20-4-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే”
(లేదా...)
“కంజాతాక్షుని భూషణమగుఁ గదా కంకాళ మెల్లప్పుడున్”
శార్దూలవిక్రీడితముశింజానమ్మగు లాస్యమై హరియె తాఁ జేరంగఁ, గౌంతేయులన్రంజింపంగను సంధివాక్యములతో రాణింపఁగన్ జూచినన్భంజింపంగ ఫలించ నెత్తుగడ మా భాగ్యంబనన్ సత్యమైకంజాతాక్షుని భూషణమ్మగుఁ గదా కంకాళ మెల్లప్పుడున్
కందంశింజితమున శ్రీకృష్ణుడురంజింపగ పాండవులను రాగన్ సభలోభంజించెడు మా యెత్తునకంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే!
పింజరపు నగ నిడుటకయిపుంజెడు రూప్యములు గూడ పొసగక, బగితిన్గుంజీలు దీసి యిడెనిక కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే
గంజాయి మత్తు తో కా లంజరిని గాంచి విష్టరశ్రవు డంచున్ సంజీవి యనుకొని పలికె కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే.సంజీవా పలుకంగనేల యిటులన్ సత్యంబు కాదందు నే కంజాతాక్షుడనంగ క్ష్వేళగళుడే కాదందువా శూలి యున్ కంజాతాక్షుడె యందువా మరిగనన్ కామారి యేయైనచో కంజాతాక్షుని భూషణమగుఁ గదా కంకాళ మెల్లప్పుడున్.
శార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండిశింజానమ్మగు లాస్యమై హరియె తాఁ జేరంగఁ, గౌంతేయులన్
రంజింపంగను సంధివాక్యములతో రాణింపఁగన్ జూచినన్
భంజింపంగ ఫలించ నెత్తుగడ మా భాగ్యంబనన్ సత్యమై
కంజాతాక్షుని భూషణమ్మగుఁ గదా కంకాళ మెల్లప్పుడున్
కందం
తొలగించండిశింజితమున శ్రీకృష్ణుడు
రంజింపగ పాండవులను రాగన్ సభలో
భంజించెడు మా యెత్తున
కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే!
పింజరపు నగ నిడుటకయి
రిప్లయితొలగించండిపుంజెడు రూప్యములు గూడ పొసగక, బగితిన్
గుంజీలు దీసి యిడెనిక
కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే
రిప్లయితొలగించండిగంజాయి మత్తు తో కా
లంజరిని గాంచి విష్టరశ్రవు డంచున్
సంజీవి యనుకొని పలికె
కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే.
సంజీవా పలుకంగనేల యిటులన్ సత్యంబు కాదందు నే
కంజాతాక్షుడనంగ క్ష్వేళగళుడే కాదందువా శూలి యున్
కంజాతాక్షుడె యందువా మరిగనన్ కామారి యేయైనచో
కంజాతాక్షుని భూషణమగుఁ గదా కంకాళ మెల్లప్పుడున్.