13, ఆగస్టు 2018, సోమవారం

సమస్య - 2761 (దాహ మైనప్పుడే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును"
(లేదా...)
"దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్"

64 కామెంట్‌లు:

 1. తప్పకుండ జనులు నీరు ద్రావు చుంద్రు
  దాహ మైనప్పుడే, బావి ద్రవ్వ దగును
  ప్రతిగృహమ్మున విధిగను వారి కోరి
  జలము లేకున్న లేదింక జగతి నిజము.

  రిప్లయితొలగించండి
 2. మైలవరపు వారి పూరణ

  దేహగతానురాగ సుదతీ సుత బంధ నిదాఘ తాప స...
  మ్మోహితులైనవారికి నపూర్వ మహోదయ తోయకూపమై
  దాహము దీర్చు భాగవతధర్మము., దానిఁబఠింప మోక్షపుం...
  దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 3. భావి నెంచుచు పురుషుండు బహుళ గతుల
  నార్జనము చేసి సుఖముల నందవలయు
  “దాహమైనప్పుడే బావి త్రవ్వ దగును”
  సత్య మనువాని కెదురౌను సంకటములు

  రిప్లయితొలగించండి
 4. వంతెనను దాట వలె నది వచ్చి నపుడె
  దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగున
  టంచు పలుకుట సబబు కా దవనిపైన
  ముందు చూపుతో పని సతము సలుపవలె
  నవసరము నెరిగి చరించు డనవరతము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఎందుకో మొదటి పాదం అన్వయం కుదరనట్టున్నది.

   తొలగించండి


 5. గుహ్య మైనద యా బతుకు మన కర్థ
  మసలు కానిది పనిలేక మదిని త్రవ్వి
  పోసి ననుపయో గములేదు! బోధముగన
  దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. గుహ్య మైనదయా బతుకు మన కర్థ
   మసలు కానిది పనిలేక మదిని త్రవ్వి
   పోసిన నుపయోగము లేదు! బోధము‌ గన
   దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును

   జిలేబి

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. త్రాగ మందు రు నీటిని తక్షణం బ
  దాహమైనప్పుడే ; బావి దవ్వదగును
  జనుల కు ప యోగ పడుట కు సాగు కొఱకు
  ధనము వెచ్చించి సహృదయ దాత లెల్ల
  ______కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
 7. వరుణ దేవుడు కరుణించ పంట పండు
  చల్ల గాలియె సోకిన జలద మలరు
  యవ్వ నంబున శోభించు నతివ సొగసు
  దాహ మైనప్పుడే బావి ద్రవ్వ దగును

  రిప్లయితొలగించండి
 8. ఆకలైనప్పుడే తినుడనుట పాడి
  యుక్త వయసున పెండ్లియు రక్తిఁగట్టు
  నార్తి రేకెత్తగా గుడికరుగవలయు
  దాహమైనప్పుడే బావిఁద్రవ్వఁదగును.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   దాహమైనపుడు అప్పటికే త్రవ్విన బావి దగ్గరకు వెళ్ళాలి కాని క్రొత్తగా త్రవ్వడం?

   తొలగించండి
  2. బావి త్రవ్వటం తనకోసం కాదు భావి తరాలవారి దప్పిక పోగొట్టటం కోసం అని నా భావన

   తొలగించండి
 9. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  దాహము వేసినప్పుడె కదా నుయి
  ద్రవ్వగ నొప్పు జ్ఞానికిన్
  =======================
  దాహంగా తోచినప్పుడే దాహమును
  తీర్చుకొనుటకై బావిని త్రవ్వుట యన్నది
  సజ్జనుల , జ్ఞానుల లక్షణమై ఒప్పునని
  చెప్పుటలో గల అసంబద్దమే సమస్య
  ===========================
  సమస్యా పూరణము - 230
  ====================

  మూడొంతుల ప్రాణమై నీరుగ
  తనువున తానై అది పారుగ
  జీవమే తానని మనమెరుగ
  అనాదిగ తను పారెను ఏరుగ
  తృష్ణగ దాహార్తి తెలియును
  దాహము వేసినప్పుడె కదా
  నుయి ద్రవ్వగ నొప్పు జ్ఞానికిన్
  ప్రజా హితమై తోచు సదా

  ====##$##====

  ప్రాణమై తోచు నీరు మన శరీరమున
  మూడొంతులుగా నెలకొని యున్నది.జీవము
  నకు ప్రమాణము నేనేననుచు నదులుగ నీరు
  పారుచున్నది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ
  నీటి విషయంలో దప్పిక యనునది మనిషికి
  కాదనలేని అవసరం, దప్పిక విలువేమిటోనన
  దాహమైనపుడే కదా తెలియును. అట్టి దాహా
  ర్తుల దాహమును తీర్చు సంకల్పముగా బావిని
  త్రవ్వుటకు పూనుకొనుట ప్రజాహిత కార్యంగా
  సజ్జనులకు జ్ఞానులకు ఒప్పును కదాయని
  భావము.

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం )

  రిప్లయితొలగించండి
 10. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2761
  సమస్య :: దాహము వేసి నప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్.
  దాహము వేసినప్పుడే బావిని త్రవ్వుకొంటారు కదా జ్ఞానులు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: ఊహలలో మునిగిపోయే సర్వభూతములకూ ఏది పగలు అవుతుందో అది మునికి రాత్రి అవుతుంది. ఈ దేహం నాది అని భ్రమపడే వారు నిద్రపోయేటప్పుడు సంయమి అంటే ముని మేల్కొని ఉంటాడు.
  ‘’యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ।
  యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః’’ ।। అనే గీతాశ్లోకాన్ని వినియున్నాం కదండీ.
  ఈవిధంగా లోకులరీతి జ్ఞానులరీతి అనేవి పూర్తిగా విరుద్ధంగా ఉంటున్నాయి కాబట్టి లౌకికజ్ఞానం ఉన్నవారు దాహం వేయకముందే బావి త్రవ్వుకోవాలి. జ్ఞానులు దాహం వేసినప్పుడు బావి త్రవ్వుకొనవచ్చు అని భావించి చెప్పే సందర్భం.

  ఊహల మున్గు వారలకు నొప్పు పగల్ నిశయౌను మౌనికిన్,
  దేహులు నిద్రబోవునెడ ధీరత మేల్కొను సంయమీశ్వరుం
  డీహలు మాఱు లోకులకు నెంచగ జ్ఞానికి నిట్లు, గావునన్
  ‘’దాహము వేసి నప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్.’’
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (13-8-2018)

  రిప్లయితొలగించండి


 11. మోహము తీర మానవుడు మోదముతో సులభమ్ము గా విభున్
  సోహము సోహమంచు భళి శోభల కొల్వగ సిద్ధులన్ గనన్
  సాహస మున్గొనున్,నపుడె సాధ్యము మోక్షము సూవె, యెట్లనన్
  దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి

 12. దూర దృష్టియె కలవాడు కోరి యెపుడు
  నదను జూచియు బనులను మొదలు బెట్టు
  తెలివి లేనట్టి మూర్ఖుని దృష్టిలోన
  దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...యెప్పు। డదను...' అనండి.

   తొలగించండి

 13. దాహమైనయపుడె బావి ద్రవ్వగ వలె
  ననుట మంచిపనియవబోదవనియందు
  నటులె యవసరమ్ము నెరిగి ననవరతము
  ముందుజాగ్రత్త చూపంగ ముప్పు తప్పు.

  రెండవ పూరణ

  పెను ప్రమాదములొదవంగ విశ్వమందు
  యాపుటకుసు యత్నించుట యనువు గాదు
  దాహమైనయపుడె బావి ద్రవ్వగ వలెన
  టన్న ఛందాన యౌనండ్రు నరని బుధులు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'విశ్వమందు నాపుటకు...' అనండి. 'నరని బుధులు'...?

   తొలగించండి
 14. దాహమైనప్పుడేబావిద్రవ్వదగును
  నట్లుసేసిననీలోపునసువుబోవు
  గాన ముందుజాగ్రత్తలుగైకొనంగ
  మంచిదెప్పుడుమంచిగమనుటకొఱకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తగును + అట్లు = తగునట్లు' అవుతుంది. అదనంగా నకారాన్ని ప్రయోగించారు.

   తొలగించండి
 15. వాహనమేమిలేక పరివారము తో నడువంగ దారిలో
  దోహదకారియౌనుగద దూరపు యాత్రలఁ జేయువారికిన్
  దాహముఁ దీర్చ బావి - మరి తప్పు కదా యిటులెవ్వరన్ననున్
  *"దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...యిటు లెవ్వ రన్నచో' అనండి.

   తొలగించండి
 16. "సోహము సోహ" మంచు తన శోషితరూపము
  జూచికొంచు ద
  ద్గేహము నుండి వెల్వడుచు ఖేదము లేకయె ;
  చుట్టుముట్టు సం
  దేహములన్ని వీడుచును ; దీప్తవిరాగవివేకవిజ్ఞతా
  దాహము వేసినప్పుడె కదా నుయిద్రవ్వగ నొప్పు జ్ఞానికిన్ .

  రిప్లయితొలగించండి
 17. దాహములెన్నిరీతులొ! విదాహనబాధకజీవనాప్తసం

  దేహపిశాచభీగ్రసితతీవ్రరుజానలగాఢతప్తముల్,

  శ్రీహరిభక్తికూపజలసేవనతోనఁ దొలంగు , నిట్టిదౌ

  దాహము వేసినప్పుడె గదా!, నుయి ద్రవ్వగ నొప్పు జ్ఞానికిన్.  రిప్లయితొలగించండి
 18. జలము నభిలషింతురుగదా జనులు తాము
  దాహమైనప్పుడే; నూయి ద్రవ్వదగును
  గ్రామమందున ముందుగా ఖాయముగను
  ప్రజల దాహంబు దీర్చగ ప్రజ్ఞగలిగి

  రిప్లయితొలగించండి
 19. స్వాదు జల పూరితమ్మగు స్థలము నెంచి
  కష్ట మని విడువకయు సకల జన హిత
  తత్పరతయు నుండఁగఁ బట్టుదలయుఁ గార్య
  దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును


  మోహ మదారి సంయుతము మూరిన మత్సర కామ లోభ సం
  దోహము మూట గట్టి యతి దుష్కర మైనను బాఁతిఁబెట్ట సం
  దేహ నికాయ మంతయును దీర్చు కొనంగను జిత్త మందునన్
  దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 20. కోట్లడబ్బులు లాటరీకూడిరాగ
  ఓట్లు వేయగ మంత్రియై!"నోట్లచేత
  దాహమైనప్పుడే బావి ద్రవ్వదగును
  అన్నసూత్రంబు మైకున విన్నవించె
  కలలసామ్రాజ్య మేలెడిమలినమనసు!"

  రిప్లయితొలగించండి
 21. మోహము దప్పి వంటి దది మోసము చేయుచు తీరబోనిదై
  దేహిని కామకూపమున దింపును కాదని త్రెంచుకొన్నచో
  మోహపు పాశము న్నతడు ముక్తుడు కామము లుండబో వికన్
  దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
   కాకినాడలో మీకోసం అందరం నిరీక్షించాము!

   తొలగించండి
  2. నేను కూడా బాధ పడ్డాను గురువు గారూ. ఆరోగ్యం సహకరించలేదు. దేనికైనా అదృష్టం ఉండాలి.

   తొలగించండి
 22. పుణ్య మధికము గన్వచ్చు బువ్వ పెట్ట
  నాక లైనప్పుడు,జలము నతిధికివ్వ
  దాహమైనప్పుడే,బావి ద్రవ్వదగును
  సతము నీశాన్య దిక్కున సంతసముగ
  నైరు తిదిశలో గుంటలు నేరమగును

  రిప్లయితొలగించండి
 23. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును

  సందర్భము: "శుక మహర్షి పరీక్షిత్తుతో చెప్పినట్లుగా వైశంపాయనుడు జనమేజయునితో చెప్పినా డీ మాటనే... " అన్నా డొకడు.. కాని నమ్మడానికి లే దీ మాట!
  ఏమాట అనగా "దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును".. అనే మాట!
  ఎందుకంటే... శుకుడు పరీక్షిత్తుతో చెప్పినట్లుగా సూతుడు శౌనకాది మహా మునులకు చెప్పినాడు. అది భాగవతం.
  ఇక భారత మేమో వైశంపాయనుడు జనమేజయునకు చెప్పినది.
  నాతో చెబుతున్న వాని మాటనే కలగా పులగంగా వుంది. ఎలా నమ్మాలి?
  పైగా ఆ మహానుభావులు "దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును" అనే మాట చెప్పా రనీ చెబుతున్నాడు. ఎలా నమ్మమంటారో మీరే చెప్పాలి మరి!!
  ==============================
  ""తొడరి శుకు డా పరీక్షిత్తుతోడ నంత

  "దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును

  రాజ!" యన్నట్టి చొప్పు మీర జనమేజ

  యుండు వినగ వైశంపాయనుండు చెప్పె

  రా!"" యనియె నొకం;డిది నమ్మరాని మాట

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  13-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 24. క్రోవి నీరు బట్టగ నది క్రొత్త వింత
  చేయి ద్రిప్పగ నీరెగా జేద నేల ?
  దాహ మైనప్పుడే బావి ద్రవ్వ దగును
  జూడగ నిది సామెతగనె జూచి నవ్వ

  రిప్లయితొలగించండి
 25. వృద్ధియనుచు నధికముగ వృక్షములను
  కొట్టివేయగ వానలు కురువకుండె
  నీటివనరుల నిలుపగ నేలకు జల
  దాహమైనప్పుడే బావి ద్రవ్వదగును

  రిప్లయితొలగించండి

 26. దాహము దాహమంచు శరతల్పము నందు తపించు తాతకు
  త్సాహముతోడ భూజలము దక్కువిధంబుగనొక్క
  బాణమున్
  సాహసి శ్వేతవాహనుడు క్షౌణిని గొట్టెనదెంచి చూడగా
  దాహము వేసినప్పుడె గదా నుయి ద్రవ్వగ నొప్పు జ్ఞానికిన్

  రిప్లయితొలగించండి
 27. గనుల యందు నిక్షిప్తమౌ ఖనిజమట్లు
  జ్ఞానమన్నది గ్రంథాలలోన యుండు
  భూరి వాంఛగలిగి మానవునకు జ్ఞాన
  దాహమైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును.

  రిప్లయితొలగించండి
 28. ఆ హరి నామమున్ విడక నార్తిగ కేశవు బాదమందు దా
  సోహమటంచు బుణ్యగతి శోధన జేయదలంచుచున్ సదా
  యూహల లోన గొల్చెడు మహోన్నత మూర్తికి జ్ఞానతృష్ణ యౌ
  దాహము వేసినప్పుడె కదా నుయి ద్రవ్వగ నొప్పు జ్ఞానికిన్

  రిప్లయితొలగించండి
 29. సవరణతో

  పెను ప్రమాదములొదవంగ విశ్వమందు
  యాపుటకుసు యత్నించుట యనువు గాదు
  దాహమైనయపుడె బావి ద్రవ్వగ వలెన
  టన్న ఛందాన యౌనండ్రు నవని బుధులు.

  రిప్లయితొలగించండి
 30. ఈహము చేత మానవుడు హేతువు నందక లోకమందునన్
  మోహితుడై సదా మెలగు మూర్తుల వేడుచు శాంతిఁ బొందగన్
  దేహము మీఱి యూహలను దీరిచి దిద్దుచు పారమాత్మికో
  "ద్దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్"

  రిప్లయితొలగించండి
 31. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును

  సందర్భము: దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును... మంచిమాటే సుమా!
  ఆకలైనప్పు డనటం లేదు కదా అయ్యవారు!...
  అన్నాడు నా మిత్రు డొకడు.
  ==============================
  "ఇందులో ననుచిత మన్న దేమి గలదు?
  'దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును'
  మంచి మాటే కదా!" యనె మా సఖుండు..
  "ఆకలైనప్పు డనలేదె యయ్యవారు!"

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  13-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 32. (తెనాలి రామలింగ కవి గంపెడు సంసారం పెరిగి సంతుకు పాలు లేవని రాజు నర్ధించగా, నృపుడును ఆవుతో నొక పిల్లిని గూడా ఇచ్చి పెంచుమనెను.. అసలే పిల్లలకే పాలు లేవంటే ఈ పిల్లికి గూడ పాలు పొయ్యాలి అని బాధతో, వేడిగా కాచిన పాలు పోస్తే, నోరు గాలిన పిల్లి, పాల గిన్నె చూస్తేనే పారిపోయేది...ఇలాంటివెన్నో ఆ కవి చేసాడు.. అయన గుఱ్ఱము పెంచడం గూడా ఒక తమాషా కథ ఉంది...)


  పాలకు లింగడు గోరెను
  పాలకు డావును, బిడాల పాలన జేయన్
  పాలను వేడిగ బోయగ
  పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్"

  రిప్లయితొలగించండి
 33. కప్పి యున్నది మాయతో కలన జలము

  కామ దాహము తెలియదు కందులకును

  మోహము మదము తీరగ మురిసి...జ్ఞాన

  దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును  కలన = జ్ఞానము


  రిప్లయితొలగించండి
 34. దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికి

  న్నాహము నాహమున్ననుచు నమ్ముచు దేహము మట్టిబొమ్మ గా

  కోహము కోహమున్ననుచు కోరిక తీరగ దేవులాడగా

  సోహము సోహమే ననుచు సొంపుగ నింపుగ నర్థమౌనహా!

  రిప్లయితొలగించండి
 35. వాహన వస్తువుల్ విడిచి బ్రహ్మను గ్రోలుచు వీతరాగుడై
  దేహము నాహమంచుచును దీర్ఘ తపస్సున మున్గి తేలగా
  మోహము మీర మేనకమ ముద్దుగ నిచ్చిన చంటిపాపకున్
  దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్ :)

  రిప్లయితొలగించండి