13, ఏప్రిల్ 2026, సోమవారం

సమస్య - 5438

14-4-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు”
(లేదా...)
“స్ఫురదురుశయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే”

5 కామెంట్‌లు:

  1. తేటగీతి
    ఉన్న మంచమొక్కటె నల్లులుండ నెటులఁ
    గ్రొత్తజంట శోభనమది కుదురుననఁగ
    బెడ్డు బగ్గు స్ప్రే వాడఁగ వీడి పోయి
    మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు

    చంపకమాల
    సరసపు సౌఖ్యమున్ బడయ జంటకు నేర్పరచంగఁ దల్పమున్
    గొరతగ నొక్కటే కలదు కూర్చుటనెట్లని చింతఁజేయగన్
    గురియగ బెడ్డు స్ప్రే రయమె కూలుచు నన్నియు వీడి మంచమున్
    స్ఫురదురుశయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే

    రిప్లయితొలగించండి
  2. పాన్పుపయి పరుపు పరచి పడగ , నిద్ర
    రాక నటునిటు దొర్లితి , రక్త పాయి
    లెన్నొ చావగ గలిగిన యెరుపు వలన
    మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు

    రిప్లయితొలగించండి
  3. సౌఖ్యమిడునని చూపిరి చక్కనిదగు
    హంస తూలికా తల్పము హర్షమలర
    రాత్రి గడిచిన తఱి విశారదుడు దెల్పె
    మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు

    సురతిని గూర్చు నీకనుచు సుందర మైన విశాల తల్పమున్
    సరసుడు బండితుండునగు సత్కవి కిచ్చిరి విశ్రమించగా
    మరుదినమా బుధానుడనె మంచపు ఠీవిని బ్రస్తుతించుచున్
    స్ఫురదురుశయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే

    రిప్లయితొలగించండి

  4. విరహమును తాళ లేనైతి పిరిమి జేరి
    ముద్దు మురిపాల తోడ నా నిద్దుర నిక
    చెరచు నీదగు బాధ్యత చేగొని యిట
    మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు.


    పురమును వీడి పోయితివి పువ్విలుకాని శరమ్ములే గనన్
    విరహము పెంచు చుండె నను ప్రేమగ జేరుచు మందసానమున్
    బరమును చేయు నీ పనిని బాధ్యత గాగొనెనేమొ కాంచ నా
    స్ఫురుదురుశయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే.

    రిప్లయితొలగించండి
  5. -
    మామిడాకుల తోరణ మాల లచట
    మంచమునకు శోభనుఁ గూర్చె; మత్కుణములు
    వాటి వాసనకు బెదిరి పరుగు లిడుచు
    నక్కె మూలలో; కత కంచి నగరి చేరె
    కవివరులు నిదురను జారు కాలమాయె



    రిప్లయితొలగించండి