13, నవంబర్ 2018, మంగళవారం

సమస్య - 2845 (పందినిఁ గని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పందినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్"
(లేదా...)
"పందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై"

12, నవంబర్ 2018, సోమవారం

సమస్య - 2844 (మాఘము సంక్రమించినది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్"
(లేదా...)
"మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్"

10, నవంబర్ 2018, శనివారం

సమస్య - 2842 (లయమే శాంతిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"లయమె శాంతిఁ గూర్చు నయముగాను"
(లేదా...)
"లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారమయ్యే బండకాడి అంజయ్య గౌడ్ గారి సమస్య)

9, నవంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2841 (తోడఁ బుట్టువే...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె"
(లేదా...)
"తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!"

8, నవంబర్ 2018, గురువారం

సమస్య - 2840 (భరతుఁడు రామునకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్"
(లేదా...)
"భరతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్"

కౌస్తుభ చిత్ర బంధ సీసము


శివ ప్రార్ధన

శ్రీ శృంగి నాదా! గిరిసుత వల్లభ!  శితి
          కంఠ! కాలాంతకా! ఖరువు! హీర!
అర్ధనారీశ్వర! అలరు సాయకు వైరి!
          పంచ వదన! పశుపతి!  మలహర!
విలయ దర్శక! భూరి!జలధి తూణీరుడ!
           కరకంఠ!అనలాంబక!పరమేశ!
ఖట్వాoగి! ఉగ్రాక్ష!కామారి! ముక్కంటి!
            పురభిత్తు! మరుగొంగ! భూతరాట్టు!
అసమ నేత్ర! ఈశానుడ! అచల! శూలి!
పర్వత తనయ మది చోర! భవుడ! పాశు
పతుడ!బేసికంటి! కపర్ది! భద్ర!  నైక
మాయ!   నాకు నొసగుము శమము వినయము

ఈ  పద్యము లోని విశేషము   మధ్య  గడిలోని (పసుపు పచ్చ రంగు గల) అక్షరములు బంధించ బడినవి .
“శ్రీగిరి శిఖర దర్శనము సర్వ పాప నాశనము “   అన్న వాక్యము బందిమ్చబడినది 


                                                            బంధ కవి   పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

7, నవంబర్ 2018, బుధవారం

సమస్య - 2839 (తిమిర మ్మెల్లెడల...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తిమిర మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్"
(లేదా...)
"తిమిరము నిండు నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్"

ద్వాదశ దళ గర్భ దీప చిత్ర బంధము


   శ్రీ కృష్ణ ప్రార్ధన


(క)మలనాభా!  పోత ! గరుడ వాహన! (కా)లగమ్యా! గదాగ్రజ! కైటభారి 
(క)మలాక్ష!దైత్యారి!అమర వందిత!(మ)ధు సూధనా! హేమాoగ!సోమ గర్భ!
(క)రివేల్పు! భూజాని ! తరిదాల్పు! (చ)క్రి నందకి! నీరజోదర! దానవారి  
(క)పిల!జగన్నాధ!గరుడి రవుతు(వే)దగర్భా!  పరంధామ! గట్టు తాల్పు 
(క)ర్మేశ ! పుండరీ కాక్ష! పురుష వరా! (గా)నలోలా !  వర్దమాన! శేషి!
శ్రీ(క)రా!విక్రమా!శ్రీ జాని!వనమాలి! (లో)కనాధ! పెరుమాళ్ళు!యమ కీల!
(క)పి! పురాణ పురుష !కంసారి!(స)రసిజనాభ! దామోదర! నాగ  శయన!
(క)న్నయా !వెన్నదొంగా!యతి!విరజ!(కా)లపురుషా!మురభిత్తు!లచ్చి మగడ!     
(క)మల నయన! ధర్మి!గరుడ ధ్వజా!(మీ)నరూపుడా !వంశీధరుడ! సిరిపతి!        
( క)స్యప రూప!చక్రాయుధా! మధునిషూ ద(ను)డా!పురంధరా! తాత తాత!                                                                 
(క)రి నేస్తి!  శ్రీధరా !కంబుపాణీ!  నేత! (చ)క్ర  ధారీ! హరీ! సంకు దారు!  
(క)రుణాంత రంగా!జగపతీ శుభాం(గా)! వరాహమూర్తి!శిఖండి!రమ్య నేత్ర!  
దేవకీ సుతా! గోపాల! దీన బాంద
వా! జగద్రక్షకా!సూరీ! వాసు దేవ!,
కాచు మయ్య చక్రీ వేణు గాన లోల 
సర్వ కాలమీ దీనుని చల్ల గాను                                               
  ఇది సీస పద్యము శ్రీకృష్ణ ప్రార్ధన :  (క) అను అక్షరము మధ్యలో బంధింప బడినది  క  అక్షరంతో సీస పద్యములోని పాదములు మొదలు  అవుతాయి (ఒక్క పాదములో తప్ప ) .  ముందుగా   క   తో 1  వ గడి (బాణము గుర్తు  గల)లో నుంచి మొదలు పెట్టాలి  (కమల నాభా) అన్న పదము తో మొదలు పెట్టి గరుడ వాహన  దగ్గిర ఆపి పైన గల (కా) తో కలుపుకొని (కాలగమ్యా) అని 

చదువుకొంటూ క్రిందకు వచ్చి  మరల (క)  తో కలుపుకొని  ప్రక్క గడిలో పాదము చదువుకోవాలి  అలా  12 వ గడిలో (రమ్య నేత్ర) అని చదివి  క్రింద  ప్రమిదలోని  తేట గీతి మొదటి పద్యపాదము  (దేవకీ సుతా) తో మొదలు పెట్టి  (వాసు దేవా) అని పదము తోటి ముగించాలి ఈ బంధములో విశేషము తేట గీతి లోని చివరి రెండు పాదములు పైన దళ మల  కొసలలో బంధించ బడినవి (వాసు దేవ)  చదివిన తర్వాత 1 వ దళము కొసలో గల  (కా)  తో తిరిగి మొదలు పట్టి వరుసగా   (కాచుమయ్య చక్రీ , వేణుగాన లోల  సర్వ కాల మీ దీనుని చల్ల గాను)  అని ప్రతి అక్షరము కలిపి చదివితే    పద్యము ముగుస్తుంది 
 
బంధ కవి పూసపాటి కృష్ణ సూర్య కుమార్