17, డిసెంబర్ 2015, గురువారం

సమస్య - 1887 (చేఁదు తీయ నగుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు.

(ఈ సమస్యను పంపిన భాగవతుల కృష్ణారావు గారికి ధన్యవాదాలు)

51 కామెంట్‌లు:

  1. వేప తినగ తిక్త వేయిలాభ ములంట
    మేను కెంత మిన్న మేలు యనగ
    కాక రెంత ఘనము పాకమందున వంట
    చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మేలు+అనగ’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘మేలనంగ’ అనండి.

      తొలగించండి
    2. వేప తినగ తిక్త వేయిలాభ ములంట
      మేను కెంత మిన్న మేల నంగ
      కాక రెంత ఘనము పాకమందున వంట
      చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. వేమనార్యు డనెను విశ్వసత్యమదియు
      తినగ వేము తీయ ననెడు రీతి
      వెజ్జు డిచ్చు మాత్ర వెగటుగా నున్నను
      చేదు తీయనగుచు క్షేమ మొసగు

      తొలగించండి
  3. మహిని బాధ పడెడు మధుమేహ రోగికి
    చేదు కాక రదియె చేయు మేలు
    దినము తప్ప కుండ తినినంత చాలదా
    చేదు తీయ నగుచు క్షేమ మొసగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ప్రథమార్థంలో ‘వేమనార్యు’ అనరాదు. అక్కడ ‘వేమనార్యు డనెను’ అనండి.

      తొలగించండి
  4. మిత్రులందఱకు నమస్సులు!

    పండ్లుతోముటకును భద్రత నిడునట్టి
    వేఁపపుల్ల పైన ద్వేష మేల?
    వేఁపపుల్ల నోటఁ బెట్టి తోముచునుండఁ

    జేదు తీయనగుచు క్షేమ మొసఁగు!

    రిప్లయితొలగించండి
  5. కొట్టు,తిట్టు గురువు,కోపించు తల్లియు
    కట్టుబాట్ల నుంచు కన్నతండ్రి
    చేదుగారు వారు-చేటును మాన్పగ?
    చేదు తియ్యనగుచు క్షెమమొసగు.
    2.పొసగ నట్టిభార్య పొందిక లేకున్న?
    పడకటింట జేర భర్త చెంత
    మారిపోవు గాదె మమతలు జేరగ
    చేదుతియ్యనగుచు క్షెమమొసగు.
    3.చదువు జెప్పుగురువు చక్కటిమార్గాన
    నేర్పునపుడు గొట్ట?నెంచు చేదు
    విద్యబుద్దిచేత విలువలు బెరుగంగ?
    చేదు తియ్య నగుచు క్షెమమొసగు

    రిప్లయితొలగించండి
  6. తినగ తినగ వేము తీయనౌనని వేమ
    తెలుపలేదె నాడు తెల్లముగను
    వెజ్జు తెలిపె నేడు విను డిక్షు రోగికి
    చేదు తీయ నగుచు క్షేమ మొసగు

    రిప్లయితొలగించండి
  7. 1.ఆ.వె:కాకర రస మిలను కల్గించు మేలును
    రుజలు తొలగు గాదె రూఢి యిదియు
    వేము వోలె నిదియు విషమె యన్పించినన్
    చేదు తీయనగుచు క్షేమ మొసగు.
    2.ఆ.వె:చిన్న తప్పు చేయ చిననాట దండింప
    దారి లోకి వచ్చి దక్షుడగును
    కోపగించు కొనక కూరిమి చూపిన
    చేదు తీయ నగుచు క్షేమ మొసగు.

    3.ఆ.వె:విద్య నేర్చు నపుడు వినయము తోడను
    నేర్వ వలయు సుమ్మి నెపుడు కూడ
    బుద్ధి చెప్పు గురువు బూని యొక మాటన్న
    చేదు తీయ నగుచు క్షేమ మొసగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘సుమ్మి యెపుడు’ అనండి.

      తొలగించండి
  8. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    రామనామ స౦స్మరణము వి ప ద గా ధ

    పతిత దీన జన వితతిని , పైకి - ి
    ి
    చేదు | తీయ నగుచు క్షేమ మొసగు గద

    భవ విషమ్ము న౦త. పరిహరి౦చి !!

    { విపత్ + అగాధ పతిత. = విపదగాధపతిత. = ఆపదల అగాధము లో పడి పోయిన. ;
    పైకిచేదు = లోపల నున్నవారిని పైకి తెచ్చు }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      విలక్షణమైన విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  9. చేదు మందు త్రాగ రాదంచు తలపగా
    వ్యాధి మూనుటెట్లు వరము గాదె
    మందు తీపి రుచిని బొందుచునలనార
    చేదు తీయనగుచు క్షేమమొసగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శశికాంత్ మల్లప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...బొందించు నలనార..’...?

      తొలగించండి
    2. గురువు గారూ, మందు తీపి రుచితో లభ్యమైతే వరము కదా! అన్న భావం లో వ్రాసాను.
      మీ సవరణ ఇంకా ప్రశస్తంగా ఉన్నది.
      ధన్యవాదాలు

      తొలగించండి
    3. ఒకే అక్షషరం మూర్పుతో 180 డిగ్రీలు తిప్పారు

      తొలగించండి
    4. శశికాంత్ మల్లప్ప గారూ,
      నేను ‘...బొందుచు నలనార...’ అన్నది నాకు అర్థం కాక ప్రశ్నార్థకం పెట్టి టైపు చేస్తూ పొరపాటున ‘...బొందించు నలనార’ అన్నాను. అది సవరణ కాదు.

      తొలగించండి
    5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    6. రుచిని + పొందుచును + అలరార = రుచినిబొందుచునలరార అన్నాను
      దోషం ఉంటే సరిచేయగలరని మనవి

      తొలగించండి
    7. మీరు ‘...బొందుచు నలరార’ అని కాక ‘...బొందుచు నలనార’ అని టైప్ చేశారు. అందుకే సందిగ్ధత...

      తొలగించండి
    8. హతోస్మి...ధన్యోస్మి.._/\_ గురుదేవా...

      తొలగించండి
    9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  10. పెద్దలాడు మాట సద్ది మూట యనగ
    నలరు చుండు నిల ననవరతమ్ము
    యోగి వేమనార్యు డుడివె నపుడు వేప
    చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. చెప్పునిజము లన్ని చేదుగా నుండును
    నిజము మంచి చేయు ప్రజల కెపుడు
    చేదుమందు లెపుడు ఛేదించు రు గ్మతల్
    చేదు తియ్యనగుచు క్షేమ మొసగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. చేదుతీయనగును జేదగుదీపియు
    నొడలు కుదురు లేక యుండు నపుడు
    క్షేమ మొసగునుగద చేదు మాత్రలు వాడ
    చేదుతీయనగుచుక్షేమ మొసగ

    రిప్లయితొలగించండి
  13. 1.ఆ.వె:కాకర రస మిలను కల్గించు మేలును
    రుజలు తొలగు గాదె రూఢి యిదియు
    వేము వోలె నిదియు విషమె యన్పించినన్
    చేదు తీయనగుచు క్షేమ మొసగు.
    2.ఆ.వె:చిన్న తప్పు చేయ చిననాట దండింప
    దారి లోకి వచ్చి దక్షుడగును
    కోపగించు కొనక కూరిమి చూపిన
    చేదు తీయ నగుచు క్షేమ మొసగు.

    3.ఆ.వె:విద్య నేర్చు నపుడు వినయము తోడను
    నేర్వ వలయు సుమ్మి నెపుడు కూడ
    బుద్ధి చెప్పు గురువు బూని యొక మాటన్న
    చేదు తీయ నగుచు క్షేమ మొసగు.

    రిప్లయితొలగించండి
  14. మరవక ప్రతి దినము మధు మేహ రోగులు
    తిన వలయును మిగుల దిక్త కూర
    గాయలనవి తినిన గడకు తరిగిపోయి
    చేఁదు, తీయ నగుచు క్షేమ మొసఁగు.

    రిప్లయితొలగించండి
  15. తల్లి తిట్టు తండ్రి దండించు గురువులు
    కోప పడుచు నుంద్రు రేపు మాపు
    నీదు మేలు గోరె నిజమిది బాలకా!
    చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు.

    రిప్లయితొలగించండి
  16. క్షణము యుగము గాగ చెక్కెర వ్యాధితో
    బ్రతుకు రోగి ప్రాణ భయము తోడ
    కరము తినగ జూడ కాకర కడు ప్రీతి
    చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారికి, పెద్దలకీ నమస్కారం. నా ఈ క్రింది పూరణ పరిశీలించి తప్పులు తెలియచేయగలరు.
    ఆ.వె:
    తీపిరుచినిగుడముతెచ్చునురోగము
    చేదుకాకరయగుచేవమందు
    వేపకటువైచేయువేవేలహితములు
    చేదుతీయనగుచుక్షేమమొసగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేదుల సుభద్ర గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కటువై’ అంటే గణదోషం. ‘వేప కటువు...’ అనండి.

      తొలగించండి
    2. టైపింగులో దొర్లిన పొరపాటు గురువుగారు. చూసుకోలేదు. సవరించాను. ధన్యవాదాలు

      తొలగించండి


  18. నమ్మి మనసు దలుపు నరులను శ్రీపతి
    దరిని చేరదీయు తండ్రివోలె
    నమ్మకమ్ము లేక నలుగుచు నుండెడి
    చేఁదు తీయ, నగుచు క్షేమ మొసఁగు.

    రిప్లయితొలగించండి
  19. జీవితంబునందు చేదు, మధురమైన
    సన్నివేషములవి చాలయుండు
    తీపి చేదునొక్క తీరుగా గణియింప
    చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు

    రిప్లయితొలగించండి
  20. మంచి యుపశమనముమాపతి నగరంపు
    పసరు నిడగ పక్షవాతమునకు
    శిబిరమందు నను సుశిక్షతులీయగ
    చేఁదు తీయనగుచు క్షేమమొసఁగు

    రిప్లయితొలగించండి