19, ఆగస్టు 2018, ఆదివారం

సర్ప ప్రార్ధన

                                నాగ బంధ  చిత్ర తేట గీతి    
                        


ఖలమును తలపై నిడె నొక గనప నగము,
గారవముగ పెంచి వటముగ కలిలమును
చలమునకు చుట్టి మురడించి జయమిడిన వ
ర  నగ  మొకటి, దేవర  రూప మనుచు సీద
రమునకు   నమసము ననవరతము నిడుదు
అర్ధములు
ఖలము =  భూమి ,     గనప  = పెద్ద   ,  నగము   =  పాము ,గారవముగ  =  బాగుగా  , వటము=  త్రాడు,    కలిలము  =  దేహము  ,  చలము =  కొండ   ,మురడించి  =  రాణింఛి ,వర =  శ్రేష్ఠ ,  సీదరము =  పాము    నమసము   =  నమస్కారము      అనవరతము  = ఎల్లప్పుడూ
 తాత్పర్యము
భూమిని తన పడగలపై  ఉంచి కాపాడు చుండె నొక  పెద్ద పాము  (ఆదిశేషుడు)తన శరీరమును బాగుగా పెంచి  త్రాడు లాగా  అయ్యి మందర పర్వతమును చిలుకుటకు సాయపడినది   ఒక  ఘనమైన పాము   (వాసుకి ) అట్టి పాములు దేవత స్వరూపములు కాబట్టి వాటికి నమస్కారములు చేసెదను
 చిత్రములో పద్యము చదువు పద్ధతి :
ఈ పద్యము తలనుంచి మొదలు బెట్టి చదువు కోవాలి  పాము చుట్టుకుంటు  తోక దాక రావాలి.   అంటే  ఖలమును  దగ్గిర మొదలు పెట్టి   మునిడుదు తో  ముగిoచాలి   
 దీనిలో విశేషము   చదరములలో ఉన్న  అక్షరములు రెండు సార్లు ముందర ఒక పదమునకు మరల ఇంకొక పదమునకు అమరునట్లుగా  బంధించుట   

                                     బంధ కవి  పూసపాటి కృష్ణ సూర్య కుమార్

18, ఆగస్టు 2018, శనివారం

సమస్య - 2766 (పశ్చాత్తాపము విడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్"
(లేదా...)
"పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియల్ సల్పుమా"
ఈ సమస్యను పంపిన గురుమూర్తి ఆచారి గారికి ధన్యవాదాలు.

17, ఆగస్టు 2018, శుక్రవారం

సమస్య - 2765 (సవతి లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
" సవతి లేని సంసారము సాగు టెట్లు"  
(లేదా...)
"సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో"

16, ఆగస్టు 2018, గురువారం

సమస్య - 2764 (కోడలి పొందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కోడలి పొం దభిలషించెఁ గుణకోవిదుఁడే"
(లేదా...)
"కోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెఁగా"

15, ఆగస్టు 2018, బుధవారం

సమస్య - 2763 (స్వేచ్ఛ లభించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"స్వేచ్ఛ వచ్చెఁ దెగవు దాస్య శృంఖలములు"
(లేదా...)
"స్వేచ్ఛ లభించె దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్"

14, ఆగస్టు 2018, మంగళవారం

శ్రీకృష్ణ ప్రార్ధన

భేరి చిత్ర బంధ సీసము 

పూతన పాతంగి! నాతిరక్షక! సత్యభామ  మానస చోర!  పార్ధ సార
ధీ!గిరి ధర! వసుదేవ సుత!  కరటి ప్రాణ దా! వనమాలి!   భద్రనాధ! 
చిరజీవి!   బకవైరి!   శ్రీపతి!   భాస్కర   నేత్ర!  వజ్రకిశోర!   నీరజోద
రా!దీనబంధు! మురారి! కంసారాతి!  మల్లారి!నగధరా! నల్లనయ్య!
నరకాంతక!కమల నాభ! నటన సూత్ర ధారి!విశ్వంభరా! దానవారి! 
దేవకీ సుతా! యవనారి! తీర్ధ కరుడ!
సూరి! బాహు భేది! భరిమ!సోమ గర్భ!  
భూరి!  చక్రధారి!  కపిల! పుష్కరాక్ష!
కాచు పూసపాటి నెపుడు  కరుణ తోడ 
 
పై పద్యములో భేరి  పైన (పూసపాటి చిత్ర బంధ కవితా భేరి) అన్న వాక్యము బంధించ బడినది                             
                             పూసపాటి కృష్ణ సూర్య కుమార్   బంధ కవి

సమస్య - 2762 (పాలం గనినంత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్"
(లేదా...)
"పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్"

13, ఆగస్టు 2018, సోమవారం

సమస్య - 2761 (దాహ మైనప్పుడే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును"
(లేదా...)
"దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్"

12, ఆగస్టు 2018, ఆదివారం

సమస్య - 2760 (శ్రీకృష్ణునిఁ దిట్టె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శ్రీకృష్ణునిఁ దిట్టె నయొ కుచేలుం డలుకన్"
(లేదా...)
"శ్రీకృష్ణుం గటుభాషణంబులను గర్హించెన్ గుచేలుం డయో"

11, ఆగస్టు 2018, శనివారం

సమస్య - 2759 (ఒక్కఁడె పాంచాలికి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఒక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్"
(లేదా...)
"ఒక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్"