20, డిసెంబర్ 2015, ఆదివారం

19, డిసెంబర్ 2015, శనివారం

‘ఆంధ్రామృతం’ బ్లాగులో వ్యాకరణ పాఠాలు…

శ్రీ చింతా రామకృష్ణారావు గారి ‘ఆంధ్రామృతం’ బ్లాగులో సంస్కృత, తెలుగు సంధుల గురించి వివరంగా వీడియో పాఠాలను అందిస్తున్నారు. ఔత్సాహిక కవిమిత్రులకు ఆ పాఠాలు ఎంతో ఉపయుక్తం. ఆ పాఠాలను పరిశీలించి, సాధారణంగా మనం చేస్తున్న నుగాగమ, యడాగమ, ద్రుత సంధిదోషాలను పరిహరించుకోవచ్చు. తప్పక చూడండి.

ఈ పాఠాలను అందిస్తున్న చింతా వారికి ధన్యవాదాలు తెల్పుకుందాం.
క్రింది లింకును క్లిక్ చేయండి.....

సమస్య – 1889 (అమ్మా రమ్మని పిల్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్!
(‘సమస్యాపూరణము’ సమూహంనుండి కవిమిత్రునకు ధన్యవాదాలతో...)

18, డిసెంబర్ 2015, శుక్రవారం

సమస్య – 1888 (ధనము నమ్మి…)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ధనము నమ్మి ధనము దార కొసఁగె.
(ఈ సమస్యను సూచించిన భాగవతుల కృష్ణారావు గారికి ధన్యవాదాలు)

17, డిసెంబర్ 2015, గురువారం

సమస్య - 1887 (చేఁదు తీయ నగుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు.

(ఈ సమస్యను పంపిన భాగవతుల కృష్ణారావు గారికి ధన్యవాదాలు)

16, డిసెంబర్ 2015, బుధవారం

ఆహ్వానం!

ఆహ్వానము
"కోమల సాహితీవల్లభ"
శ్రీ కోడూరి ప్రభాకరరెడ్డి సాహితీపీఠం- ప్రొద్దుటూరు.
తే. 27-12-2015 సాయంత్రం గం.4.00లకు
జయప్రకాష్ నారాయణ్ నగర్ కమ్యూనిటీ హాలు(మియాపూర్)నందు
ప్రౌఢకవి శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె కు
2015 సంవత్సరమున చేయుచున్న సాహితీపురస్కార కార్యక్రమమునకు 
సాహితీ ప్రియులైన మీ అందరినీ 
సాదరంగా అహ్వానిస్తోంది.
కార్యక్రమ వివరములు.
సాయంత్రంగం.4.00లకు జ్యోతి ప్రజ్వలనము.
తదనంతరము
వేదికనలంకరించువారు.
సభాధ్యక్షులు-ప్రముఖ పదబంధ రామాయణకవి శ్రీ విహారి .
ముఖ్య అతిథి- శ్రీ ఎల్లూరి శివారెడ్డి .ఉపకులపతి - తెలుగు విశ్వవిద్యాలయము.
పురస్కృతుని పరిచయం చేయువారు. డా.డీ.వీ.జీ.యే.సోమయాజులు.
విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. అనకాపల్లి.
పురస్కార గ్రహీత. ప్రౌఢకవి శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె .
ఆత్మీయ అతిథులు. శ్రీ చెన్నూరు ఆంజనేయ రెడ్డి.   శ్రీ వై.విశ్వేశ్వర రెడ్డి.
ప్రశంసాపత్ర సమర్పకులు. శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి .
తదనంతరము
ప్రార్థన
వక్తల ఉపన్యాసములు.
సాహితీ పురస్కారము.
ధన్యవాదములు. 
మంగళ గీతాలాపనము.
వివరముల కొఱకు 
సంప్రదించవలసిన దూరవాణి సంఖ్య 9177945559
ఇట్లు
అధ్యక్షుఁడు. కోడూరి ప్రభాకరరెడ్డి
కార్యదర్శి. శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి.
(కార్యక్రమానంతరము అల్పాహారము)

సమస్య - 1886 (పామునుఁ దినఁ గోరి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
పామునుఁ దినఁ గోరి కప్ప బారెఁడు సాగెన్.
ఒకానొక అవధానంలో గరికిపాటివారు పూరించిన సమస్య...

15, డిసెంబర్ 2015, మంగళవారం

14, డిసెంబర్ 2015, సోమవారం

13, డిసెంబర్ 2015, ఆదివారం

సమస్య - 1883 (కొట్టెడు పతి సుజనుఁ డనుచు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్.
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,
నాన్నగారి అస్థికలను త్రివేణీ సంగమంలో నిమజ్జనం చేయడానికి కాళేశ్వరం వెళ్తున్నాను. అందువల్ల బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి పరిస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.