26-4-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రూరమృగమును ముద్దాడెఁ గోమలాంగి”
(లేదా...)
“క్రూరమృగమ్మునుం గనిన కోమలి ముద్దిడి సంతసించెనే”
పండుగ దినమునందున వాడుకయగు బొమ్మల కొలువుతోపాటు పొంతన యొక అడవి నేర్పరచు తరి సింహమును బోలు క్రూరమృగమును ముద్దాడెఁ గోమలాంగి”
తేటగీతిమగడు వెంటరాన్ వనముల మగువ తిరిగెకొండకోనల నందాల మెండు గనుచుదారి కడ్డమై గర్జింపఁ బార ద్రోలఁగ్రూరమృగమును, ముద్దాడెఁ గోమలాంగిఉత్పలమాలఆ రమణీమణిన్ వనవిహారము సేయ మగండు చేకొనెన్గోరిన కొండ కోనలను కొంగునుబట్టుకు సంచరించగన్దారికి యడ్డమై నిలిచి తత్తరఁ బెట్టఁగఁ బార ద్రోలఁగన్గ్రూరమృగమ్మునుం, గనిన కోమలి ముద్దిడి సంతసించెనే
దనుజుడా హిరణ్య కశిపు దునుమ నెంచి హరియె నరసింహ రూపాన నవత రించి చెలగెడి సమయమందున చెంచు లక్ష్మి క్రూరమృగమును ముద్దాడెఁ గోమలాంగి.ఔరసుడైన బాలకుని యంతము జేయ దలంచి నట్టి యా ఫేరవునిన్ వధించుటకు విష్ణువు ధాత్రి నృసింహ రూపమున్ చేరగ కానలందు గల చెంచిత మోహము నంది నంత నా క్రూరమృగమ్మునుం గనిన కోమలి ముద్దిడి సంతసించెనే.
వనవిహారమనుచుఁ జని భామయొకతెకాననంబున భీతిల్లె గాంచి నంత క్రూరమృగమును; ముద్దాడెఁ గోమలాంగిజింకపిల్ల తన దరికి చేర రాగ దూరము నున్న కాననము దూరిన బృందము నందు భీతిలెన్గ్రూరమృగమ్మునుం గనిన కోమలి; ముద్దిడి సంతసించెనేచేరగ వచ్చినట్టిదగు చిత్ర మృగంబును గౌగిలించుచున్వారికిఁ గల్గె గాఢమగు వన్య మృగానుభవమ్ము నిండుగా
చిత్రకారుని ప్రతిభకు చిత్తరువులెజీవకళలుట్టి పడుచుండె చిత్రముగనువిపినమందున సలుపుచు విహరణమ్ముక్రూరమృగమును ముద్దాడెఁ గోమలాంగి
వారెవ! నేత్రపర్వముగ భాసిలె కుడ్యపు చిత్రలేఖనంబారయ జీవముట్టిపడునా పటకారుని చిత్రమందునన్ఘోర వనాంతమందు నొక కూపమునందున జిక్కె సింగమాక్రూరమృగమ్మునుం గనిన కోమలి ముద్దిడి సంతసించెనే
తే.గీ:కూర కై లేడినిన్ నీవు కూల్చ బోవ ,బాణహతి తప్పి యా లేడి బతికె చూడు!హింస వదలుము! చూడుమా యింతి క్రియనుక్రూర! మృగమును ముద్దాడెఁ గోమలాంగి”(నాలుగవ పాదం లో మృగము అంటే లేడి. )
పండుగ దినమునందున వాడుకయగు
రిప్లయితొలగించండిబొమ్మల కొలువుతోపాటు పొంతన యొక
అడవి నేర్పరచు తరి సింహమును బోలు
క్రూరమృగమును ముద్దాడెఁ గోమలాంగి”
తేటగీతి
రిప్లయితొలగించండిమగడు వెంటరాన్ వనముల మగువ తిరిగె
కొండకోనల నందాల మెండు గనుచు
దారి కడ్డమై గర్జింపఁ బార ద్రోలఁ
గ్రూరమృగమును, ముద్దాడెఁ గోమలాంగి
ఉత్పలమాల
ఆ రమణీమణిన్ వనవిహారము సేయ మగండు చేకొనెన్
గోరిన కొండ కోనలను కొంగునుబట్టుకు సంచరించగన్
దారికి యడ్డమై నిలిచి తత్తరఁ బెట్టఁగఁ బార ద్రోలఁగన్
గ్రూరమృగమ్మునుం, గనిన కోమలి ముద్దిడి సంతసించెనే
రిప్లయితొలగించండిదనుజుడా హిరణ్య కశిపు దునుమ నెంచి
హరియె నరసింహ రూపాన నవత రించి
చెలగెడి సమయమందున చెంచు లక్ష్మి
క్రూరమృగమును ముద్దాడెఁ గోమలాంగి.
ఔరసుడైన బాలకుని యంతము జేయ దలంచి నట్టి యా
ఫేరవునిన్ వధించుటకు విష్ణువు ధాత్రి నృసింహ రూపమున్
చేరగ కానలందు గల చెంచిత మోహము నంది నంత నా
క్రూరమృగమ్మునుం గనిన కోమలి ముద్దిడి సంతసించెనే.
వనవిహారమనుచుఁ జని భామయొకతె
రిప్లయితొలగించండికాననంబున భీతిల్లె గాంచి నంత
క్రూరమృగమును; ముద్దాడెఁ గోమలాంగి
జింకపిల్ల తన దరికి చేర రాగ
దూరము నున్న కాననము దూరిన బృందము నందు భీతిలెన్
గ్రూరమృగమ్మునుం గనిన కోమలి; ముద్దిడి సంతసించెనే
చేరగ వచ్చినట్టిదగు చిత్ర మృగంబును గౌగిలించుచున్
వారికిఁ గల్గె గాఢమగు వన్య మృగానుభవమ్ము నిండుగా
చిత్రకారుని ప్రతిభకు చిత్తరువులె
రిప్లయితొలగించండిజీవకళలుట్టి పడుచుండె చిత్రముగను
విపినమందున సలుపుచు విహరణమ్ము
క్రూరమృగమును ముద్దాడెఁ గోమలాంగి
వారెవ! నేత్రపర్వముగ భాసిలె కుడ్యపు చిత్రలేఖనం
రిప్లయితొలగించండిబారయ జీవముట్టిపడునా పటకారుని చిత్రమందునన్
ఘోర వనాంతమందు నొక కూపమునందున జిక్కె సింగమా
క్రూరమృగమ్మునుం గనిన కోమలి ముద్దిడి సంతసించెనే
తే.గీ:కూర కై లేడినిన్ నీవు కూల్చ బోవ ,
రిప్లయితొలగించండిబాణహతి తప్పి యా లేడి బతికె చూడు!
హింస వదలుము! చూడుమా యింతి క్రియను
క్రూర! మృగమును ముద్దాడెఁ గోమలాంగి”
(నాలుగవ పాదం లో మృగము అంటే లేడి. )