12, ఆగస్టు 2018, ఆదివారం

సమస్య - 2760 (శ్రీకృష్ణునిఁ దిట్టె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శ్రీకృష్ణునిఁ దిట్టె నయొ కుచేలుం డలుకన్"
(లేదా...)
"శ్రీకృష్ణుం గటుభాషణంబులను గర్హించెన్ గుచేలుం డయో"

34 కామెంట్‌లు:

 1. మైలవరపు వారి పూరణ

  మీకా కృష్ణుడు బాల్యమిత్రుడు గదా ! మీ దైన్యమున్ దీర్పలే...
  డా ? కారుణ్యము జూపి ., సంపదలనీయన్ చేతకాదా ! యనన్
  శ్రీకాంతున్ నిరసింప భార్య., మదిలో చింతించి , తా మ్రొక్కుచున్
  శ్రీకృష్ణుం.,గటుభాషణంబులను గర్హించెన్ గుచేలుండయో !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నీకేమో యొకమారు చెప్పగనె దానిన్ నేర్చు నేర్పుండెడిన్ !
   నాకా శక్తియె శూన్యమాటలకు నన్ రమ్మంచు గొంపోవగా
   నీకేమయ్యె ? గురుండు కొట్టెననుచున్ వీపున్ ప్రదర్శించుచున్
   శ్రీకృష్ణుం, గటుభాషణంబులను గర్హించెన్ గుచేలుండయో !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి


 2. మీ కతలకంతు లేదం
  డీ కందివరా ! సమస్య రెప్పము గా త
  ప్పేకద!తెలుపుడు యెప్పుడు
  శ్రీకృష్ణునిఁ దిట్టె నయొ కుచేలుం డలుకన్?

  జిలేబి

  రిప్లయితొలగించండి


 3. ఆ కళ్ళాలు నభూతిని,
  శ్రీకృష్ణునిఁ దిట్టె నయొ, కుచేలుం డలుకన్
  నాకన్నడు మిన్నడనుచు
  సాకతమునకై నటుకుల సంయానమయెన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. పోకిరి యగు శిశుపాలుడు
  శ్రీకృష్ణుని దిట్టెనయొ, కుచేలుండలుకన్
  శ్రీకరుడగుసఖుని, సతియె
  చీకాకున యెత్తిపొడవ చింతిలి మదిలో!!!

  రిప్లయితొలగించండి
 5. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2670
  సమస్య :: శ్రీకృష్ణుం గటు భాషణమ్ములను గర్హించెన్ గుచేలుండయో.
  శ్రీకృష్ణుని కుచేలుడు నిందించాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: శ్రీ కృష్ణ భగవానుని చేష్టలు అన్నీ ఆయన లీలలు అని భక్తుల కందఱికీ తెలిసిన విషయమే. బాల్యంలో ఆటలాడే సమయంలో కృష్ణుడు ఒక మిత్రుని పట్టుకొని లాగినప్పుడు ఆ మిత్రుని చేలములు (వస్త్రములు) పూర్తిగా చినిగిపోయాయి. అందరూ వాడిని కుచేలుడు (చినిగిపోయిన వస్త్రములు కలవాడు) అంటూ ఎగతాళి చేయడం మొదలుపెట్టినారు. అప్పుడు బాధతో అవమానంతో ఆ కుచేలుడు ‘’నా దుర్గతికి కారణం నీవే’’ అంటూ శ్రీకృష్ణుని పలురకాలుగా నిందించాడు అని విశదీకరించే సందర్భం.

  శ్రీకృష్ణుం డిల జేయు చేష్టలు కృపా లీలల్ గదా! క్రీడలన్
  జేకొంచున్ వడి లాగుచుండ చినిగెన్ చేలమ్ము, మిత్రుం డటన్
  ‘’నా కీ దుర్గతి గల్గ కారణము కృష్ణా! నీవె’’ యంచున్ వెసన్
  శ్రీకృష్ణుం గటు భాషణమ్ములను గర్హించెన్ గుచేలుండయో.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (12-8-2018)

  రిప్లయితొలగించండి
 6. రిప్లయిలు
  1. ఆ కారుణ్యహృదంతసంతతజగద్వాపారనిర్వ్యాజదా

   యైకేచ్ఛున్,శిశుపాలుడట్లు సభలో నావేశరుద్రాకృతిన్ ,

   శ్రీ కృష్ణుం గటుభాషణంబులను గర్హించెన్ , గుచేలుం డయో

   చ్యాకారున్ స్తుతియించ , నిర్వురకు మోక్షాకాంక్షఁ జేకూర్చెనే!.

   తొలగించండి
 7. ఓకుటిలుం డాటలలో
  శ్రీకృష్ణునిఁ దిట్టె నయొ, కుచేలుం డలుకన్
  తాకెను నికృష్టుని, సఖుని
  కై, కదుర కరమగు ప్రేమ, కని హరి మురియన్

  రిప్లయితొలగించండి

 8. మాడర్న టైమ్స్ కుచేలులు జిలేబుల వలలో చిక్కుబడి :)


  నా కష్టంబులు కెల్ల నీవు గద వైనంబయ్య! పద్నారు వే
  లౌ కళ్ళాలను లాగినాడు గద నే లౌక్యంబుగా నొక్కతెన్
  నీకూచిన్ మనువాడి నమ్మి బడయన్ నిండారుగానమ్మి నే
  రోకట్లో తలదూర్చినానయ సఖా! రొంజుళ్ళ చెండాడెరా!
  శ్రీకృష్ణుం గటుభాషణంబులను గర్హించెన్ గుచేలుండయో !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  =====================
  శ్రీకృష్ణుం గటు భాషణంబులను
  గర్హించెను గుచేలుండయో
  ========================
  భార్య బలవంతమున పరంధాముని
  అనుగ్రహం పొందగ నెంచి యేతెంచిన
  కుచేలుడు శ్రీకృష్ణుడిని కటువైన మాట
  లతో నిందించె ననుటలో అసంబద్దమే
  ఇచట సమస్యగా నెంచనైనది
  ==========================
  సమస్యా పూరణము - 229
  ===================

  ముసిరిన అష్ట ధరిధ్రములు నావి
  అష్టైశ్వరంబులవి నీవి
  నాకిదె ఉచితాసనంబిడితివి
  భక్తితో వినమ్రుడవైతివి
  సిగ్గున చితికి చచ్చెదనయో
  గొణుగుచు బడుగు బాపనుండయో
  శ్రీకృష్ణుం గటు భాషణంబులను
  గర్హించెను గుచేలుండయో

  ====##$##====

  అష్ట ధరిధ్రములతో బాధపడుచున్న
  వాడిని నేను, అష్టైశ్వరంబులతో తులతూగు
  వాడివి నీవు, అట్టి నాకు ఉచితాసనంబును
  ఇవ్వడమే గాక భక్తితో నాముందు మోకరిల్లి
  తివి, ఓ కృష్ణా నన్నిటుల సిగ్గుతో చితికి
  చంపగ నెంచితివా యని మనమున గొణుగు
  చు ఆ కుచేలుడు కటువైన మాటలతో
  కృష్ణుడిని నిందించెనని భావము.

  అయాచిత సౌఖ్యములను, అలవి
  మాలిన అభిమానమును దుర్జనులు సైతురే
  మో కాని సజ్జనులు మోయగ లేరుగా !

  (మాత్రా గణనము - అంత్య ప్రాస)
  ---- ఇట్టె రమేష్
  (శుభోదయం)

  రిప్లయితొలగించండి
 10. పేదరికాన్ని తాళగ లేక యొకనాడు సుదాముడు సంతానమాకలి యాకలి అని విలపిస్తుంటే చూడలేక తనలో తాను ఇలా అనుకొన్నాడని యూహించి.....

  నా కాప్తుడవై యుండియు
  నీకరుణను జూపవేల నీకిది తగునా
  హే కఠినాత్మా యనుచును
  శ్రీకృష్ణుని తిట్టెనయొ కుచేలుండలుకన్.

  రిప్లయితొలగించండి
 11. శ్రీకాంతుండవు నీవు మిత్రుడవనన్ ఛీ సిగ్గగున్ నాకురా
  రూకన్ లేదిట బీదనైతిగదరా! క్రూరుండవే నీవురా!
  నాకన్నా! యని నిన్ను బిల్చితినిరా!నట్టేట ముంచావురా!
  *"శ్రీకృష్ణుం గటుభాషణంబులను గర్హించెన్ గుచేలుం డయో"*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 12. శ్రీ కృష్ణుని నియమించిరి
  శ్రీ కారము చుట్టి నాడు, రీతులు దెలపన్,
  ఆకారముమెచ్చని యా
  శ్రీ కృష్ణుని దిట్టెనయొ కుచేలుండలుకన్
  రాష్ట్ర విభజన కమీషన్ ,
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 13. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఆ కంసుండాగ్రహమున
  శ్రీకృష్ణుని దిట్టెనయొ; కుచేలుండలుకన్
  తాకనాడెను తన లేమిని
  కైకానుక కృష్ణునికిడ కాకైనపుడున్

  రిప్లయితొలగించండి
 14. (తన మిత్రుడు శ్రీకృష్ణుని శిశుపాలుడు నిందించిన
  విషయం తెలిసిన కుచేలుని ప్రతిస్పందన )
  ప్రాకృతమతి శిశుపాలుడు
  శ్రీక్రృష్ణుని దిట్టె నయొ ; కుచేలుం డలుకన్
  వ్యాకులమనమున వానిని
  వాకొనజాలని పలుకుల భంగించె గదా!

  రిప్లయితొలగించండి
 15. శ్రీకృష్ణుడాటలాడుచు
  మూకుమ్మడిద్రోసికొనగమురిపెముతోడ
  న్నొక్కనిచేలముచిరుగగ
  శ్రీకృష్ణునిదిట్టెనయొకుచేలుండలుకన్

  రిప్లయితొలగించండి
 16. దేవిక
  -------
  తా కీర్తించె సుదాముడె
  చేకూరంగ సకలమ్ము చెలికాని కృపన్ ;
  దూకలి దీర్చగ నేలన్
  శ్రీకృష్ణుని దిట్టెనయొ కుచేలుండలుకన్ !

  రిప్లయితొలగించండి
 17. దేవిక
  ------
  దూకలి దీర్చగ నేలన్
  శ్రీకృష్ణుని దిట్టెనయొ కుచేలుండలుకన్ ;
  తా గీర్తించె కుచేలుడె
  చేకూరంగ సకలమ్ము చెలికాని కృపన్ !

  (దూకలి=బాధ)

  రిప్లయితొలగించండి
 18. క్రమాలంకారం లో
  ఛీ కొట్టి యు శిశు పాలుడు
  చేకొని పోయె నటు కు లను చెలిమి గ నెవరో ?
  తా కొమరుసత్య దునిమె ను
  శ్రీకృష్ణుని దిట్టేన యొ; కుచేలుం;డ లు క న్
  కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
 19. ఆ కరుణా చిత్తుని నే
  నీ కారణమునఁ గనంగ నెట్లని తనదౌ
  ప్రాకట దుస్థితిని, దలఁచి
  శ్రీకృష్ణునిఁ, దిట్టె నయొ కుచేలుం డలుకన్


  ఏకైకుం డట ధర్మ రాజ కృత భూమీ శావనీ దేవ సం
  ఘైకత్వార్జిత పుణ్య నిర్ణయము కృష్ణాగ్రార్చనం గాదనన్
  శ్రీకృష్ణ ప్రతియోగ చేల ధర దుశ్శీలుండు చైద్యుండు వే
  శ్రీకృష్ణుం గటు భాషణంబులను గర్హించెన్ గుచేలుం డయో

  [కుచేలుఁడు : చెడ్డ వస్త్రమును ధరించిన వాఁడు; శ్రీకృష్ణుని మీద పగ యనెడు బట్టను కట్టి కుచేలుఁ డయ్యాఁడు.]

  రిప్లయితొలగించండి
 20. మీకౌ మిత్రుని చిన్ననాటి సఖునిన్ మీ రేగి వేడంగదే
  యీ కష్టంబుల దీర్చు నన్న సతితో "నేమంటివే వెఱ్ఱినై
  నా కీవే సిరులంచు వేడ జనుటా నాతీ! పరంధామునిన్
  శ్రీకృష్ణుం?" గటుభాషణంబులను గర్హించెన్ గుచేలుం డయో.

  రిప్లయితొలగించండి
 21. శ్రీకృష్ణ వేష దారుని
  నాకృతిలోమార్పురాగ?నయ్యోమిత్రా
  సాకృతిముఖుడవ్వరయని
  శ్రీకృష్ణుని దిట్టెనయొ!కుచేలుండలుకన్!

  రిప్లయితొలగించండి
 22. నీ కే లోటిటు లుంఛ వృత్తి గొన నీ నేస్తుండ నేనుండగన్
  లోకోద్ధారకు డిట్లు బల్కె! వినె లోలోనార్ద్ర డెందంబుతో
  శ్రీకృష్ణుం గటుభాషణంబులను గర్హించెన్! గుచేలుం డయో
  నా కృష్ణా! ను వయోగ్యవంతునకు నానందమ్ము నందింతువా౹౹

  రిప్లయితొలగించండి
 23. ప్రాకృత భాషన నెయ్యుడు
  శ్రీకృష్ణుని దిట్టెనయొ; కుచేలుండలుకన్
  యాకృతమును జూచియొక ఖ
  లీకృతి నొనరించునట్టి లీలగనెంచెన్

  ఖలీకృతి = అనర్థము

  రిప్లయితొలగించండి
 24. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  శ్రీకృష్ణుం గటుభాషణంబులను గర్హించెన్
  గుచేలుం డయో!

  సందర్భము: కరూశరాజు పౌండ్రకుడు "వాసుదేవు డనే పేరు నా ఒక్కనిదే!
  (వాసుదేవాఖ్యు డనగ నే నొక్కరుడ గాక యితరుల కీ నామ మలవడునే!.. భాగ-దశ..స్కం.504)
  నా పేరు నా చిహ్నాలు ధరించరాదు.అవి విడిచిపెట్టి నన్ను సేవించి బతికిపో! లేదా యుద్ధమే" యని దూతతో చెప్పి పంపెను.
  కృష్ణుడు బయలుదేరెను. పౌండ్రకుడు అతని మిత్రుడు కాశీరాజు యుద్ధంలో ఎదుర్కొనిరి. కృత్రి మాయుధాలు దాల్చి రంగ స్థలంమీది కృష్ణునిలా వున్న పౌండ్రకుని చూచి కృష్ణుడు నవ్వుకొన్నాడు. చక్రంతో అంత మొందించినాడు. (చక్రమున న ప్పౌండ్రున్ వెసన్ ద్రుంప వా డిల గూలెన్.. భాగ..519)
  కాశీ పతిని కూడ వధించినాడు. అతని కొడుకు సుదక్షిణుడు శివు నారాధించగా ప్రసన్నుడై అభిచార హోమం చేస్తే అగ్ని ప్రసన్నుడౌతా డన్నాడు. అతడట్లా చేయగా భయంకరాకారయైన కృత్య ఉద్భవించి అల్లకల్లోలం చేయగా కృష్ణుడు చక్ర ప్రయోగం చేశాడు. కృత్యకు చేతగాక తిరిగి వెళ్ళి ఋత్విక్కులతో సహ సుదక్షిణుని దహించింది.
  అలా రూపంలో అచ్చం కృష్ణునిలాగానే వున్న పౌండ్రకుణ్ణి కుచేలుడు దూషించినాడు అత డన్న మాటలను గుర్తుకు తెస్తూ..
  ==============================
  " 'నీ కేలా మరి నాదు చిహ్నములు? నే
  నే వాసుదేవుండఁ కృ
  ష్ణా! కయ్యానికి వత్తువా! విడుతువా!
  నా గుర్తు' లంచున్ భలే
  చీకాకున్ బొనరించెఁ బౌండ్రకుడు.. ఛీ!
  ఛీ!" యంచు... రూపంబునన్
  శ్రీకృష్ణుం గటుభాషణంబులను గ
  ర్హించెన్ గుచేలుం డయో

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  12-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 25. నీకరుణయు లేకున్నను
  నాకీ బ్రతుకది యేల నగధర శౌరీ
  శ్రీకృష్ణా కావుమనుచు
  శ్రీ కృష్ణుని దిట్టెనయొ కుచేలుడలుకన్.

  రిప్లయితొలగించండి
 26. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  శ్రీకృష్ణుం గటు భాషణంబులను గర్హించెన్
  గుచేలుం డయో

  సందర్భము: భార్య ప్రేరణతో కృష్ణునివద్దకు వెళ్ళిన కుచేలుడు ఊహించని రాచ మర్యాదలు తనకు జరుగుతూ వుంటే మనసులోనే యిలా అనుకుంటున్నాడు.
  "నే నేమో నీకోసం (అల్పమైన) అటుకులు (కొన్ని) తెస్తాను (మహా గొప్పగా ఉత్తరీయంలో ముడివేసికొని).
  నీవేమో పంచ భక్ష్య పరమాన్నాలూ నాకోసం వడ్డిస్తావు.
  ఏ నేల మీదో చతికిలబడవలసిన వాణ్ణి నన్ను (ఏకంగా) హంస తూలికా తల్పంమీద ఆసీనుణ్ణి చేస్తావు.
  ఈ దీనునిమీద హీనునిమీద ఎంత ప్రేమ చూపిస్తున్నా వయ్యా! సహాధ్యాయినైతే కావచ్చు. నీ కెంతమంది సహాధ్యాయులు లేరు (నాకంటె అన్ని విధాల గొప్పవారు) !
  పనికిమాలిన వాణ్ణి. ఇంత గొప్ప ప్రేమకు నే నర్హుణ్ణా! నీ స్థాయి యేమిటి? నా స్థాయి యేమిటి? నాలాంటి వాడితో నీవు మాట్లాడడమే గొప్ప!"
  ఈ విధంగా కుచేలుడు కృష్ణుని ప్రేమను భరించలేక తన మనసులోనే కటువైన మాటలతో గర్హించినాడు (నిరసించినాడు).

  (శ్రీ గౌరీభట్ల బాల ముకుంద శర్మ గారి
  ప్రేరణతో.. ధన్యవాదాలతో..)
  ==============================
  "నాకున్ భక్ష్యము లిత్తు, వే నటుకులన్
  నా యుత్తరీయాన నే

  వో కొన్నింటినిఁ దెత్తు నీకొరకు న
  య్యో! కృష్ణ! నా బుద్ధి యిం

  తే కాబోలును! హీనుడన్ మరియు నే
  దీనుండ" నంచున్ మదిన్

  శ్రీకృష్ణుం గటు భాషణంబులను గ
  ర్హించెన్ గుచేలుం డయో!

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  12-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 27. నీకాతండిల బాల్యమిత్రుడనగా నే వింటి నే సత్యమా?
  యా కాఠిన్యునివల్ల నిష్ఫలమదే యంచున్ కళత్రమ్మటన్
  శ్రీకృష్ణుంగటు భాషణంబులను గర్హించెన్, గుచేలుండయో
  పోకన్ దప్పదటంచుచున్ మనములో బూజించెపుణ్యాత్మునే

  రిప్లయితొలగించండి
 28. పోకిరి చంద్రుడు రాముని

  చీకాకులు పెట్టిపెట్టి చిడిముడి జేసెన్...

  కాకా! ఇదియెట్లన్నన్:

  శ్రీకృష్ణునిఁ దిట్టె నయొ కుచేలుం డలుకన్ :)

  రిప్లయితొలగించండి
 29. ఆకాశంబున నుండి వ్రాలె గదరా! హైరాణ గావించితే!

  కోకల్ నూలువి పట్టువస్త్రములు హా! కోటానుకోటుల్ గ! నన్

  చీకాకున్ పడజేసి నాకు చెమటల్ చిందించితే! యంచు పల్

  శ్రీకృష్ణుం గటుభాషణంబులను గర్హించెన్ గుచేలుం డయో :)  కుచేలుడు = చీరలను లాగి లాగి సొమ్మసిలి చెమటతో తడిసి చినిగిన వస్త్రములు కల దుశ్శాసనుడు

  కుచేలము: తెలుగు నిఘంటువు
  తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
  సంస్కృత విశేష్యము

  చినిగిన వస్త్రము.

  రిప్లయితొలగించండి
 30. చీకాకున్ పడద్రోసితే భడవరో! శ్రీలక్ష్మి నిప్పించుచున్
  బాకాలూదుచు వచ్చిరే ప్రభులిటన్ పట్టంగ నల్లన్ ధనమ్
  శ్రీకృష్ణున్ చెరసాల నాకికనురో సీమౌనటన్ దూరుచున్
  శ్రీకృష్ణుం గటుభాషణంబులను గర్హించెన్ గుచేలుం డయో!

  రిప్లయితొలగించండి