15, డిసెంబర్ 2015, మంగళవారం

సమస్య - 1885 (అవధానమ్ముల నుండరా దనె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
అవధానమ్ముల నుండరా దనె సమస్యాపూరణం బెన్నడున్.

46 కామెంట్‌లు:

 1. నవనీతంబగు కావ్యకన్నియల నానందంబునన్ విందుగా
  అవధానమ్ముల , నుండరా దనె ? సమస్యాపూరణం బెన్నడున్
  సవరిం చంగను పద్యమందునట సౌజన్యంబనన్ వింటిమే
  శ్రవణా నందము నొందనేరముగదా శ్రావ్యంబుగా ధారణన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘కావ్యకన్నియ’ అని సమాసం చేయరాదు కదా! ‘కావ్యకన్యకల’ అనండి.

   తొలగించండి
  2. నవనీతంబగు కావ్యకన్యకల నానందంబునన్ విందుగా
   అవధానమ్ముల , నుండరా దనె ? సమస్యాపూరణం బెన్నడున్
   సవరిం చంగను పద్యమందునట సౌజన్యంబనన్ వింటిమే
   శ్రవణా నందము నొందనేరముగదా శ్రావ్యంబుగా ధారణన్

   తొలగించండి
 2. కంది వారికి ఇదే మాలిక లో పునర్ ఆహ్వానం :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. అవధానమ్ము లనేకమై తనరు విన్యాసమ్ముల న్నంతర
  మ్మవలోకింపగ గల్గు నెట్లనగ, నాట్యమ్మనన్,చిత్రవే
  ష విధానమ్మన,మల్లబంధన విశెషాలన్న నిత్యాదులౌ
  యవధానమ్ముల నుండరాదనె సమస్యా పూరణంబెన్నడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో ‘నాట్యమ్మనన్’ అన్నచోట గణదోషం. సవరించండి.

   తొలగించండి
 4. స్తవనీయుండగు పృచ్ఛకుం డొకఁడు క్లిష్టంబైన భావమ్ముతో
  యువగండమ్ములు వృద్ధనారి కని సంయుక్తాక్షరశ్లిష్టశ
  బ్దవిలాసమ్ములతో సమస్య నిడగాఁ దా నోడి కృద్ధాత్ముఁడై
  యవధానమ్ముల నుండరాదనె సమస్యాపూరణం బెన్నడున్.
  (యువగండములు = మొటిమలు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. చక్కటి మీ పూరణ నా పూరణకు సమాధానము గా విరాజిల్లుతోంది.

   తొలగించండి
  2. మాస్టరు గారూ ! మీ పూరణ చక్కని " శబ్ద విలాసమ్ములతో " అలరారుచున్నది.

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ,
   హనుమచ్ఛాస్త్రి గారూ,
   ధన్యవాదాలు.

   తొలగించండి
 5. రిప్లయిలు
  1. కవిరాజన్యుల భావజాలయుత వాక్చాతుర్య మాహాత్మ్యముల్
   కవనప్రాభవ ధీతతుల్ మెరయ సత్కారార్హ పద్యావళుల్
   శ్రవణా నందము నొప్పఁ జెప్పు కవిసమ్రాట్టుల్ గనన్నేల దా
   నవధానమ్ముల నుండరా దనె సమస్యాపూరణం బెన్నడున్.

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   శబ్దసౌందర్యంతో మీ పూరణ విరాజిల్లుతున్నది. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 6. అవధానమ్ములు కాంచువారలకు దివ్యంబైన తోష మ్మిడున్
  కవితాగోష్టిన శ్రోతలన్ కరము చొక్కంజేయ నట్లైనచో
  నవధానమ్ముల నుండరాదనె సమస్యాపూరణం బెన్నడున్
  కవితాసాగరమందునన్ సతతమున్ కాన్పించు నిష్ణాతుడే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘కవితాగోష్ఠిని’ అనండి.

   తొలగించండి
 7. కవితాసక్తత గల్గువారలను నాకర్షించు మార్గమ్మునన్
  నవనీతంబగు పద్ధతుల్నడుపు విన్యాసాల విజ్ఞానమే
  అవలీలన్ గణితావ ధానమున—నాధ్యాంతమ్ము వీక్షించగా?
  అవధానమ్ముల నుండరాదనె సమస్యాపూరణంబెన్నడున్
  2.అవధానంబున పృచ్చకుండడిగె పద్యంబందు దీర్గాక్షరాల్
  అవధానమ్ముల నుండరాదనె” సమస్యా పూరణం బెన్నడున్
  వివరంబందున ధారణా ప్రతిభ నిర్వీర్యంబు గాకున్నచో?
  శ్రావణానందము గూర్చునట్టిదగు| విశ్వాసాన పూరించగా.

  రిప్లయితొలగించండి
 8. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  G V S సహదేవుడు గారికి నమస్కరిస్తూ :----
  నేను నిన్నటి పూరణలో , హనుమ౦తుడు రాముని రక్ష౦చెను అని పూరి౦చాను .
  రాముని చిన్నబుచ్చినట్లు కాదు. ఆవిషయము పోచిరాజుగారు సవిస్తర౦గా వివరి౦చారు . హనుమ రాముని బ౦టు కాదు.
  రాముని ప్రాణములో ప్రాణము

  ర క్షి ౦ చు అనగా = ప్రాణాలు రక్షి౦చు

  అనే కాక

  ర క్ష ౦చు అనగా = కాపు గాయు,రక్షగానిలుచు

  అ౦డగా నిలుచు

  అనే అర్థాలు కూడా ఉన్నాయి కదా !

  కావున నేను రామచ౦ద్రు నిసుమ౦తయు

  చిన్నగా చేసి పద్య౦ పూరి౦చ లేదు

  న మ స్తే

  రిప్లయితొలగించండి
 9. కవనంబన్నది కర్ణ పేయమగుచున్ గానంబు గా సాగ మా
  నవ మస్తిష్కము నందు రంజిలు కలల్ నాదంబు గా బల్కగా
  నవరొధమ్ముల నుంచ ధారణ మహా యజ్ఞంబు నందొక్కడా
  యవధానమ్ముల నుండరా దనె సమస్యాపూరణం బెన్నడున్.

  రిప్లయితొలగించండి
 10. అవధానే మరి కష్టమంచు ననగా నాపూరణన్ జేయగా
  నవలోకించుచు పృచ్చకుండు సరిగా పూరించ బూనంగ తా
  నవలీలంగను చేయలేక జనగా నట్లైన నీ పోకడన్
  యవధానమ్ముల నుండరా దనె సమస్యాపూరణం బెన్నడున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అవధానాలలో క్లిష్టమైన సమస్యల నివ్వడం సులభమే. అయితే అవధాని పూరించలేని పరిస్థితిలో పృచ్ఛకుఁడు దానిని పూరించగలగాలని నియమం. ఆ విషయాన్ని మీ పూరణలో ప్రస్తావించారు. బాగుంది.

   తొలగించండి
 11. గురువుగారికీ, పెద్దలందరికీ నమస్కారం. మొట్టమొదటిసారి మత్తేభ పద్యం రాయడానికి సాహసించాను. చాలా చిన్న ప్రయత్నం. దయచేసి పరిశీలించి నా తప్పులు తెలియచేయగలరు.
  మ:
  సువిధానుండగుపండితోత్తముడుప్రాశస్త్యంబుగా
  కవిప్రజ్ఞాలులగెల్వ,నాకవనయాకాశాన,భా
  రవినీ తండగు నా?యనీ, బెదరి తర్కించీ సుమేధావులే
  అవధానమ్ములనుండరాదనెసమస్యాపూరణంబెన్నడున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుభద్ర గారు మీ సౌకర్యార్థము యతి మైత్రి నియమాలు సంక్షిప్తముగ జతపరచు చున్నాను. ఉపయోగకరముగా ఉంటుందని భావిస్తున్నాను.
   యతి మైత్రి:
   క గుణింతం తీసుకుంటే
   క, కా, కై, కౌ ల మధ్యన యతి మైత్రి ఉంది.
   కి, కీ, కె, కే ల మధ్యనా..
   కు, కూ, కొ, కో. ల మధ్యనా మైత్రి చెల్లును.

   (ఇదే రీతిగా మిగిలిన అన్ని హల్లులకు యతి మైత్రి చెల్లును)

   ఈ క్రింది యతి మిత్రులు కూడా గమనించండి.
   1. అ, ఆ, ఐ, ఔ, య, హ...
   2.ఇ, ఈ, ఎ, ఏ, ఋ, ౠ
   3. ఉ, ఊ, ఒ, ఓ
   4. క, ఖ, గ, ఘ
   5.చ,ఛ,జ,ఝ, శ, ష, స.
   6. ట, ఠ, డ ,ఢ
   7, ప, ఫ,బ, భ, వ.
   8.త, థ, ద, ధ
   9.న, ణ, ఙ.
   10, ల, ర, ళ,డ ..,
   * మ, oప, oఫ, oబ, oభ (ప్రత్యేకంగా... పు, పూ, పొ, పో, ఫు, ఫూ, ఫొ, ఫో, బు, బూ, బొ, బో, భు, భూ, భొ, భో- లతో ... ము, మూ, మొ, మో లకు యతి కుదురుతుంది.)
   ఉదా|| ’మా’దు జనని! దుర్గమ్మ! అ’oబ’! దయ జూడు
   అలాగే, మరో ఉదా|| ’పు’లతి అందమైన ’మో’ము జూడు
   ప్రాసయతి:

   యతి ప్రాసలతో పాటు ప్రాసయతి అని మరొకటి ఉన్నది,,,,,ఏదేని పద్య పాదములో ఉన్న మొదటిదైన యతి అక్షరమును తిరిగి యతిస్థానంలో లోవ్రాయటానికి అవకాశం లేనప్పుడు ప్రాసగా రెండవ స్థానంలో ఉన్న ప్రాసాక్షరాన్ని తిరిగి యతిస్థానానికి ప్రక్కన వ్రాయటాన్ని ప్రాసయతి అటారు. ఈ ప్రాసాయతికి ఖచ్చితంగా మనం గుర్తుంచుకో వలసిన నియమం ఒకటి ఉన్నది , ప్రతి పాదానికి మొదటి అక్షరం యతి అని రెండవ అక్షరం ప్రాస అని మనకు తెలుసు కదా అయితె ప్రాసకు ముందున్న అక్షరం హ్రస్వం అయితే ప్రాసయతి స్థానంలో కూడ హ్రస్వమేవాడాలి......థీర్ఘం అయితే దీర్ఘం మాత్రమే వాడాలి.అంతే కాని ప్రాస పూర్వాక్షారం హ్రస్వంగాను ప్రాసయతి పూర్వాక్షరం దీర్ఘం గాను ఉండ కూడదు.ఈడు- జోడు
   ఆట - పాట.,,,,ఇలాగే ఉండాలి..అంతేకాని ప్రాస పూర్వాక్షరం దీర్ఘంగాను ప్రాసయతి లోపూర్వాక్షారం హ్రస్వంగాను ఉండరాదు .

   "బోటి" యెకటి పెండ్లి "పాట" పాడగఁ జొచ్చె
   "నాప" రాని విరహ "తాప" మునను"

   తొలగించండి
  2. యతి గణదోషాలను సవరించగా మీ పద్యము ఈవిధముగా ఉండ వచ్చును. అన్వయము కొంచెము సందేహాస్పదము గా ఉంది, మీ భావము సరిగా తెలియనందున.
   సువిధానుండగు పండితోత్తముడు సంశోభిల్లగన్ నెమ్మెయిన్
   కవివిజ్ఞానుల గెల్వగోరి కవనాకాశమ్మునన్ భానుభా
   రవియీ తండగు నా?యనిన్, బెదరి తర్కంబొప్పమేధావియే
   యవధానమ్ములనుండరాదనెసమస్యాపూరణంబెన్నడున్.

   తొలగించండి
  3. వేదుల సుభద్ర గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసార్హం. పద్యంలోని లోపాలను కామేశ్వర రావు గారు ప్రస్తావించి, సవరణలు సూచించారు. మరికొన్ని వృత్తాలను రచిస్తే మీరు సలక్షణంగా వ్రాయగలరు. నిరుత్సాహపడకండి. స్వస్తి!

   తొలగించండి
  4. ధన్యవాదాలు సార్. ఈ రోజు సమస్య చూసి చాలా భయపడ్డాను. కనీసం ప్రయత్నం చేస్తేనే కదా తప్పులు తెలిసేది అనుకుని సాహసించాను. మీ వీవరణకూ, సవరణకూ మరొక్కసారి నా ధన్యవాదాలు. పండితుడు పృచ్చకులడిగిన ప్రశ్నలన్నింటికీ బాగా సమాధానములు చెప్పినపుడు వారు ఆతని ప్రతిభకు భయపడి ఇలా అనుకున్నారన్న అర్ధంలో రాశాను. మీరు, గురువుగారు ఇప్పటివరకూ ఇచ్చిన సూచనలన్నీ గుర్తు పెట్టుకుని తప్పక పాటిస్తాను. ఇలాగే మీకు నా పద్యాల్లో ఏ దోషాలు కనపడినా తప్పకుండా తెలియచేయండి.

   తొలగించండి
  5. ధన్యవాదాలు గురువుగారు. తప్పకుండా రాస్తాను మీ అందరి ఆశీర్వాదంతో..

   తొలగించండి
 12. శ్రీకెంభాయితిమ్మాజీరావుగారి సవరణ పూరణం
  అవధానమ్ములనేకమై తనరు విన్యాసమ్ములన్నంతర
  మ్మవలోకింపగ గల్గు నెట్లనగ?ప్రామాణ్యంబునన్-చిత్ర వే
  షవిదానమ్మున,మల్లబంధన విశేషాలన్ననిత్యాదులౌ
  యవధానమ్ములనుండరాదనెసమస్యా పూరణంబెన్నడున్

  రిప్లయితొలగించండి
 13. లవలేశంబగు ప్రజ్ఞ లేకయును తెల్లంగాగ చాతుర్యమున్
  సువిచారంబు నొకింతయున్ సలుపడా సోలెే మదోన్మత్తతన్
  యవధానిన్ గని కూసె నా ఖలుడు మాయామోహ విభ్రాంతుడై
  యవధానమ్ముల నుండరాదనె సమస్యాపూరణం బెన్నడున్

  రిప్లయితొలగించండి
 14. కవిరా జుల్ ఘన పాటవ మ్మున చమత్కారోక్తులౌ భాషణల్
  ల్లవధానమ్మున జెప్పరే జనుల నాహ్లాదమ్మొనర్చగ నా
  శ్రవణానందము కల్గజేయు కవి ధారావాహికిన్ భంగమౌ
  యవధానమ్మున నుండరాదనె సమస్యా పూరణం బెన్నడున్

  రిప్లయితొలగించండి
 15. గురువు గారికి నమస్కారములు......నేను నా వ్యక్తిగత కార్యార్థినై కామారెడ్డి వచ్చియున్నందున విపరీతమైన పని ఒత్తీడి చే పూరణను ఆలస్యముగా ప్రచురించడం జరిగింది.

  రిప్లయితొలగించండి
 16. సమస్య
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  నిన్నటి సమస్య స్వీకరి౦చ మనవి

  ..................................................
  " పృఛ్ఛకుడు అశ్లీలమగు సమస్యనిడగా సభలో నొక. శ్రోత. యిట్లు వచి౦చెను "
  ....................................................

  శ్రవణాసహ్య పదప్రయోగమున

  ................ .. క్లిష్ట౦బైన ఛ౦దమ్ము న౦

  దవరోధ౦బుగ. నీ సమస్య నిడుచు ు

  ...................... + అష్టావధానాధిక

  వ్యవసాయ౦బున దుష్టకీటకముగా

  ...................... వర్తి౦ప మేలౌనె ? యీ

  యవధానమ్ముల ను౦డ రాదనె

  ................ సమస్యాపూరణ౦ బెన్నడున్


  .

  రిప్లయితొలగించండి
 17. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  G V S సహదేవుడు గారికి నమస్కరిస్తూ :----
  నేను నిన్నటి పూరణలో , హనుమ౦తుడు రాముని రక్ష౦చెను అని పూరి౦చాను .
  రాముని చిన్నబుచ్చినట్లు కాదు. ఆవిషయము పోచిరాజుగారు సవిస్తర౦గా వివరి౦చారు . హనుమ రాముని బ౦టు కాదు.
  రాముని ప్రాణములో ప్రాణము

  ర క్షి ౦ చు అనగా = ప్రాణాలు రక్షి౦చు

  అనే కాక

  ర క్ష ౦చు అనగా = కాపు గాయు,రక్షగానిలుచు

  అ౦డగా నిలుచు

  అనే అర్థాలు కూడా ఉన్నాయి కదా !

  కావున నేను రామచ౦ద్రు నిసుమ౦తయు

  చిన్నగా చేసి పద్య౦ పూరి౦చ లేదు

  న మ స్తే

  రిప్లయితొలగించండి
 18. కవిహంసంచును విర్రవీగుచును షోగ్గాడొచ్చి నెల్లూరునన్
  స్తవనీయుండ్లగు పండితోత్తములు క్లిష్ట ప్రశ్నలప్పించగా
  నవమానమ్మును తాళజాలకిక నానాబూత్లు లంకించుచు
  న్నవధానమ్ముల నుండరాదనె సమస్యాపూరణం బెన్నడున్!

  రిప్లయితొలగించండి
 19. చవటల్ పల్కురు శంకరార్య బలుపౌ చాదస్తమే హెచ్చగా:
  "అవధానమ్ముల నుండరాదనె సమస్యాపూరణం బెన్నడున్"
  సవరింపుమ్ వడి నీదు వాక్యమిటులన్ శ్రావ్యమ్ముగా మార్చుచున్:
  "అవధానమ్ముల నుండగాదగు సమస్యాపూరణం బెన్నడున్"

  రిప్లయితొలగించండి


 20. చవటల్ చప్పున పూర్తి చేయు విధమై సాధారణంబైన రీ
  తి, వధాన్యుల్ తమ స్థాయి క్రిందిదని వాదింపంగ సందర్భమి
  చ్చు విధానమ్ముగ, పూరణమ్ములిక చచ్చుల్గాను తోచంగనా
  యవధానమ్ముల నుండరా దనె సమస్యాపూరణం బెన్నడున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి