21, జులై 2026, మంగళవారం

సమస్య - 5535

22-7-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“హితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్”

(లేదా...)

“హితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్”

(ఛందోగోపనం)

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో కటకం వేంకటరామ శర్మ గారి సమస్య)

2 కామెంట్‌లు:

  1. స్నేహితులన్న క్షీరమును నీరము వోలె లయించువారు వి
    ద్రోహపు చింతనన్ విడచి తోషము గూర్చగ జూతు రొండొరుల్
    స్నేహమె యూపిరై మెలఁగి నిత్యము నాజత గోరువారలౌ
    నాహితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్

    రిప్లయితొలగించండి
  2. సాహిత్య సేద్య మొనరిం
    చు హాలికులుగ పచరించు సుముఖుల లోనన్
    సహృదయము నొందిన కడు స
    న్నాహితు లర్థప్రియులనగ నమ్మరు విజ్ఞుల్

    రిప్లయితొలగించండి