18, ఆగస్టు 2018, శనివారం

సమస్య - 2766 (పశ్చాత్తాపము విడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్"
(లేదా...)
"పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియల్ సల్పుమా"
ఈ సమస్యను పంపిన గురుమూర్తి ఆచారి గారికి ధన్యవాదాలు.

71 కామెంట్‌లు:

 1. మైలవరపు వారి పూరణ

  *రక్షకభటులారా* !

  ఆశ్చర్యంబిది ! స్త్రీల గాంచగనె కామాంధప్రవృత్తిన్ సదా
  దుశ్చర్యారతులైన దుండగుల యస్థుల్ నుజ్జునుజ్జౌ గతిన్
  నైశ్చల్యమ్మున మీరు దండధరులైనన్ దప్పులేదయ్య ! మీ
  పశ్చాత్తాపము వీడి , పుణ్యమునకై పాపక్రియల్ సల్పుమా !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 2. నిశ్చయ సంకల్ప ము తో
  దుశ్చర్యలు చేయు వారు దురితాత్ములు గా
  ఆశ్చర్య oబిది యగునే
  పశ్చాత్తాప ము విడి సలుపoదగు న ఘ ము ల్ల్
  కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
 3. దుశ్చారిత్రుం డొకరుడు
  నిశ్చయముగ దెల్పెనిట్లు నిజమిత్రునకున్
  పశ్చిమదేశంబందున
  పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్.

  రిప్లయితొలగించండి
 4. రిప్లయిలు
  1. "పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియల్ సల్పుమా !"

   నిశ్చేష్టుండన నైతి నిట్లనగ నే నీతిం బ్రబోధించెనో?

   నిశ్చేయమ్మిది రాక్షసక్రియ వలెన్ నేరమ్ము కాదెట్టులన్ ?

   పశ్చాత్తాపము పాపహారకమనన్ భావింతు రేపట్టునన్ ?
   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
  2. రామాచార్య గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 5. శ్రీ హరి కొరకై వెదికే హిరణ్యకశిపుడు తన భటులకీవిధంగా ఆదేశించాడని యూహించిన పద్యం

  నిశ్చింతగ చేయుడికను
  దుశ్చర్యల హద్దుమీరి, ధూమాంకుడు తా
  నిశ్చయముగ వచ్చునిలకు
  పశ్చాత్తాపము విడి సలుపందగు నఘముల్.

  రిప్లయితొలగించండి
 6. ఆశ్చర్యము గొలుపును గద!
  దుశ్చర్యల జేయుచుండు ధూర్తుల గనినన్
  నిశ్చయముగ దలతు రిటుల
  "పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్."

  రిప్లయితొలగించండి
 7. ఆశ్చర్య మ్మేమున్నది ?
  నిశ్చింతగ జేయవచ్చు నేరము లెన్నో!
  దుశ్చరితుల పాలనలో!
  పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్ !

  రిప్లయితొలగించండి
 8. ఆశ్చర్యంబది యేటికి?
  నిశ్చయముగ శుక్రనీతి నేమము గొనుచున్
  నిశ్చింతగ బొంకదగును
  పశ్చాత్తాపము విడి, సలుపందగు నఘముల్!

  రిప్లయితొలగించండి
 9. పశ్చిమ దేశము లందున
  పశ్చాత్తాపము విడి , సలుపం దగు నఘముల్
  నిశ్చయముగ దెలియ కనే
  నిశ్చింత గమెలగు చుంద్రు నీమము లేకన్

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా సత్యనారాయణ
  నిశ్చరతి మనః కృష్ణా!
  దుశ్చర్య సమస్య నిడిన దోర్బల యుక్తిన్
  దుశ్చర్యల సఫలత గన
  పశ్చాత్తాపము విడి సలుపందగు నఘముల్
  (దుష్కర ప్రాసల సమస్యా పూరణల యెడ ననుసరించ వలసిన వ్యూహమును గూర్చిన విదురనీతిని ఒక అవధాని ప్రారంభకునికి యిచ్చుట-- ఉచిత సలహా.)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. డా.పిట్టా సత్యనారాయణ
   ఆర్యా,
   ఆశ్చర్యమును తీసుకున్న కవులు కందం హ్రస్వంతో సమస్యఉంటే దీర్ఘాక్షరం తో ఆరంభించినట్లవలేదా?సందేహ నివృత్తి చేయగలరు, ధన్యవాదములు.

   తొలగించండి
 11. ఆశ్చర్యమొంద నుదయమె
  పశ్చిమదిక్కున కపిలుడు ప్రభవించంగన్
  నిశ్చయముగ నావేళల
  పశ్చాత్తాపము విడి సలుపందగు నఘముల్

  రిప్లయితొలగించండి
 12. (ప్రజలకు నాస్తికుడైన చార్వాకుని బోధన )
  నిశ్చయమిది వినుడు జనులు !
  నిశ్చింతగ మీపనులను నిండుగ జేయన్
  దుశ్చర్యలు కానేరవు ;
  పశ్చాత్తాపము విడి సలుపందగు నఘముల్ .

  రిప్లయితొలగించండి
 13. దుశ్చర్యంబన బోకు పార్థ !వినుమా ! దున్మాడుటే యొప్పగున్

  నిశ్చింత్యమ్మగు నిట్టి ధర్మవిధిలో నేరమ్ము గాదెవ్విధిన్

  నిశ్చేయమ్మని పాపకర్మరతులన్ నిర్జీవులం జేయ నీ

  పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియల్ సల్పుమా !.
  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 14. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో:

  నిశ్చయ మిది హరి యరి యౌ
  నాశ్చర్యము వలదు పుత్ర హరి యనకుము ప్రా
  యశ్చిత్తముగా నీ విక
  పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్.

  రిప్లయితొలగించండి
 15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2766
  సమస్య :: పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియన్ సల్పుమా.
  పశ్చాత్తాపాన్ని వదలిపెట్టి పుణ్యం సంపాదించుకోవడం కోసం పాపపు పనులు చేయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: రావణాసురుడు మారీచుని సమీపించి ఓరీ! రాముని భార్య యైన సీతను అపహరించే విషయంలో నీవు మాయలేడిగా మారి నాకు సహాయపడు. లేకుంటే నిన్ను చంపేస్తాను అని అన్నాడు. అలా శ్రీరాముని మోసం చేయడం పాపం చేయడం ఇష్టం లేని మారీచుడు ఏమి చేయాలి అని విచారిస్తూ ఉండి నిద్ర పోయాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో మారీచుని ఆత్మ ‘’ ఓరీ! నీవు మాయలేడిగా మారకుంటే రావణుడు చంపుతాడు. మాయలేడిగా మారితే శ్రీ రాముడు చంపుతాడు. రావణుని చేతిలో కంటే శ్రీ రాముని చేతిలో మరణిస్తే పుణ్యము మోక్షము దక్కుతాయి. కాబట్టి అటువంటి పుణ్యం పొందడం కోసం పాపపు పని చేయడానికి సిద్ధపడు’’ అని బోధించినట్లు ఊహించి చెప్పే సందర్భం.

  పశ్చాత్తాపము గూర్చు పాప మనుచున్ భావించు మారీచుడే
  యాశ్చర్యమ్మున స్వప్న మందు వినె తా నాత్మప్రబోధ మ్మిటుల్
  ‘’దుశ్చర్యున్ నిను జంపు దాశరథి సంతోషమ్ము పుణ్యమ్మగున్
  పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియన్ సల్పుమా’’.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (18-8-2017)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అద్భుతమైన సన్నివేశాన్ని మరింత అద్భుతంగా పొదిగేరు పద్యంలో. నమస్సులు.

   తొలగించండి
  2. సహృదయులు
   శ్రీ మిస్సన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

   తొలగించండి
  3. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  4. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి ప్రణామాలు.

   తొలగించండి
 16. బహు చక్కని పూరణ! అభినందనలు అవధానిగారూ!💐💐💐

  రిప్లయితొలగించండి
 17. ఒక బోయవాడు పక్షులను పట్టి చంపుట పాపమని చెప్ప అతని తండ్రి అతనికి కర్తవ్యమును తెలిపినను భావన  నిశ్చలమున జరుగుబడి న
  భశ్చరముల గని చిదుముట, బాధ పడకుమా,
  నిశ్చయముగ నీ విధి యిది,
  పశ్చాత్తాపము విడి సలుపం దగు, నఘముల్"

  రిప్లయితొలగించండి
 18. 18. 08.2018, శనివారం
  సమస్య - *2766*
  *"పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్"*
  (లేదా...)
  *"పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియల్ సల్పుమా"*

  ఆశ్చర్యంబది యేలా
  దుశ్చర్యలు జేయుచున్న ధూర్తుల నిలుపన్
  నిశ్చయమిది చేసికొనుచు
  *"పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్"*

  రిప్లయితొలగించండి
 19. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  "పశ్చాత్తాపము విడి సలుపం దగు
  నఘముల్"

  సందర్భము: అంతవరకు తమతో కలిసియుండి దుష్కృత్యాలలో పాలు పంచుకొన్న మిత్రు డెవడైనా పశ్చాత్తాపపడి ఆ పనులు మానివేసినట్లైతే తక్కిన వారి కది నచ్చదు. (తమ గుట్టు ర ట్టవుతుం దేమో నని భయం కూడ.)
  అందు కని వాని దగ్గర చేరి ఇలా అంటున్నారు.
  "అసలు నిన్ను పశ్చాత్తాపపడ మన్న వా డెవడు? అది విడిచిపెడితే మళ్ళీ మనం చేసే పనులు మామూలుగా చెయ్యవచ్చు గదా!
  (నీ విప్పుడు మంచివాడిలా మారినా ని న్నెవరూ నమ్మరు సుమా! తొలుతటి కోణంనుంచే చూడటం అలవా టయింది జనాలకు)"
  ==============================
  పశ్చాత్తాపంబునఁ దా

  నిశ్చింతగ నుండు మిత్రునిం జేరి సదా

  దుశ్చరితు లిట్టు లందురు..

  "పశ్చాత్తాపము విడి సలుపం
  దగు నఘముల్"

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  18-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి


 20. వృశ్చికము కుట్టిన నరుడ,
  పశ్చాత్తాపము విడి సలుపందగు నఘముల్
  నిశ్చయముగ దానిని నకు
  తశ్చన దగ్గిరకు నంప తటపట వలదోయ్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి


 21. గోల్ గోల్ జిలేబి :)  పశ్చాత్తాపము నిన్ను శృంఖలముతో బందీని చేయంగ నా
  పశ్చాత్తాపము నీకు కానిది సుమా ! ప్రాణమ్ము లేపోవగా
  పశ్చాత్తాపమదేమి తిన్నదనమో ? బాధింప నిన్ మానవా
  పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియల్ సల్పుమా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. ఆశ్చర్యమాయెయీయది
  పశ్చాత్తాపమువిడిసలుపందగునఘముల్
  దుశ్చర్యలుసేయంగను
  నిశ్చయముగబ్రోత్సహించనేరముగాదే

  రిప్లయితొలగించండి


 23. వచ్చే వారపు ఆకాశ వాణి సమస్య :)-

  మాటకు నిలబడనివాడె మాన్యుడు జగతిన్

  తూటాలను దూయంగను
  మాటకు నిలబడని వాడె, మాన్యుడు జగతిన్ ,
  దీటుగ నిలబడు గాంధీ
  బాటన సత్యాగ్రహమను పధ్ధతి తనదై !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 24. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  =======================
  పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై
  పాప క్రియల్ సల్పుమా
  =======================
  అయ్యో! పాపపు పనులకు పాల్పడు
  చున్నానే యన్న పశ్చాత్తాపమును
  వీడి యధేచ్ఛగా ఎలాంటి జంకూ
  గొంకూ లేకయే పాప కార్యములకు
  పాల్పడమని ప్రభోదించుటలో గల
  అసంబద్దతే ఇచట సమస్య
  =========================
  సమస్యా పూరణము - 235
  ====================

  సతి సుతులుగా కథల నుతులు
  కూర్చవు నీకవి ఉత్తమ గతులు
  సుడులై తిరిగెను మనుషుల మతులు
  తనువును కాల్చే ప్రేమ చితులు
  బంధముల్ ద్రెంచితిననెడు
  పశ్చాత్తాపమును వీడి పుణ్యమునకై
  పాపక్రియల్ సల్పు మార్గమొదిలి
  నిలువు ముక్తి తరుణముకై

  ====##$##====

  నా భార్య,నా కొడుకులన్న గొప్పల సుద్దులు
  నీకెలాంటి ఉత్తమ గతులను సమకూర్చగ
  లేవు. నేను నా వారలను పెనవేసుకున్న
  మమతలు సుడులై తిరుగుతు శరీరములను
  చివరికి ప్రేమ చితులలో కాల్చివేయును.

  సాంసారిక బంధములను త్రెంచినానన్న
  పశ్చాత్థాపమును వీడి పుణ్యమునకై పాప
  కార్యముల మార్గమునొదిలి ముక్తికై నిరీక్షించ
  మని భావము.

  ( మాత్రా గణనము - అంత్యప్రాస )
  ----- ఇట్టె రమేష్
  ( శుభోదయం )

  రిప్లయితొలగించండి

 25. విన్నకోట వారి న్యూసు 108 ఇక మీదట లిమిటెడ్ సర్వీస్ :)


  నిశ్చయముగ చెప్పండి న
  భశ్చక్షువుని సమయమ్ము వరకే డ్యూటీ
  పశ్చాత్తు యాంబులెన్స్ నో!
  పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. “వరూధిని” బ్లాగ్ లో పెట్టవలసిన వ్యాఖ్య మీరు ఇక్కడ పెట్టినట్లున్నారు. పారలాక్స్ అయ్యుంటుంది 😀 (jk 🙂).

   రెండో సంగతి - ఇది “విన్నకోట వారి న్యూసు” కాదండి, ఇది ysrcp వారి న్యూస్. అందువల్ల నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి ☝️.

   తొలగించండి
 26. తల్లినిఁ జంప మన్న తండ్రి తపశ్శక్తిఁ దలఁచి పరశురాముఁడు మనస్సు లో నూహించు సందర్భము:

  కశ్చి దకార్యము జనకుఁడు
  నిశ్చయముగ నుడువిన జప నిరతుం డలుకన్
  నిశ్చింతఁ జేయఁ దగుఁ బడి
  పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్

  [విడి = ఒంటరి]


  నిశ్చింతన్ మన నెంచు దేని వడి వీనిన్ మాను దుశ్చర్యముల్
  గిశ్చర్యమ్ముల నింక నైనను గృతాకృత్యాలికిం జెందుమా
  పశ్చాత్తాపము, వీడి పుణ్యమునకై పాపక్రియల్, సల్పుమా
  యాశ్చర్యమ్మును బొంద నెల్లరును నిత్యం బీవు సత్కార్యముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
   సమస్యాపూరణ కార్యక్రమంలో...
   25/08/2018 రోజు ప్రసారం కాబోయె సమస్య:

   మాటకు నిలబడని వాడె మాన్యుడు జగతిన్

   నా పూరణ :
   ------ --- --
   కం:

   కోటీశ్వరుడైనను సరి

   బూటకములు జేయువాడె, మూర్ఖుండగుచున్

   చేటు నొనరించు వాడును,

   మాటకు నిలబడని వాడె మాన్యుడు జగతిన్!


   ~ఆకుల శాంతి భూషణ్

   వనపర్తి

       


   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 27. ఆశ్చర్యంబగు రీతి నక్రమముగా నాస్తుల్ నయించంగ ప్రా
  యశ్చిత్తంబున వేంకటేశుకిడె తాఁ హారిద్ర కోటీరమున్
  పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై, పాపక్రియల్ సల్పు మా
  నిశ్చింతుండగు మంత్రి నీశ్వరుడు తానేనాడు శిక్షింతునో౹౹

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రఘురామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శిక్షించునో' టైపాటు!

   తొలగించండి
 28. పశ్చిమ వాసులగనుచున్
  నిశ్చయముగ బలికె మ్లేచ్చ నేత యొకడు మీ
  దుశ్చర్య లనే భావము ,
  పశ్చాత్తాపము, విడి సలుపం దగు నఘముల్

  రిప్లయితొలగించండి
 29. నిశ్చేష్టుండవు గాకుమోయి సఖుడా నేచెప్పెదన్ మానుమా
  పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియల్ , సల్పుమా
  దుశ్చర్యల్ తమవృత్తిగా చెరగెడిన్ దుష్టాత్ములన్ వీడు, ప్రా
  యశ్చిత్తమ్మది యేను లోకులను బాహాటమ్ముఁ సేవింపుమా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొంత అన్వయదోషం కనిపిస్తున్నది.

   తొలగించండి
 30. "నిశ్చయ బాల్యవివాహాము
  పశ్చాత్తాపము" విడిసలుపందగు "
  నఘముల్
  నాశ్చర్యమేమి పెద్దల
  దుశ్చరితము బాల్యమందు దోషముగాదా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొంత అన్వయదోషమున్నట్లున్నది.

   తొలగించండి
 31. డా.పిట్టా సత్యనారాయణ
  ఆశ్చర్యంబును జెందనేల నెరుగన్నత్యంత దుర్భేద్యమౌ
  పాశ్చాత్యంబన బ్రహ్మమే దినగ వే పానాదులందేలగ
  న్నిశ్చింతన్గడపంగ జీవనమున్ నిర్వేద భావంబునన్
  పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియల్ సల్పుమా!
  (వేష భాషలలో పాశ్చాత్య ధోరణితో సగం మునుగా జీవ న విధానంలో మారక పోవడమేమిటి.నిండుగా మునిగి పోయే దశ లో మనమున్నాము.)

  రిప్లయితొలగించండి
 32. ఆశ్చర్యము! ధర్మజునిది

  నిశ్చల తత్త్వమ్ము గూడ నివ్వెర వోయన్..
  .
  నిశ్చయముగ యుద్ధమునను

  పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్

  రిప్లయితొలగించండి
 33. నిశ్చయ్యమ్ముగ దాగి యుండి దునుమా నింపార బాణమ్ముతో

  నిశ్చయ్యమ్ముగ డప్పుగొట్టి దునుమా నింపార బొంకాడుచున్

  నిశ్చయ్యమ్ముగ రేఖ దాటి దునుమా నింపార పాకీయులన్

  పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియల్ సల్పుమా :)

  రిప్లయితొలగించండి
 34. ఆశ్చర్యమ్మభినందనుండు మిగుతో హంగామ జేసెన్ గదా
  కశ్చిన్ మాత్రము సిగ్గువీడి గునిసెన్ కాంగ్రేసు చిద్దంబరం
  నిశ్చయ్యంబుగ మోడి! త్రోయు మితనిన్ నింపార తీహారునన్
  పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియల్ సల్పుమా!

  రిప్లయితొలగించండి