22, జూన్ 2026, సోమవారం

సమస్య - 5506

23-6-2026 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ముదిమినిఁ బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్”

(లేదా...)

“ముదిమినిఁ బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

8 కామెంట్‌లు:

  1. కందం
    పదునేడేళ్ల మనుమనిన్
    విధివంచితు పెంచి నేర్పి విద్యాబుద్ధుల్
    ముదమునఁ బితామహుఁడడుగ
    ముదిమినిఁ, బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్

    చంపకమాల
    విధివశమౌచు మన్మనుని పెంచియు నేర్పియు విద్యలెన్నియో
    కుదురుగ గౌరవప్రదపు కొల్వున జేరఁ బితామహుండు తా
    ముదమున పెళ్లిచేసుకొని ముచ్చట దీర్చుమటంచుఁ గోరఁగన్
    ముదిమినిఁ, బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్

    రిప్లయితొలగించండి

  2. ముదమగు నీ పెండ్లి గనిన
    పిదపనె చచ్చెద నటంచు వృద్ధుండచటన్
    వదలక కోరిక కోరెను
    ముదిమినిఁ , బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్.


    పదుగురు కోర నేమిర వివాహమునే వల దన్న వేళ లో
    నది సరి కాదటంచును ప్రియత్వము తోడ పితా మహుండు తా
    వదలక నాదు పెండ్లి గని సంస్థితి పొందెద నంచు కోరె నా
    ముదిమినిఁ , బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్.

    రిప్లయితొలగించండి
  3. ముదముగ దీవించ దగును
    ముదిమినిఁ ; బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్
    పదునెనిమిది యేండ్ల వయసు
    పదంపడి వరునిగ వయసు పాటిగ నుండన్

    రిప్లయితొలగించండి
  4. మది తలచును శివ నామము
    ముదిమిని :: పెండ్లాడ దగును ముగ్ధ ను బాలన్
    పదునగు వయసున యువకుడు
    ముదమున పెద్దలు కుదుర్చు మూరుత మందున్

    రిప్లయితొలగించండి
  5. పదిలముగా తెలిపె నతడు
    ముదురు వయస్సున వరించి, ముదిత మగనికిన్
    జెదరని సేవలనిడగా
    ముదిమినిఁ, బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్

    ముదురు వయస్సునందునొక ముగ్ధను జూచి వివాహమాడి తాఁ
    గుదురుగ పల్కెనావిభుడు గొప్ప రహస్యము చిత్తగింపుమా
    వధువు వయస్సు ముఖ్యమగు, భార్యయె సేవలొనర్చు భర్తకున్
    ముదిమినిఁ, బెండ్లి యాడవలె ముగ్ధను షోడశవర్ష బాలికన్

    రిప్లయితొలగించండి
  6. మదిని మరల్చి నీవు పరమాత్ముని వైపుకు ముక్తి కోసమై
    సదమల బుద్ధితో సతము చక్కగ పూజలొనర్చగా వలెన్
    ముదిమినిఁ ,బెండ్లియాడవలె ముగ్ధను షోడశ వర్షబాలికన్
    ముదముగ యవ్వనాన పరి పూర్ణత గాంచగఁ జీవితంబునన్

    రిప్లయితొలగించండి
  7. -

    సదమల శంకరు గొల్వున
    ముదిమినిఁ బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్
    పదముల పద్యంపు చెలిని
    సుధలన్ గ్రోలంగ రారె శుభముల బడయన్


    రిప్లయితొలగించండి