2, ఏప్రిల్ 2026, గురువారం

సమస్య - 5427

3-4-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ”
(లేదా...)
“దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు) 

7 కామెంట్‌లు:

  1. కందం
    ఏలాగు? సాధ్యమంచును
    గూలఁబడకుమయ్య! మొదటి గురువు లఘువులై
    చాలిన పద్యమయిన శా
    ర్దూలం బిభరాజమగుచుఁ దోఁచెన్ సుకవీ!

    రిప్లయితొలగించండి
  2. పాలన గురించి దెలుపుచు ,
    నాలుక తిరగని విధముగ నడపించినదౌ
    మేలగు పదముల ఘి శా
    ర్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ

    రిప్లయితొలగించండి
  3. మేలుగ 'మసజసతతగ' ను
    వీలుగ 'సభరనమయవ' గ విభజించినచో
    చాలును గతిమారిన శా
    ర్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ

    రిప్లయితొలగించండి
  4. ఏలా తర్జనభర్జనల్ సుకవి నీకేలా విచారమ్ము శా
    ర్దూలంబందలి యాది గుర్వుఁగొని యస్తోకంబుగా దానినిన్
    మేలౌజేయ లఘుద్వయమ్ముగ వెసన్ మీమాంస చేయంగ శా
    ర్దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్

    రిప్లయితొలగించండి
  5. చాలిక తొలిగురువు బదులు
    నాలుగు పాదాల మొదట నయముగ లఘువుల్
    లీలగ నిగుడించిన శా
    ర్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సౌలభ్యంబని బల్కి చూపితిరహో శార్ధూలమత్తేభముల్
      మూలంబందున నక్షరాల బదులే పొంకించి హ్రస్వంబులన్
      వాలాయించి యొనర్చిరా విబుధులే వాగ్వాదమేలేక శా
      ర్దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్

      తొలగించండి

  6. మూలంబున గల యా దీ
    ర్ఘాలను మార్చి ఖలునివలె హస్వమ్ములుగా
    నేల పలుక నది గన శా
    ర్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ.

    బాలుండైనను చేయబోవడు కదా పాండిత్యమున్ గల్గియున్
    మూలంబున్ గనకుండ చెప్పితివిటన్ మూఢుండవై నీవు దీ
    ర్ఘాలే హ్రస్వము లైన పద్యమదియే కాంచంగ ఛందమ్ము శా
    ర్దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్”

    రిప్లయితొలగించండి