27, ఏప్రిల్ 2026, సోమవారం

సమస్య - 5452

28-4-2026 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కంచములో గారెలున్నఁ గాని తినండే”

(లేదా...)

“కంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే” 

5 కామెంట్‌లు:

  1. కందం
    పొంచిన దిగులదిమనమున
    మంచమునుండంగ నిద్రమాటయె కరవౌ!
    కొంచెము నాకలి లేదన
    కంచములో గారెలున్నఁ గాని తినండే!


    ఉత్పలమాల
    నించిన కుండలన్ గలుగ నీరము దాహములేక త్రాగమే!
    మంచమునుండియున్ దిగులుమానసమెంచగ నిద్రవచ్చునే?
    కొంచెమునైన నాకలియె కుక్షిని లేదన నిచ్ఛగింపకే
    గంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే!

    రిప్లయితొలగించండి
  2. సంచిలొ దెచ్చిన వడలను
    పంచన గూర్చుండబెట్టి భక్షించుమనన్
    కొంచెము నలత కలదనుచు
    కంచములో గారెలున్నఁ గాని తినండే

    రిప్లయితొలగించండి

  3. పంచగ, మారుతికి నివే
    దించి ప్రసాదముగ నచట దేవళ మందున్
    కాంచన వర్ణ మ్మున గల
    కంచములో గారెలున్నఁ గాని తినండే.


    పంచగ భక్త కోటికిని, వాయుసుతుండకు భక్తితో నివే
    దించగ నెంచి భూరిగను దేవళ మందున నర్చకుండు వే
    యించిన గారె లాతనికి యిష్టమటంచును తెచ్చి నట్టి యా
    కంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే.

    రిప్లయితొలగించండి
  4. చంచలమౌ వ్యక్తిత్వము
    వంచన యని నమ్ముచుండు వలదను నతడే
    త్రుంచగ నెంచక నుండును
    కంచములో గారెలున్నఁ గాని తినండే

    చంచలమైన మానసము సత్వరమున్ మదినమ్మకుండుగా
    వంచన లేకపోయినను భద్రము కాదని నిబ్బరించుచున్
    ద్రుంచడు తాను చిన్నదగు తుండెము నైనను నోటబెట్టడే
    కంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే

    రిప్లయితొలగించండి
  5. -

    పంచాపకేశ అయ్యరు
    కంచెము లో గారెలున్న గాని తినండే
    టంచను గాను జిలేబియె
    ముంచెత్తక పిండిని ఘృతమున వేడిగనే

    రిప్లయితొలగించండి