ఆంజనేయ శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘అమ్మ+ఏ’, ‘ఆక్షేపణ+ఇంక’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అమ్మ ఏకవచనం, పడతులన్ బహువచనం. ‘సత్+శీల=సచ్ఛీల’ అవుతుంది. మీ పద్యానికి నా సవరణ.... అమ్మల్ నా కని యెంచెదన్ పడతుల న్నాక్షేపణం బేటికే సమ్మానించెద నెప్పుడున్ ముదముతో సచ్ఛీల సంపన్ను లీ కొమ్మల్ నాపయి శంక మానుమిక నీ కోపమ్ము చాలించి రా వమ్మా! రమ్మని పిల్చె భర్త తన యర్థాంగిన్ ప్రమోదమ్మునన్
నమస్కారములు గురువు గారి పద్యం చాలా బాగుంది అసలు ధనుర్మాసం వచ్చిందన్న సంగతే గుర్తులేదు. సంక్రాంతి నెల ముగ్గుల సందడీ ప్చ్ ! ఏమీ గుర్తు తెలియడం లేదు. ఈ అమెరికా క్రిస్మస్ సందడి అయోమయంలో .
అక్కయ్యా, ధన్యవాదాలు. ఇక్కడ ధనుర్మాసపు సందడి బాగానే ఉంది. మేము వైష్ణవులమే. మా సోదరుల పేర్లు వేంకటనారాయణ, సూర్యనారాయణ, లక్ష్మీనారాయణ. మా అమ్మమ్మకు ఏదో మొక్కు ఉండి నా పేరుమాత్రం ‘శంకరయ్య’ అని పెట్టింది. కనీసం ‘శంకర నారాయణ’ అన్నా బాగుండేది.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘మెరిసే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘బమ్మే చేసిన ముద్దుగుమ్మవు గదా! బంగారు బొమ్మా!...’ అందామా?
రామకృష్ణ పరమహంస గోపికల వలె కృష్ణుని యెడల మధుర భావము, హనుమంతుని లా రామునియెడల దాస్య భావము, భార్య శారదాదేవిని కాళికా మాత స్థానమున నుంచి భక్తి భావము తో ప్రవర్తించు సందర్భము..
ఇమ్మారన్ సతిరూప ధారి యయి విశ్వేశుం బ్రమోదించుచున్ సమ్మోదంబుగ రామనామమున దాస్యత్వంబునుం దాల్చుచున్ అమ్మాయీ విట కాళివే పరమ హంసాఖ్యుండు సద్భక్తిని న్నమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్!
గురువులకు నమస్కారములు శివాయ విష్ణు రూపాయ కదా . అందుచేత మీపేరు ఇద్దరినీ ఒకటిగా తలపింప జేస్తుంది. బాగుంది. అందరు " అక్కయ్యా " అని పిలుస్తుంటే ఇక్కడ నా ఒంటరి తనంలోని ఆప్యాయతను ఆనందంగా అనుభవిస్తున్నాను. ఇవి దూరపు కొడలు మాత్రమే .పిడికెడు ప్రేమ దొరకడం కష్టం. ఇక శ్రీ చింతావారి బ్లాగు చాలా ఉపయుక్తంగా ఉంది. నాలాగ కొత్తగా రాసేవారికి చాలా బాగుంది. మీ అందరి ప్రేమాభిమానములకు శ్రీ వసంత కిశోర్ గారికి హృదయ పూర్వక ధన్య వాదములు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అమ్మ+ఏ’, ‘ఆక్షేపణ+ఇంక’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అమ్మ ఏకవచనం, పడతులన్ బహువచనం. ‘సత్+శీల=సచ్ఛీల’ అవుతుంది. మీ పద్యానికి నా సవరణ....
అమ్మల్ నా కని యెంచెదన్ పడతుల న్నాక్షేపణం బేటికే
సమ్మానించెద నెప్పుడున్ ముదముతో సచ్ఛీల సంపన్ను లీ
కొమ్మల్ నాపయి శంక మానుమిక నీ కోపమ్ము చాలించి రా
వమ్మా! రమ్మని పిల్చె భర్త తన యర్థాంగిన్ ప్రమోదమ్మునన్
అమ్మల్ నా కని యెంచెదన్ పడతుల న్నాక్షేపణం బేటికే
తొలగించండిసమ్మానించెద నెప్పుడున్ ముదముతో సచ్ఛీల సంపన్ను లీ
కొమ్మల్ నాపయి శంక మానుమిక నీ కోపమ్ము చాలించి రా
వమ్మా! రమ్మని పిల్చె భర్త తన యర్థాంగిన్ ప్రమోదమ్మునన్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరింప నున్నవి !
మేనల్లుడే - అల్లుడు , అయినా మనఃస్పర్దలు ! మనుమడు పుట్టినా చూడలేని పరిస్థితిలో
అల్లుడే మనసు మార్చుకొని అమ్మాయిని , మనుమణ్ణీ పంపిస్తే ; ఆ ఆనందం వర్ణనాతీతం కదా :
01)
__________________________________________
అమ్మో ! యేమని చెప్పు వాడ, హృదయం - బానందమున్ బొంగె ; ని
న్నమ్మమ్మా యని బిల్వ వచ్చె , మనుమం - డా యూరి నుండీడకున్ !
అమ్మాయిన్ తన తోడ నంపె మన మే - నల్లుండు ; శోకింప నే
లమ్మా , రమ్మని పిల్చె భర్త తన య - ర్థాంగిన్ ప్రమోదమ్మునన్ !
__________________________________________
వసంత కిశోర్ గారూ,
తొలగించండిబహుకాల దర్శనం. సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
తొలగించండినమస్కారములు
రిప్లయితొలగించండివసంతకిషోర్ గారూ ! మీ పూరణ కొత్తగా వైవిధ్యంగా ఉంది .భేష్
అక్కయ్యా ! ధన్యవాదములు !
తొలగించండికొమ్మా గాంచితి నీదుమోము సొగసుల్ కోపంబునన్ చందమే
రిప్లయితొలగించండిలెమ్మా నీవిక చాటు మాటున మదిన్ లేనవ్వులన్ వీడుమా
సమ్మానిం చెదనీదు భాషణములన్ సంతోష మున్ దేలి రా
వమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రమ్మంచున్ శుభకాలమై యిదె ధనుర్మాసంబు విచ్చేసెనే
రిప్లయితొలగించండిమమ్మెల్లన్ మురిపింపఁ జేయుచును గుమ్మంబందు చిత్రావళుల్
నెమ్మిన్ నిల్పియు రంగవల్లులను సంధింపంగ వేవేగ మ
ల్లమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ బ్రమోదమ్మునన్.
ధనుర్మాసంలో చక్కని పూరణ చేసిన గురువర్యులకు నమస్సులు.
తొలగించండిఅన్నపరెడ్డి వారూ,
తొలగించండిధన్యవాదాలు.
నమస్కారములు
తొలగించండిగురువు గారి పద్యం చాలా బాగుంది అసలు ధనుర్మాసం వచ్చిందన్న సంగతే గుర్తులేదు. సంక్రాంతి నెల ముగ్గుల సందడీ ప్చ్ ! ఏమీ గుర్తు తెలియడం లేదు. ఈ అమెరికా క్రిస్మస్ సందడి అయోమయంలో .
అక్కయ్యా,
తొలగించండిధన్యవాదాలు. ఇక్కడ ధనుర్మాసపు సందడి బాగానే ఉంది.
మేము వైష్ణవులమే. మా సోదరుల పేర్లు వేంకటనారాయణ, సూర్యనారాయణ, లక్ష్మీనారాయణ. మా అమ్మమ్మకు ఏదో మొక్కు ఉండి నా పేరుమాత్రం ‘శంకరయ్య’ అని పెట్టింది. కనీసం ‘శంకర నారాయణ’ అన్నా బాగుండేది.
యథా శివమయో విష్ణుః
తొలగించండిఏవం విష్ణుమయ శ్శివః
యథాంతరం న పశ్యామి
తథా మే స్వస్తిరాయుషి.
శివాయ విష్ణురూపాయ
తొలగించండిశివరూపాయ విష్ణవే|
శివస్య హృదయం విష్ణుః
విష్ణోశ్చ హృదయం శివః||
శాః బొమ్మన్ బోలు సుగాత్రిఁగాంచి, హృదిలో పొంగారి చేబట్టగా
రిప్లయితొలగించండినమ్మేల్బంతిని పత్నిగాను, మది వే యాకాశ మున్ చేరగన్
బమ్మేచేసిన ముద్దుగుమ్మ!మెరిసే బంగారు బొమ్మా! సు శీ
లమ్మారమ్మని పిల్చెభర్త తన యర్థాంగిన్ బ్రమోదమ్మునన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మెరిసే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘బమ్మే చేసిన ముద్దుగుమ్మవు గదా! బంగారు బొమ్మా!...’ అందామా?
ఇమ్మంటిన్ గతమందు నీదు మనమున్ నేతీరు భావించితో
రిప్లయితొలగించండిరమ్మంచున్ పలుమార్లు నేపిలువగా రాలేక యుంటన్ మదిన్
గ్రమ్మెన్ చీకటి నంత లోనె జరిగెన్ గమ్మత్తుగా పెళ్లి, కొం
టమ్మా! రమ్మని పిల్చెభర్త తనయర్థాంగిన్ ప్రమోదమ్మునన్!!!
మంద పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
!ముమ్మారున్ గుడి చుట్టు బెట్టె సతితో మ్రొక్కుల్ తలన్ దాల్చి యా
రిప్లయితొలగించండిసమ్మర్దమ్మున తూలి క్రింద బడుచున్ సాహాయ్యమున్ గోరుచున్,
అమ్మా! రమ్మని పిల్చె భర్త తన యర్థాంగిన్,ప్రమోదమ్మునన్
"తమ్మంటుల్ పదెనా?"యటంచు జనముల్ తాటాకులన్ గట్టగన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామకృష్ణ పరమహంస గోపికల వలె కృష్ణుని యెడల మధుర భావము, హనుమంతుని లా రామునియెడల దాస్య భావము, భార్య శారదాదేవిని కాళికా మాత స్థానమున నుంచి భక్తి భావము తో ప్రవర్తించు సందర్భము..
రిప్లయితొలగించండిఇమ్మారన్ సతిరూప ధారి యయి విశ్వేశుం బ్రమోదించుచున్
సమ్మోదంబుగ రామనామమున దాస్యత్వంబునుం దాల్చుచున్
అమ్మాయీ విట కాళివే పరమ హంసాఖ్యుండు సద్భక్తిని
న్నమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఇమ్మేదిన్ సతిరూప ధారి యయి దానీశానురక్తుండునై
తొలగించండిసమ్మోదంబుగ రామనామమును దాస్యాసక్తి నిందల్చుచున్
అమ్మానీ విట కాళివే పరమ హంసాఖ్యుండు సద్భక్తిని
న్నమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్!
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమ్మోహంబును సాకుపూలజడ విశ్వాసంబునన్-కళ్ళ| లూ
రిప్లయితొలగించండిర్ధమ్మారమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదంబునన్
సొమ్ముల్ షోకులు లేని బంధమిదియే| సూక్ష్మంబు |నూహించగా
అమ్మో|సాహస మౌను భార్య సహచర్యంబేమి లేకున్నచో.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమించిన ప్రియురాలిని పెండ్లిచేసుకుని వచ్చి తల్లిదండ్రుల దీవెనలనడుగు పుత్రుని మాటలుగా నూహించిన పూరణము
రిప్లయితొలగించండిఅమ్మాచూడుము నీదు కోడలిదిగో యందమ్ములో మిన్నయౌ
బొమ్మై దోచెను ప్రేమతో మదిని యీ పూబోణియే నమ్ముమా!
కొమ్మన్ జూపగ నెంచి తెచ్చితి సతిన్ కోపంబు జాలించవే
యమ్మా రమ్మని పిల్చె, భర్త తన యర్థాంగిన్ ప్రమోదమ్మునన్
అమ్మానాన్నల చేర్చియున్ ముదముతో నర్థించె నాశీస్సులే.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండితిమ్మన్ బమ్మగ జేసి ప్రుచ్చకు లిడన్ దీటైన న్యస్తాక్షరిన్
సమ్మానంబును పొంది నేటి సభలో సత్కీర్తి నార్జించితిన్
సమ్మోదమ్మొనగూర్చ కౌముదినిశన్ సైయ్యాట కైరావదే
లమ్మా రమ్మని పిల్చె భర్త తనయర్ధాంగిన్ ప్రమోదమ్మునన్
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ కొ౦దరు ఆడు వారు కారణా కారణములు
గుర్తి౦చక సొమ్ములు సోకులు చేసుకొనడ౦
లో మునిగి పోతూ ఉ౦టారు. }
కొమ్మా ! కూతురు కా౦చె హాస్పిటలు లో
. . . గో డా డ కి౦తేని ; యీ
సొమ్ముల్ సోకులు చేయనె౦దుకు , సినీ
. . . షూ టి౦గు లేదేమియున్ ;
గుమ్మ౦బ౦దున. ఆ టొ నిల్చినది ;
. . . రా ! గో జె౦ దు కే ? ఓ ర్ని యె౦
కమ్మా ! రమ్మని పిల్చె భర్త
. . . తన అర్ధా౦గిన్ ప్రమోదమ్ముతో
{ కూతురు కా౦చె .... గోడాడక. = అమ్మాయి
హాస్పిటల్ లో కష్టపడక ప్రసవి౦చెను ::
గోజె౦దుకే = జాగె౦దుకే ::
ఓర్ని యె౦కమ్మ. = సినీ కామెడి డైలాగు }ి
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువులకు నమస్కారములు
రిప్లయితొలగించండిశివాయ విష్ణు రూపాయ కదా . అందుచేత మీపేరు ఇద్దరినీ ఒకటిగా తలపింప జేస్తుంది. బాగుంది. అందరు " అక్కయ్యా " అని పిలుస్తుంటే ఇక్కడ నా ఒంటరి తనంలోని ఆప్యాయతను ఆనందంగా అనుభవిస్తున్నాను. ఇవి దూరపు కొడలు మాత్రమే .పిడికెడు ప్రేమ దొరకడం కష్టం.
ఇక శ్రీ చింతావారి బ్లాగు చాలా ఉపయుక్తంగా ఉంది. నాలాగ కొత్తగా రాసేవారికి చాలా బాగుంది. మీ అందరి ప్రేమాభిమానములకు శ్రీ వసంత కిశోర్ గారికి హృదయ పూర్వక ధన్య వాదములు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అద్భతమ౦డీ ! పోచిరాజు గారూ !
రామకృష్ణపరమహ౦స.
భార్యను మాతృసమాన౦గా భావి౦చె నని
పూరి౦చిన. మీపద్య౦ అమోఘ౦
ి
రిప్లయితొలగించండిఅమ్మల్జేరుచు నెట్టిపోగ గదిలో నాపాల పాత్రందుచున్
క్రమ్మన్ సిగ్గులు వాల్చి చూపులట శృంగారమ్ముగా నిల్వగా
గుమ్మం వద్దనె యాగిపోక రయమున్ గూడంగ రా ! యాగలే
నమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమ్మోదమ్మున దాసివౌచు సతమున్ సత్కర్మలన్ మంత్రివై
రిప్లయితొలగించండిసమ్మోహమ్మునముంచు రంభవగుచున్, క్ష్మారీతి నీయోర్మి మా
గుమ్మంమందున లక్ష్మిరూప ప్రభలన్ గూర్చంగ, భోజ్యమ్మున
న్నమ్మా! రమ్మని పిల్చె భర్త తనయర్ధాంగిన్ ప్రమోదమ్మునన్!
సమ్మోదమ్మున దాసివౌచు సతమున్ సత్కర్మలన్ మంత్రివై
రిప్లయితొలగించండిసమ్మోహమ్మునముంచు రంభవగుచున్, క్ష్మారీతి నీయోర్మి మా
గుమ్మంమందున లక్ష్మిరూప ప్రభలన్ గూర్చంగ, భోజ్యమ్మున
న్నమ్మా! రమ్మని పిల్చె భర్త తనయర్ధాంగిన్ ప్రమోదమ్మునన్!
కలకత్తా దుర్గపూజ విరహం:
రిప్లయితొలగించండిగమ్మున్ వచ్చెద గోలజేయ వలదా గంగమ్మ యుందంటివే!
రమ్మన్ పిల్వగ నెత్తినుండి దిగినే రాలేను పొమ్మన్న దే!
చిమ్మన్నిల్లును లేరు నాకిచటనో చిన్నమ్మ! కల్కత్త దు
ర్గమ్మా! రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్!
అర్ధాంగి = పార్వతి
రిప్లయితొలగించండివామ్మో!అయ్యరు ధైర్యశాలియె సుమా ! వాత్స్యాయునిన్ శిష్యుడే !
కొమ్మా కోనలబట్టి బోవు తరుణిన్ కొండాడ పెండ్లాముగా
బొమ్మాళీ యని ముద్దుగా బిలుచుచున్ పోరీ వయారీ జిలే
బమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్ !
జిలేబి
కమ్మారింటిని పెండ్లి భోజనమునన్ గంటాయె ముస్తాబుతో
రిప్లయితొలగించండిగమ్మున్ రావమ! పట్టువస్త్రములతో ఘాటైన గంధమ్ముతో
తమ్మున్ వీడుచు పిల్లలందరి
కడన్ తాడించి ఝాడించి గౌ
రమ్మా! రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్!