14, డిసెంబర్ 2015, సోమవారం

సమస్య - 1884 (రామచంద్రుని రక్షించు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
రామచంద్రుని రక్షించు రావణుండు.

49 కామెంట్‌లు:

 1. సత్య ధర్మము వీడని నిత్య వ్రతుడు
  రామ చంద్రుని రక్షించు ,రావ ణుండు
  లంక నిండిన యసురుల సంక టములు
  వాన రమ్ముల బారిన బడయు నంట

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని పద్యంలో అన్వయలోపం ఉంది.

   తొలగించండి
  2. సత్య ధర్మము వీడని నిత్య వ్రతుడు
   రామ చంద్రుని రక్షించు ,రావ ణుండు
   పరమ పావని సీతను బట్టి దెచ్చె
   పాప మేరీతి పండునో భగవ దేచ్చ

   తొలగించండి
 2. గురువుగారికి నమస్సుమాంజలులు....ఈరోజు సమస్య చాలా సమస్యగానే వుంది తప్పో ఒప్పో మరి దయతో చూసి సరిచేయగలరని విన్నపం

  విజ్ఞతగల మండోదరి వేడె నిటుల
  రామచంద్రుని! రక్షించు, రావణుండు
  దానవగుణ సంపన్నుడు, ధర్మ మనక
  ఉర్వి తనయను చెరపట్టె గర్వమందు
  కరుణ జూపించి పతిభిక్ష వరము నొసగు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ (నిస్సందేహంగా) బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 3. రమణి సీతమ్మ ధ్యానించు రామ స్మరణ
  రామచంద్రుని రక్షించు, రావణుండ
  మిత శివునిభక్తు డవనేమి? హతము గాక
  తప్పదికను జానకి శోక తప్తమందు.

  రిప్లయితొలగించండి
 4. పడతి జానకి భర్తగా బడిసె నెవని
  పరమ పురుషుని శరణన్న ఫలితమేమి?
  అపహ రించిన దెవరంట యవని సుతను
  రామచంద్రుని రక్షించు రావణుండు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   క్రమాలంకారంలో మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. అశోకవనిలో రాక్షస స్త్రీలు సీతతో...

  శోకమును బాపి నిన్ను యశోకవనిని
  మార్చి చేరుచుగా తన మందిరమున
  మాదుమాటలవిని సీత ! మరువ నిపుడు
  రామచంద్రుని, రక్షించు రావణుండు.

  రిప్లయితొలగించండి
 6. తండ్రి యా జ్ఞను బాటించు తనయు డగుట
  రామచంద్రుని రక్షించు, రావణుం డు
  పరమ శివుని నా రాధించు భక్త వరుడు
  వేయి శివలింగ ములకుదా జేయు బూజ

  రిప్లయితొలగించండి
 7. కూడ దీసుకు ప్రాణముల్ వేడుకొనుచు
  రామచంద్రుని , రక్షించు, రావణుండు
  సీత నెత్తుకు బోయెను, శీఘ్రముగను
  బోయి కాపాడు మానీదు జాయననుచు
  కేలుమోడ్చి జటాయువు కూలి పోయె!!!

  రిప్లయితొలగించండి
 8. దూషణ ఖరాసురులు మునిదుఃఖకరులు
  దండకారణ్య రాక్షసాధము లనిశము
  వారి, భావినిహతులు కోపానలము న
  రామచంద్రుని, రక్షించు రావణుండు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. నాదు మాయల నెదురాడ నరుల వశమె
  లక్షణమ్ముగ లక్ష్మణా! రణము వీడి
  శరణుజొచ్చిన మాతండ్రి సంతసించి
  ప్రాణభిక్షను బెట్టుచు నాణెముగను
  రామచంద్రుని రక్షించు రావణుండు
  యనుచు రావణి బల్కెను నహము మీర!!!

  రావణి = ఇంద్రజిత్తు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ రెండవపూరణ బాగున్నది. అభినందనలు.
   ‘రావణుండు+అనుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘రావణుం డ|టంచు రావణి...’ అనండి.

   తొలగించండి
 10. గురువుగారికి, పెద్దలందరికీ నమస్కారం. తన మాట కాదన్నాడన్న కోపంతో తమ్ముడు విభీషణుడిని రావణాసురుడు ఇంట్లోంచి తరిమివేయడంవల్లనే అతడు రాముడి శరణుకోరి, లంక గుట్టు చెప్పి అన్న చావుకు కారణమయ్యాడు. ఒక రకంగా రావణాసురుడే తన మరణ రహస్యం చెప్పి సులువుగా సం హరించబడ్డాడు కనక పరోక్షంగా తానే రాముడిని రక్షంచాడు అన్న భావనతో పూరించాను. భావం తప్పైనా, పద్యం లో తప్పులున్నా క్షమించి తెలియచేయవలసినదిగా కోరుతున్నాను.
  తే.గీ:

  తన్నుకాదనుతమ్మునితరుమ,నతడు
  కోశ లీశుని కినుడివె కోట కిటుకు
  తెలియకుండనె పరునికి తెలిపి గుట్టు
  రామచంద్రునిరక్షించురావణుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేదుల సుభద్ర గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘కోసలేశుని’ అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువుగారు. సవరిస్తాను

   తొలగించండి
 11. సర్వ శక్తిమంతుడనని గర్వ పడుచు
  వాయు దేవుని గమనంపు వరుస మార్చు!
  వెన్నెలన్ గోర తలవంచి వెలుఁగ, రామ!
  రామ! చంద్రుని రక్షించు రావణుండు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. శత్రువన్నచొ భయమేగ-శాంతమేది?
  భయమునశియించు శత్రువే బ్రతుకకున్న
  రామచంద్రుని రక్షించె|” రావణుండు
  అసువుబాయగ రాముని కభయమేగ|
  2.కామ,-క్రోదాది మొహాలుకలువగానె
  అహము నధికార దర్పంబు యశముగాదు
  అట్టి హృదయంబు రామునికంటనీక
  కీర్తి నిల్పెను| రావణ స్పూర్తిజచ్చి
  రామచంద్రుని రక్షించె రావణుండు
  నాటిఆదర్శభావాలుచాటునట్లు.

  రిప్లయితొలగించండి
 13. రావణు సతి తా కోరెను రఘుకులేశు
  రామచంద్రుని,రక్షించు.రావణుండు
  భూసుతనుదెచ్చి తప్పిదమునిట జేసి
  నాడు మన్నించు రామ,నా నాథు నిచట.

  రిప్లయితొలగించండి

 14. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  పలికె నిట్లు మహేశుడు పార్వతి గని
  " ఈశ్వరా౦శ స౦భూతు డనశ్వర మహి
  మాన్వితు౦డైన. యా మారుతాత్మజు౦డు
  రామచ౦ద్రుని రక్షి౦చు | రావణు౦డు
  చచ్చు | లక్ష్మీస్వరూపిణిన్ జనకసుతను
  వా౦ఛిలిన కూళ యి౦కను బ్రతుక గలడె ? "

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామచంద్రమూర్తి భక్తుని రక్షించడం సరియైనమాట.
   మారుతి ఆయన ఆదేశమును పాటించే బంటు.
   ఆలోచించండి.

   తొలగించండి
  2. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   గుండా వారి అభ్యంతరం కూడా ఆలోచింపదగినదే...
   *****
   సహదేవుడు గారూ,
   మీ అభ్యంతరం సహేతుకమే. కాని సమస్యాపూరణాల్లో మరీ అంత లోతుగా లాజిక్కులకోసం వెదకాలా?

   తొలగించండి
  3. అన్నింటికీ అంత లోతుగా వెదుకనే వెదకను. గురువుగారూ! శ్రీరామచంద్రమూర్తిని తక్కువ చేసే మాటవినలేక అలా స్పందించాను.మన్నించండి.

   తొలగించండి
  4. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు నమస్కారములు. మీకు వచ్చిన సందేహానికి నివృత్తికై వ్రాస్తున్నాను.
   మేఘనాధుని నాగాస్త్రానికి బద్ధులైన రామ లక్ష్మణులను గరుత్మంతుడు వచ్చి నాగ బంధన విముక్తి చేసి కాపాడుతాడు.
   అప్పుడు రాముడన్న మాటలు:

   భవత్ప్రసాదాద్వ్యసనం రావణిప్రభవంమహత్
   ఆవాహమివ వ్యతిక్రాంతౌ పూర్వవద్బలినౌకృతౌ వా.రా. 6.50.42

   తదుపరి మేఘనాధుని బ్రహ్మవర ప్రసాద మహిమ తో శరవర్ష జాలానికి పీడితులై మూర్ఛపోయిన రామ లక్ష్మణులను వానర సైన్యాన్ని సంజీవని మొదలైన మూలికలతో ఉన్న పర్వతాన్ని తెచ్చి ఆ మూలికల వాసనకి రామ లక్ష్మణులతో సహ వానర వీరులు తేరుకోవటానికి కారణమవుతాడు.
   ఈ విధముగా వైనతేయుడు, మారుతాత్మజుడు రాముణ్ణి రక్షించినటులే కదా.

   తొలగించండి
  5. విషయాన్ని తెలియపరచిన పోచిరాజు వారలకు ధన్యవాదములు.

   తొలగించండి
  6. విషయాన్ని తెలియపరచిన పోచిరాజు వారలకు ధన్యవాదములు.

   తొలగించండి
  7. అన్నింటికీ అంత లోతుగా వెదుకనే వెదకను. గురువుగారూ! శ్రీరామచంద్రమూర్తిని తక్కువ చేసే మాటవినలేక అలా స్పందించాను.మన్నించండి.

   తొలగించండి
  8. భవత్ప్రసాదాద్వ్యసనం రావణిప్రభవంమహత్
   ఆవామిహ వ్యతిక్రాంతౌ పూర్వవద్బలినౌకృతౌ వా.రా. 6.50.42

   తొలగించండి
 15. జూచి వానర మూకను గాచు నరుని
  రామచంద్రుని, రక్షించు రావణుండు
  లంక వాసుల ; రక్కసులనిరి నగుచు
  మర్కటము లేమి చేయును మనల నిచట

  రిప్లయితొలగించండి
 16. మిత్రులందఱకు నమస్సులు!

  తనదు ఘనశాపమునకును దగిన త్వరిత
  మైన యవధికై యట యుద్ధమను నెపమునఁ
  దననుఁ గూల్చుటకునుఁ దానె ధారిక నిడి
  రామచంద్రుని రక్షించె రావణుండు!
  (ధారిక=ముహూర్తము)

  రిప్లయితొలగించండి
 17. పవనసుతు డెవ్వని భజించు భక్తితోడ?
  నిచ్ఛతో వేడ రఘురాము డే మి చేయు ?
  రాముతో నని చేసిన రాయడెవరు?
  రామచంద్రుని, రక్షించు, రావణుండు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. ధర్మమును రక్షసేయగ ధర్మమెపుదు
  రక్ష సేయుననెడి సూక్తి ప్రథ వహించి
  రామచంద్రుని రక్షించు.రావణుండు
  ధర్మహానిని గావించి జచ్చె గాదె

  రిప్లయితొలగించండి
 19. ధర్మమును రక్షసేయగ ధర్మమెపుదు
  రక్ష సేయుననెడి సూక్తి ప్రథ వహించి
  రామచంద్రుని రక్షించు.రావణుండు
  ధర్మహానిని గావించి జచ్చె గాదె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

  2. కంది వారు కూడా రాముల వారి మీద పడ్డారూ :)

   రామా నీ తరమా నిను మేము మరువ :)

   జిలేబి

   తొలగించండి