14, ఆగస్టు 2018, మంగళవారం

సమస్య - 2762 (పాలం గనినంత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్"
(లేదా...)
"పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్"

85 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ

   హేలగఁ బాలుదెచ్చి మరగించి పొగల్ వెలిగ్రక్కఁ , ద్రావు మా...
   ర్జాల ! యనంగ వచ్చెనది ద్రాగగ., బాలనుఁ దాకఁ గాలగా
   నాలుక , రాకపోయె మరునాడు, తెనాలి కవీంద్రునింటిలో
   పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. పాలను, మోదకమ్ములను పాయసమున్ గని ప్రీతిఁజేర మా...
   ర్జాలము , చిత్రమౌనెలుక రక్షణఁజేయుచునుండె , నోటిలో
   లాల జనింప జంపుటకు రాన్ , గణనాథుని యుగ్రకోపతా...
   పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  3. మైలవరపు వారి రెండు పూరణలు వైవిధ్యంగా అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. శైలిని జూపుచు రయమున
   మాలగ పద్యములు వ్రాయ మార్జాలము పై
   మైలవరపు వారి గృహముఁ
   *"బాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్"*

   తొలగించండి

 2. జాలము లో నేర్చితి మురి
  పాల సమస్యలను తేట పరచు విధములన్
  మా లావుగ నేర్పెద, రా!
  పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. మేలము లాడుచు నేస్తము
  హేలగ కవ్వించె నంట నెలుకను తినకన్
  కాలిన మీసము తలుచుకు
  పాలం గనినంత బిల్లి భయపడి పాఱెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తినక' కళ. దానికి ద్రుతం రాదు. "తినకే" అనండి.

   తొలగించండి
 4. బాలుం డొసగిన క్షీరము
  కాలుచునుండగ త్రాగి కమలిన నోటన్
  గ్రోలంగలేక నాపయి
  పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాలుచునుండంగ..' అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించండి
 5. డా.పిట్టా సత్యనారాయణ
  బాలుండెరుగడు నియమము
  జాలింగొని తనకు చాలు సై యని విడువన్
  వ్రేలిం బెట్టగ జాలని
  పాలంగనినంత బిల్లి భయపడి పారెన్

  రిప్లయితొలగించండి


 6. మూలకు బోకు ! శక్తి నిడు! ముద్దుగ నీకని తెచ్చి నాను మా
  టేల ! జిలేబి యిద్ది ! హెరిటేజుది ! వేగిర రమ్మ గైకొనన్ !
  బేలగ కన్ను లార్చి, నను విన్నదనమ్ముల జూచి, గిన్నెలో
  పాలనుఁ జూచి, పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్ :)


  జిలేబి
  మా హెరిటేజ్ :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వేగమె రమ్ము...' అనండి.

   తొలగించండి
 7. డా.పిట్టాసత్యనారాయణ
  చాలగ వ్రాయ తీవ్రతన చక్కని కావ్యము లుద్భవించె నం
  చాలము గోరు కైతలను సత్వరయూహల వ్రాయగా చెర
  ల్లాలయ పంక్తులాయె నది యత్యయిక స్థితి లోన నాడు నే
  డీ లయకారి నోట్లగొన యెక్కడివా రచనా ప్రచారముల్?
  "పాలను జూచి పిల్లి వడి బారెను తీవ్ర భయార్తి జెందుచున్"!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సత్వర+ఊహలు = సత్వరోహలు' అవుతుంది. యడాగమం రాదు. 'చెరల్ + ఆలయ' అన్నపుడు ద్విత్వలకారం రాదు.

   తొలగించండి
 8. “గోలను చేయకు నీవిట
  రాలేవ”నుచుండి వేత్రరాజిని గొను నా
  బాలక గణములలో కో
  పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్

  రిప్లయితొలగించండి
 9. బాలుని కొరకై పెట్టిన
  మూలన గల పాత్రగాంచి పోకిరి తనమున్
  గ్రోలగను వచ్చి మరిగెడు
  పాలంగనినంత బిల్లి భయపడి పాఱెన్

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా సత్యనారాయణ
  ఊహ కందని పైపైని యూట జెలగ
  గేహమును వీడ చెలిమలు గ్రీష్మమైన
  వాహ!యిక నేమి యిడు నీటి వాసి మెలగ
  దాహ మైనప్పుడే బావి ద్రవ్వనగును.

  రిప్లయితొలగించండి
 11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2762
  సమస్య :: పాలనుఁ జూచి పిల్లి వడి బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్.
  పాలను చూచి పిల్లి భయపడి పాఱిపోయింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: శ్రీకృష్ణదేవరాయలు తన నగరంలో ఎలుకలబెడద ఎక్కువగా ఉన్నదని తెలిసికొని ఎలుకలను నివారించేందుకు ప్రతి ఇంటికీ ఒక పిల్లిని ఇచ్చి చక్కగా పెంచమన్నాడట. రాజుగారు ఇచ్చిన పిల్లి కదా అని అందఱూ పాలు పెరుగు పెట్టి వాటిని పెంచుతుండడంతో అవి ఎలుకలను పట్టడం మానేశాయి. తెనాలి రామకృష్ణుడు తెలివిగా పిల్లి ముందు వేడిపాలు పెట్టినాడు. ఆ పిల్లి మూతి కాలింది. ఇక పాలజోలికి వెళ్లకుండా ఎలుకలను పట్టి తినసాగింది. తన పిల్లి పాలజోలికి వెళ్లదు అనే విషయాన్ని రాజుగారి కొలువులో కూడా నిరూపించే ప్రయత్నం చేశాడు రామకృష్ణుడు. అప్పుడు ఆ పిల్లి పాలను చూచి భయపడి పాఱిపోయింది అని విశదీకరించే సందర్భం.

  లీలఁ బ్రజాళి బెంచె కడుఁ బ్రీతిగ పిల్లుల రాజొసంగుటన్,
  వేళకు రామకృష్ణు డిడె వేడిగ పాలను మూతి గాల, నా
  లీలనె చూపఁ గొల్వునను, లేవక లేవక లేచి లేచి యా
  పాలనుఁ జూచి పిల్లి వడి బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (14-8-2018)

  రిప్లయితొలగించండి
 12. డా.ఎన్.వి.ఎన్.చారి
  వ్యాలపువామలూరముల పాలను బోయుచు నాగపంచమిన్
  బాలికలంతపూజలను భక్తిని జేయు విధంబుజూచుచున్
  గ్రోలగ పుట్టలోనికిని గొంతును పెట్టగ నందునన్" స
  ర్పాలనుజూచి పిల్లివడి బారెను తీవ్ర భయార్తి చెందుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పెట్టగ నందులోని స।ర్పాలను...' అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించండి
 13. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  పాలను జూచి పిల్లి వడి బాఱెను
  తీవ్ర భయార్తి జెందుచున్
  ======================
  పాలనగానే ఎగిరి గంతులేసెడు పిల్లి
  పాలను జూచి మిక్కిలి భయపడుతు
  అక్కడి నుండి వేగముగా పరుగెత్తి
  పారిపోయినదనుటలో అసంబద్దమే
  ఇచట సమస్యగ పరిగణించనైనది.
  =========================
  సమస్యా పూరణము - 231
  ====================

  కల్తీ పాలకె ఉన్నది జోరు
  సింథటిక్ పాలుగ దానికి పేరు
  అణుకాలుష్యము గడ్డిలో చేరు
  మ్యాడ్ కౌ వివాదముగ పోరు
  దుగ్దమును విషముగ తలపోసెను
  మనమున సంకోచం పొందుచున్
  పాలను జూచి పిల్లి వడి బాఱెను
  తీవ్ర భయార్తి జెందుచున్

  ====##$##====

  అత్యధికముగా పాలను ఉత్పత్తి చేయు
  దేశములలో మన దేశమొకటి, అయితేనేమి
  మనకు అందుబాటులో ఉన్న పాలలో 70%
  కల్తీ పాలేనన్న సత్యం కాదనలేనిది.

  యూరియా, కాస్టిక్ సోడా, గ్లూకోజ్, గంజి
  పొడి, డిటర్జెంట్, కుంకుళ్ళు , రిఫైన్డ్ ఆయిల్,
  లాంటి అనేక పదార్థములచే తయారు చేయ
  బడిన కల్తీ పాలు (సింథటిక్ పాలు ) మన
  మధ్య చలామణిలో ఉన్నాయి.

  1986 లో సంభవించిన చర్నోబిల్ అణు
  ప్రమాద ఫలితంగ భూమిపై మొలిచిన గడ్డి
  సైతం అణుధార్మికధార్మికతను సంతరించుకుని
  పాలు కలుషితమైపోయాయి

  1986 లో ఇంగ్లాండులో "మ్యాడ్ కౌ"
  వివాదం చెలరేగింది. అత్యధిక మాంస, పాల
  ఉత్పత్తికై అసహజ రీతిలో ఆవులకు మాంసా
  హారమును అందించి అనర్థమునకు పాల్పడి
  నారు. ఫలితంగా పశువులకు వ్యాధులు సోకి
  పాలు విషపూరితమైనాయి.

  ఇన్ని రీతులుగా పాలు విషతుల్యమైన
  గతులు గని, పాపం ఆ పిల్లి పాలను చూచి
  భయంతో పారిపోయినదని భావము.

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం )

  రిప్లయితొలగించండి
 14. పాలకు నా జ్జకు లోబడి
  బేలగ నంగీకరించె వికటకవి తా
  లీలగ నొసగె ను మరిగెడు
  పాలంగని నంత బిల్లి భయపడి పారె న్
  _______కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "వికటకవియె తా" అనండి.

   తొలగించండి
 15. కోలాహలముం జేయక
  వీలుంజూచి ఖనకమును వేటును వేయన్
  హేలగ వెలిగిన పలు దీ
  పాలం గనినంత పిల్లి భయపడి పారెన్!

  రిప్లయితొలగించండి
 16. మిత్రులందఱకు నమస్సులు!

  ఏలిక వృద్ధుఁడౌటఁ, దన కెంతయుఁ దిండినిఁ బెట్టకున్నఁ, దా
  నేలిక వీడి, తిండికయి యిక్కడ నక్కడ దేవులాడుచున్
  మేలగు రాజహర్మ్యమున మెల్లఁగఁ జొచ్చి, ప్రదక్షిణించి, పోఁ
  జాలఁగ లేక, తచ్ఛిథిల సౌధ తటస్థ మహోగ్ర సింహశి
  ల్పాలనుఁ జూచి, పిల్లి, వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్!

  రిప్లయితొలగించండి
 17. బాలకుడొక డలికిడి విని
  మేలుకొనియు వేసినట్టి మెఱుపుల కాంతిన్
  బోలిన గది విద్యుద్దీ
  పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్!

  రిప్లయితొలగించండి
 18. గ్రోలగ వచ్చెను రయముగ
  పాలం గనినంతఁ బిల్లి ,భయపడి పాఱెన్"
  దాలి కడనున్న ఖనకము
  వేళముగ తన కలుగునకు వేసట బడుచున్

  రిప్లయితొలగించండి

 19. చాన్నాళ్ళు గా పద్మార్పిత కనబడటం లేదు :)


  లోలాక్షియు మధురనయన
  బాలకుమారియు జిలేబి పద్మార్పిత,క
  ల్లోలిని బ్లాగుల లో తా
  పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. దూల కలంచగన్ మెయిని, తోడనె రాయును నైజధర్మమా

  ర్జాలము ; క్షీరపానమన రక్తిని జూపును ; నట్లు నొక్కెడన్

  బాలను పాత్రలోన గని పానము జేయుగ మూతి కాలినన్ ,

  పాలను జూచి పిల్లి వడి బారెను తీవ్రభయార్తి జెందుచున్.


  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 21. మాలతి యపుడే కాచిన
  బాలంగనినంతబిల్లిభయపడిపాఱె
  న్బాలవిజూడగ నావిరి
  తోలయమునగుచురవములతుమురులువెడలెన్

  రిప్లయితొలగించండి


 22. పాలుంచిన గిన్నెను గని
  కాలును సడిచేయకెత్తి గటగటత్రాగన్
  నాలుక చుర్రన కాలగ
  పాలనుగనినంతపిల్లి భయపడి పారెన్ !

  రిప్లయితొలగించండి
 23. పాలను త్రాగి యింట తెగ వ్యాకులతన్ గలిగించుచున్న మా
  ర్జాలము కోసమావిరులు గ్రక్కుచు వేడిగ పాత్రయందునన్
  బాలను పెట్ట త్రాగుటకు వచ్చిన పిల్లికి మూతికాలనా
  *"పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్"*

  రిప్లయితొలగించండి
 24. కందం
  వేళకు తిండిని బెట్టుచు
  పాలనమొనరించ బలిసి పాత్రన్ గలుగన్
  పాలనుఁ గ్రోలి గృహిణి కో
  పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్  రిప్లయితొలగించండి
 25. బేలతనమ్మున కల్తీ
  పాలను సేవించి మిగుల వ్యాకుల మొంద
  న్నీ లోకమునే నమ్మక
  పాలం గనినంత బిల్లి భయపడి పాఱెన్!

  రిప్లయితొలగించండి
 26. వాలము నాడించుచు వే
  పాలను ద్రాగంగఁ దాను బర మాతురతన్
  వ్రాలఁ బొగలు గ్రక్కెడు నా
  పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్


  పాలు విశుద్ధ కుంద నిభ పాండిమ వర్ణ విరాజమాన మా
  ర్జాల మనోభిలాష ఘన రంజన క్షీరము గ్రోలఁ జేరి తా
  నా లలి తోన్నత స్థిత గృహాంతర మందలి సారమేయ రూ
  పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాలు -
   విశుద్ధ - నిర్మలము
   కుంద - స్తంభము/వెన్నుడు/నిధి
   నిభ - సమానము
   పాండిమ - తెలుపు
   వర్ణ - రంగు
   విరాజమాన - మిక్కిలి ప్రకాశించునది
   మార్జాల

   పాలు విశుద్ధ కుంద నిభ పాండిమ వర్ణ విరాజమాన మార్జాలము - తెల్లపిల్లి
   మనోభిలాష
   రంజన క్షీరము

   సారమేయ - కుక్క

   తెల్ల పిల్లి పాలుతాగబోయి కుక్కను చూచి పారిపోయెను. సరియేనాండి ?


   జిలేబి

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   రెండవ పూరణ ప్రారంభంలోని 'పాలు'కు అన్వయం? 'రంజన క్షీరము' అన్నపుడు 'న' గురువై గణదోషం. సవరించండి.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. అవునండి పొరపాటయినది. మొదటి పాలు నకు క్షీరము విశేషణముగాఁ బ్రయోగించితిని.
   సవరణను సమీక్షించ గోర్తాను.

   పాలు విశుద్ధ కుంద నిభ పాండిమ వర్ణ విరాజమాన మా
   ర్జాల మనోభిలాష ఘన రంజన దుగ్ధము గ్రోలఁ జేరి తా
   నా లలి తోన్నత స్థిత గృహాంతర మందలి సారమేయ రూ
   పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్

   జిలేబి గారు తెల్ల పిల్లి కాదు. పాలు, విశుద్ధమైన మొల్లల వంటి తెల్లని రంగుతో ప్రకాశము కల్గిన, పిల్లికి మనోభీష్టమై యానంద మొసఁగు పాలను ద్రాగఁ గోరి యని భావము.

   తొలగించండి

  4. విశుద్ధ కుంద నిభ పాండిమ వర్ణ విరాజమాన మా
   ర్జాల మనోభిలాష ఘన రంజన దుగ్ధము = పాలు !


   జిలేబి

   తొలగించండి
 27. లాలన జేయుచున్ మిగుల లాలసదీరగ జేరదీయగా
  బాలను జూసి పిల్లి వడిబారెను; తీవ్రభయార్తి జెందుచున్
  కాలుని బోలు నాసిగని కాచికమా గవి శీఘ్రగామియై
  మేలని దూరెగా తనదు మీదను దూకగ దుష్టతత్వమున్!

  రిప్లయితొలగించండి
 28. జాలిని వీడి గోవులను జంపెడి హంతలు జంకు లేక దే
  వాలయ విత్తముం దినెడి వంచకులున్ విహరింప స్వేచ్ఛ గ
  ర్వాలను జంపి చౌర్యమున పాలను ద్రావుచు నట్టి వారి పా
  పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్.

  రిప్లయితొలగించండి
 29. పాలను నుంచగనే దీ
  పాలుగ కనులున్నపిల్లి వడివడినడ "నా
  పాలనుయజమానియు "కో
  పాలంగనినంత బిల్లిభయపడి పారెన్!

  రిప్లయితొలగించండి
 30. మాలతికాయగానమృతమప్పుడువేడిగనావిరొయ్యన
  న్హేలగరింగురింగులుగహేయముగాబ్రసరించనత్తరి
  న్గాలునియొద్దకున్నరుగుకాపురుషుండునుబోలెభీతితో
  పాలనుజూచిపిల్లివడిబారెనుతీవ్యభయార్తిచెందుచున్

  రిప్లయితొలగించండి
 31. మేలుగ నటుయిటు జూచుచు
  పాలను గ్రోలంగ దూరి వాసము నందున్
  కౌలేయకముల యాలా
  పాలం గని నంత బిల్లి భయపడిపాఱెన్ !!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మేలుగ నటునిటు...' అనండి.

   తొలగించండి
 32. పాలను గ్రోల దలచి గో
  శాలను దూరియు వెదకుచు చతురత తోడన్
  మూల కతిపయ వికృత రూ
  పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్"

  రిప్లయితొలగించండి
 33. మాలిమి చేయుచు యింటను
  పాలన సలుపగ పడకల పైకెక్కంగా
  శాలీనుని ముఖమున కో
  పాలంగనినంత బిల్లి భయపడి పాఱెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చేయుచు నింటను... పైకెక్కంగన్..' అనండి.

   తొలగించండి
 34. 14, ఆగస్టు 2018, మంగళవారం

  శంఖరాభరణం వారి సమస్య

  సమస్య - *2762*


  *"పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్"*

  పూరణ

  కూలిన గోడగట్టగను కొత్తగ రంగును వేయు చుండగన్
  గోళెము నందు సున్నమును గోతము నున్నది కల్పిపాత్రలో
  మూలన బెట్టగన్ గనుచు మోహము నొందగ మూతి బెట్టి యా
  *"పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్"*

  హంసగీతి
  14.8.18

  రిప్లయితొలగించండి
 35. ఉత్పలమాల
  పాలను ద్రాగువేళ నటు ప్రక్కగ బోవుచు వెంబడించ మా
  ర్జాలము పారఁజూడ, నొకసారిగ నూగెడు నూయలెక్కుచున్
  వాలుచు దానిముందు తిన శ్వానము జూచుచు దూకరాగ జం
  పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్


  రిప్లయితొలగించండి
 36. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్

  సందర్భము: నాగులచవితి నాడు పాములకోసం గిన్నెలో పాలుపోసి పుట్ట పక్కన పెట్టారు. ఆశతో వచ్చిన పిల్లి పాములను పాలను లేదా పాములకై పెట్టిన పాలను చూసి పారిపోయింది.
  ==============================
  మేలగు నాగుల చవితిని

  బాలను నాగులకుఁ బుట్ట పక్కన గిన్నెన్

  లీలగఁ బోయగఁ బాములఁ

  బాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  14-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 37. పాలను వేడివి ముట్టగ

  వాలము ముడుచుచు వడివడి పారగ నొకచో...

  కాలిన మూతిని తలచుచు

  పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్

  రిప్లయితొలగించండి
 38. హా! కరుణానిధీ!


  మేలు బిడాల మొంటరిగ మేరిన బీచిని యాడుచుండగా

  నాలుక లారెడిన్ రొదలు నాలుగు ప్రక్కల రోదనమ్ములున్

  గోలలు కేకలున్ మిగుల గొంతుల చించెడి శోకముల్ విలా

  పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్


  మేరిన బీచి = Marina Beach, Chennai

  రిప్లయితొలగించండి
 39. వాలము త్రిప్పుచున్ వడిగ వచ్చెను పర్గున మ్యావుమంచుచున్
  పాలనుఁ జూచి పిల్లి;...వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్
  మేలగు మూషికమ్మచట మేయుట మానుచు నూలు కోకలన్...
  కాలము మారినన్ కడకు గాభర మారదె వైరిగాంచగా

  రిప్లయితొలగించండి