20, డిసెంబర్ 2015, ఆదివారం

సమస్య – 1890 (అర్వాచీనమ్ములు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అర్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్.

39 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      నిజమే! సవరించాను. ధన్యవాదాలు.

      తొలగించండి
  2. ఔనండి 'అ' కు 'వే' కు యతి పొసగదు అనే అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      యతి పొసగదని చెప్తూనే మీరు పూరణ చేశారు. పూరణ బాగుంది. కాని రెండవ మూడవ పాదాలలో ప్రాస తప్పింది. సవరించండి.

      తొలగించండి
  4. కవిమిత్రులు మన్నించాలి.
    “అర్వాచీనములు వేదవేదాంగమ్ముల్” అని యతిని గమనించకుండా సమస్య ఇచ్చాను. మిత్రులు ఆ యతిదోషాన్ని తెలియజేయగా ఇప్పుడు సమస్యను సవరించాను.

    రిప్లయితొలగించండి
  5. పూర్వము గ్రంధము లన్నియు
    అర్వా చీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్
    యుర్విని వెలయుచు నేటికి
    సర్వము నిజమంచు గనుము సాక్ష్యమ్మి లనే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      ఇప్పుడు ప్రాచీనాలైనా అవి పూర్వం అర్వాచీనాలే కదా అన్న భావంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఆమ్నాయమ్ముల్+ఉర్విని’ అన్నప్పుడు యడాగమం రాదు. మీ పద్యానికి నా సవరణ...
      ఉర్విం గనగా గ్రంధము
      లర్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్
      పూర్వము; వెలయుచు నేటికి
      సర్వము నిజమంచు గనుము సాక్ష్యమ్ములనే.

      తొలగించండి
    2. గురువు గారికి నమస్కృతులు....మీరిచ్చిన సమస్యకు నా పూరణము....

      పూర్వ యుగమ్ముల నుండియు
      సర్వజనావళి కొలిచెడు సద్గ్రంథములై
      ఉర్విన వెలసెను, కావివి
      అర్వాచీనమ్ములు స్మృతులామ్నాయమ్ముల్

      తొలగించండి
  6. శర్వరము బ్రారదోలి య
    పూర్వంబగు జ్ఞానమునిల పూయించగనా
    సర్వేశుబొందు సాధన
    మర్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్

    రిప్లయితొలగించండి
  7. సార్వ జనీనమ్ము లవి సు
    పర్వాధర్వామరమునివర సేవితముల్
    గర్వాతిశయమున ననకి
    టర్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్.

    రిప్లయితొలగించండి
  8. పూర్వాపరవిజ్ఞానపు
    సర్వస్వము,సర్వసాక్షిసంలాపములై
    చర్విత చర్వణ మైనను
    అర్వాచీనమ్ములు స్మృతులామ్నాయమ్ముల్

    రిప్లయితొలగించండి
  9. పూర్వమె మనకిల నుండియు
    సర్వము తమయందునిమిడి సర్వేశునివౌ
    నిర్వచనములన సతతము
    నర్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్

    రిప్లయితొలగించండి
  10. పూర్వపు గ్రంధము లెప్పుడు
    నర్వాచీనమ్ములు, స్మృతు లామ్నాయమ్ముల్
    సర్వోన్నతమై చెదరక
    నుర్విని కలకాలముండు నుద్యోతంబై.

    రిప్లయితొలగించండి
  11. ఉర్వీతలమున వెలసిన
    సర్వజ్ఞానము నొసగుచు సంపూజ్యము లౌ
    సర్వజనవందితములవి
    అర్వాచీనమ్ములు స్మృతులామ్నాయమ్ముల్

    రిప్లయితొలగించండి
  12. గర్వము గావీ దినములు
    ఆర్వాచీనమ్ములు-స్మృతులామ్నాయమ్ముల్
    పర్వదినాలనుమరచియు
    సర్వులు వ్యసనాల యందుసాగిన ఫలమా?
    2.ఓర్వని కాలంబందున
    ఆర్వాచీనమ్ములు| స్మృతులామ్నాయమ్ముల్
    నేర్వరు|చదువేముఖ్యము
    పూర్వుల నడవడికలన్న పొసగవు సుమ్మీ.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    పూర్వా పరముల నెరుగుచు
    నేర్వంగా దలచు వార్కి నేర్పెడు విజ్ఞుల్
    సర్వంబెరుగరె; కావని
    యర్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్

    రిప్లయితొలగించండి
  14. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. దృత ప్రకృతికముల మీద పరుషములుంటే సరళములవుతాయి. సరళములున్న మార్పు జెందవు గద. దృతము మీద సరళములుండ గూడదని లేదు గద. అని అప్పుటి నా సందేహమున కుండవచ్చునని ప్రమాణము భారతము లో దొరికినది గమనించ గోర్తాను.
    నన్నయ భట్టారకుని భారతములో ఆది పర్వము చతుర్థాశ్వాసము లో 37 వ పద్యపు ప్రతిమ నీ క్రింద నుంచితిని.

    పద్య ప్రతిమ ఇక్కడ ప్రచురణ కానందున మీ మెయిలు కు పంపితిని.పాదము వ్రాసాను.
    “న్వన నిధిలోన ముంచిన యవారిత సత్త్వుఁ డు నిన్నుఁ దొట్టి యీ”
    “నిన్నుఁ దొట్టి” లో
    దొట్టి= తో, కూడా అనే యర్థమే యన్వయమవుతుంది.
    తొట్టి = 1. నోరు వెడల్పును, అడుగు సన్నమునైన గంపవంటి మట్టి పాత్రము;
    2. పసులు నీళ్లుత్రాగుట లోనగువాని కుపయుక్తముగ ఱాతితో కట్టిన కట్టడము;
    3. కొప్పెర.
    అన్వయమవదు కద.
    అప్పుడు నేను వాడిన పదము:
    “వేడ్కఁ జింకను” లో “చింక” అను పదమునకర్థము లేదు. “జింక” అను పదమే అన్వయమవుతుంది కద.
    దయచేసి మీ వద్ద గల పుస్తకమును గూడ జూచి మీ యభిప్రాయమును దెలుప గోర్తాను.
    జిజ్ఞాస తోనే అడుగుతున్నాను. అన్యథా తలచ వద్దని మనవి.

    రిప్లయితొలగించండి
  15. సర్వాంతర్యామి కృ తము
    లర్వాచీనములు స్మృతు లామ్యాయమ్ముల్
    పూర్వీకులు చదివి దృతిన్
    సర్వ జ్ఞానమును గొనిరి సం తో షముతో

    రిప్లయితొలగించండి
  16. పూర్వము ప్రతి గురుకులమున
    నేర్వగ వీలుండె శ్రుతుల నీమముతోడన్
    సర్వులు మెచ్చెడి విధి, ని-
    త్యార్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్.

    రిప్లయితొలగించండి
  17. నిన్నటి సమస్యకు నా పూరణ.

    అమ్మల్జేరుచు నెట్టిపోగ గదిలో నాపాల పాత్రందుచున్
    క్రమ్మన్ సిగ్గులు వాల్చి చూపులట శృంగారమ్ముగా నిల్వగా
    గుమ్మం వద్దనె యాగిపోక రయమున్ గూడంగ రా ! యాగలే
    నమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్!

    రిప్లయితొలగించండి
  18. ఉర్విం జనులకు నెల్లను
    పర్వంబులు నిర్ణయించు పక్షములందున్
    తర్వాతి తరముల వారికి
    అర్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్.

    రిప్లయితొలగించండి
  19. సర్వజనాలికి నిత్య
    మ్ముర్వీ తలమందు నడతకుపయుక్తంబౌ
    చర్విత వేదాంతర్గత
    యర్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్.

    రిప్లయితొలగించండి
  20. కవిమిత్రులకు నమస్కృతులు.
    ప్రయాణంలో ఉన్నాను. మీ పూరణలపై, సందేహాలపై రేపు స్పందిస్తాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  21. గర్వము గాదే జనులకు
    అర్వాచీనమ్ములు, స్మృతులామ్నాయమ్ముల్
    నుర్విని నడిపెడు వీనిని
    సర్వులు పాటించవలయు సంతోషముగన్!!!

    రిప్లయితొలగించండి
  22. సర్వప్రబంధ కావ్యము
    లర్వాచీనమ్ములు; శ్రుతు లామ్నాయమ్ముల్
    నిర్వాణ మందఁజేసెడు
    కర్మానుష్ఠానమునకుఁ గారణము లగున్.

    రిప్లయితొలగించండి
  23. పూర్వపు కాలము నందున
    పూర్వోత్తరములు విమర్శ పూర్వకముగనీ
    యుర్విన్ పరిశీ లించనె
    నార్వాచీనంబులు శ్రుతులామ్నాయమ్ముల్

    రిప్లయితొలగించండి
  24. నిన్నటి పూరణ:
    సమ్మోదమ్మున దాసివౌచు సతమున్ సత్కర్మలన్ మంత్రివై
    సమ్మోహమ్మునముంచు రంభవగుచున్, క్ష్మారీతి నీయోర్మి మా
    గుమ్మంమందున లక్ష్మిరూప ప్రభలన్ గూర్చంగ, భోజ్యమ్మున
    న్నమ్మా! రమ్మని పిల్చె భర్త తనయర్ధాంగిన్ ప్రమోదమ్మునన్!

    రిప్లయితొలగించండి
  25. పూజ్య గురువులు శంకరయ్య గారికి నమస్సులు. పోచిరాజు కామేశ్వర రావు గారి సందేహం గురించి నా విన్నపము.
    బాల వ్యాకరణం సంధి -18 సూత్రం “ద్రుతంబునకు సరళ స్థిరంబులు పరంబు లగునపుడు లోప సంశ్లేషంబులు విభాష నగు”
    బాల వ్యాకరణం సంధి -19 సూత్రం “వర్గ యుక్ సరళములు పరము లగునపు డొకానొకచో ద్రుతమునకుఁ బూర్ణ బిందువును గానం బడియెడు”
    ఈ రెండు సూత్రాల ప్రకారం ద్రుతం మీద సరళం ఉండొచ్చు. ఆ ద్రుతానికి లోపం రావచ్చు. కానీ సహజ సరళానికి ముందున్న ద్రుతానికి లోపం వచ్చినా అక్కడ అర్థానుస్వారం రాదు. నేను అర్థం చేసికొన్నది తప్పు అయితే దయచేసి సరిదిద్దండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయ కుమార్ గారు ధన్యవాదములు. నన్నయ గారి పద్యములోని “నిన్నుఁ దొట్టి” లో “నిన్నున్” “నిన్నుఁ” గా వాడబడినది. “దొట్టి” యథాతథము గా ఉంది. ఇక్కడ సంధి లేదని నా భావన. అర్థానుస్వారము దృతమున్నదని సూచన ప్ర్రాయముగా వాడబడుతుందనుకుంటాను.

      తొలగించండి
  26. శర్వర! నిజమే యయ్యది?
    యర్వాచీనమ్ములు స్మృతులామ్నాయమ్ము
    ల్లుర్వికి మొదటే గలవని
    సర్వులకున్దెలియునయ్య! సంపూర్ణముగన్

    రిప్లయితొలగించండి
  27. పూర్వమ్ములు వేదమ్ములు
    తర్వాతివి యుపనిషదులు తథ్యము సుమ్మీ...
    అర్వకురా! కొన్నింటికి
    యర్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్ :)

    రిప్లయితొలగించండి


  28. ఫర్వా లేదు జిలేబీ
    తర్వాయి కతలను చెప్పు తరగతి లోనన్
    కర్వలి కబురులు కాదోయ్,
    అర్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి