11, ఆగస్టు 2018, శనివారం

సమస్య - 2759 (ఒక్కఁడె పాంచాలికి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఒక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్"
(లేదా...)
"ఒక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్"

60 కామెంట్‌లు:

 1. ఒక్కండె మత్స్య యంత్రము
  బెక్కురు గాంచంగ గొట్టి బెండ్లాడిన యా
  చక్కని రూపసి యగ నరు
  డొక్కడె పాంచాలికి మగడూహింపంగన్

  రిప్లయితొలగించండి
 2. మైలవరపు వారి పూరణ

  ఎక్కటి జోదు , చేప గమనించి తటాలున కొట్టినట్టివా....
  డొక్కడె భర్త ద్రౌపదికి., నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్
  ప్రక్కనె చేరి ముద్దుమురిపాలను బంచునదాగ్రహమ్మునన్
  చుక్కలు చూపునట్టి గుణసుందరికెవ్వరు సత్యభామయే !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 3. అక్కజపు బలుడు విజయుం
  డొక్కడె పాంచాలికి మగ? డూహింపంగన్
  నెక్కటి సత్వుడు ధర్ముడు,
  మిక్కిలి జోదగు వలలుడు,మించిన కవలున్.

  రిప్లయితొలగించండి
 4. క: నిక్కముగ పాండు రాజుకు
  చక్కని రూపములతోడ శతధృతి కలిగెన్
  చిక్కెను శచి ద్రౌపదియై
  ఒక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్

  రిప్లయితొలగించండి

 5. నలాయుని కుమార్తె ఇంద్రసేన మౌద్గల్యుని భార్యగా, కోరినది.
  కాశీరాజు కుమార్తె గా పశుపతి ని వేడ పతి పతి అని నైదు మార్లు కోరినది.
  మ్రొక్కెను మౌద్గల్యుని తా
  మ్రొక్కెను పశుపతిని కామ మోహము తనరన్
  దక్కిరి నైదుగురైనను
  నొక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. పెక్కురు బహుళ బలాఢ్యులు
  లెక్కకు నైదుగురు గలరు లిఖియించినచో
  నెక్కడ నైనను సత్యం
  బొక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్?

  రిప్లయితొలగించండి


 7. మ్రొక్కెను కవ్యవాహనుని మోహము తీరగ పంచ నాధులన్
  మ్రొక్కిరి ద్రష్ట లెల్లరును మోదము తోడుగ స్వామి సేవకై
  మ్రొక్కులు తీర కర్మ ఫల మొప్పగ దక్కగ జన్మ శేషమై,
  ఒక్కఁడె భర్త ద్రౌపదికి, నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. నిక్కము దెలియక జగతిని
  మక్కువగా పెండ్లి యాడె మానిని యనగన్
  లెక్కకు శివనా మములట
  ఒక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్

  శివుడే ఐదు రూపాలుగా వివాహా మాడినట్లు ఎక్కడొ చదివిన గుర్తు

  రిప్లయితొలగించండి
 9. నిక్కమిది గద సజాతుం
  డొక్కడె పాంచాలికి, మగఁడూ హింపంగన్"
  చక్కని సీతకు రాముం
  డొక్కడె యని బల్క వచ్చు నుర్వర పైనన్

  రిప్లయితొలగించండి
 10. నిక్కపు సాహస వీరుడు
  పెక్కు రు సాధింప లేని విజయము పొంద న్
  చక్కగ నెం చ గ నర్జును
  డొక్క డె పాంచాలి కి మగడూ హిం ప గన్
  _____కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
 11. మిక్కిలి భర్తలున్, సతులు మేదినినెవ్వరికున్ననేమగున్
  ప్రక్కననేక్షణమ్మెవరు వంతుగ నుందురొ వారెయౌగదా
  నిక్కము భర్తయో సతియొ నిష్ఠురమేలర యిట్లు జూడగా
  "ఒక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్

  రిప్లయితొలగించండి
 12. పెక్కురు జూచుచుండ నొక విప్రుని వేషముఁ మత్స్యయంత్రమున్
  మక్కువ తోడ గొట్టి కడు మాన్యుడు కుంతికనిష్ఠుడౌ నరుం
  డొక్కడె భర్త ద్రౌపదికి, నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్
  మిక్కిలి భక్తినే కలిగి మెండుగ గొల్చెడు రుక్మిణే గనన్

  రిప్లయితొలగించండి
 13. వ్రక్కలు జేసి చాపమును పార్థుడె గెల్వ స్వయంవరమ్మునం ,

  దెక్కటికయ్యమందున జయించి వరించగ చక్రి రుక్మిణిన్,

  నిక్కువమేగదా! యరయ నేర్పున గెల్చిన రీతి నొప్పగా,

  నొక్కడె భర్త ద్రౌపదికి నొక్కతె బెండ్లము కృష్ణమూర్తికిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీ విరించిగారి సూచనతో

   వ్రక్కలు జేసి మత్స్యమును పార్థుడె గెల్వ స్వయంవరమ్మునం ,

   దెక్కటికయ్యమందున జయించి వరించగ చక్రి రుక్మిణిన్,

   నిక్కువమేగదా! యరయ నేర్పున గెల్చిన నొప్పు రీతి లో,

   నొక్కడె భర్త ద్రౌపదికి నొక్కతె బెండ్లము కృష్ణమూర్తికిన్.

   తొలగించండి
 14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2759
  సమస్య :: ఒక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్.
  సందర్భం :: పూర్వగాథాలహరిని అనుసరించి ఇంద్రుని అంశలే పంచపాండవులు. కాబట్టి ద్రౌపదికి భర్త ఒకడే. అతడే ఇంద్రుడు అని చెప్పవచ్చు.
  రాఘవత్వేఽభవత్ సీతా రుక్మిణీ కృష్ణజన్మని।
  అన్యేషు చావతారేషు విష్ణోరేషానపాయినీ।। అనే శ్లోకం సుప్రసిద్ధం. కాబట్టి ఎన్నడూ వదలిపెట్టకుండా తోడుగా నీడగా లక్ష్మిగా ఉన్న రుక్మిణి ఒక్కటే శ్రీ కృష్ణునికి (జన్మజన్మల అనుబంధంగా ఉన్న) భార్య అవుతుంది అని విశదీకరించే సందర్భం.

  చక్కని పూర్వగాథ లివి, శక్రుని యంశలె పంచపాండవుల్
  నిక్కము భర్తలై రిలను నిశ్చిత మిద్దియె, పాకశాసనుం
  ‘’డొక్కఁడె భర్త ద్రౌపదికి; నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్’’
  దక్కెను లక్ష్మి రుక్మిణిగ నాథుని వీడదు జన్మజన్మలన్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (11-8-2018)

  రిప్లయితొలగించండి
 15. మిక్కుటమగు కామమునను
  ముక్కంటిని వేడగాను ముద్దుగ పతియన్
  మక్కువ నైదుగురైనను
  నొక్కడె పాంచాలికి మగడూహింపంగన్

  రిప్లయితొలగించండి
 16. తక్కొరు మ్రాన్పడి పోగా
  నొక్కతెయై ద్రోవది సభ నొంటరి కాగా
  ప్రక్కన నిలబడె భీముం
  *డొక్కడె పాంచాలికి మగడూహింపన్
  ****)()(****
  (మిగిలిన నలుగురు భర్తలు నిశ్చేష్టులు కాగా భీముడొక్కడె ఆమె వాదనకు,వేదనకు అండగా నిలిచాడని భావం)

  రిప్లయితొలగించండి
 17. చక్కదనమ్ముల ద్రోవది
  చిక్కినదని కీచకుండు చెఱబట్టంగన్
  జక్కగ గాచెం భీముం
  డొక్కడె పాంచాలికి మగడూహింపంగన్
  ***)()(***
  (మానము గాపాడు వాడె మగడౌను కదా!)

  రిప్లయితొలగించండి

 18. ఆకాశ వాణి వచ్చే వారం సమస్య

  రెక్కలు రాని పక్షి యెగిరెన్ విను వీధిని రివ్వు రివ్వనన్  లెక్కలు పోలె ఛందమును లెస్సగ శంకరు కొల్వు లోన నెం
  చక్కగ వ్రాసి పద్యముల సాధన జేయుచు కైపదమ్ములన్
  మక్కువ తోడు గాంచి పలు మార్లటు పంపుచు రేడియోలకున్
  రెక్కలు రాని పక్షి యెగిరెన్ విను వీధిని రివ్వు రివ్వనన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వహ్వా! వహ్వా!! సహీ బోలా జిలేబీజీ!!

   చాల పక్షులకు యిక్కడ రెక్కలు వచ్చాయి!!
   🦋🦋🦋🦋🧚‍♀️🧚‍♀️🧚‍♀️🧚‍♀️

   తొలగించండి
  2. జిలేబీ:

   చక్కని శంకరాభరణ ఛాత్రుని వేషము దాల్చి నేర్చుచున్
   మిక్కిలి పద్యముల్ ముదము మీరగ కేళిగ వ్రాసి పోరుచున్
   గ్రక్కున గూటినిన్ విడిచి ఘాటుగ కూయుచు కావుకావనిన్
   రెక్కలు రాని పక్షి యెగిరెన్ విను వీధిని రివ్వు రివ్వనన్ :)

   తొలగించండి
 19. మిత్రులందఱకు నమస్సులు!

  మిక్కుటమౌ తమిన్ బతిని మెప్పుగ నిమ్మని కోరి యీశునిన్
  జక్కఁగ నైదుమార్లు తఱచంగను, నీయఁగ, నింద్రపంచకం
  బొక్కఁడె భర్త ద్రౌపదికి! నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్
  మక్కువ లక్ష్మియే యగుచు మన్నన లందెను జన్మజన్మలన్!!

  రిప్లయితొలగించండి
 20. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  =========================
  ఒక్కడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము
  కృష్ణమూర్తికిన్
  ==========================
  ఐదుగురు భర్తలతో పాంచాలిగా పిలవ
  బడే ద్రౌపదికి ఒక్కడే భర్త కలడనియు
  అష్టభార్యలతో అలరారే కృష్ణుడికి
  ఒక్కతే భార్య కలదనియు చెప్పడంలో
  అసంబద్దతె ఇక్కడ సమస్య
  ==========================
  సమస్యా పూరణము - 223
  ===================

  పాలియాండ్రిగా సతులకు పతులు
  అనేకులై ఆలికి చెందినను
  పాలిగమిగ సతుల నెందరినో
  పతులు తమ భాగ్యమున పొందినను
  మనసును తానై దోచెడు
  యెదలో తనను దాచెడు ప్రేమనెంచగన్
  ఒక్కడె భర్త ద్రౌపదికి
  నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్

  ====##$##====

  పాలియాండ్రిగా(polyandry) ( బహు -
  భర్తృత్వం)ద్రౌపదికి ఐదుగురు పతులున్నను
  పాలిగమి (polygamy)(బహు భార్యత్వం)
  గా కృష్ణుడికి ఎనమండుగురు భార్యలున్నను
  మనసును దోచుకొని, యెదలో దాచుకుని
  ప్రేమలు కురిపించు విషయమై చూసిన
  ద్రౌపదికి పార్థుడు,కృష్ణుడికి రుక్మిణి వారొక్కరే
  కదాయని భావము

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం )

  రిప్లయితొలగించండి


 21. ఒక్కడె పూరుషుండు పరమోన్నతుడారయ గృష్ణతత్త్వమున్
  దక్కినదంతకల్పితము తత్పరమాత్మయె సృష్టికర్తగా
  నొక్కడెభర్తలోకమునకూహలసృష్టిసతీత్వమాస్థితిన్
  నొక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్.. కోట శర్మ

  రిప్లయితొలగించండి
 22. దేవిక
  ------
  (అర్జునుడు సంతానగోపాలుడనే బ్రాహ్మణ బాలుణ్ణి రక్షిం చడానికై ఆయుధాగారానికి వెళ్ళి ధర్మరాజు,ద్రౌపదిలను చూసి వ్రత భంగమైనది కనుక తీర్థయాత్రలకు వెళతాడు).

  లెక్కను సేయక నీమము
  నక్కరకై లోనికి జనె నర్జును ; డత్తరి
  మక్కువ మీరగ ధర్మజు
  డొక్కడె పాంచాలికి మగడూహింపంగన్ !

  రిప్లయితొలగించండి
 23. ఒక్కడెరూపములైదుగ
  లెక్కకుమఱి గానబడినలీలలవలనన్
  మక్కువజూపెడుభీముడె
  యొక్కడెపాంచాలికిమగడూహింపంగన్

  రిప్లయితొలగించండి
 24. వ్రక్కలుగాగ మానినికి ప్రాణసమానము మానమా సభన్
  దిక్కులు పిక్కటిల్లగను తీవ్రతరంబగు పూనికల్ గొన
  న్నిక్కము జేయగా ననిని నీచుని యూరువు ద్రుంచివేయగా
  నొక్కడెభర్త ద్రౌపదికి; నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్
  మక్కువ మీరగా సురల మానును బొందిన సత్యభామయే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. (మన్నన బొందిన అనండి బాగుంటుంది )
   సముచితసమర్థనీయసమన్వయపూరణ.

   తొలగించండి
  2. సురలమాను = పారిజాతపు చెట్టు
   పంతము నెగ్గించుకున్న పత్ని అని నా భావన!

   తొలగించండి
 25. నిక్కము!పాండవులేవురు
  చక్కగ మఱి చింతజేసి చర్చింపంగా
  నొక్కటిగా మెలిగిరి కద!
  యొక్కడె పాంచాలికి మగడూహింపంగన్
  ****)()(****
  (వాచార్థమున నేవురైనను కవనార్థమున నొక్కరే కదా యని యర్థము. భావము పొసగునా?)

  రిప్లయితొలగించండి
 26. ద్రుపదునకు వ్యాస భగవానుఁడు పంచేం ద్రోపాఖ్యానము చెప్పి ద్రౌపదినిఁ బంచ పాండవుల కిచ్చి వివాహము సేయు మని చెప్పిన సందర్భము:

  చక్కఁగ హరి హరు నానతి
  పెక్కువ హరి పంచమ మయి పృథ గర్భమునం
  దక్కిన సురాంశఁ బుట్టఁగ
  నొక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్

  [హరి = ఇంద్రుఁడు]


  పాండవు లైదుగు రొక్క యింద్రుఁడే యగుటయు, శ్రీకృష్ణ పరమాత్ముఁ డష్టోత్తర షష్టి సహస్ర కృష్ణులై యొక్కొక్క కృష్ణుఁడు నొక్కొక్క భార్య యొద్ద నారదునకుఁ గనిపించుటయు నయిన పరమార్థము నుదహరించుట:


  పిక్కటిలంగ స్వార్థము వివేక విహీను లధర్మ మార్గముల్
  త్రొక్కుచు నుండ నెంత మది రోసిన నేరరు విష్ణు మాయ లోఁ
  జిక్కిన మోహ మానసులు సెప్పిన నీ పరమార్థ తత్త్వమే
  యొక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్

  రిప్లయితొలగించండి
 27. సమస్య :-
  "ఒక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్"

  *కందం**

  మక్కువ జూపుచు ద్రుపదుడు
  చక్కగ పెంచిన తనయకు సామర్థ్యముగల
  చక్కని యల్లుని ధరలో
  ఒక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్
  ...................✍చక్రి

  రిప్లయితొలగించండి
 28. ఒక్కడెభర్తద్రౌపదికినొక్కతెపెండ్లముకృష్ణమూర్తికి
  న్నక్కట యేమిమీపలుకునారయద్రౌపది,కృష్ణమూర్తికి
  న్నొక్కరుకాకనుండిరినైదుగురున్బదునారుమందిల
  న్జక్కనిచుక్కలున్నరయచక్కనివీరులువారలందఱున్

  రిప్లయితొలగించండి
 29. ప్రక్కన రాజులుగాంచగ
  నక్కడ గురిబెట్టి మత్స్యయంత్రముగొట్టన్
  నిక్కము గమనించంగా
  ఒక్కడె పాంచాలికి మగడూహించంగన్ (స్వయంవరమున)

  రిప్లయితొలగించండి


 30. లెక్కల చూడగ తమ్ముం
  డొక్కఁడె పాంచాలికి, మగఁ డూహింపంగన్
  లెక్కగ యొకండు పార్థుడు
  తక్కిన వారలు మగండ్లు తల్లి పనుపుగన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 31. ఎక్కిడి విల్లు నీట గని యేసెను నింగిని చేప నింతికై
  గ్రక్కున పాండవుం డెవడు? కార్ముక మెక్కిడి శౌరి మత్స్యమున్
  గ్రక్కున వేయ నీట గని రాలగ చిక్కిన లక్ష ణెవ్వరో ?
  ఒక్కఁడె - భర్త ద్రౌపదికి, నొక్కతె - పెండ్లము కృష్ణమూర్తికిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్షణ యెవ్వరో యని యనవలసి యుండును మిస్సన్న గారు.

   తొలగించండి
  2. పెద్దలు కామేశ్వరరావు గారికి నమస్కారములు. మీ సూచన మేరకు సవరించడానికి ప్రయత్నిస్తాను.

   తొలగించండి
  3. శ్రీయుతులు కామేశ్వరరావు గారి సూచన మేరకు సవరించిన పద్యం:

   ఎక్కిడి విల్లు నీట గని యేసెను నింగిని చేప నింతికై
   గ్రక్కున పాండవుం డెవడు? కానుచు నీటను నింగి మత్స్యమున్
   వ్రక్కలు చేయ గోల జెయి బట్టిన దెవ్వరు లక్షణాఖ్య యౌ?
   ఒక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్.

   తొలగించండి
 32. తిక్కలవాడు భారతము , దేవత లెల్లరు మెచ్చినట్టి యా
  చక్కని భవ్య దివ్య గుణ సారము గల్గిన గీత గ్రంథమున్
  నిక్కము జన్మలో జదువ నేరని వారలు పల్కుమాటలే
  ఒక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్"

  రిప్లయితొలగించండి
 33. ఒక్కెడ బాఠశాల తగు నుత్తమ ఛాత్రుని జేయ నెంపికన్
  జిక్కున బెట్టు వ్యూహమున చిత్రసమస్యను గూర్చి రీగతిన్
  చక్కని వాదమున్ వినుచు సంగ్రహరీతిని క్రింది వ్యాఖ్య పై
  "ఒక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్".

  రిప్లయితొలగించండి
 34. ఒక్కొక వత్సరమందున
  నొక్కొక పురుషుని మనసున, నొంజలులందున్
  నిక్కముగా పతిగ తలచ
  నొక్కడె పాంచాలికి మదడూహింపంగన్

  ఒంజలి=పని, చర్య

  రిప్లయితొలగించండి

 35. ఇవ్వాళ కంది వారు సెలవా ?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 36. ఒక్కొక భూతము యొక్కరు
  ఒక్కటి గావెలిగినారుఓటమినెదురన్,
  చక్కని సామ్యముదలచగ
  నొక్కడె పాంచాలికి మగ డూహింపంగన్
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 37. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  "ఒక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్"

  సందర్భము: దుశ్శాసనుడు తన తల వెంట్రుకలు పట్టి కౌరవ సభ కీడ్చి తెచ్చి నప్పటినుండి ద్రౌపది వెంట్రుకలు ముడి వేయలేదు (దుశ్శాసన అపకృష్టయై.. వికీర్ణ కేశ...యైనది..అని భారతం.)
  భీముడు దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగుతా నని రక్త సిక్తములైన చేతులతో ద్రౌపది కేశములను ముడివేస్తా నని ప్రతిజ్ఞ చేసిన విషయం జగద్విదితమే!
  అలా చేయడానికి సమర్థుడు భీము డొక్కడే భర్త ద్రౌపదికి..
  చక్కడచు=చంపు; సత్య=ద్రౌపది
  ==============================
  మిక్కిలి విక్రమ మొప్పగ
  చక్కడచెను దుస్ససేను.. సత్య సిగ ముడిన్
  జక్కగ వేసెను.. భీముం
  డొక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  11-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 38. లెక్కిడ నైదుగురైనను
  నొక్కడె పాంచాలికిమగడూహింపంగన్
  చక్కగ మత్స్యము కొట్టగ
  దక్కెను ద్రుపదుని కొలువన దారగ నరుకు న్.

  రిప్లయితొలగించండి
 39. పెక్కురు చూచుచునుండగ

  మిక్కిలి చీరల నొసగుచు మీరిన లలితో

  చక్కగ సిగ్గును నిలిపిన

  నొక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్!


  మగడు = శూరుడు (శబ్దరత్నాకరము)

  రిప్లయితొలగించండి
 40. మిక్కిలి చీరలన్ పనిపి మీరిన క్లేశము తీర్చినట్టి వా

  డొక్కఁడె భర్త ద్రౌపదికి;...నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్

  చక్కని ప్రేమపత్రమును చాటుగ బాపని చేతికిచ్చుచున్

  గ్రక్కున జేర్చరో యనుచు కాసుల నిచ్చిన కన్నెయేగదా!

  రిప్లయితొలగించండి
 41. చక్కగ ప్లేటులో డజను చక్కెర కేళులు నుండనేమిరా
  మక్కువ తోడ నోటినహ మాత్రము నొక్కటె నొక్కటేగదా
  కుక్కుచు మెక్కగా గలరు కుల్కుచు స్త్రీలును పుణ్యపూరుషుల్:👇
  "ఒక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్"

  రిప్లయితొలగించండి