27, జూన్ 2026, శనివారం

సమస్య - 5511

28-6-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గ్రుడ్డువై వెక్కిరింతువె కూన నకట”
(లేదా...)
“గ్రుడ్డా పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండగన్”

9 కామెంట్‌లు:


  1. బద్ధకమ్మును కలిగిన వాడోకండు
    తనదు పోలిక కలిగిన తనయు నపుడు
    వెక్కిరించుట గాంచిన విహితు డనెను
    గ్రుడ్డువై వెక్కిరింతువె కూన నకట.


    బిడ్డన్ గాంచుచు బద్ధకస్తుడనుచున్ వేధింతువే నిత్యమున్
    విడ్డూరంబిది నీదు పోలికయె యావృ ఆవృత్తవ్ చు చేరెన్ గదా
    బిడ్డన్, నిన్నిలబోలినట్టి సుతుడన్ వెంగమ్ము లాడన్ గనన్
    గ్రుడ్డా పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండగన్.

    రిప్లయితొలగించండి
  2. లెస్సగనె నీ వలె కదల లేదని కను
    గ్రుడ్డువై వెక్కిరింతువె కూన నకట !
    కసిడి దినముల లోననె కదల గల్గి
    యున్న చోటు నుండి చలించు నొప్పిదముగ

    రిప్లయితొలగించండి
  3. శార్దూలము:
    ఎడ్డెమ్మన్నను తెడ్డెమందువుగదా యేబ్రాసివా? వెర్రివా?
    బిడ్డా! చాలును చాలునింక తగునా ప్రేలాపనల్? మానుమా
    విడ్డూరమ్ముగ మాటలాడెదవుగా పెచ్చారివా? ద్రాపివా?
    గ్రుడ్డా! పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండగన్

    రిప్లయితొలగించండి
  4. చెడ్డీ చక్కగ వేయ నీవు నెరుగవ్ చెప్తుంటివే సూక్తులన్
    వడ్డీ లెక్కలు వచ్చునా యనుచు నన్ ప్రశ్నించుచున్ నుంటివే
    విడ్డూరంబుగ మాటలాడెదవుగా పెట్రేగుచున్ మిక్కిలిన్
    గ్రూడ్డా పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండగన్

    రిప్లయితొలగించండి
  5. (మూడు నాలుగు రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన ఘోరము ఆధారంగా నండి దారి తప్పిన పిల్లలు తల్లిదండ్రులలో తప్పులు వెదుకుతారు కాని తిద్దుకోరు అని. చంపేదానికీ వెనుకాడరు)

    శా॥ అడ్డమ్మేదయ దారిఁ దప్పఁగను నేఁడయ్యో విలోమమ్ముగా
    జెడ్డన్ మెచ్చుచుఁ దల్లిదండ్రులను హిసించంగ దోషమ్ములన్
    గడ్డాయమ్ముగఁ జూప సూక్తమును బల్కంగా నిటుల్ విందురే!
    గ్రుడ్డా పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండఁగన్

    (విషయము తెలిపేందుకు అఖండయతి తప్పలేదండి 3వ పాదములో)

    రిప్లయితొలగించండి
  6. యుద్ధ రంగాన నభిమన్యు యుద్ధ పటిమ
    గాంచి కురుపతి కుట్ర తో కయ్య మందు
    పధ్ధతిని వీడి చంపుట పాడి యగునె?
    గ్రుడ్డు వై వెక్కిరింతు వె కూన నకట!

    రిప్లయితొలగించండి
  7. పిల్లలెదిగి కనుల ముందు పెద్దలగుట
    సర్వ సాధారణంబగు సంగతి గద
    వారి పనులలో విజ్ఞత వారిదనక
    గ్రుడ్డువై వెక్కిరింతువె కూన నకట

    అడ్డాదిడ్డు లనంగవచ్చునుగదా హాస్యోక్తులన్ బల్కినన్
    గడ్డాలొచ్చిన నాడు బిడ్డలయినన్ గాకుందురా విజ్ఞులే
    విడ్డూరంబుగ చూచుచుంటివిగదా విజ్ఞాని నీదృష్టి లో
    గ్రుడ్డా! పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండగన్

    [ పిల్లలు పెరిగి పెద్దయినా వారిని తగిన రీతి మెచ్చక
    పరిహాసమాడే భర్తతో భార్య అన్న మాటలు ]

    రిప్లయితొలగించండి