17, ఆగస్టు 2018, శుక్రవారం

సమస్య - 2765 (సవతి లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
" సవతి లేని సంసారము సాగు టెట్లు"  
(లేదా...)
"సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో"

111 కామెంట్‌లు:



  1. ప్రాస యతి గణములులేని పద్య మెట్లు
    సాగు నమ్మ? ఛందము లేక చందు గలదె?
    గడన లేని కాపురముసాగ గలదకొ? ర
    సవతి లేని సంసారము సాగు టెట్లు?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. అవనిని నెన్న పూరుషున కామెయె దిక్కగు జీవితాంతముం
    బవలును రేయి తోడగుచు బాధల బ్రేమల నొక్క ప్రాణమై
    చివర తురీయ సాధనకు చేయుచు ప్రోదిని మించు నా విలా
    సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      'విలాసవతి'తో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  3. ఇరుకు స్థలమున గట్టితివిల్లు నీవు
    తరువులను బెంచ నచ్చోట తావు లేదు
    మూడు గదులున్న ఫలమేమి ముఖ్యమగు ర
    సవతి లేని సంసారము సాగు టెట్లు.

    రిప్లయితొలగించండి
  4. కాల క్షేపము సతికట కయ్య మనుచు
    ఉన్న భార్యను కాదని మిన్న యువతి
    నెత్తి నెట్టుకు దిరుగంగ నీల కంఠు
    సవతి లేని సంసారము సాగు టెట్లు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాలక్షేప' మన్నపుడు 'ల' గురువై గణదోషం. 'నీలకంఠ!' అని సంబోధనగా మార్చండి. బాగుంటుంది.

      తొలగించండి
    2. కాలు దువ్వుచు నుండును కయ్య మునకు
      ఉన్న భార్యను కాదని మిన్న యువతి
      నెత్తి నెట్టుకు దిరుగంగ నీల కంఠా !
      సవతి లేని సంసారము సాగు టెట్లు

      తొలగించండి
    3. అక్కయ్యా,
      సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
      'నీలకంఠ' అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      'రసవతి'తో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేసే' అన్నది వ్యావహారికం. "సృష్టి జేయు విధాతయు..." అనండి. అలాగే "సుఖసంపద లిడి" అనండి. సంపద + ఇచ్చి.. అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. 1. సృష్టిజేయు విధాతయు సృష్టి జేయ
      పొందుపరచె మనుజు సుఖ సంపద లిడి
      కూడు గుడ్డ నిల్లు ధనము గూడగా, ర
      సవతి లేని సంసారము సాగు టెట్లు"

      2. సృష్టి జేసెడి బ్రహ్మ సుస్పష్టముగను
      పొందుపరచెను మనుజుడు పొందఁదగిన
      కూడు గుడ్డను గూడును., గూటిలో ర....
      సవతి లేని సంసారము సాగు టెట్లు" ?

      తొలగించండి
    4. వరలక్ష్మి గారూ,
      సవరించిన మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  6. డా. పిట్టా సత్యనారాయణ
    పిల్ల పాపలు గలుగని వేళ నొకతె
    చెల్లె రెండవ భార్య, కుచేల సంతు
    పూట గడవదు పైపెచ్చు పోరు సలుపు
    సవతి, "లేని సంసారము" సాగుటెట్లు

    రిప్లయితొలగించండి
  7. డా.ఎన్.వి.ఎన్.చారి
    కవనముచెప్పినాడనట కామ రసంబు లుజాలువారగా
    నవనవలాడు కన్యలనునాకనులారగ జూచి మెచ్చకన్
    కవితనుపెండ్లియాడితి వికారము బుట్టె ను మాటతీరు "హా
    సవతియె" లేని కాపురము సవ్యముగా గొన సాగిటెట్టులో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. చారి గారూ,
      'హాసవతి'తో మీరు చెప్పిన పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    కవనమె వృత్తిగా గడన గాంతురె యీ యుగ ధర్మ మొక్కటే
    బవరము సేయగానగును, భాషను నమ్ముటదేమి?కేశపుం
    సవరము బోలె వచ్చె నొక జవ్వని కైతల మెచ్చి, భార్యకున్
    సవతియె,"లేని కాపురము",సవ్యముగా కొనసాగుటెట్టులో!

    రిప్లయితొలగించండి
  9. అత్త మామల సేవలో నల య కుండ
    భర్త కనుకూలవ తి యైన భార్య యగుచు
    మనసు లు తెలి సి మసలెడి మగువ గ సర
    సవతి లేని సంసార ము సాగు టెట్లు ?_
    _______కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
  10. పవనము వీచ కుండిన నుప్రాణము నిల్వదు జీవి కైననే
    డవనిని రాలు రప్పలు నురంజిలు రీతిగ సోయగమ్మి డన్
    కవనము లందు పండితులు కాంతల కోప మువేడు కేయనన్
    సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో

    రిప్లయితొలగించండి

  11. అరయ సాహితీ సంసార మందు ఛంద
    మనెడి నరునకు భార్యలు యతియు బ్రాస ;
    వాని యందున నెయ్యది లేనియెడల
    సవతి లేని సంసారము సాగుటెట్లు ?

    రిప్లయితొలగించండి



  12. పోతా నా పుట్టింటికి పోతా నంటూ
    పట్టు బట్టు జిలేబి ని
    ఉద్దేశిస్తూ అయ్యరు గారు :)



    అవసర మిద్ది గాదె మన నాయతనంబు శుభమ్ము గాన! జా
    య! వలయు నీదు పొందు గద ! యమ్మి ! శుభాంగి! జిలేబి ! పల్కులన్
    గవనము గా వినమ్మరొ ! యగారము లో ప్రియ ! నీవు, నా విలా
    సవతియె, లేని కాపురము, సవ్యముగాఁ గొనసాగు టెట్టులో!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      చాన్నాళ్ళకు అయ్యరు వారిని పూరణలో దింపారు. పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    ప్రవిమలవిద్యలన్ గలిగి భాసిలు పుత్రుడు, మెట్టినింటిలో
    నవసరమెంచి వర్తిలెడి యాత్మజ , నే వినిపించునట్టివౌ
    కవితల మెచ్చునట్టి నిజకాంత మనోహరనవ్యమందహా...
    సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో!


    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మురళీ రవము ! అద్భుతం !



      జిలేబి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. భాస్కరోదయమయ్యె సంబరమునయ్యె! 🙏

      శ్రీమతి జిలేబీ గారికి.. సీతాదేవి గారికి..మీకు... ధన్యవాదాలు 🙏🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    4. బాష్పాంజలి:

      పటుతర చాతురీ భరిత వాగ్విభవుండు, ప్రజానురంజన...
      స్ఫుటపరిపాలనానుభవపూర్ణుడు, నిర్జితవైరిమానసుం...
      డట నమరేంద్రదివ్యసభయందు విశేషపదమ్ము పొందె, మా
      అటలు బిహారి వాజపెయి ఆత్మకు శాంతి లభించుగావుతన్ !

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
  14. గరళకంఠుని తలపైనగంగలేక
    శక్తి నాసక్తి నిలచునా?సాంబమూర్తి?
    సవతిలేని సంసారముసాగుటెట్లు?
    గంగ,పార్వతికలయికే కలియుగంబు!

    రిప్లయితొలగించండి
  15. సరస సంభాషణములను చక్కగాను
    మగని మనసును దోచుచు మరులు గొల్పి
    వంశవృద్ధిని జేసెడు పరువపు సర
    స వతిలేని సంసారము సాగుటెట్లు?

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2765
    సమస్య :: సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో?
    సవతి లేకుంటే కాపురం సరిగా కొనసాగడం ఎలా కుదురుతుంది? అని ప్రశ్నించడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన విషయం.
    సందర్భం :: నాయనా ! ఈ ప్రపంచంలో అనేక లక్షల జీవరాసులు ఉండగా ఎంతో దుర్లభమైన మానవజన్మ లభించడం మన అదృష్టం. అందువలన మనం మన జన్మను తప్పనిసరిగా సార్థకం చేసికొనాలి. అందుకోసం సజ్జన సహవాసం చేయి. విద్య బాగా నేర్చుకో. వినయాన్ని కలిగియుండు. సుగుణవంతుడవై నీ ధర్మపత్నితోనే దాంపత్య జీవనాన్ని కొనసాగించు. గొప్ప కీర్తిని సంపాదించుకో. కీర్తి అనే సవతి లేకుంటే నీ కాపురము జీవితము జన్మ సార్థకములు కానే కావు అని పెద్దలు ఉపదేశించే సందర్భం.

    అవనిని జన్మ సార్థకత నందగ సజ్జనసంగమమ్ముతో
    బ్రవిమల విద్యతో వినయభావముతో నిజధర్మపత్నితో
    స్తవగుణరాశితో జిర యశస్సుఁ గడింపుము వత్స! కీర్తియన్
    ‘’సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో?’’
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (17-8-2018)

    రిప్లయితొలగించండి
  17. శివ!శివ!చూడుమీ సతిని,చిక్కని చక్కని చుక్క -బాపురే!
    యవిరళ భోగ భాగ్య మహితాద్భుత హస్త కళాభిరామయై
    చివరకు వంద,వేయి,యన శీఘ్రమె ఖర్చులఁజేయు నా విలా
    సవతియె లేని కాపురము సవ్యముగా కొనసాగుటెట్టులో?

    రిప్లయితొలగించండి
  18. మిత్రులందఱకు నమస్సులు!

    వివిధపు టష్ట రూపములఁ బ్రీతినిఁ దాల్చి, యనుగ్రహించి, యీ
    యవనినిఁ గల్గు నింతులకు హర్షమొసంగుచు నష్టలక్ష్మి రేఁ
    బవలును గావ, మానినులు భద్రత నందెద! రట్టి పృథ్వికిన్
    సవతియె లేని కాఁపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అద్భుతమైన పూరణ మధురకవిగారూ! అభినందనలు!💐💐💐

      తొలగించండి
    3. కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. “అష్టలక్ష్మి” సమాసములో నేకవచన ప్రయోగము నందు నాకు చిన్న సందేహము కలుగు చున్నది. నివృత్తి సేయ గోర్తాను.
      అష్టలక్ష్మి సంఖ్యాపూర్వకమే కాని లక్ష్మి సమాహార వాచ్యము కాదు కదా. సప్తర్షులు వలె బహువచనాంతము గా వలెనని నా సందేహము.
      విష్ణు వను నర్థమున నష్టలక్ష్మి ( అష్ట లక్ష్ములు గలవాడు) ప్రయోగించ వచ్చు నను కుంటాను.
      పఞ్చపాత్ర; త్రిభువనము పాత్ర, భువనము సమాహార వాచ్యములు కనుక యీ ద్విగు సమాసము లేక వచనాంతములు.
      ఇందలి వ్యాకరణ విశేషమును వివరించ గోర్తాను.

      తొలగించండి
    4. సుకవి మిత్రులు కామేశ్వర రావు గారికి నమస్సులు!

      అష్టలక్ష్మి అను సమాసమును నేను అష్టవిధరూపములు గలదైన లక్ష్మి అనే అర్థంలో ప్రయోగించాను. తప్పైనచో దెలుపగలరు.

      తొలగించండి
    5. నా కభినందనలు తెలిపిన సీతాదేవి గారికి మనఃపూర్వక ధన్యవాదములు!

      తొలగించండి
    6. షడ్చక్రవర్తులు, నవ బ్రహ్మలు, ఏకాదశ రుద్రులు, అష్ట దిక్పాలకులు, అష్ట సిద్ధులు, మున్నగు ప్రయోగములను గాంచ నష్ట లక్ష్ములే సాధువని నా యభిప్రాయము.

      తొలగించండి
    7. మఱియొక విశేషము. సంఖ్యాపూర్వకమయి సమాహార వాచ్య మైనప్పుడే ద్విగు సమాసమన బడును.
      ద్విగుసమాసము లేక వచ నాంతములే.
      మిగిలినవి సంఖ్యా యుక్తమయినను ద్విగు సమాసము లన లేము. అవి కర్మధారయములే యగును.
      ఈ విషయమున తఱచు వైయాకరణులు గూడ పొరబడు తుంటారని చదివితిని.

      తొలగించండి


    8. ఆహా! ఇవన్నీ తెలియకుండానే పదాలన్నల్లేస్తున్నానే !


      జిలేబి

      తొలగించండి
    9. లక్ష్మి తో మీరనుకున్న విగ్రహ వాక్యము రావలెనన్న అష్టము నుత్తరపదముగా వాడవలసి యుండు నను కుంటాను శ్రీకృష్ణాష్టకము వలె.
      రమాష్టము, లక్ష్మ్యష్టము, మాష్టము , మాష్టకము పరిశీలించండి.
      అష్టాధ్యాయములు ( ఎనిమిది అధ్యాయములు) - అష్టాధ్యాయి (ఎనిమిది అధ్యాయములు కలది).

      తొలగించండి
    10. ఈ విషయమై సూరం శ్రీనివాసులు గారిని సంప్రదించాను. వారు 'అష్టలక్ష్మి' అనడంలో వ్యాకరణ వైరుధ్యం లేదు. అది తాత్త్వికమైనది అంటారు. సమాహారంగా స్వీకరిస్తే నిర్దోషమే. స్వీకరించకపోతే దోషం. మరి దానిని సమాహారంగా స్వీకరించాలా వద్దా అనేది తత్త్వశాస్త్రానికి సంబంధించిన అంశం. అప్పుడది ఎన్నటికీ తెగదు.... ఇదీ వారు తెలిపిన విషయం.

      తొలగించండి
    11. పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవాదములు.సాహిత్య సమస్య తాత్త్విక సమస్య యైనది.ఇంక నది వారి వారి విశ్వాసముల పై యాధార పడి వుంటుంది.

      తొలగించండి
  19. శివశివ! జాలమయ్యెనిలు సేరుటకిందుకె యింతకోపమా!
    రవరవలేలనే సతి? నిరంతరమిట్లుఁ దలంచబోకు గౌ
    రవమగు కొల్వునున్ సవతిగా మది, జీతమునిచ్చునట్టి యీ
    *"సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో!"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణలోని చమత్కారం అలరించింది. మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  20. ఎన్ని సంపద లుండియు నేమి ఫలము?
    ధనము ధాన్యము లన్నియు దరుగు లేక !
    గరళ కంఠుని సిగగల గౌరి యొక్క
    సవతి లేని సంసారము సాగు టెట్లు ?
    ****)()(****
    (నీటి ప్రాధాన్యత వివరింప బడింది)

    రిప్లయితొలగించండి
  21. తరచి చూడ వేల్పులకును తప్ప లేదు
    సవతి పోరు, గంగకు నుమ శివుని చెంత,
    సత్యకు విదర్భ సుత కృష్ణ సామి చెంత,
    తిరుమ లేసుడు కొలువాయె తిరుమలగిరి
    పైన భార్యలు కలహము పడగ, నీదు
    జబ్బు నయము కాదు రమణీ, సంతు సాక
    నాదు తరము కాదిప్పుడు, నమ్మకముగ
    నిన్ను నేచూచు కొందును కన్న బిడ్డ
    వోలె, నీ సోదరిని తెత్తు వోలి నిచ్చి
    సవతి లేని సంసారము సాగు టెట్లు
    యనుచు బలికె నొకడు తన వనిత తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సాగు టె। ట్లంచు బలికె...' అనండి.

      తొలగించండి
  22. వీడెను తనసతి సుతులున్,
    మోడాయెనుగద బ్రతుకులు,ముండన మేలా
    పాడియె నాతో పెండ్లని
    కోడలి పొందభిలషించె గుణకోవిదుడే

    ఒక ప్రమాదములో భార్య కొడుకు చనిపోగా కోడలు విధవరాలు గా మారదలచి గుండు చేయించుకొనదెనని తెల్ప మామ గారు వలదని తాను పెండ్లి చేసుకుంటానని చెప్పు సందర్భము NINNATI SAMASYA

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      కొడుకు చనిపోతే ఆ కోడలిని పెండ్లి చేసికొనలేదు కాని ఆమెతో కాపురం చేసే వ్యక్తిని మా ఊళ్ళో చూసాను.

      తొలగించండి


  23. సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో
    గవనము గా వినండి కనకాంగులు! మీరు భళా జిలేబులై
    జవనపు వేగ మై పతికి సారతరమ్ముగ ప్రేమ తోయరా
    శివలెను జూపి నార్యులను సింహపు కైపుల గావ తధ్యమౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. చీకుచింతలులేకుండసాగునార్య!
    సవతిలేనిసంసారము,సాగుటెట్లు
    గంపగయ్యాళిభార్యలుగల్గునెడల
    వారిబ్రదుకులుసుఖముగ భరణియందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  25. *పార్వతి ఉవాచ*

    శివునకు శాంతి గూర్చగను శీర్షము నందున కుల్కు గంగనే
    భువిపయి బారజేయగను పూని భగీరథుడే తపింపగన్
    ధవుని పరిత్యజించెగద, తాను విసంబు సహించుటెట్టులో
    *సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  26. భవకృతసార్థకానుగతభవ్యతనూభవసంపదాభమై

    సువిధయశస్కరీవినుతశోభనవృత్తివిరాజమానమై

    నవరసభావబంధురసనాథవినోదరమాకళావిలా

    సవతియె లేని కాపురము సవ్యముగా కొనసాగు టెట్టులో?.
    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  27. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    =====================
    సవతియె లేని కాపురము
    సవ్యముగా గొనసాగుటెట్టులో
    =======================
    సవతి పోరు లేకున్నను ఆవిడ గారి
    కాపురము సవ్యముగా సాగడం
    లేదనుటలో గల పరస్పర విరుద్ద
    అర్థమే సమస్య
    =====================
    సమస్యా పూరణము - 234
    ====================

    అత్తా మామలె కాదుగ ఆవిడకు
    సవతియె లేని కాపురము
    సవ్యముగా గొనసాగుటెట్టులో
    వారి ఈ సుఖ గోపురము
    మగనికి కొలువు ఆలికి కొలువు
    పడక గదియె కలయికకు నెలవు
    దొరకదు పిల్లలకై సెలవు
    శాంతికి చిక్కదు వారికి సుళువు

    ====##$##====

    వారిద్దరు "సాఫ్ట్ వేర్ " వారి కాపురము
    "హార్డ్ వేర్ " , అత్తా మామలే కాదు "ఆయన
    కిద్దరు" చందంగా సవతి కూడా లేదాయేను,
    ఆయినను కాపురంలో సుఖము , శాంతి ,
    కరువైనది. పిల్లల కోసం సెలవులు దొరకవు
    కలిసి గడుపుటకు షిఫ్టు డ్యూటీలడ్డం ,
    అలసిన మేనులుగా పలకరించుకునేది
    పడకటింట్లోనే కదాయని భావము.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం )

    రిప్లయితొలగించండి
  28. సవతి లేని సంసారము సాగు టెట్లు
    తెలుపుమన పద్మనాభుడు గళము విప్పు
    నీల కంఠుడు వివరింప జాలు నేమొ
    పద్మ సంభవు డెపుడైన పలుక గలఁడె ?

    నిన్నటి సమస్యకు నా పూరణ

    వేడుకగా తన సుతునకు
    కోడలి పొందభిలషించెఁ గుణకోవిదుఁడే
    నాడా నారాయణు డన ;
    చూడగ నేనాడు నొక్క చోట మెలిగిరా ?

    రిప్లయితొలగించండి
  29. రిప్లయిలు
    1. విశ్వ మందున వంశాభి వృద్ధిఁ గర మొ
      సంగు సంతాన మరయని జన్మ మేల
      సాధుతర పాక సంచయ సంభృతపు ర
      సవతి లేని సంసారము సాగు టెట్లు

      [రసవతి = వంటయిల్లు]


      యవనిక చాటు నుండక మహత్తర రోష విహీనయై కృతా
      నవరత గేహ కర్మ చయ నైపుణ మొప్పి చరించు దార ప
      త్యవసర కార్య భార రత హాస్య రసావృత రుగ్వచో విలా
      సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  30. సవతియెలేనికాపురముసవ్యముగాగొనసాగుటెట్టులో
    సవతియెలేనికాపురముజక్కగసాగునుసందియంబులేదులే
    దవనినిజూచుచుంటిమిగనన్నికుటుంబములందుహాయిగా
    నెవరికివారుదాముగనెనెక్కటిప్రేమనుజూపుచుండుటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సందియంబు లే దవనిని...' టైపాటు.

      తొలగించండి
  31. నవరసమాధురీభరితనవ్యకవిత్వరసప్రసారయు

    క్కవనసమర్థశక్తి , వరకమ్రగుణోన్నతసాధ్వి భార్య , సం

    స్తవసుతు , లొప్పియున్ , బ్రతుక జాలునె ? వేంకటపత్యురోనివా

    సవతియు లేని కాపురము సవ్యముగా కొనసాగు టెట్లగున్.
    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  32. పతికి నాకంటె పనియన్న వలపు మెండు
    లేక గడువదు సమయము లేశమైన
    కొంచెముగ బాధయున్నను కూడుపెట్టు
    సవతి లేని సంసారము సాగు టెట్లు

    రిప్లయితొలగించండి
  33. తేటగీతి

    శౌరికిన్ లక్ష్మి, భూదేవి సతులు చూడ
    నుండ చోటిచ్చి కాచును యుర్వి మనకు
    కడుపు నింపగ కలిమికి కమల, భువికి
    సవతి లేని సంసారము సాగు టెట్లు


    చంపకమాల
    అవనికి లక్ష్మియే సవతి యంబుజనాభుని దర్మపత్నిగా
    సవరణ జేయ జీవితము సంపదలిచ్చును యష్టలక్ష్మియై
    యవియివి యందునో? మరియు నందవొ? భుక్తికి ధాన్యలక్ష్మిగా
    సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణలు :
      తేటగీతి
      శౌరికిన్ లక్ష్మి, భూదేవి సతులు చూడ
      నుండ చోటిచ్చియును గాచు నుర్వి
      కడుపు నింపగ కలిమికి కమల, భువికి
      సవతి లేని సంసారము సాగు టెట్లు

      చంపకమాల
      అవనికి లక్ష్మియే సవతి యంబుజనాభుని ధర్మపత్నిగా
      సవరణ జేయ జీవితము సంపదలేయిడు నష్టలక్ష్మియై
      యవియివి యందునో? మరియు నందవొ? భుక్తికి ధాన్యలక్ష్మిగా
      సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో?

      తొలగించండి
    2. సహదేవుడు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  34. డా.పిట్టా నుండి
    ఆర్యా, కీర్తియన్ ॥ కీర్తియను అన్న అర్థం వస్తుందన్నమాట!

    రిప్లయితొలగించండి
  35. పడతికి తనదగు గృహము పడక టింట,
    కాళ్ళు పట్టెడి భర్తయు, కలరు టీవి
    లేక పోయిన నేమగు? లోక మున ర
    సవతి లేని సంసారము సాగు టెట్లు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివరామకృష్ణ శాస్త్రి గారూ,
      మీ పూరణ మనోరంజకంగా చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  36. సవరణఁ జేయు మంత్రి సువిచారణ లందున,కార్యనిర్వహా

    ధ్యవసితదాసియౌ , కడుపు నాదృతి నింపెడు మాతృమూర్తియౌ ,

    హవణము నందు లక్ష్మి యగు , నారయ నోరిమిలో ధరిత్రియౌ ,

    నవశయనమ్ము లందు రతి , నాదగు నీదృశ సంతతప్రయా

    సవతియె లేని కాపురము సవ్యముగా కొనసాగుటెట్లగున్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  37. ...............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    సవతియె లేని కాపురము సవ్యముగాఁ
    గొనసాగు టెట్టులో

    సందర్భము: "చదువు పూర్తయింది కదా! ప్రస్తుతం ఏం చేస్తున్నా వయ్యా!" అని అచ్చంపేట ప్రాంతీయులను అడిగితే బుద్ధిగా "కాపురం" అంటారు. మనం విస్తుపోయి "సంసారం" అని అర్థం చేసుకొని పొరపాటు పడరాదు. అలా అనడం ఆ ప్రాంతంలో మామూలే! కాపుర మంటే వ్యవసాయ మని ఆ ప్రాంతంలో అర్థం.
    ఒక పెద్ద మనిషి ఒక యువకునితో యిలా అంటున్న సందర్భ మిది..
    నీళ్లు లేకపోతే నీ వ్యవసాయం ఎలా సాగుతుందయ్యా!.. అంటున్నాడు.

    గౌరికిం సవతి= గంగ (నీ ళ్ళని యర్థం)
    ఖుష్కి= Dry land నీటి వసతి లేని పొలం.. వర్షాధార భూమి
    తరి= Wet land చెరువు కింద సాగయ్యే పొలం
    కాపురము= కాపుదనము వ్యవసాయము (నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాండలికం)
    ==============================
    "యువకుడ! విద్య పూర్తి యయె..
    నొప్పుగ నేమి యొనర్తు" వంటి; న
    య్యవసరమందు "కాపురమె!"
    యంటివి.. "రెండెకరాల ఖుష్కి సా
    గు విధ మ దెట్టులో యెఱుగ
    గోరెదఁ జెప్పు మొకింత.. గౌరికిం
    సవతియె లేని కాపురము
    సవ్యముగాఁ గొనసాగు టెట్టులో!"

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
    17-8-18
    """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

    రిప్లయితొలగించండి


  38. రుచికరంబులైనట్టి యారుచ్యములను
    వండ వలెనటన్న వలయు వాసి యగుర
    సవతి,లేని సంసారము సాగుటెట్లు
    ననుచు చింతించె నచ్చోట నతివ యోర్తు.

    2.విడివిడి గదులే వలెనని వేడ లేదు
    పేచి పెట్టలేదెప్పుడు పెరడుకొరకు
    అందరికి వండి వడ్డించు నట్టి యార
    సవతి లేని సంసారము సాగు టెట్లు.

    రిప్లయితొలగించండి
  39. భవనము గట్టనెంచినను వారియె ముఖ్యము గాదె గాంచినన్
    నవిరళ మైన సేద్యమున యారుడు నిత్యము వేచి చూసెడిన్
    నవనిని ప్రాణకోటికిని యక్కర దీర్చెడు నట్టి గౌరికిన్
    సవతియె లేనికాపురము సవ్యముగా గొన సాగుటెట్టులో.

    రిప్లయితొలగించండి
  40. సాగు సవ్య దిశనిలను చక్కగాను
    సవతి లేని సంసారము ; సాగుటెట్లు
    సవతుల తగవు లుండిన శాంతి లేక
    కాపురమది? సతము మండు కాష్టమౌను.

    రిప్లయితొలగించండి
  41. ఉప్పు, పసుపు, కంది, పెసల పప్పు, పులుపు,

    బియ్యము, మిరప కాయలు, నెయ్యి, నూనె,

    గిన్నెలు, గరిటలు, పెనము, గేసుతో; ర

    సవతి లేని సంసారము సాగు టెట్లు???


    రసవతి = వంటిల్లు

    రిప్లయితొలగించండి
  42. నవనవ లాడు చీరలును నాణెపు దుద్దులు బేరమాడుచున్

    కవరున దాచినట్టి పలు కార్డులు గీకుచు చింతలేకయే

    చవిగొని మాలులన్ వెలయు షాపుల గోలలు గ్రోలెడిన్ విలా

    సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో!!!

    రిప్లయితొలగించండి
  43. శివరాత్రి స్పెషల్:

    గౌరమ్మ ఉవాచ:👇

    నవనవలాడు చీరలును నాణ్యపు రీతుల కంఠహారముల్
    చెవులకు జంట దుద్దులును చేతుల నిండుగ కంకణమ్ములున్
    చవిగొన ముక్కు పొడ్కలును చప్పున జూపగ నెత్తిమీదనా
    సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో!

    రిప్లయితొలగించండి