19, ఏప్రిల్ 2026, ఆదివారం

సమస్య - 5444

20-4-2026 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే”

(లేదా...)

“కంజాతాక్షుని భూషణమగుఁ గదా కంకాళ మెల్లప్పుడున్”

14 కామెంట్‌లు:

  1. శార్దూలవిక్రీడితము
    శింజానమ్మగు లాస్యమై హరియె తాఁ జేరంగఁ, గౌంతేయులన్
    రంజింపంగను సంధివాక్యములతో రాణింపఁగన్ జూచినన్
    భంజింపంగ ఫలించ నెత్తుగడ మా భాగ్యంబనన్ సత్యమై
    కంజాతాక్షుని భూషణమ్మగుఁ గదా కంకాళ మెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందం
      శింజితమున శ్రీకృష్ణుడు
      రంజింపగ పాండవులను రాగన్ సభలో
      భంజించెడు మా యెత్తున
      కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే!

      తొలగించండి
  2. పింజరపు నగ నిడుటకయి
    పుంజెడు రూప్యములు గూడ పొసగక, బగితిన్
    గుంజీలు దీసి యిడెనిక
    కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే

    రిప్లయితొలగించండి

  3. గంజాయి మత్తు తో కా
    లంజరిని గాంచి విష్టరశ్రవు డంచున్
    సంజీవి యనుకొని పలికె
    కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే.


    సంజీవా పలుకంగనేల యిటులన్ సత్యంబు కాదందు నే
    కంజాతాక్షుడనంగ క్ష్వేళగళుడే కాదందువా శూలి యున్
    కంజాతాక్షుడె యందువా మరిగనన్ కామారి యేయైనచో
    కంజాతాక్షుని భూషణమగుఁ గదా కంకాళ మెల్లప్పుడున్.

    రిప్లయితొలగించండి
  4. సంజయ! శ్రీవత్సంబగు
    కంజాతాక్షునకుఁ దొడవు; గంకాళమ్మే
    కంజాయించిన విధమున
    భంజన నిడు వైద్య విద్యఁ భావింపంగన్

    అంజాయించక నిత్య సత్యములతో నాలోచనల్ సల్పుమా
    కంజాతమ్మన నొప్పు తామరసమే కాఁబట్టి శ్రీవత్సమే
    కంజాతాక్షుని భూషణమ్మగుఁ గదా; కంకాళ మెల్లప్పుడున్
    గంజాయించిన వైద్య విద్య కొఱకున్ గల్గించు సౌలభ్యమే

    [అంజాయించు = సందేహపడు; కంజాయించు = ఏర్పాటుచేయు]

    రిప్లయితొలగించండి
  5. గంజాయిని గొని నీవిటు
    పింజారిగ బల్కదగునె వెర్రితనమునన్
    రంజిల్లదె కౌస్తుభమణి
    కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే?

    రిప్లయితొలగించండి
  6. -

    గంజాయిగొని బలికితివొ
    కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే?
    పింజారీవెధవా! నిను
    రంజణి లో కాల్చెదగునురా దుశ్శీలా

    రిప్లయితొలగించండి
  7. శా॥ బంజారాలిలఁ బూర్వ కాలమున సంభావించుచున్ గానలన్
    రంజిల్లంగ నమోఘమంచునటు ప్రారంభించ వాసించఁగన్
    సంజాతమ్మును గాక విజ్ఞతయు విశ్వాసమ్ము నెక్కొల్పిరే
    కంజాతాక్షుని భూషణమ్మగుఁ గదా కంకాళ మెల్లప్పుడున్

    నెక్కొల్పు వ్యాపింపజేయు

    రిప్లయితొలగించండి
  8. కం:భంజించి హిరణ్య కశిపు
    రంజన బ్రహ్లాదు కిడిన ప్రబలరణమునన్
    కెంజాయ రంగు నొందిన
    కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే”
    (నరసింహుడు హిరణ్య కశిపుని సంహరించినప్పుడు ఆ కంకాళమే ఆయన ఆభరణం గా ఒప్పింది.అది తన శరీరం పైనే ఉంది కనుక. )

    రిప్లయితొలగించండి
  9. గంజాయిం గొనినావొ చిత్తమున సంఘాతమ్ము వాటిల్లెనో
    భంజింపం దగునే పురాణముల సంభావింపకన్ సత్యమున్
    రంజిల్లున్ గద కౌస్తుభమ్మురమునన్ లక్ష్మీశుకున్, బల్కెదో
    కంజాతాక్షుని భూషణమ్మగుఁ గదా కంకాళ మెల్లప్పుడున్?

    రిప్లయితొలగించండి
  10. కంజంబందున లక్ష్మి తోడ నడరెన్ కౌస్తుంభ,శ్రీవత్సమే
    కంజాతాక్షని భూషణమ్మగుగదా కంకాళమెల్లప్పుడున్
    పింజంబున్ శిరమందు దాల్చు శివుకున్ ప్రీతైన సొమ్మౌనుగా
    కంజుండావిధి సృష్టి జేయును గదా కారుణ్యమున్ జూపుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కంజంబందు జనించె లక్ష్మి ముదముగన్ కౌస్తుభ శ్రీవత్సముల్
      *కంజాతాక్షని భూషణమ్మగుగదా కంకాళమెల్లప్పుడున్*
      పింజంబున్ శిరమందు దాల్చు శివుకున్ ప్రీతైన సొమ్మౌనుగా
      కంజుండావిధి సృష్టి జేయును గదా కారుణ్యమున్ జూపుచున్

      తొలగించండి
    2. కంజంబందు జనించె లక్ష్మిహముగన్ కౌస్తుంభ శ్రీవత్సముల్
      *కంజాతాక్షని భూషణమ్మగుగదా కంకాళమెల్లప్పుడున్*
      పింజంబున్ శిరమందు దాల్చు శివుకున్ ప్రీతైన సొమ్మౌనుగా
      కంజుండావిధి సృష్టి జేయును గదా కారుణ్యమున్ జూపుచున్

      తొలగించండి
  11. గంజాయి గొనిన విధముగ
    రంజన జెడి పలుక నిట్లు రమ్యం బగు నే
    రంజిల్లె నెచట నెప్పుడు
    కంజా తా క్షు నకు దొడవు గంకా ళ మ్మే?

    రిప్లయితొలగించండి