18, డిసెంబర్ 2015, శుక్రవారం

సమస్య – 1888 (ధనము నమ్మి…)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ధనము నమ్మి ధనము దార కొసఁగె.
(ఈ సమస్యను సూచించిన భాగవతుల కృష్ణారావు గారికి ధన్యవాదాలు)

73 కామెంట్‌లు:

  1. కానల తిరుగాడి కాష్టముల్ సాధించి
    వంట చెఱుకు గాను పట్టమున
    వీధు లన్ని దిరిగి వేసారి చివరకిం
    ధనము నమ్మి ధనము దార కొసఁగె .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వంటచెఱుకు అమ్మడానికే కదా పట్టణానికి వచ్చింది... వేసారి చివరి కింధనము నమ్మి అనడంలో ఔచిత్యం లోపించినట్లుంది. ‘వీధులన్ని తిరిగి బేరమ్ములాడి యిం|ధనము నమ్మి...’ అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. గురువు గారికి ధన్యవాదములు.......మీ సూచన ప్రకారము సవరించిన పద్యము......

      గురువుగారికి ప్రణామములు

      కానల తిరుగాడి కాష్టముల్ సాధించి
      వంట చెరుకు గాను పట్టణమున
      వీధు లన్నిదిరిగి బేరమ్ము లాడి యిం
      ధనము నమ్మి ధనము దార కొసగె

      తొలగించండి
  2. లంచ మెరుగ నట్టి మంచివాడిని భార్య
    పట్టు చీర కొరకు బట్టు బట్టె
    వేగ లేక కడకు వృత్తి ధర్మమనెడు
    ధనము నమ్మి ధనము దార కొసఁగె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండు పూరణలూ బాగున్నాయండి, మీ ఇంధనం పూరణ చూసి , నేను లంచం అంశం గా పూరిద్దామని, పద్యం పట్టుకొని వచ్చే లోపు, ఆ పద్యం కూడా మీరే ప్రచురించేశారు :)
      "వంట చెఱుకు గాను పట్టమున" వద్ద టైపాటు దొరలింది చూడండి

      తొలగించండి
    2. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. ఊకదంపుడు గారికి నమస్కారములు....
      ధన్యవాదములు.....

      తొలగించండి
  3. కోర ననుదినమ్ము క్రొంగొత్త కోర్కులు
    దీర్చలేక యింటఁ దృప్తి లేక
    ఆర్జ నొకటె ధ్యేయమై కటా! తన మాన
    ధనము నమ్మి ధనము దార కొసఁగె

    రిప్లయితొలగించండి
  4. ఆధు నికపు మోజు లవుసరా నికిమిన్న
    తీర్చ లేని భర్త దిక్కు లేక
    మీస మందు నొక్క కేశమ్ము యభిమాన
    ధనము నమ్మి ధనము దార కొసఁగె

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అవసరానికి’ అనండి.

      తొలగించండి
    2. ఆధు నికపు మోజు నవసరా నికిమిన్న
      తీర్చ లేని భర్త దిక్కు లేక
      మీస మందు నొక్క కేశమ్ము నభిమాన
      ధనము నమ్మి ధనము దార కొసఁగె

      తొలగించండి
  6. కట్టుకున్న సతికిఁ గన్నవారలకెల్లఁ
    గూడుఁ బెట్ట లేని కొలువుఁ గనక
    తగని దనుచుఁ దెలిసి తప్పక నంతర్ద
    ధనము నమ్మి ధనము దారకొసగె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
      కట్టుకున్న సతికిఁ గన్నవారలకెల్లఁ
      గూడుఁ బెట్ట లేని కొలువు గనుక
      తగని దనుచుఁ దెలిసి తప్పక నంతర్ద
      ధనము నమ్మి ధనము దారకొసగె!

      తొలగించండి
  7. గురువుగారికి, పెద్దలకు నమస్కారం. కరణేషు మంత్రి యైన ఇల్లాలు కష్టాలు కలకాలముండవు అని భర్తకు ధైర్యము చెప్తూ, చెప్పిన సలహామేరకు ఆమె స్త్రీధనమునమ్మి ధనము తెచ్చాడు అనే భావన లో రాశాను. స్రీ ధన ప్రయోగము కుదరలేదు నాకు, అందుకని ఆలి ధనము అని రాశాను. భావము, పద్యము సరిగా ఉన్నాయా లేదా ని పరిశీలించి తెలుపగలరు. ధన్యవాదాలు.

    చిక్కులుండవుకద చిరకాలమనుచును
    మగువచెప్పెనపుడుమేటిహితము
    కరణమునకుమంత్రి,కలికికోర్కెనయాలి
    ధనమునమ్మిధనముదారకొసగె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేదుల సుభద్ర గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో యతి తప్పింది. ‘మగువ చెప్పె నపుడు మహితహితము/ మంచి హితము’ అనండి. ‘కలికి కోరంగ స్త్రీ|ధనము...’ అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు. ముందు మంచి అనే రాసుకుని ఆ తర్వాత మార్చాను. సవరించిన పద్యమిదిగో.
      చిక్కులుండవుకద చిరకాలమనుచును
      మగువచెప్పెనపుడుమంచిహితము
      కరణమునకుమంత్రికలికికోరంగస్త్రీ
      ధనమునమ్మిధనముదారకొసగె!

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. హితము కరణము సమాసమయినపుడు “హితకరణము” అవుతుందికద.
      మంచి హితము కూడ సరికాదేమో కద. మంచి (దేశ్యము), హితము(సం. సమము) విశేషణము కద. నా సంశయము తీర్పగోర్తాను.

      తొలగించండి
    4. కామేశ్వర రావు గారూ,
      సుభద్ర గారి పాదం “మగువచెప్పెనపుడుమేటిహితము”. ఇందులో మ-మే అని యతిదోషం. దానిని తొలగించడానికి “మగువ చెప్పె నపుడు మంచిహితము” అన్నాను. ‘మంచిహితము’ అనడం దోషం కాదు. పూర్వపదం ఆచ్ఛికం, ఉత్తరపదం తత్సమం ఉండవచ్చు. మంచికార్యము, గొప్పదైవము... ఇలా. పూర్వపదం సంస్కృతం, ఉత్తరపదం తెలుగు ఉండరాదు.

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. హితకరణము కూడ నివృత్తి చేయ గోర్తాను.

      తొలగించండి
    6. కరము, కరణము లకు అర్థభేదం ఉంది. హితకరము సరియైన ప్రయోగం. హితకరణము అంటే అర్థం మారుతుంది.

      తొలగించండి
    7. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. అప్పుడు “హితపు కరణము” అని అర్థమా?

      తొలగించండి
    8. దయచేసి ఒకసారి ‘ఆంధ్రభారతి’లో కరము, కరణము అర్థాలను పరిశీలించండి.

      తొలగించండి
    9. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  8. పట్టణమ్ములోని ప్రఖ్యాతమైనట్టి
    బడినిఁ జేర్చె సుతుని బడుగురైతు;
    రుసుముఁ గట్టఁ జేత రూకలు లేక గో
    ధనము నమ్మి ధనము దార కొసఁగె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పనులు దొరుకకున్న వడ్రండి యొక్కఁడు
      సంతు తిండి లేక వంతఁ జెంద
      వారి కడుపు నింప వలెనంచు వృత్తిసా
      ధనము నమ్మి ధనము దార కొసఁగె.

      తొలగించండి
  9. కట్టుకున్న సతికిఁ గన్నవారలకెల్లఁ
    గూడుఁ బెట్ట లేని కొలువుఁ గనక
    తగని దనుచుఁ దెలిసి తప్పక నంతర్ద
    ధనము నమ్మి ధనము దారకొసగె!

    రిప్లయితొలగించండి
  10. గురువుగారికి నమస్కారాలు. నిన్నటి సమస్యకు నా పూరణ. ఆలస్యంగా పూరించడంవల్ల ఇక్కడ ప్రచురిస్తున్నాను. తప్పులుంటే తెలుపగలరు.

    జీవితంబునందు చేదు, మధురమైన
    సన్నివేషములవి చాలయుండు
    తీపి చేదునొక్క తీరుగా గణియింప
    చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవికాంత్ మల్లప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదాన్ని ‘సన్నివేశములవి చాల నుండు’ అనండి.

      తొలగించండి
    2. దన్యవాదాలు. సవరించాను.

      జీవితంబునందు చేదు, మధురమైన
      సన్నివేశములవి చాలనుండు
      తీపి చేదునొక్క తీరుగా గణియింప
      చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు

      తొలగించండి
    3. దన్యవాదాలు. సవరించాను.

      జీవితంబునందు చేదు, మధురమైన
      సన్నివేశములవి చాలనుండు
      తీపి చేదునొక్క తీరుగా గణియింప
      చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు

      తొలగించండి
  11. క్షణము క్షణము ధనమె ఘనమంచు ప్రేమించె
    మనము నందు నదియె వ్రణము జేసె
    గుణము గల్గ నొక్క ధనవంతుడే ప్రాణ
    ధనము నమ్మి ధనము దార కొసఁగె.

    రిప్లయితొలగించండి
  12. 'అమ్మి' తనదు సుతయె నాతడు కూలీయె
    పంట చేనుకేగె ప్రత్తికోయ
    కూడుకొరకు తనదు కూలి సంపాదన
    ధనము 'నమ్మి ధనము' దారకొసగె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      కూతురు కూలితోపాటు తన కూలిని భార్య కిచ్చాడన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మా మేనకోడలు పేరు అమల. ఇంట్లో ‘అమ్మి’ అని పిలుస్తారు.

      తొలగించండి
  13. రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపూరణలో ‘దార కొసగె నేల’, ‘అర్ధనారి యయ్యు’ అనండి. రెండవపూరణలో ‘ధనము+ఇంధన’ మన్నపుడు యడాగమం రాదు. ‘ధనమె యింధన’ మనండి. మూడవపూరణలో ‘అందును+అన్న’ అని విసంధిగా వ్రాయరాదు. ‘...యిల్లాలికే యందు| నన్న...’ అనండి.

      తొలగించండి
  14. వేద వేద్యుడైన విఖ్యాత పండితు
    నాదరించ బోక చీదరించ
    గోవుదానమొంది కుములుచునంత గో
    ధనము నమ్మి ధనము దార కొసఁగె.

    కొండ కోనలందు కొట్టిన కట్టెలు
    పట్టణమ్ము నందు పట్టిపట్టి
    పొట్ట కొఱకు తనకు గిట్టినధరకు యిం
    ధనము నమ్మి ధనము దార కొసఁగె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  15. ఇనకులాబ్ధి సోము డీ హరిశ్చంద్రుడు
    సత్య వచన బద్ద సత్పురుషుడు
    స్వార్జిత పితృ దత్త సకలోర్వి గృహ పశు
    ధనము నమ్మి ధనము దార కొసఁగె.
    [ధనమును+ అమ్మి = ధనము నమ్మి; దారకు = దానమునకు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇనకులాబ్ధి సోము డీ హరిశ్చంద్రుడు
      సత్య వచన బద్ద సత్పురుషుడు
      స్వార్జిత పితృ దత్త సకలోర్వి గృహ దార
      ధనము నమ్మి ధనము దార కొసఁగె.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నాకు స్ఫురించిన యీ సమస్యను పరిశీలించ గోర్తాను.
      “విజయుండామీనభేదవిఫలుండయ్యెన్”

      తొలగించండి
    3. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు పంపిన సమస్య బాగుంది. పరిశీలించి బ్లాగులో ప్రకటిస్తాను. ధన్యవాదాలు.

      తొలగించండి
  16. దార,సుతులు, గలుగు తన పూర్వ కృతమున
    వారి ఋనము దీర్చ వలయు గనుక
    ధర్మయుతములైన కర్మలచే పుణ్య
    ధనము నమ్మి,ధనము దార కొసగె

    రిప్లయితొలగించండి
  17. కట్నమిడక బిడ్డ కళ్యాణ మొనరించ
    భర్త దలచె గాని భార్య వినని
    కారణమ్ముచేత కడకు తప్పక మూల
    ధనము నమ్మి ధనము దార కొసఁగె.

    రిప్లయితొలగించండి
  18. సమస్య
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    పట్టు వస్త్రములను , స్వర్ణభూషణములన్

    కోర గానె --- నొక్క చోర వరుడు

    ధ న ము నమ్మి - ధనము దార కొసగె | దొర

    సాని యయ్యె దొ౦గ వాని భార్య. ! !

    { ధ న ము నమ్మి = దోచు కొని తెచ్చిన

    సొమ్ము నమ్మి వేసి }

    .......................................................... ి

    రిప్లయితొలగించండి
  19. ఆలి మిత్రురాలు యాపదలో నుండ
    ఆదుకొనగ దలచి యతివ వేడ
    స్వీకరించ మనుచు చెలితోడ స్నేహభం
    ధనము నమ్మి ధనము దార కొసగె.
    2.పట్టు కోక వలయు ప్రాణనాథ యటంచు
    పడతి చెంత చేరి పతిని కోర
    అప్పు చేసి యొసగె నాపతి యభిమాన
    ధనము నమ్మి ధనము దార కొసగె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘మిత్రురాలు+ఆపదలో’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఆలి యనుగుచెలియ యాపదలో’ అందామా?

      తొలగించండి
  20. మనకు లోటు లేదు మానినీ నీ చిన్ని
    కోర్కె తీర్చగలను కొనెద నగను
    రమ్ము వేగ మనెను రంగ డుద్యోగ బం
    ధనము నమ్మి ధనము దార కొసఁగె.

    రిప్లయితొలగించండి
  21. చీరెను కొన మంచు శ్రీమతి కోరగా
    పెళ్లిరోజు నాడుప్రీతితోడ
    వంట కోసము పతి వనము న గొనిన యిం
    ధనము నమ్మి ధనము దార కోస గె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. కన్న వారి కతడు కడుపు నిండుగ గూడు
    పెట్టలేక తనదు కొట్టమందు
    గున్న వోలెయుండుగోమాతదూడను
    ధనమునమ్మి ధనముదారకొసగె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘గున్నవోలె నుండు’ అనండి.

      తొలగించండి
  23. నిన్నటి పూరణ:
    మంచి యుపశమనముమాపతి నగరంపు
    పసరు నిడగ పక్షవాతమునకు
    శిబిరమందు నను సుశిక్షతులీయగ
    చేఁదు తీయనగుచు క్షేమమొసఁగు

    రిప్లయితొలగించండి
  24. మిత్రులందఱకు నమస్సులు!

    (ప్రభువులిడిన పసదనమునుంగొని యాశ్రమమున కేఁగిన తాపసి, యర్థార్థియై యొకఁడు దారా సహితుఁడై రాఁగఁ, దన తపోధనమును నమ్ముకొని, ప్రభువులిచ్చిన ధనమంతటిని యతని దార కొసఁగిన సందర్భము)

    తపసి ప్రభువు లిడిన ధనమంతయునుఁ గొని
    యాశ్రమమున కేఁగ, నర్థితులయి
    ధవుఁడు దార రాఁగఁ, దడుమక, తన తపో
    ధనము "నమ్మి", ధనము దార కొసఁగె!

    రిప్లయితొలగించండి
  25. మొన్నటి పూరణ:
    యమబంటువోలె సర్పము
    కమనీయముగ శలభమ్ము గాంచినటునిటుల్
    సమయముఁగని తప్పించుకు
    పామును, తినగోరి కప్ప బారెడు సాగెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  26. గౌరవీయులగు గురువర్యులకుసవరణ పద్యము వందనములతోపంపుచున్నాను
    18.12.15.ధనమునమ్మి|ధనము దారకొసగెనేల?
    వంశ వృద్ధి బరచు వనిత యనుచు,
    అర్ధనారి యయ్యు నాయుష్యు బెంచెడి
    శక్తి,యుక్తి యున్న సాధ్వి గాన
    2.ధన మధాందులకది దర్జాలు బంచును
    ధనము| దానధర్మ దయనుదలచి
    ధనమునమ్మిధనము దారకొసగెనట
    ధనమెయింధనమగు మనకటంచు.
    3.ధనమునమ్మి .ధనముదార కొసగెను వే
    దనము మాన్పు పాడితగ్గకున్న
    ఇంటి ఖర్చులన్నియిల్లాలికేయందు
    అన్నభావమందె నాథుడొసగె. {ధనము=గోధనము}

    రిప్లయితొలగించండి