21-6-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామునిఁ గని నవ్విరట ధరాపతు లెల్లన్”
(లేదా...)
“రామునిఁ గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్”
కందంకాముకతనహల్యఁ గొనన్దా, మౌని రగిలి శపించ,తనువెల్ల భగాలై మనుచు స్వప్నమై సుత్రామునిఁ గని నవ్విరట ధరాపతు లెల్లన్!ఉత్పలమాలకాముకతత్వమై చెలఁగి కాంత నహల్యను బొంద మోహమైతా, ముని కోప శాపమున తన్వున నిండి భగమ్ము లేర్పడన్జామునఁ జింతతో కునుక స్వప్నము నందున గేలి చేసి సుత్రామునిఁ గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్!
ఏ మన్నెదొర నడిగినను రామునిగ నటించినట్టి రంజిలు టాక్సీ రాముడు చిత్రపు తారకరామునిఁ గని నవ్విరట ధరాపతు లెల్లన్”
స్థేమము గల్గిన నృపతులు తామట మరలిరి పరీక్ష తప్పిన వారైకోమల శరీరుడగు శ్రీరామునిఁ గని నవ్విరట ధరాపతు లెల్లన్స్థేమము గల్గువారలును శ్రేష్ఠులు పల్వురి భంగపాటునేతామట గాంచిరా పుడమి తాల్పులు సీత స్వయంవరంబునన్గోమలమైన దేహమును గొప్పలు చెప్పగ లేని బాలుడౌరామునిఁ గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్
రాముడు పసి బాలుండని కోమల రూపుండనుచును కోదండము తా నిమాత్రమెత్తలేడని రామునిఁ గని నవ్విరట ధరాపతు లెల్లన్.కామిత కార్యమౌ శివుని కార్ముక మెత్త నసాధ్యమై యిటన్ భీమ బలుండ్రె కీడుపడి వేదన చెందుచు నుండు వేళలో నా మహిమాన్వితమ్మగు హయాంగము నెత్తగ వచ్చెనంచు శ్రీ రామునిఁ గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్.
అష్టావక్రుడు జనకుని సభలో ప్రవేశించినప్పుడు ఆయన ఆకారాన్ని చూసి సభికులు అపహాస్యము చేశారని ఒక కథ ఆధారంగా)కం॥సామర్థ్యమందు గాకన్స్థామనమందున్నవంక దరిసించుసభన్ధీమంతసమున్నతిఁవనరా మునిఁగని నవ్విరట ధరాపతులెల్లన్!!వనర+ఆ ముని
కందం
రిప్లయితొలగించండికాముకతనహల్యఁ గొనన్
దా, మౌని రగిలి శపించ,తనువెల్ల భగా
లై మనుచు స్వప్నమై సు
త్రామునిఁ గని నవ్విరట ధరాపతు లెల్లన్!
ఉత్పలమాల
కాముకతత్వమై చెలఁగి కాంత నహల్యను బొంద మోహమై
తా, ముని కోప శాపమున తన్వున నిండి భగమ్ము లేర్పడన్
జామునఁ జింతతో కునుక స్వప్నము నందున గేలి చేసి సు
త్రామునిఁ గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్!
ఏ మన్నెదొర నడిగినను
రిప్లయితొలగించండిరామునిగ నటించినట్టి రంజిలు టాక్సీ
రాముడు చిత్రపు తారక
రామునిఁ గని నవ్విరట ధరాపతు లెల్లన్”
స్థేమము గల్గిన నృపతులు
రిప్లయితొలగించండితామట మరలిరి పరీక్ష తప్పిన వారై
కోమల శరీరుడగు శ్రీ
రామునిఁ గని నవ్విరట ధరాపతు లెల్లన్
స్థేమము గల్గువారలును శ్రేష్ఠులు పల్వురి భంగపాటునే
తామట గాంచిరా పుడమి తాల్పులు సీత స్వయంవరంబునన్
గోమలమైన దేహమును గొప్పలు చెప్పగ లేని బాలుడౌ
రామునిఁ గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్
రిప్లయితొలగించండిరాముడు పసి బాలుండని
కోమల రూపుండనుచును కోదండము తా
నిమాత్రమెత్తలేడని
రామునిఁ గని నవ్విరట ధరాపతు లెల్లన్.
కామిత కార్యమౌ శివుని కార్ముక మెత్త నసాధ్యమై యిటన్
భీమ బలుండ్రె కీడుపడి వేదన చెందుచు నుండు వేళలో
నా మహిమాన్వితమ్మగు హయాంగము నెత్తగ వచ్చెనంచు శ్రీ
రామునిఁ గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్.
అష్టావక్రుడు జనకుని సభలో ప్రవేశించినప్పుడు ఆయన ఆకారాన్ని చూసి సభికులు అపహాస్యము చేశారని ఒక కథ ఆధారంగా)
రిప్లయితొలగించండికం॥
సామర్థ్యమందు గాకన్
స్థామనమందున్నవంక దరిసించుసభన్
ధీమంతసమున్నతిఁవన
రా మునిఁగని నవ్విరట ధరాపతులెల్లన్!!
వనర+ఆ ముని