16, డిసెంబర్ 2015, బుధవారం

సమస్య - 1886 (పామునుఁ దినఁ గోరి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
పామునుఁ దినఁ గోరి కప్ప బారెఁడు సాగెన్.
ఒకానొక అవధానంలో గరికిపాటివారు పూరించిన సమస్య...

38 కామెంట్‌లు:

  1. .ప్రస్తుతము కాల్మనివిషయంపైనాపూరణ
    పామౌ రీతిగ కాల్ మని
    సామాన్యుడినప్పుగప్ప సహనము లేకన్
    ధీమాగా నెదురొడ్డియు
    పామును దినగోరి కప్పుబారెడు సాగెన్|

    రిప్లయితొలగించండి
  2. గురువు గారికి నమస్కారములు

    సామాన్యుల వంచించెడు
    నేమాత్రము నీతిలేని నేతల నెదురొ
    డ్డన్ మాన్యులంత నొకటవ
    పామును దినగోరి కప్ప బారెడు సాగెన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో ప్రాసదోషం. ‘నేతల కెదురై| యా మాన్యులంత...’ అనండి.

      తొలగించండి

    2. సామాన్యుల వంచించెడు
      నేమాత్రము నీతిలేని నేతల నెదురై
      యా మాన్యులంత నొకటవ
      పామును దినగోరి కప్ప బారెడు సాగెన్ .

      తొలగించండి
  3. కవిరా జుల్ ఘన పాటవ మ్మున చమత్కారోక్తులౌ భాషణల్
    ల్లవధానమ్మున జెప్పరే జనుల నాహ్లాదమ్మొనర్చగ నా
    శ్రవణానందము కల్గజేయు కవి ధారావాహికిన్ భంగమౌ
    యవధానమ్మున నుండరాదనె సమస్యా పూరణం బెన్నడున్



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘భాషణల్+అవధానమ్మున=భాషణ లవధానమ్మున’ అవుతుంది. ఉక్తులౌ భాషణలు... పునరుక్తి అవుతుంది. ‘చమత్కారోక్తులన్ వింతగా| నవధానమ్మున...’ అనండి. ‘...నాహ్లాద మ్మొనర్చంగ’ అనండి. గణదోషం తొలగిపోతుంది. ‘ధారావాహి’ ప్రయోగం లేదు. ‘భంగమౌ|నవధానమ్మున’ అనండి.

      తొలగించండి
  4. ఈ మేదిని రకరకముల
    పాములలోఁ గలవు వానపాములు, క్షుద్బా
    ధామంత్రితమై యందలి
    పామునుఁ దినఁగోరి కప్ప బారెడు సాగెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాస్టరుగారూ ! కప్పతో పామును ఎలా తినిపించాలా అని ఆలోచిస్తున్నాను...వానపామును రంగంలోకి దించారు...బాగుంది.

      తొలగించండి
    2. హనుమచ్ఛాస్త్రి గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
  5. రాముడొక చిన్ని బుడతడు
    సోముడు తనయీడు గాన సోకుగ జెప్పెన్
    సోమూ కథవినుమిపుడిటు
    పామును దినగోరి కప్ప బారెడు సాగెన్

    రిప్లయితొలగించండి
  6. రాముడొక చిన్ని బుడతడు
    సోముడు తనయీడు గాన సోకుగ జెప్పెన్
    సోమూ కథవినుమిపుడిటు
    పామును దినగోరి కప్ప బారెడు సాగెన్

    రిప్లయితొలగించండి
  7. ఏమో యనుకొంటినిమరి
    పామునుదినగోరికప్ప బారెడు సాగెన్
    పాములుకప్పల,కప్పలు
    పాముల వలె నుండు వాన పాముల దినునున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పాములను దినున్’ అనండి.

      తొలగించండి
  8. సోముని మ్రింగెడు రాహువు
    నామముగల ప్రుచ్ఛకుండు నవయవధానిన్
    బాముల ముంచ విఫలుడయె
    పామునుఁ దినఁ గోరి కప్ప బారెఁడు సాగెన్.

    రిప్లయితొలగించండి
  9. "ఏమా కప్పకు దూకుడు?
    పామును గనలేద?"నంగ,పలికితి"నదిగో,
    నా ముంగిస తొ వచ్చెను
    పామును దినగోరి కప్ప బారెడు సాగెన్

    రిప్లయితొలగించండి
  10. పాముల కాహారమ్మగు
    నీ మండూకం బచట గనియె విధిలీల
    న్నేమఱిన చిన్ని నలికిరి
    పామునుఁ దినఁ గోరి కప్ప బారెఁడు సాగెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. Inspired by antz movie. trailer here https://www.youtube.com/watch?v=iX_qRwVXWYQ

    ఏమన మాయాజాలము
    గా, మరి యదియద్భుతంబె కంప్యూటరుతో
    చీమల చిత్రంబటులే
    పామును దినగోరి కప్ప బారెడు సాగెన్

    రిప్లయితొలగించండి
  12. ఆమడుగున జలమింకగ
    నామారిన ఋతువు లోన నాకలి యడరన్
    కామన తోనొక్క బురద
    పామును దినగోరి కప్ప బారెడు సాగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. గురుమూర్తి ఆచారి గారి పూరణలు.....
    నిన్నటి సమస్యకు పూరణ....
    (పృఛ్ఛకుడు అశ్లీలమగు సమస్య నిడగా సభలో నొక శ్రోత యిట్లు వచి౦చెను)
    శ్రవణాసహ్య పదప్రయోగమున క్లిష్ట౦బైన ఛ౦దమ్ము న౦
    దవరోధ౦బుగ. నీ సమస్య నిడుచు + అష్టావధానాధిక
    వ్యవసాయ౦బున దుష్టకీటకముగా వర్తి౦ప మేలౌనె? యీ
    యవధానమ్ముల ను౦డ రాదనె సమస్యాపూరణ౦ బెన్నడున్.

    ఈనాటి సమస్య
    గోముగ మయూర మెగసెను
    పామును దిన గోరి; కప్ప బారెడు సాగెన్
    భూమిలతను మ్రి౦గ దలచి
    సామీ! నీ దైన వి౦త సృష్టికి జే జే!
    {భూమిలత = వానపాము}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      (నిన్నటి, నేటి సమస్యలకు) మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
      నిన్నటి పూరణలో ‘సమస్య నిడగా నష్టావధానాధిక...’ అనండి.

      తొలగించండి
  14. ఏమని చెప్పుదు భారత
    భూమిని కబలించ పాకు పూనిక చేతన్
    ఏమరిక లేక నాహా!
    పామునుఁ దినఁ గోరి కప్ప బారెఁడు సాగెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చేతన్ + ఏమరిక" అని విసంధిగా వ్రాయరాదు. "పూనికతోఁ దా| నేమరిక..." అనండి.

      తొలగించండి
  15. ఏమని జెప్పుదు వింతని
    దోమకు హస్తికిని వలపు దూరం బెంతౌ
    క్షేమము మరచిన లాలస
    పామునుఁ దినఁ గోరి కప్ప బారెఁడు సాగెన్

    రిప్లయితొలగించండి
  16. ఓముని పుంగవు నెదుటే
    పామునుదినగోరి కప్పబారెడుసాగెన్
    స్వామీ యేమీ వింతన?
    పామే సాధుత్వమైన పట్టుటనిజమే|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒక'ను 'ఓ' అనడం గ్రామ్యం.

      తొలగించండి
  17. యమబంటువోలె సర్పము
    కమనీయముగ శలభమ్ము గాంచినటునిటుల్
    సమయముఁగని తప్పించుకు
    పామును, తినగోరి కప్ప బారెడు సాగెన్!

    రిప్లయితొలగించండి


  18. దామము వలె తిరిగె వరుగు
    పామునుఁ దినఁ గోరి, కప్ప బారెఁడు సాగెన్
    చీమను తినగోరి, నరుడు
    నీమము వీడి మనుజుని తిని బతుక నేర్చెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. గోముగ పట్నపు బుడతడు
    పామూరికి వచ్చి జూచి పలికెను వింతన్: 👇
    మామా! చూడుము! ఏలిక
    పామునుఁ దినఁ గోరి కప్ప బారెఁడు సాగెన్!

    రిప్లయితొలగించండి
  20. నీమము వీడుచు మోడిన్
    గోముగ కౌగిలుచు కన్ను గొట్టెను రాహుల్
    భామా! ఇది యెట్లన్నన్:
    పామునుఁ దినఁ గోరి కప్ప బారెఁడు సాగెన్

    రిప్లయితొలగించండి