16, ఆగస్టు 2018, గురువారం

సమస్య - 2764 (కోడలి పొందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కోడలి పొం దభిలషించెఁ గుణకోవిదుఁడే"
(లేదా...)
"కోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెఁగా"

51 కామెంట్‌లు:



  1. సుబ్బారావాయ నమః


    కీడు తలపెట్టకండీ!
    యీడూజోడు సరి లేని యీ పల్కులతో!
    బాడబు డాచెప్పండే
    కోడలి పొందభిలషించెఁ గుణకోవిదుఁడే?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. తోడై నూరేండ్లు తనకు
    జోడుగ బ్రతకంగ నెంచు సుగుణపు రాశిన్
    చేడియను తల్లి మెచ్చిన
    కోడలి పొందభిలషించెఁ గుణకోవిదుడే.

    రిప్లయితొలగించండి


  3. కీడుతలంపు లివ్వనుచు కీసర బాసర లాడుటేలనో?
    బాడబు డన్న పల్కు లను పద్ధతి గావిడ దీసి‌ చూడు మా
    జోడిగ పెండ్లి చేసుకుని జోరుగ తా తన తండ్రి తాయికిన్
    కోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెఁగా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    మూడవ యేడు వచ్చెనని , పుట్టినరోజని పెద్దలందరున్
    వేడుక జేసినారు మన పిల్లకి., దే సమయమ్ము నమ్ము పూ
    బోడి ! యటంచు బిల్చి యొక పుత్రునికై , నిజమాతృమూర్తికిన్
    కోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ., డామెయు సమ్మతించెఁగా !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. వీడక హరి పాదమ్ముల
    వాడని గతి సత్కథలను వాసిగ వ్రాయన్
    వేడుచు సాయము విష్ణుని
    కోడలి పొందభిలషించె గుణకోవిదుడే!!

    రిప్లయితొలగించండి
  6. వేడుకగా పెండ్లాడిన
    చేడియ సుగుణాలరాశి చిరుదర హాసిన్
    నేడిల జననియె మెచ్చిన
    కోడలి పొందభిలషించెఁ గుణకోవిదుడే.

    రిప్లయితొలగించండి


  7. వేడుక తోడతానుచని వీనుల విందుగ మేనమామతో
    నాడగ పిల్వగా నగుచు నాదర మొప్పగ చెంత చేరుచున్
    వేడిన వన్నియున్నొసగి వేడుక పర్చగా సంతసించినా
    కోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెఁగా.

    పొందు:బాంధవము,స్నేహము అనే అర్థంలో వాడాను.

    రిప్లయితొలగించండి
  8. వేడుచు లక్ష్మిని యడిగె నీ
    కోడలి పొంద భిలషించెఁ , గుణ కోవిదుడే
    పాడగ కచేరి యందున
    తోడుగ తనచెంత నుండి తూగించ మదిన్

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు


    1. చూడ నిదో సమస్య యన చోద్యమదెట్లగు, మేనమామతో

      గోడలి పెండ్లి సాజమగు, కోవిదు లొప్పరి, లోకధర్మమౌ,

      పాడరె యాంధ్రదేశమున భామల మామల పాట లవ్విధిన్

      గోడలి పొందు గోరె గుణకోవిదు డామెయు సమ్మతించెగా.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
  10. వాడొక పాపాచారుడు
    చేడియలను దుష్టబుద్ధి జేరుచునుండున్
    వీడడు దుర్భావంబుల
    కోడలి పొం దభిలషించెఁ గుణకోవిదుఁడే?

    రిప్లయితొలగించండి
  11. కోడలు వచ్చు వేళయును గొడ్డరుదెంచెడి వేళ యంద్రు మా
    వాడను నీమె యుంచె శుభ పాదము నింటను మారినాడు మా
    వాడును మంచి వానిగను పండుగ మాకిక నింట నిత్యమున్
    కోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెఁగా.

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టాసత్యనారాయణ
    కోడై కూసిన సత్యమె
    కోడలి పొందభిలషించె గుణ కోవిదుడే
    నేడా బెడదయె లేదిక
    పాడిగ తలిదండ్రినొకట వదలియు మనగన్

    రిప్లయితొలగించండి


  13. మోడైన జీవితమ్మది
    వాడిన పూవు వికసించి పరిమళముగనన్,
    గూడును చేర్చ తనుయునికి,
    కోడలి పొందభిలషించె గుణకోవిదుడే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టాసత్యనారాయణ
    పాడుది స్పర్శా సౌఖ్యము
    గూడున గల దొంగ జేయు ఘోరమ్మనగా
    ఈడును దలచియు మనమున
    కోడలి పొందభిలషించె గుణ కోవిదుడే(తీవ్ర మానసికాపరాధముగా)

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందఱకు నమస్సులు!

    [తెలుఁగు భాషాభివృద్ధికై యొక గుణకోవిదుఁడు సరస్వతీ కటాక్షముం బొందిన వైనము]

    బీ డగునట్టి తెల్గునకుఁ బెంపును గల్గఁగఁజేయ నెంచియున్
    దో డగునట్టి భాష నిలఁ దోరపు భక్తినిఁ బొంది, దానిఁ దా
    వేడుకతోడ వేగిరమె ప్రేమను శిష్యుల కీయ, లక్ష్మికిం
    గోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ; డామెయు సమ్మతించెఁగా!

    రిప్లయితొలగించండి
  16. తోడుగ నీడగ మసలుచు
    నం డ గ నన్నియు విధముల నల రె డు మగువ న్
    పోడిమి పత్ని ని జనని కి
    కోడలి పొందభి ల షి oచె గుణ కోవిదుడే
    కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
  17. జోడు కుదురునని దలచియు
    నీడగు తన యక్కబిడ్డ నిష్ట పడుచునే
    యాడగనెంచి మనువొకడు
    "కోడలి పొందభిలషించెఁ గుణకోవిదుఁడే"

    రిప్లయితొలగించండి
  18. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2764
    సమస్య :: కోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెగా.
    సందర్భం :: పొందు అనే పదానికి స్నేహము అనే అర్థం ఉన్నది కదండీ. ‘’పోరు నష్టము పొందు లాభము’’ అనే సామెత అందఱికీ తెలిసిందే కదండీ.
    15 వ శతాబ్దానికి చెందిన విద్వత్కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు వాణి కృపను పొంది, శృంగారశాకుంతలము జైమినీభారతము అనే గ్రంథ రచనలతో ఘనకీర్తిని పొంది విరాజిల్లినాడు. ఆ సుకవి ‘’వాణి నా రాణి’’ అని కూడా చెప్పుకొన్నట్లు జనబాహుళ్యంలో ఉన్నది. ఆ మహాకవి కరుణతో జగముల నేలే విష్ణుమూర్తి యొక్క కోడలి పొందును (సరస్వతీ దేవితో స్నేహాన్ని) కోరినాడు. అలా స్నేహంతో ఉండేందుకు ఆ సరస్వతీ దేవి కూడా సమ్మతించింది అని విశదీకరించే సందర్భం.

    వేడె మహాకవీంద్రుడుగ పిల్లలమర్రిగ కీర్తి నందుచున్
    తోడుగ నుండ వాణిఁ బరితోషమునన్ పినవీరభద్రు డా
    నాడు ప్రసిద్ధి కెక్కె, కరుణన్ జగమేలెడి విష్ణుమూర్తికిన్
    ‘’కోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెగా.’’
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (16-8-2018)

    రిప్లయితొలగించండి
  19. చూడగ సోదరి సుత, తన
    కోడలినే పెండ్లియాడి కోమలితోడన్
    వీడని బంధమ్మని తన
    కోడలి పొందభిలషించెఁ గుణకోవిదుఁడే.

    రిప్లయితొలగించండి
  20. వీడెను తనసతి సుతులున్,
    మోడాయెనుగద బ్రతుకులు,ముండన మేలా
    పాడియె నాతో పెండ్లని
    కోడలి పొందభిలషించె గుణకోవిదుడే

    ఒక ప్రమాదములో భార్య కొడుకు చనిపోగా కోడలు విధవరాలు గా మారదలచి గుండు చేయించుకొనదెనని తెల్ప మామ గారు వలదని తాను పెండ్లి చేసుకుంటానని చెప్పు సందర్భము

    రిప్లయితొలగించండి
  21. జోడుగ జోరుగ కొడుకే
    కోడలి పొందభిలషించె,గుణ కోవిదుడే
    వీడనిఁబల్కెను తండ్రియు
    పాడుచు హరిదాసు పాట పావన మతుడై.

    రిప్లయితొలగించండి
  22. బోడి యురోజ సంపదను పోల్చగ వచ్చు హిమాలయమ్ముతో
    కోడలి యింటి పేరకట కోమలి మధ్యము శూన్యమే కనన్
    బోడి నితంబమే తనను పొందున గెల్వ సవాలు చేయగన్
    *కోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెఁగా*

    రిప్లయితొలగించండి
  23. (రావణుడు కోడలైన రంభను కోరుకోవటం )
    రేడు కుబేరుని కోడలు ;
    వీడని నలకూబరునకు ప్రియసతి రంభన్ ;
    జాడలు విడి దశకంఠుడు
    కోడలి పొందభిలషించె గుణకోవిదుడే !

    రిప్లయితొలగించండి
  24. మాడుగులరామచంద్రుడు
    వీడుటదానిష్టపడకవిధవదియైన
    న్గీడనిభావించకమది
    న్గోడలిపొందభిలషించెగుణకోవిదుడే
    ----
    పొందు=మైత్రి

    రిప్లయితొలగించండి
  25. వేడుక కల్గ కవితపై
    పోడిగ చదివి పలుశాస్త్రములను కడు ధృతిన్
    వేడుచు ననునిత్యము హరి
    కోడలి పొందభిలషించెఁ గుణకోవిదుఁడే

    రిప్లయితొలగించండి
  26. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    కోడలి పొందు గోరె గుణ కోవిదు
    డామెయు సమ్మతించెగా
    ======================
    మంచి వాడిగా గణుతికెక్కిన పెద్ద
    మనిషి శారీరక సుఖమిమ్మని
    కోడలిని కోరగా ఆవిడయు అందుకు
    ఒప్పుకొనినదని చెప్పడంలో గల
    అనైతికతయే ఇక్కడ సమస్య
    ========================
    సమస్యా పూరణము - 233
    ====================

    సంబద్దము చెవులకు చేటు
    అసంబద్దము తీరైన ఘాటు
    నైతికములకు లేదిక చోటు
    అనైతికములె అందరి రూటు
    ప్రకృతికెదురీదుతు వినుటకు
    జనులిచ్చగింతురు కథగా
    కోడలి పొందు గోరె గుణ కోవిదు
    డామెయు సమ్మతించెగా

    ====##$##====

    సమాజం ఆమోదించిన దంపతుల ప్రేమ
    లీరీతియన వినుటకెవరూ ఆసక్తి చూపరు
    ఆక్రమ సంబంధముల నేరములివి ఘోర
    ములవి యనియంటె చెవులు రిక్కించెదరు.

    నాగరికులై కొనసాగుతు ఒక పార్శ్వమున
    నైతికతలను ఉఛ్ఛరించుచునె , మరొక
    పార్శ్వమున ప్రకృతి విరుద్ద సంబంధము
    లను వినుటకిచ్చగించుచు పరోక్షంగా
    వాటికి ఆమోదముద్రలు వేయువారెందరో
    కదాయని భావము.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం )

    రిప్లయితొలగించండి
  27. కోడలిపొందుగోరెగుణకోవిదుడామెయుసంతసించెగా
    కోడలిసమ్మతిన్నతడుగోముగనుండుటమంచిదేకదా
    కోడలుమామబంధమదికూతురుతండ్రికిగల్గుపొందికే
    తోడునునీడగానుబరితోషముతోడననుండమేలగున్

    రిప్లయితొలగించండి
  28. డా.పిట్టసత్యనారాయణ
    చూడర పాపి!దొంగవయి చూడ్కుల, నీ బెదిరింపు, సొంపులన్
    పాడెకు గట్టరా!తృటిని ప్రాణముబోదుగదా చిరాయువై;
    పాడిగ లోక మీగతిని భర్తనుగాదను బోటి నేమనున్,
    "కోడలి పొందు గోరె గుణ కోవిదు'డామెయె సమ్మతించగన్' "

    రిప్లయితొలగించండి
  29. వీడని భక్తితో హరిని వేడుకమీరగ పూజచేయుచున్
    తోడుగ నిల్వగా దనకు తోయజనాభుని
    గాథలల్లగన్
    వేడుచు వాణినిన్ విమల వీణియధారిణి, విష్ణుమూర్తికిన్
    కోడలి పొందుగోరె గుణకోవిదు డామెయు సమ్మతించెగా!

    రిప్లయితొలగించండి
  30. డా.పిట్టా సత్యనారాయణ
    ఆర్యా,ఐదవ పాదము:
    ఆడుది చుల్కనాయెనిక, హా విధి పుట్టుక ఘోర శాపమా?

    రిప్లయితొలగించండి
  31. వేడిన స్త్రీ తీరు మనకు
    కూడదనుచు చెప్పుచున్న కూడను తెచ్చెన్
    ప్రోడను భార్యగ, తప్పక
    కోడలి పొందభిలషించె గుణకోవిదుడే

    పొందు=స్నేహము

    రిప్లయితొలగించండి
  32. ఆడుచుఁ బాడుచుఁ దిరుగుచు
    వాఁ డెడతెగక యెపుడు పుర వర మందుఁ దమిన్
    వేడుకఁ దేనెను గోరుచుఁ
    గో డలి పొం దభిలషించెఁ గుణకోవిదుఁడే

    [కోడు + అలి = కోడలి; కోడు = ఊరి చివరి చిన్న చెఱువు; అలి = తుమ్మెద; పొందు = స్నేహము]


    వీడని ప్రేమ పాశమునఁ బెన్మిటి నింపుగఁ గట్టి వేయుచున్
    వాడని మోము వన్నె లవి పమ్మఁగ నేరికిఁ దీసి పోని యే
    చాడుపుఁ జూడ పుణ్యసతి సద్గుణరాశి నిజాంగ కర్తకుం
    గోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెఁగా

    రిప్లయితొలగించండి
  33. రిప్లయిలు
    1. డా. సీతా దేవి గారు ధన్యవాదములు. మీ ప్రశంస నా పూరణమున కేనా? అయినచో మొదటిదా? రెండవదా మీకు నచ్చినది?

      తొలగించండి
  34. మేడలు మిద్దెలేల ఘన మేధనొసంగిన చాలనంచు తా
    వేడెను హంస వాహినిని విజ్ఞత తోడ పదాంబుజమ్ములన్
    వీడక కొల్చెనెప్పుడును విశ్వమనోహర మూర్తి లక్ష్మికిన్
    గోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెగా

    రిప్లయితొలగించండి
  35. తోడుకు,నీడకు,జోడుకు
    నాడది నవసరమటంచు నభిమానముతో
    మాడక మేనత్తసుతయగు
    కోడలిపొందభిలషించె!గుణకోవిదుడే!

    రిప్లయితొలగించండి
  36. ఉత్పలమాల
    ఏడవకమ్మ నిన్ను కృతినీయఁగ నొప్పను కీచకాళికిన్
    వేడుక నంకితంబిడెద విష్ణువు గాథల రామమూర్తికిన్ 
    తోడిడ మంచుఁ దాఁ జదువుతొయ్యలిఁ బోతన మ్రొక్కి శౌరికిన్
    గోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెఁగా

    రిప్లయితొలగించండి
  37. కందం
    తోడిడ రాజుల కమ్మక
    వేడుక కృతి రామభద్ర విభునకొసంగన్
    వేడుచు పోతన శ్రీహరి
    కోడలి పొం దభిలషించెఁ గుణకోవిదుఁడే

    రిప్లయితొలగించండి
  38. కాడిని మోసేటి కయిత
    గాడు, విధుడు ,శిక్షకుoడు,కవికోవిధుడున్,
    వేడుచు శంకరు డా హరి
    కోడలి పొందభిలషించెఁ, గుణకోవిదుఁడే?
    శంకరాభరణమను ( బ్లాగును) కాడిని సతతము మోయుచు శంకరార్యులు హరి కోడలు పొందు కోరుచున్నాడని భావన

    రిప్లయితొలగించండి
  39. ఏడీ శంకర గురువులు?
    నేడే మాయెను? కనబడనే లేదు గదా?
    చూడడు బ్లాగు, నతడు హరి
    కోడలి పొందభిలషించెఁ గుణకోవిదుఁడే?

    రిప్లయితొలగించండి
  40. ...............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    కోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు
    సమ్మతించెగా

    సందర్భము: *శ్రీ తూములూరి పార్థ సారథి* గారు అవిశ్రాంత పథికులు. మామూలు ఉపాధ్యాయునిగానే పని చేసినా వారి విద్యా పిపాస చాలా గొప్పది. తెలుగు సంస్కృతం ఇంగ్లీషు హిందీ మొదలైన సుమారు ఆరింటిలో మాష్టర్ డిగ్రీలు ఎంఫిల్ పిహెచ్.డి సాధించినారు. అట్లే సుమారు పదికి మించిన పిజి డిప్లొమాలుకూడ.. ఐనా ఏడు పదులు దాటినా వారి విద్యా తృష్ణ తీరలేదు.
    పరమార్థాన్ని ప్రతిపాదించే దివ్యమైన సారస్వతాన్ని మథించే కృషి ప్రారంభించారు. అధ్యయనంతోబాటు ఛందస్సు అభ్యసిం చారు. విశ్వనాథ శతకము అన్నపూర్ణ శతకము హనుమచ్ఛతకము నదీభారతము మొదలైనవి వారి పద్యకృతులు. ప్రస్తుతం సకల దేవతా స్తుతి.. అనే కృతి రచిస్తున్నారు.
    గుణ కోవిదులై యొప్పారుతూ వా రీ విధంగా విష్ణుమూర్తి కోడలు.. అనగా సరస్వతీ దేవియొక్క.. పొందు.. అనగా స్నేహాన్ని సాహచర్యాన్ని అభిలషించి (సారస్వత కృషిలో) ఆదర్శమైన సాహసోపేతమైన సార్థకమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. (అన్నట్టు వారి శ్రీమతి పేరూ సరస్వతి యే సుమండి..)
    ==============================
    వేడుక నెన్ని నేర్చినను
    విద్య లిలన్ బరమార్థదమ్ము లే
    నాడును గా వటంచు మది
    నమ్మిన విజ్ఞుడు "తూములూరి" తా
    నోడక నేర్చు, వ్రాయు, మది
    నుంచి మథించు శభా షనంగ నే
    డే డగు నీడు పైబడిన
    దే! వర సాహితి మెచ్చు; విష్ణునిం
    కోడలి పొందుఁ గోరె గుణ
    కోవిదుఁ డామెయు సమ్మతించెగా!

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
    16.8.18
    """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

    రిప్లయితొలగించండి
  41. డా.పిట్టా సత్యనారాయణ
    చూడర పాపి!దొంగవయి చూడ్కుల, నీ బెదిరింపు, సొంపులన్
    పాడెకు గట్టరా!తృటిని ప్రాణము బోదుగదా చిరాయువై;
    పాడిగ లోక మీగతిని భర్తను గాదను బోటి నేమనున్?
    "కోడలు పొందుగోరె గుణ కోవిదు'డామెయె సమ్మతించగన్'"

    రిప్లయితొలగించండి
  42. నీడగ నుండుచున్ మిగుల నిర్మలమౌ హృదయంబుతోడనన్
    వీడక ప్రేమతో సుజనవేదిగ మార్చిన యక్క బిడ్డకున్
    తోడయి యుండ నెంచుకొని తోరపు టాశ జనించ నాతడున్
    కోడలి పొందు గోరె గుణ కోవిదు'డామెయె సమ్మతించగన్' "

    రిప్లయితొలగించండి
  43. ఆడెడి పాడెడి తనదై

    నాడుది స్వర్గమును జేర నలయుచు భువిలో

    కూడుకు గుడ్డకు మందుకు

    కోడలి పొందభిలషించెఁ గుణకోవిదుఁడే



    పొందు = స్నేహము

    రిప్లయితొలగించండి
  44. ఓడగ నెన్నికన్, విడక, నోటమి నొల్లక, దొడ్డిదారిలో

    కూడుచు పార్లమెంటునను కూరిమి తీరక, నాయకుండుగా

    తాడును పేడునున్ గనక, తందన తానని నిందిరమ్మదౌ

    కోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెఁగా


    పొందు = స్నేహము

    రిప్లయితొలగించండి
  45. వాడలు వాడలన్ దవిలి వందల భామల రూపులెన్నుచున్
    చేడియ గానరాక తగు చెన్నుగ నుండెడి నొక్కదానినిన్
    తాడును గట్టి శూర్ఫణకు తబ్బిబు లౌచును తల్లి దెచ్చినా
    కోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెఁగా

    రిప్లయితొలగించండి