5-4-2026 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“లక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె లంకఁ గనఁగ”(లేదా...)“లక్ష్మణుఁ డూర్మిళాసతిని లంకకుఁ జేర్చెను పుష్పకమ్ముపై”
విపినమున కెగుచుండగ విడిచి వచచ్చెలక్ష్మణుం డూర్మిళన్ ; దెచ్చె లంకఁ గనఁగఆంజనేయుని తోడుగ , నతివ కుజనువెతకి తరువాత నామెను విడుపు జేయ
లక్ష్మికి వల్లభుండు హరి లక్ష్మణు డూర్మిళ ప్రాణనాథుడేలక్ష్మణుడే సహోదరుడు రాముని కంచువచింప నొప్పుగాసూక్ష్మముగా దృశించితిని శూన్యవితర్కము లేల? స్వప్నమే!లక్ష్మణుఁ డూర్మిళాసతిని లంకకుఁ జేర్చెను పుష్పకమ్ముపై
లక్ష్మికి పరిణాయకుడన లచ్చిమగడులక్ష్మణుడు సహోదరుడగు రామునకునుసూక్ష్మముగ కలగాంచి నే జూచియుంటిలక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె లంకఁ గనఁగ
రావణవధ, శ్రీరామ పట్టాభిషేకానంతరము.... తేటగీతిపిలువ విహరింప రాజు విభీషణుండుస్వర్ణమయమని వివరించి చక్కగానుసమ్మతిన్ దెల్పినంత పుష్పకమునందులక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె లంకఁ గనఁగ
ఉత్పలమాలసూక్ష్మమెఱింగియున్ శరణుజొచ్చియు రాముని, పట్టమందఁగన్లక్ష్మి సమస్తరాజ్యమున రాజిల రాజు విభీషణుండుగన్లక్ష్మణునార్తితోఁ బిలిచి లంక విహారము సేయరమ్మనన్లక్ష్మణుఁ డూర్మిళాసతిని లంకకుఁ జేర్చెను పుష్పకమ్ముపై
భర్త కానల కేగెడి పాళ మందు పడతి యూర్మిళ నిదురించె వాస్త వమ్ము తప్పు వచియించి తివికద యెప్పు డంటి లక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె లంకఁ గనఁగ.లక్ష్మణు డేగు వేళ రఘు రాముని వెంబడి నాడు గాంచగా లక్ష్మణ పత్ని యూర్మిళయె రాజ్యము లో శయనించె గాదె యీ సూక్ష్మమెఱుంగ కుంటివిది చోద్యమె యందుమరెప్పు డంటి నా లక్ష్మణుఁ డూర్మిళాసతిని లంకకుఁ జేర్చెను పుష్పకమ్ముపై.
-కొన్ని వత్సరములు దాట కోర్కె గల్గనా విభీషణునికి లంక నందు విందు కు బిలి చెనయోధ్య ధీరుల కొంత వెసులుబాటు చేసుకొని విహరింపంగ నదిగొలక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె లంకఁ గనఁగశ్రీలంక తెలుగు ప్రజలు అతిశీఘ్రముగా అష్టావధానమునకు కంది వారిని బిలుతురు గాక!
లక్ష్మణుఁ బత్ని యూర్మిళకు రాతిరి వచ్చిన స్వప్నమందునన్లక్ష్మణుఁ డూర్మిళాసతిని లంకకుఁ జేర్చెను పుష్పకమ్ముపైసూక్ష్మఁపు బుద్ధితో నరసి జూడఁగ నీకిది తేటతెల్లమౌలక్ష్మణుఁడే నిరంతరము రాజిలు నూర్మిళ మానసంబునన్
ఉ॥ సూక్ష్మముఁ దెల్ప రామ కథ శోభఁ బఠించి పరుండ శయ్యపైలక్ష్మి విధమ్ము స్వప్నమున రాజిలి జానకి కన్పడంగ నాలక్ష్మణ పూర్వజుండు రఘురాముఁడు నొప్పఁగ విష్ణురూపునన్లక్ష్మణుఁ డూర్మిళా సతిని లంకకుఁ జేర్చెను పుష్పకమ్ముపైపూర్వజుడు అన్నఇక్కడ స్వప్నములోని సూక్ష్మమండి. ఇంకా అసంబద్ధంగా ఎన్నో కనిపించి ఇవి కూడా కనిపించాయని.
తే.గీ:భూమిజను రాముడు గ్రహించ, బ్రేమ మీరలక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె, లంకఁ గనఁగ,నిడుములన్ బొంద జానకె కే విధినివ్రాయ బడె, నూర్మిళకు నిద్ర వరము కాగ
ఉ;లక్ష్మికి మారు రూపు మిథిలాపుర దీప్తియు సీత కాగ నాలక్ష్మిని బొంద రాముడు, కులప్రభ మించ వివాహమాడె గాలక్ష్మణుఁ డూర్మిళాసతిని, లంకకుఁ జేర్చెను పుష్పకమ్ముపైలక్ష్మిని రావణుండు కుశలమ్ముగ నూర్మిళ యుండె నిద్ర లోన్.
సీత యున్నట్టి లంకను జూత మంచు నాథుఁ గోరఁగఁ గూర్మిని నాతి కోర్కెఁ దీర్ప రఘురాము నానతి ధీర వరుఁడు లక్ష్మణుం డూర్మిళం దెచ్చె లంకఁ గనఁగ సూక్ష్మముగా వచింపు మనఁ జోద్యము మీఱఁగఁ జెప్పె శిష్యుఁడే యక్ష్మ రుజార్త వక్త్రుఁ డయి యత్తఱి నివ్విధి సంశయమ్మునం బక్ష్మ యుగమ్ముఁ ద్రుంచి వెసఁ బక్షి వరేణ్యున కుగ్ర మూర్తి యాలక్ష్మణుఁ డూర్మిళాసతిని లంకకుఁ జేర్చెను బుష్పకమ్ముపై
జనక సుత తోడ పెండిలి జరిగి నంత లక్ష్మ ణుo డూ ర్మిళన్ దె చ్చె : లంక గనగవెడలె హనుమంతు సీతను వెదకు కొఱకు కాంచె తా నశోక వ నాన కన్నులార
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కాంచగ న శోక వనంలో కలిగె ముదము అని సవరణ చేయడమైనది
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.పెండ్లి యాడి యయోధ్యకు పితృ నాజ్ఞలక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె; లంకఁ గనగహనుమ ధైర్యముగ గగనమందు నెగిరెసంద్రమును దాటి జానకి జాడ తెలియ.
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.పెండ్లి యాడి యయోధ్యకు పితరు నాజ్ఞలక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె; లంకఁ గనగహనుమ ధైర్యముగ గగనమందు నెగిరెసంద్రమును దాటి జానకి జాడ తెలియ.
విపినమున కెగుచుండగ విడిచి వచచ్చె
రిప్లయితొలగించండిలక్ష్మణుం డూర్మిళన్ ; దెచ్చె లంకఁ గనఁగ
ఆంజనేయుని తోడుగ , నతివ కుజను
వెతకి తరువాత నామెను విడుపు జేయ
లక్ష్మికి వల్లభుండు హరి లక్ష్మణు డూర్మిళ ప్రాణనాథుడే
రిప్లయితొలగించండిలక్ష్మణుడే సహోదరుడు రాముని కంచువచింప నొప్పుగా
సూక్ష్మముగా దృశించితిని శూన్యవితర్కము లేల? స్వప్నమే!
లక్ష్మణుఁ డూర్మిళాసతిని లంకకుఁ జేర్చెను పుష్పకమ్ముపై
లక్ష్మికి పరిణాయకుడన లచ్చిమగడు
తొలగించండిలక్ష్మణుడు సహోదరుడగు రామునకును
సూక్ష్మముగ కలగాంచి నే జూచియుంటి
లక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె లంకఁ గనఁగ
రావణవధ, శ్రీరామ పట్టాభిషేకానంతరము....
రిప్లయితొలగించండితేటగీతి
పిలువ విహరింప రాజు విభీషణుండు
స్వర్ణమయమని వివరించి చక్కగాను
సమ్మతిన్ దెల్పినంత పుష్పకమునందు
లక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె లంకఁ గనఁగ
ఉత్పలమాల
తొలగించండిసూక్ష్మమెఱింగియున్ శరణుజొచ్చియు రాముని, పట్టమందఁగన్
లక్ష్మి సమస్తరాజ్యమున రాజిల రాజు విభీషణుండుగన్
లక్ష్మణునార్తితోఁ బిలిచి లంక విహారము సేయరమ్మనన్
లక్ష్మణుఁ డూర్మిళాసతిని లంకకుఁ జేర్చెను పుష్పకమ్ముపై
రిప్లయితొలగించండిభర్త కానల కేగెడి పాళ మందు
పడతి యూర్మిళ నిదురించె వాస్త వమ్ము
తప్పు వచియించి తివికద యెప్పు డంటి
లక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె లంకఁ గనఁగ.
లక్ష్మణు డేగు వేళ రఘు రాముని వెంబడి నాడు గాంచగా
లక్ష్మణ పత్ని యూర్మిళయె రాజ్యము లో శయనించె గాదె యీ
సూక్ష్మమెఱుంగ కుంటివిది చోద్యమె యందుమరెప్పు డంటి నా
లక్ష్మణుఁ డూర్మిళాసతిని లంకకుఁ జేర్చెను పుష్పకమ్ముపై.
-
రిప్లయితొలగించండికొన్ని వత్సరములు దాట కోర్కె గల్గ
నా విభీషణునికి లంక నందు విందు
కు బిలి చెనయోధ్య ధీరుల కొంత వెసులు
బాటు చేసుకొని విహరింపంగ నదిగొ
లక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె లంకఁ గనఁగ
శ్రీలంక తెలుగు ప్రజలు అతిశీఘ్రముగా అష్టావధానమునకు కంది వారిని బిలుతురు గాక!
లక్ష్మణుఁ బత్ని యూర్మిళకు రాతిరి వచ్చిన స్వప్నమందునన్
రిప్లయితొలగించండిలక్ష్మణుఁ డూర్మిళాసతిని లంకకుఁ జేర్చెను పుష్పకమ్ముపై
సూక్ష్మఁపు బుద్ధితో నరసి జూడఁగ నీకిది తేటతెల్లమౌ
లక్ష్మణుఁడే నిరంతరము రాజిలు నూర్మిళ మానసంబునన్
ఉ॥ సూక్ష్మముఁ దెల్ప రామ కథ శోభఁ బఠించి పరుండ శయ్యపై
రిప్లయితొలగించండిలక్ష్మి విధమ్ము స్వప్నమున రాజిలి జానకి కన్పడంగ నా
లక్ష్మణ పూర్వజుండు రఘురాముఁడు నొప్పఁగ విష్ణురూపునన్
లక్ష్మణుఁ డూర్మిళా సతిని లంకకుఁ జేర్చెను పుష్పకమ్ముపై
పూర్వజుడు అన్న
ఇక్కడ స్వప్నములోని సూక్ష్మమండి. ఇంకా అసంబద్ధంగా ఎన్నో కనిపించి ఇవి కూడా కనిపించాయని.
తే.గీ:భూమిజను రాముడు గ్రహించ, బ్రేమ మీర
రిప్లయితొలగించండిలక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె, లంకఁ గనఁగ,
నిడుములన్ బొంద జానకె కే విధిని
వ్రాయ బడె, నూర్మిళకు నిద్ర వరము కాగ
ఉ;లక్ష్మికి మారు రూపు మిథిలాపుర దీప్తియు సీత కాగ నా
రిప్లయితొలగించండిలక్ష్మిని బొంద రాముడు, కులప్రభ మించ వివాహమాడె గా
లక్ష్మణుఁ డూర్మిళాసతిని, లంకకుఁ జేర్చెను పుష్పకమ్ముపై
లక్ష్మిని రావణుండు కుశలమ్ముగ నూర్మిళ యుండె నిద్ర లోన్.
సీత యున్నట్టి లంకను జూత మంచు
రిప్లయితొలగించండినాథుఁ గోరఁగఁ గూర్మిని నాతి కోర్కెఁ
దీర్ప రఘురాము నానతి ధీర వరుఁడు
లక్ష్మణుం డూర్మిళం దెచ్చె లంకఁ గనఁగ
సూక్ష్మముగా వచింపు మనఁ జోద్యము మీఱఁగఁ జెప్పె శిష్యుఁడే
యక్ష్మ రుజార్త వక్త్రుఁ డయి యత్తఱి నివ్విధి సంశయమ్మునం
బక్ష్మ యుగమ్ముఁ ద్రుంచి వెసఁ బక్షి వరేణ్యున కుగ్ర మూర్తి యా
లక్ష్మణుఁ డూర్మిళాసతిని లంకకుఁ జేర్చెను బుష్పకమ్ముపై
జనక సుత తోడ పెండిలి జరిగి నంత
రిప్లయితొలగించండిలక్ష్మ ణుo డూ ర్మిళన్ దె చ్చె : లంక గనగ
వెడలె హనుమంతు సీతను వెదకు కొఱకు
కాంచె తా నశోక వ నాన కన్నులార
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికాంచగ న శోక వనంలో కలిగె ముదము అని సవరణ చేయడమైనది
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పెండ్లి యాడి యయోధ్యకు పితృ నాజ్ఞ
లక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె; లంకఁ గనగ
హనుమ ధైర్యముగ గగనమందు నెగిరె
సంద్రమును దాటి జానకి జాడ తెలియ.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పెండ్లి యాడి యయోధ్యకు పితరు నాజ్ఞ
లక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె; లంకఁ గనగ
హనుమ ధైర్యముగ గగనమందు నెగిరె
సంద్రమును దాటి జానకి జాడ తెలియ.