల
తలచని రీతిగన్ బదవి దక్కియు నేతఁగ గద్దెనెక్కియున్
విలువలు వీడి దోచుకొని, భీతిని కంపనమొంద యెన్నికల్
కలవర పెట్ట, నోటమిని గానెడు శంకను వైరినెంచుచున్
బలికెను బండబూతులను! పండితుఁ డౌర? సభాంతరమ్మునన్!
రిప్లయితొలగించండివారుణిని గ్రోలి మత్తు లో వాగ నేల
నిట్టి మాటలు నమ్మెడి హీన గుణుని
యిలను గాంచగ లేమంటి మెప్పుడోయి
బండబూతులఁ బలికెను పండితుండు.
అలుకను బూని మంత్రి యొక యల్పుని గైకొని వచ్చి యాతడే
పలువిధ మైన శాస్త్రములు వ్యాకర నమ్ముల కోవిదుండనన్
వలము నెఱుంగనట్టి యడిబండ యతండట రాజు సన్నిధిన్
బలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్.
బండ బూతుల నిచ్చిరి పండితునకు
రిప్లయితొలగించండిదత్తపదముల తోడఁ బద్యమ్ము నల్ల
మనుచు వేరొక యర్థము తనరునటుల
బండబూతులఁ బలికెను పండితుండు
విలవిలలాడు నాతడని పిచ్చిగ నెంచిన బండబూతులన్
గలకలమొప్ప దత్తపది గానిడి పద్యము చెప్పుమన్న తాఁ
జిలిబిలివోవు పోడిమిని శీఘ్రమె వేరొక యర్థ మీయగా
పలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్
తేటగీతి:
రిప్లయితొలగించండిపండితుఁడుగాని యతఁడొక వ్యసనపరుఁడు
కల్లు చవిగొన మైకము గ్రమ్మినంత
నిచ్చవచ్చిన రీతిగా పెచ్చుమీరి
బండబూతులఁ బలికెను పండితుండు
చంపకమాల:
పలువురుమెచ్చురీతి తనపాండితిఁజూపెడు సత్కవీశుడే
తెలియును వేదశాస్త్రములు తెల్లముగా మరి ఖర్మమేమిటో
సలుపుచు దుష్ట మానవుల సంగతి మద్యము గ్రోలి మత్తునన్
బలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే.గీ:పండితుల గారవించక పరమ శుంఠ
రిప్లయితొలగించండిలైన వారికి బిరుదమ్ము లంద జేయ
వారు కులమతమ్ముల జూచు వరుస జూచి
బండబూతులఁ బలికెను పండితుండు.
తే॥ సంస్కృతమునఁ బఠించఁగ సరస కావ్య
రిప్లయితొలగించండిమెంచి చక్కగ మాధుర్యమెసఁగు పగిది
నర్థమెరుఁగని ప్రేక్షకు లనిరి యిటుల
బండ బూతులఁ బలికెను పండితుండు
ఉ॥ వలచిన సంస్కృతమ్మునను భవ్య రసాన్విత కావ్యమెంచుచున్
విలసిత రూపునొప్పు విధిఁ బ్రీతినిఁ గాంచి పఠించు చుండఁగన్
వెలవెల పోయి ప్రేక్షకులు వెఱ్ఱిగ నర్థముఁ గాకఁ దెల్పిరే
పలికెను బండ బూతులను పండితుఁ డైన సభాంతరమ్మునన్
తే.గీ: చిత్ర మేమిది? యీ బ్రహ్మసూత్ర భాష్య
రిప్లయితొలగించండిములను వివరించు విప్రోత్తముండు! చిన్న
తనము లో చదువును నేర్పు తల్లిని గని
బండబూతులఁ బలికెను పండితుండు.
చం:చిలిపిగ బూతు శబ్దమును జేర్చి యిడంగ సమస్య యేదియో
రిప్లయితొలగించండిసులభమె యయ్యు పూరణము చూపక నెట్టి యసభ్యతన్ కటా!
సులు వొనరింప ధారణను జూచెడు వారికి తిక్క రేగగా
పలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్”
(ఎవరో బూతు పదం తో సమస్య ఇచ్చారు. దాన్ని అసభ్యత లేకుండా పూరించటం సులువే కానీ ధారణ తేలిక కావటానికి ఆ అవధాని ఆ బూతు సమస్యని మళ్లీ మళ్లీ చదివాడు. )
గళము మహాద్భుతంబు పలుకమ్మకు మేటి సుతుండు కృష్ణ లీ
రిప్లయితొలగించండిలలను వచించు వేళ సలిలమ్మును దెచ్చియు సేవకుండు ప్రా
జలి ఘటియించి నిచ్చుతరి జారి రయంబున మీద నొల్కగా
*పలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మద్యమును గ్రోలి వచ్చిన మనుజు డొ కడు
రిప్లయితొలగించండిబుద్ది కుశలత లోపించి బోధ పడక
బండ బూతుల బలికెను :: పండి తుండు
మిన్న కుం డెను బ దు లీ క చిన్న బోయి
యింటి పేరు కస్తూరి వారింట నున్న
రిప్లయితొలగించండివకట గబ్బిలములు గాంచ నక్కజముగ
లేవు వాగ్వక్త్ర శుద్ధులు లేశములును
బండబూతులఁ బలికెను పండితుండు
కలఁగము వల్కఁ బామరుఁడు కైతల నీ విధి నచ్చ టచ్చటం
గలఁగక వాణి సైచు నెదఁ గాక సమస్యను గాంచ దోషమే
యొలికెను వింతగా ద్రతమె యున్న నహో పరుషమ్ము నిల్పెనే
పలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్