23, జూన్ 2026, మంగళవారం

సమస్య - 5507

24-6-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్”
(లేదా...)
“మహిషము వేడ్కతో గగనమార్గమునం జరియించెఁ గాంచుమా”

3 కామెంట్‌లు:


  1. దహరుల చిత్రం బనుచును
    విహితుడు చెప్ప గననెంచి వెడలగ నందున్
    గుహములు పొలమును దున్నగ
    మహిషము గగనమున సాగెఁ గనుమా వేడ్కన్.


    మహిమ లవెన్నొగల్గు సినిమా యని చూడ మటంచు నాకు నా
    విహితుడు చెప్ప ప్రాణ సమ వేడు కొనన్ జని కాంచ నందులో
    గుహముల గట్టి కర్షకుడు గుడ్డము దున్నుచు నుండగా నటన్
    మహిషము వేడ్కతో గగనమార్గమునం జరియించెఁ గాంచుమా.

    రిప్లయితొలగించండి
  2. జగతిని తననర్చించుచు
    స్థగులగు దానవులడిగెడు చనవుల దీర్చన్
    తిగకంటి తనపయి దరల
    గగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్

    రిప్లయితొలగించండి