10, ఏప్రిల్ 2026, శుక్రవారం

సమస్య - 5435

11-4-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన”
(లేదా...)
“అరయఁగఁ గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో”

4 కామెంట్‌లు:

  1. తేటగీతి
    సిగను గంగమ్మ మేనిలో సగము గౌరి
    విశ్వనాథుని రూపాన వేడ్కఁ జేయ
    భక్తవత్సలునర్చించి ముక్తిఁ గొనఁక
    కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన

    చంపకమాల
    తనువున గౌరియున్ సిగను ధారగ గంగయు నిండి మంగళం
    బొనరఁగ జేయుఁ రూపమున పుణ్యమొసంగెడు విశ్వనాథునిన్
    గనులను నింపి ముక్తిఁగొను నమ్మకముండగ నన్యమేదియున్
    కనుగొనఁ గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో!

    రిప్లయితొలగించండి
  2. విశ్వ నాథుని దర్శింప వెడలి కాశి
    యర్చన లు సల్పి మొ క్కె ద రంద రపుడు
    కాంచ దగిన దెద్ది యును. కాశి లోన
    లే దని యు పల్కు దురు గద లీల గాను

    రిప్లయితొలగించండి
  3. శివుని దరిసించి , యతనిని చేత దడవి ,
    కాంచనపు పుతయున్న శిఖరమునుగని ,
    ధన్యజీవుల మగుటయె తప్ప , లాతి
    కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన

    రిప్లయితొలగించండి

  4. మునులు మోక్షార్థులు చరించు పుణ్య భూమి
    భవుడు వెలసిన క్షేత్రమీ వారణాసి
    పట్టణమున కాముక ప్రేమ పక్షులకట
    కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన.


    మనమున శూలి నామమును మంత్రము గా జపి యించుచున్ విమో
    చనమును గోరు వారికిట సాధనమే సుళువైన క్షేత్రమై
    న నిట రసజ్ఞులౌ జన మనస్సును దోచేడి వింత ప్రాంతముల్
    కనుగొన గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో.

    రిప్లయితొలగించండి