13, డిసెంబర్ 2015, ఆదివారం

సమస్య - 1883 (కొట్టెడు పతి సుజనుఁ డనుచు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్.
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,
నాన్నగారి అస్థికలను త్రివేణీ సంగమంలో నిమజ్జనం చేయడానికి కాళేశ్వరం వెళ్తున్నాను. అందువల్ల బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి పరిస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

55 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పీతాంబరముల్'|పెట్టుచు' అనండి.

   తొలగించండి
  3. గురువు గారికి, కవిమిత్రులకెల్లరులకు నమస్కారములు.

   కట్టడి సేయక భార్యకు
   పెట్టెల నిండార నగలు పీతాంబరముల్
   పెట్టుచు సతి మాటకు జై
   కొట్టెడు పతి సుజనుడనుచు గోమలి పలికెన్ .

   తొలగించండి
  4. గురువు గారికి ధన్యవాదములు......
   తొలుత పద్యములో పీతాంబరముల్ | పెట్టుచు అనే రాసి పోస్టు చేసాను .....తర్వాతెందుకో దానిని తొలగించి పితాంబ్రాల్ దా | పెట్టుచు అని మార్చాను ....మీ సూచన ప్రకారం యధావిధిగ తిరిగి మార్చానండి....నమస్కారములు

   తొలగించండి
 2. పుట్టెడు ప్రేమై తనపై
  తట్టెడు బాధ్యతల బరువు తలపించకనే
  గుట్టెడు బాధల తా జో
  కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్

  రిప్లయితొలగించండి
 3. పట్టిన కుందేలున కే
  పట్టున లెక్కిడిన మూడె పాదము లనగన్
  రెట్టించక వెంటనె "ఊ
  కొట్టెడు" పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్

  రిప్లయితొలగించండి
 4. ఉట్టిగ వేళా కోళము
  నిట్టుల జేయంగ సఖుని యిచ్ఛక మందున్
  పుట్టములన్ జెదరగ తాన్
  గొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శశికాంత్ మల్లప్ప గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. మిత్రులందఱకు నమస్సులు!

  కొట్టక తిట్టక పెట్టెడు
  పుట్టము లిచ్చి సుఖపెట్టి పుట్టిలు ఘనతన్
  రెట్టించుచుఁ బలు గప్పాల్

  కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్!

  రిప్లయితొలగించండి
 6. కొట్టువిచార మదిని-తా
  కొట్టున పూదండ దెచ్చి కొప్పున నిడి-జై
  కొట్టును నాకోర్కెలు-ఊ
  కొట్టెడు పతి సుజను డనుచు గోమలి పలికెన్
  2.కట్టడి లేకను బెరిగిన
  పట్టపు రాణికట భర్త వత్తాసులతో
  చట్టము లెరుగకనే జై
  కొట్టెడు పతి సుజనుడనుచు గోమలి పలికెన్
  3.పట్టా పొందినపతిజే
  పట్టెనుకట్నంబు నొసగ బహువిధములుగా
  పుట్టింటి వారితో నూ
  కొట్టెడి పతి సుజనుడనుచు గోమలిపలికెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘కొట్టు విచార మదిని’...?

   తొలగించండి
 7. ఎట్టుల నగునయ్య ధరను
  గొట్టెడు పతిసుజనుడను చు గోమలి పలికె
  న్బిట్టుగ నది పరికించిన
  నట్టులె గద నామెమాట యన్నా! సత్యా!

  రిప్లయితొలగించండి
 8. అశోకవనములో హనుమంతునితో సీత:

  దిట్టయన మునిగణములు
  పట్టెను హరువిల్లు రామభద్రుడు వరుడై
  పిట్టవలె రాలు రావణుఁ
  గొట్టెడు పతి సుజనుఁడనుచుఁ గోమలి పలికెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటిపాదంలో గణదోషం. ‘దిట్టయన మునిగణమ్ములు’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
   దిట్టయన మునిగణమ్ములు
   పట్టెను హరువిల్లు రామభద్రుడు వరుడై
   పిట్టవలె రాలు రావణుఁ
   గొట్టెడు పతి సుజనుఁడనుచుఁ గోమలి పలికెన్

   తొలగించండి
 9. గుట్టుగ తమపని జేయగ
  బెట్టగ లంచంబు జేత పెత్తందార్లే
  ముట్టిన సిరి వలదని ఛీ
  గొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి బలికెన్!!!

  రిప్లయితొలగించండి
 10. రిప్లయిలు
  1. నట్టింట జనులు మెచ్చగఁ
   బట్ట మహిషిగ శిరమందుఁ బన్నుగ నిడి య
   ట్టిట్టనక తన కెపుడు నూ
   కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్.

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. రిప్లయిలు
  1. పుట్టెడు బాధ్యత లున్నను
   గుట్టుగ కాపురము నందు గోరిక లను జో
   కొట్టుచు బాధలను తరిమి
   కొట్టెడు పతి సుజనుడనుచు గోమలి పలికెన్

   తొలగించండి
  2. ఆంజనేయ శర్మ గారూ,
   మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. కట్టడి చేయక సతతము
  పెట్టుచు కోరిన నగలను పే రిమితోడన్
  గట్టిగ తనమాటల కూ
  కొట్టెడు పతి సుజనుడనుచు కోమలి పలికెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. సమస్య
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  పుట్టి౦టి విమర్శి౦చక

  నట్టిటు లని | పరవనితల నరయక | ని౦కె

  పట్టున తన మాటనె బల

  కొట్టెడు పతి సుజనుడనుచు కోమలి పలికెన్ ్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘బలకొట్టుట’ క్రొత్త ప్రయోగం...

   తొలగించండి
 14. పట్టిన పట్టును వీడక
  పుట్టిన సద్బుద్ధి పంచు పుణ్య పురుషుడె
  ప్పట్టున పరసంపద ఛీ
  కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్.

  రిప్లయితొలగించండి
 15. పట్టిన పట్టును విడువక
  గట్టి పరిశ్రమను జెసి గ్రహయానమునన్
  జెట్టీగ నిలచి బహుమతి
  గొట్టెడు పతి సుజనుడనుచు గోమలి పలికెన్

  రిప్లయితొలగించండి
 16. పెట్టిన వన్నియు విడువక
  తిట్టుకొనకమనసులోన దినియెడు భర్తన్
  మట్టసముగ మెచ్చుచు నూ
  కొట్టెడు పతిసుజనుడనుచుఁ గోమలి పలికెన్.

  రిప్లయితొలగించండి
 17. సమస్య
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  పుట్టి౦టి విమర్శి౦చక

  నట్టిటు లని | పరవనితల నరయక | ని౦కె

  పట్టున తన మాటనె బల

  కొట్టెడు పతి సుజనుడనుచు కోమలి పలికెన్ ్

  రిప్లయితొలగించండి
 18. గురువుగారికి, పెద్దలందరికీ నమస్కారం. నాకు చేతనయినపూరణ చేశాను. దయచేసి పరిశీలించి తప్పులున్న తెలియచేయగలరు.
  కం:
  కట్టిన తాళియె బలమని
  పెట్టిన మట్టెల రవములె పెన్నిధి యనుచున్
  పట్టివ లెసతిని గనిజో
  కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేదుల సుభద్ర గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘జోకొట్టే’ పూరణ ఎవరూ వ్రాయలేదు కదా... నేనే వ్రాయాలనుకున్నారు. తీరా మీ పూరణ కనిపించింది. సంతోషం.

   తొలగించండి
 19. బట్టలు సయితము నుతుకుచు
  నట్టింటను పనులు జేయు నలభీము డనన్
  పుట్టింటికి దోచిన మరిసై
  కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్

  రిప్లయితొలగించండి
 20. నా పూరణ....

  పుట్టెడు పనిలో మునిగియు
  పట్టినిఁ దా బుజ్జగించి పడుకొనఁబెట్టన్
  గట్టిగఁ బాడుచు మరి జో
  కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్.

  రిప్లయితొలగించండి
 21. పుట్టింటి వారి మెచ్చును
  కొట్టుచువేయక నడిగిన కోర్కెలు దీర్చున్
  మొట్టక నడుగగనే " ఊ"
  కొట్టెడు పతి సుజనుడనుచు గోమలి పలికెన్

  రిప్లయితొలగించండి
 22. పుట్టెడు కట్నము గైకొని
  నట్టింటను నన్ను తిట్టి నాట్యమ్మాడన్
  పట్టు కొనత్తయ్యను భలె
  కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్ :)

  రిప్లయితొలగించండి


 23. గుట్టుగ వంటల వండుచు
  పట్టుగ తనునింట నుండి పనియే హముగా
  పట్టమ్మాళ్ మాటకు ఊ
  కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 24. వట్టిగ తిట్టక గాలిని
  నట్టింటికి లాగి రోజు నలుగురి యెదటన్
  పట్టుకు నత్తయ జుత్తును
  కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్

  రిప్లయితొలగించండి


 25. ఎట్టెట్టా నీవేమన
  నట్టట్టేను! తలయూపి నమ్మకమునకున్
  పెట్టని కోటయగుచు ఊ
  కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్


  జిలేబి

  రిప్లయితొలగించండి