11, నవంబర్ 2018, ఆదివారం

సమస్య - 2843 (కప్పను గని పాము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కప్పను గని పాము కలఁతఁ జెందె"
(లేదా...)
"కప్పను గాంచి పాము వడఁకం దొడఁగెన్ గడు భీతచిత్తయై"

109 కామెంట్‌లు:

  1. పెద్ద కర్రతోడ వేగంబుగా వచ్చి
    సద్దు చేయుచుండి శమనుని గతి
    భీతి గలుగజేయు నాతని నచట వెం
    కప్పను గని పాము కలఁతఁ జెందె.

    రిప్లయితొలగించండి


  2. అబ్బు రమగు తావు నాంధ్ర దేశమరయ
    కప్పను గని పాము కలఁతఁ జెందె,
    నిర్భ యమ్ము గాను నివసించె నవి రాజు
    లెల్ల నాదరింప లెస్స గాను


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నాగపూజలు మీ తమిళనాడులోనే ఎక్కువండీ!

      తొలగించండి
  3. కప్పను తిని మురిసి గొప్పగ పడుకొని
    చుప్పుగ కలలు గనుచుండు వేళ
    చప్పుడు వినినంత చెప్పులతోడ వెం
    కప్పను గని పాము కలఁతఁ జెందె

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    🕉🙏నమశ్శివాయ 🙏

    ముప్పొనరించు మృత్యువని , ముక్తినిడున్ శివుడంచు , లింగమున్
    గప్పెను రెండు చేతుల మృకండునిపట్టి ., యముండు జేరియున్
    జప్పునఁ బారె లింగగతశక్తియుతున్ బసివానిఁగాంచుచున్ !
    కప్పను గాంచి పాము వడఁకం దొడఁగెన్ గడు భీతచిత్తయై !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మంటలందు చిక్కె మండూకమొక్కటి
      పట్టి చంపనెంచి పాము వచ్చె !
      నగ్నివలయమధ్యయై వెక్కిరించెడి
      కప్పను గని పాము కలతఁజెందె !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. *తింటే.. రోగం వస్తుందనే భయం..* 😀😀

      ఇప్పటి సర్పరాజమది , ఇంచుక శుభ్రత హెచ్చు దీనికిన్ ,
      చప్పున మ్రింగబోదు కలుషమ్మగు కప్పనటంచు విన్నదా
      కప్ప , తటాలునన్ బురద గన్పడ దూకెను ., పంకలిప్తయౌ
      కప్పను గాంచి పాము వడఁకం దొడఁగెన్ గడు భీతచిత్తయై !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

  5. గొప్పగ పండియున్న వరి కుప్పలు కాపల గాయగోరుచున్

    చెప్పులు కాళ్ళకున్ తొడిగి చేతిన లాంతరు,కర్రబట్టుచున్

    సప్పము కాటువేయునని చప్పుడు జేయుచు నేగుచున్న వెం

    కప్పను గాంచి పాము వడకం దొడగెన్ గడు భీతచిత్తయై

    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాత పద్యమును సా....గదీసి కలరింగ్ ఇచ్చాను...ఇలా చేయగూడదేమో????🤔🤔🤗🤗😀😀

      తొలగించండి
    2. సాగ దీయుటన్న సామాన్యమా స్వామి
      సాధనమ్ము చాల జేయవలయు
      నేటి పూరణికుల నిధియు వేంకప్పయే
      సత్యమిదియె గాద శాంతి భూష!
      😀🙏🏻

      తొలగించండి
    3. సత్తెమె...
      విట్టుబాబు పలుకు లెట్టు దప్పు..??
      😢😢😢

      తొలగించండి
    4. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. జీవులు బ్రతుకవలయును చింతలేక
    తెగువ జూపి ప్రాణంబును దీయలేను
    క్షుత్తుకై జీవహింసతో శోకమేల?
    "కప్పను గని పాము కలఁతఁ జెందె".

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      సమస్యాపాదం ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాసారు. నా సవరణ....
      జీవులు బ్రతుకవలె చింత సుంతయు లేక
      తెగువ జూపి యుసురు దీయలేను
      క్షుత్తు కొరకు హింస శోకింపగా నేల
      కప్పను గని పాము కలఁతఁ జెందె.

      తొలగించండి
  7. చప్పున నైంద్రజాల ఘన
    చాతురి చిందగ చిత్రచిత్రమౌ
    మెప్పుల బొందు కార్యములు
    మెండుగ సల్పెడి మంత్రగానినిన్ ;
    డప్పుల హోరులోన పలు
    డంబపు బల్కుల బల్కు మాయ వెం
    కప్పను గాంచి పాము వడ
    కం దొడగెన్ గడు భీతచిత్తయై .

    రిప్లయితొలగించండి
  8. శాస్త్ర వేత్త సృష్టి చాతుర్య మొప్ప గా
    పెద్ద కప్ప పుట్టె భీకర ముగ
    దాని తినగ నెంచి దరి జేర నయ్యె డ
    కప్పను గని పాము కలత చెందె

    రిప్లయితొలగించండి
  9. డా. పిట్టా సత్యనారాయణ
    చంపు, కొంప గూల్చు సాయుధుల్!రండని
    ఇల్లు, వాకిలిచ్చు నిలను ప్రభుత
    గొప్ప రక్షకాళి కొమరొప్ప నుండగ
    "కప్పనుగని పాము కలత జెందె"!

    రిప్లయితొలగించండి
  10. చేత కఱ్ఱ బట్టి చేనులో వడివడి
    పుడమి యదురు నట్లు నడుచుకొనుచు
    చేను గట్టు మీద చేరువై వచ్చు వెం
    "కప్పను గని పాము కలఁతఁ జెందె"

    రిప్లయితొలగించండి
  11. కొంగ జపము జేసి కోరితినగ చేప
    బయట తిరుగు చున్న తోయ సర్పి
    గగన మందు నెగయు గరుడుని గాంచగ
    కప్పను గని పాము కలఁతఁ జెందె

    రిప్లయితొలగించండి
  12. తప్పుప్రకృతికెదురుతప్పుడుపనులంచు
    నెత్తినోరుగొట్టిమొత్తుకున్న
    వినకశాస్త్రవేత్తలనుగుజీవిసృజింప
    కప్పనుగనిపాముగలతజెందె

    రిప్లయితొలగించండి
  13. తనదు మార్గమేమొ తాబోవ కుండగ
    నరుల పలకరింప నాడుఁ జొచ్చె
    భీతిఁ జెంది యొకడు విసరు నా తాళపుం
    *"గప్పనుఁ గని పాము గలఁతఁ జెందె"*

    (తాళాన్ని తాళంకప్ప అనడం కద్దు.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువులు శ్రీ సూరంవారి సూచనతో...చిన్న మార్పు

      తనదు మార్గమేమొ తాబోవ కుండగ
      నరుల పలకరింప దరికి నరిగె
      భీతిఁ జెంది యొకడు విసరు నా తాళపుం
      "గప్పనుఁ గని పాము గలఁతఁ జెందె"

      తొలగించండి
    2. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. ముంగిసవలె నొక్క యంగీని ధరియించి
    వేగమపుడు పెంచి విస్తృతముగ
    నడవియంత దిరుగు నవ్వేషధారియౌ
    కప్పను గని పాము కలఁతఁ జెందె"

    రిప్లయితొలగించండి
  15. చెప్పులు కిర్రుకిర్రుమన,చేతికి గజ్జెలకర్ర దాల్చియున్
    కుప్పలు నూర్చు వారి కడకున్ వడి సాగుచు భీకరంబుగా
    నిప్పులుఁగ్రక్కు మున్సబును,నిర్మల భావ విదూరుడైన వెం
    కప్పనుఁగాంచి పాము వడఁకం దొడగెన్ గడు భీత చిత్తయై.

    రిప్లయితొలగించండి
  16. డా. పిట్టా సత్యనారాయణ
    గొప్ప యరణ్య వాసముల క్రూర మృగంబుల గూల్చరాదనన్
    జప్పబడెన్ సమానతలు చావగ జూచుటె కొండజాతులన్
    అప్ప!యిదేమి మేనకయె నన్ని మెకంబుల కొక్క చోటి(జూ,zoo)డన్
    కప్పను గాంచి పాము వడకం దొడగెన్ గడు భీతచిత్తయై!(పొము కప్పను,పులికన్న బలవంతుడగు మనుజుడు పులిని చంపరాదను జీవకారరుణ్యమొకవైపు అడ్డురాగా తికమక పడినది పాము.)

    రిప్లయితొలగించండి
  17. డొ.పిట్టా నుండి(..)లలో పొము టైపాటు,అది పాము గా చదవండి.

    రిప్లయితొలగించండి


  18. తప్పిన చిన్ని బల్లి తన దారిని, భీతిని గాంచె దగ్గిరన్
    కప్పనుఁగాంచి, పాము వడఁకం దొడగెన్ గడు భీత చిత్తయై
    చప్పుడు లేక దగ్గిరిని చాకువలెన్ దిగి ముక్కుతోడుగా
    గప్పున పట్టి లాగగను గ్రద్ద! స్వభావము సంభవమ్ముగాన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బిలేబీ గారూ,
      చినచేపను పెదచేప.... బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. జిలేబీ గారూ!
      ప్రకృతి రీతిని సింపుల్‌గా తేల్చేశారు. భలే
      👌🏻👏🏻🙏🏻😁

      తొలగించండి

    3. కంది వారు కొత్త పేరెట్టేరు :)

      విట్టు బాబు గారు నెనరులు !


      జిలేబి

      తొలగించండి
  19. మొప్పగ శంకరయ్యయె సమూహము నందున నొప్పుఁ దప్పులన్
    చప్పని పద్యముండున? విచారణ జేయగ వింత గాదులే
    చెప్పగ లేని చిత్రమనఁ! జేవనుఁ గల్గిన పూరణమ్ములన్
    *"గప్పనుఁ గాంచి పాము వడఁకం దొడఁగెన్ గడు భీతచిత్తయై"*

    మొప్పగ = నేర్పగ
    (ఉత్తరాంధ్రలో వాడతారు ఈ పదాన్ని..." ఇదిగో వీడు అమాయకుడు. వాడే అన్నీ మొప్పుతున్నాడు. అల్లరి వెధవ"...ఇలా.
    మరి ఆంధ్రభారతిలో వెతికితే ఈ అర్థం దొరకలేదు. మరేదైనా నిఘంటువులో ఉందేమో..ఈ పదం. ప్రస్తుతానికైతే "నేర్పు" అనే అర్థంలో వాడేశాను)
    🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొప్పు ... ఆపద అనే అర్థంలో 'ముప్పు'కు రూపాంతరంగా ఉన్నది.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారూ..
      ఐతే శంకరాభరణం అనే సముద్రంలో కాస్త పద్యానికి ప్రాణశక్తినిచ్చే 'మొప్ప' అనే అర్థాన్ని తీసుకుందాం...
      😃🙏🏻

      తొలగించండి
  20. ఎలుక మీద నెక్కి యేనుగు విహరించె
    కప్పను గని పాము కలఁతఁ జెందె
    కాకి కోకిల వలె గానమాడెను; వింత
    గాదు! నేను కవిని కాగ వింత!

    రిప్లయితొలగించండి
  21. పాకుకొనుచువచ్చిభక్షించెవేగమె
    కప్పను గని పాము, కలఁతఁ జెందె
    పామునోటనుండిప్రాణభయముతోడ
    ప్రాణమనినబ్రీతిప్రాణులకిల

    రిప్లయితొలగించండి
  22. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    *"కప్పనుఁ గని పాము గలఁతఁ జెందె"*

    సందర్భము: పాముల దీనావస్థ.. నే నెప్పటినుంచో వ్రాయా లనుకుంటున్న భావం.
    పాములు మనుష్యులను కరుస్తాయి మామూలుగా.. కేవలం ఆత్మ రక్షణ కోసం మాత్రమే! కాని పాము కరిస్తే మాత్రం విషం తొలగించుకొని ప్రమాదంనుండి బయటపడడానికి మనుష్యున కెన్నో మార్గా లున్నవి. పాముకు లేవు మానవుడు బాదితే చావునుంచి తప్పించుకోవడానికి..
    పాము దొరికితే దాని ప్రాణాలు పోయిందాకా కొట్టకుండా వుండలేడు నరుడు. నరుడు కనిపిస్తే పాము కరువవచ్చు కరువకపోవచ్చు. కరిచినా ప్రమాదం లేకపోవచ్చు. మందులు మంత్రాలు ఆస్పత్రులు పరిచారకులు ఎన్నో వున్నాయి మనకు. పాము క వేవీ పాపం!
    ఒక పాము తనను చావ బాదడానికి దుడ్డు కర్రతో పరుగెత్తుకొని వచ్చిన వెంకప్ప అనే వానిని చూసి ఇలా అనుకుంటున్నది దీనంగా.. తీవ్రంగా..
    ఇందులో ఆటవెలది సమస్యను తేటగీతిలోకి మార్చి పూరించడం మరో విశేషం..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "ఎన్నియో ఔషధా, లెన్నియో యాస్పత్రు,
    లెందరో సేవకు లుందురు గద!
    ఎందరో మంత్రగా ళ్లీ నరాధములకు
    నా కాటునుండి ప్రాణాల బ్రోవ..
    దుడ్డు కర్రను బట్టి నడ్డి విరుగ గొట్టి
    వీడు నా ప్రాణాల వీడ జేయు..
    మేముఁజత్తుమటంచుఁబామొక్కటియురాదు.
    నను గావ నెది లేదు నరుని నుండి..
    నరుని కన్నఁ గ్రూరుడు, పాపి ధరణి లేడు..
    కావగా నింక మా పాలి దేవు డేడి?
    కడకు ని ట్లాయె" నంచు వేంకప్పనుఁ గని
    పాము గలఁతఁ జెందెడిఁ దీక్ష్ణ భావనముల..?

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    10.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ పూరణ ఛందో వైవిధ్యంతో, ప్రశస్తంగా ఉన్నది. అభినందములు.

      తొలగించండి
  23. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2843
    సమస్య :: కప్పను గాంచి పాము వడఁకం దొడఁగెం గడు భీతచిత్తయై.
    *కప్పను చూచి పాము భయంతో వణకసాగింది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: కద్రువ కుమారుడైన కాళీయుడు అనే సర్పరాజు యమునా నదిలోని కాళిందీ మడుగులో ఉండేవాడు.
    “నాకు, నీకు, మన కందఱికీ, సర్వజీవులకు చివరికి బ్రహ్మదేవునికి కూడా తండ్రి యైనవాడు, జగత్పిత, అంతటా వ్యాపించియుండే విష్ణుమూర్తి అగు శ్రీహరి నేడు బాలకృష్ణుడుగా ఉండి దుష్టశిక్షణ చేస్తూ ఉన్నాడు. యమునా నదికి నీటికోసం వచ్చే ప్రాణుల మరణానికి కారణమౌతూ ఉండిన కాళీయుని శిక్షింపదలచి ఆ సర్పం యొక్క పడగలపై తాండవనృత్యం చేశాడు చిన్నికృష్ణుడు. కృష్ణుని పాదఘాతములను భరింపలేక తాళలేక ఆ పాము భయంతో వణకసాగింది” అని కాళీయ మర్దన ఘట్టమును గోపబాలకులలో ఒకరు మఱియొకరికి విశదీకరించే సందర్భం.

    అప్పడు నాకు నీకు మన కందఱికిన్ హరి విష్ణుమూర్తియై
    యప్పడు సర్వజీవులకు నప్పడుబ్రహ్మకు, బాలకృష్ణుడై
    తెప్పున నాడి కాళియుని దిప్పలు పెట్టుచునుండ తాళలే
    కప్పను గాంచి పాము వడఁకం దొడఁగెం గడు భీతచిత్తయై.
    (నేటి నా యీ సమస్యాపూరణలో భావ సౌందర్యం కోసం యతి విషయంలో కొంత వెసులుబాటును తీసికొనడం జరిగింది.)
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (11-11-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      వైవిధ్యమైన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      అఖండయతిని పెక్కురు కవులు యథేచ్ఛగా ప్రయోగిస్తున్నారు. పరవాలేదు.

      తొలగించండి
  24. కైలాసంలో శివునికి రోజుకొక కొత్త పాము ధరించే యలవాటు. ఉన్నట్టుండి పాముల కొరత ఏర్పడింది. అడవిలో వెదకంగా
    చిన్న పాములు దొరికినవి. శివుడు వాటిని కైలాస ప్రజలకు ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చి పెంచమన్నాడు. ప్రజలదరూ పాలు పోసి పెంచుతున్నారు.

    వెంకప్ప(నేటి వెంగళప్ప) కూడ పెంచుతున్నాడు. అఙ్ఞానంతే మిక్కిలి వేడి పాలను పాముకు తాపబోతాడు. అప్పుడు వెంకప్పను చూసి పాము కలత చెందే సందర్బం ...

    ఒక్కరికొక పాము నొసగుచు శంకరు
    డాఙ్ఞ తోడ పెంచమనుచు చెప్పె,
    వేడి పాలు త్రాగ వేగలేక మది వెం
    కప్పను గని పాము కలత జెందె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      తెనాలి రామకృష్ణుడు పెంచిన పిల్లి కథను గుర్తుకు తెచ్చారు.

      తొలగించండి
  25. చొప్పగడ్డి వేయ చూడగానెద్దుకు
    తుప్పలందు తాను తోడు "టార్చి"
    చేతకర్రబట్టి చీకటి నడచు వెం
    కప్పను గని పాము కలఁతఁ జెందె.

    రిప్లయితొలగించండి
  26. ఆకలయ్యెననుచు ఆహారము నకంచు
    వెడలె పాము యొకటి యేరు బట్టి(వెంట)
    కప్పయొక్కటైనకనగలేదాయెవెం
    కప్పనుగని పాము కలతజెందె!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గంగాప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాము + ఒకటి' అన్నపుడు యడాగమం రాదు. రెండవ పాదంలో యతి తప్పింది. "ఆహారమున కంచు। నేగె నొక్క సర్ప మేరు దరికి" అనండి.

      తొలగించండి
    2. సవరణతో:
      ఆకలయ్యెననుచు ఆహారమునకంచు
      నేగెనొక్క సర్పమేరుదరికి
      కప్పయొక్కటైన కనగలేదాయె వెం
      కప్పనుగని పాము కలతజెందె!!

      తొలగించండి
  27. కప్పల జత మింగి కదలగ లేనట్టి
    యురగమొకటి యచట చెరువు చెంత
    మిడత వెంట పడెడు మిసమిస లాడెడు
    కప్పను గని పాము కలఁతఁ జెందె.

    రిప్లయితొలగించండి
  28. ఇప్పటిదేమి కాదుగద యిట్టిసమస్యలు చాలపాతవై
    కుప్పలు గాను పండితులు కూరిమి జూపుచు పూరణమ్ములన్
    జెప్పిరి గాదె గాంచగను చిత్రమదేమన రాత్రివేళ వెం
    కప్పను గాంచి పామువడకం దొడగెన్ గడు భీతచిత్తయై.

    రిప్లయితొలగించండి
  29. భీము రణము జూచి భీతిల్లె రారాజు
    కర్ణ దాన గుణము ,కమల నాభు
    కచ్చె రువుగలిగెగ ,కదనమూ ఢాంధ సు0
    కప్ప ను గని పాము కలత జెందె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర అర్థం కాలేదు.

      తొలగించండి
  30. వడి వడి నరుదెంచి బాలకుం డొక్కఁడు
    సవ్వ డించుకయును జల్ప కుండ
    వేగఁ దెచ్చి యంత బాగుగ దుప్పటిం
    గప్పను గని పాము కలఁతఁ జెందె

    [కప్పను = కప్పఁగా]


    ఎప్పుడు వచ్చు చిక్కు లవి యెక్కడ యేరికి నెట్లెఱుంగ గా
    నిప్పుడమిం గలట్టి జను లెన్నఁడు నేర్తురు తప్ప శక్యమే
    యప్పను దల్చి చిత్తమున నచ్చటి ముంగిస, మ్రింగ వచ్చుచుం
    గప్పను, గాంచి పాము వడఁకం దొడఁగెన్ గడు భీతచిత్తయై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  31. రవీందర్ గారూ,
    కరుణరసాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చప్పుడు చేయకే మురిసి చక్కని భుక్తి లభింపనున్నదన్
    కప్పను గాంచి పాము వడఁకం దొడఁగెన్ గడు భీతచిత్తయై;...
    చెప్పెద చక్కగా వినుము చిత్రపు గాధ జిలేబి నేడిటుల్:
    పప్పును చంపనున్ గనిరి బారెడు జందెపు బాపనయ్యనున్!

    రిప్లయితొలగించండి
  33. ఆకటం దపించు నట్టి పామొక కప్పఁ
    గాంచి పొంచి మ్రింగఁగాఁ గడంగెఁ
    జప్పున నట గెంతి తప్పించుకున్నట్టి
    కప్పను గని పాము కలఁతఁ జెందె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది అభినందనలు
      ఏం చేయను?.... నేనే తుమ్మి నాకు నేనే "చిరంజీవ!" అనుకున్నా. 😁

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు.
      మీ పూరణకు మీరుగాక సరియైన వ్యాఖ్య ఇంకెవరు పెట్టగలరు ?
      పూరణ చాలా బాగుంది, వ్యాఖ్య ఇంకా బాగుంది గురువుగారూ.

      తొలగించండి
    3. శంకరాభరణ మనేకులతోఁ గూడు కున్న యేకాకి లా విరాజిల్లు చున్నది. కారణము దైవజ్ఞాతము!

      తొలగించండి

    4. நீங்க பூரணம் பண்ணா நல்லா இல்லாம எப்படி இருக்கும் :)


      ஜிலேபி

      తొలగించండి
    5. ఆర్యాంబా! మీరు తమిళమైనా తెనుగు లిపి లో వ్రాసిన కొంతలోకొంతైనా అర్థమవుతుంది!

      తొలగించండి
    6. మీరు పూరణ చేస్తే అందంగా ఉండక ఎలా ఉంటుంది ? అని అంటున్నారు.

      తొలగించండి
  34. చప్పుడుచేయకుండగనుజారునిచెంతకునేగుచుండువెం
    కప్పనుగాంచిపామువడకందొడగెన్గడుభీతచిత్తయై
    యప్పుడునామెయున్మిగులనారడినొందుచుగేకవేయగా
    యప్పురపెద్దలందఱునునైక్యతతోడనబాముజంపిరే

    రిప్లయితొలగించండి
  35. శయ్యయైపీఠమై జందెమాయుధమునై
    కవ్వపుంతాడుముర్గనుడునయ్యు
    హరిభుజకీర్తులై యగజజోదరబంధ
    మైహరుహారమైమగువలకును
    ముప్పుజప్పుననాపు
    సప్పమొప్పదుకప్ప
    నెప్పుడుతప్పెంచినిప్పుగ్రక్కె
    గొప్పజెప్పగనెంచి"కప్పనుగనిపాము
    కలతజెందె"ననుటకవి ఉవాచ
    పురము"కప్పనుగాంచిపా
    మువడకందొ
    డగెనుగడుభీతచిత్తయై"
    సుగమమగునె?
    కుప్పకావలివెంకప్పదెప్పరమున
    మండ్రకప్ప,తాళంకప్ప-మాన్యులొప్ప

    రిప్లయితొలగించండి
  36. శయ్యయైపీఠమై జందెమాయుధమునై
    కవ్వపుంతాడుముర్గనుడునయ్యు
    హరిభుజకీర్తులై యగజజోదరబంధ
    మైహరుహారమైమగువలకును
    ముప్పుజప్పుననాపు
    సప్పమొప్పదుకప్ప
    నెప్పుడుతప్పెంచినిప్పుగ్రక్కె
    గొప్పజెప్పగనెంచి"కప్పనుగనిపాము
    కలతజెందె"ననుటకవి ఉవాచ
    పురము"కప్పనుగాంచిపా
    మువడకందొ
    డగెనుగడుభీతచిత్తయై"
    సుగమమగునె?
    కుప్పకావలివెంకప్పదెప్పరమున
    మండ్రకప్ప,తాళంకప్ప-మాన్యులొప్ప

    రిప్లయితొలగించండి
  37. ఇప్పురమందు మున్ను వచియించిరి ఎన్నికలందు శుష్కమౌ
    తప్పుడు కూత లొక్కటియు తాము ఘటించఁగ లేదుగాని వా
    రిప్పుడు వత్తురా యని సహింపని యీ ప్రజఁ జూచి నాయకుల్
    చప్పుడు చేయనేఱక విచార భయంబుల పార - చూడగాన్
    కప్పను గాంచి పాము వడఁకం దొడఁగెన్ గడు భీతచిత్తయై

    రిప్లయితొలగించండి
  38. గట్టు మీదనున్న కప్పయునెగురంగ
    రాయి,కప్పరెండు రయ్యనబడ!
    పాముమూతిబగుల?బట్టగసాధ్యమా?
    కప్పనుగనిపాము కలతజెందె!

    రిప్లయితొలగించండి
  39. పెద్ద పుట్టలన్ని పెకలించ పాముకై
    పెద్ద కప్ప వచ్చె ముద్దు గాను
    ముంగి సయన నొప్ప ముఖము గల్గిన యట్టి
    కప్పను గని పాము కలఁతఁ జెందె

    నిన్నటి సమస్యకు నా పూరణ

    ఈతి బాధలందు నిత్యము కుములక
    సతియు సుతుల కతన వెతలను విడ ,
    విధికి పూజ లొసఁగు వృద్ధాశ్రమమొ , శివా
    లయమె శాంతిఁ గూర్చు నయముగాను

    రిప్లయితొలగించండి
  40. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  41. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కప్ప నొడిసి పట్టి కబళించు చున్నట్టి
    తనను గాంచి భీతి జనన మొంద
    కట్టె నంటి దరికి కసమస వచ్చు వెం
    ప్పను గని పాము గలత చెందె

    రిప్లయితొలగించండి
  42. వినాయక చవితి రోజున కుడుములు మొదలగు పిండి వంటలు తిని భుక్తాయసముతో ఇల్లు చేరి తల్లి
    తండ్రులకు సాష్టాంగ నమస్కారము చేయ బోవ పొట్ట ఇబ్బంది పడుచుండ చంద్రుడు పక పక మని నవ్వు
    తాడు. అప్పుడు వినాయకుని పొట్ట పగిలి పోతుంది . అది చూచి శివుని మెడలోని సర్పరాజు బాధ పడి
    మెడ పైకి ఎగ బాకి జటలో దాగిన చంద్రుని పైకి భయంకరముగా బుసలు కొట్టుచ్చుండ చంద్రుడు వణకెను
    అన్న భావన

    (బెణకప్ప = వినాయకుడు )

    చవితి దినమున పూజల నందు కొని భక్తు లిచ్చిన కుడుములు మెచ్చు చు తిని,
    కొన్ని వాహనమున కునిడి కొన్ని తన చేతను బట్టి మంద గమనమున తన
    మాతా పితురులకు జోత నిడు సమయమందు పొట్ట పగుల, మ్రగ్గిన బెణ
    కప్పను గని పాము కలత చెందె,శివుని గళమును వదలి, వికటముగ హసి
    తము నిడి జటలో దాగిన తమ్మి దాయ
    చెంత చేరి కాంతాళము చెంగళిoచ
    బుసలు కొట్టుచు ,బీకర విసపు కీల
    లనిడి దండెత్త వగచె విలాసి యపుడు

    రిప్లయితొలగించండి
  43. గురువు గారూ!
    సమస్య లోని "కప్ప",పూరణలో వెంకప్పగా మారినప్పుడు, వెంకప్పలోని అప్పకు "అ"కు యతి చేయవలసి వస్తుందేమో!

    రిప్లయితొలగించండి
  44. దేవిక
    ------

    (తక్షకుడను సర్పము తన తండ్రి పరీక్షిత్తు మహారాజు
    మరణానికి కారణమనే దుస్సహమగు మాటలను విని
    జనమేజయుడు సాహసంతో సర్పజాతినంతం చేయుటకై అగ్నిలో పడునట్లు సర్పయాగము చేయుచుండగా,
    చూసిన పాము మిక్కిలి భయపడి వణకెను.)
    ముప్పును దెచ్చె తక్షకుడె మోసముచే తన తండ్రి కంచు తా
    దెప్పరమున్వినంగపుడు; తెంపరియై జనమేజయుండటన్
    తెప్పలుగా నశించునటు తీండ్రపు యాగము జేయ నగ్నిలోన్
    కప్పను ; గాంచి పాము వడకం దొడగెన్ గడు భీత చిత్తయై !

    రిప్లయితొలగించండి
  45. పట్టిరడవియందు పామును నేర్పుగ
    పెట్టుచుండిరన్ని బెట్టు లేక
    దక్కె భాగ్యములని తల్వనె, తాళపు
    కప్పను గని పాము గలత జెందె.

    రిప్లయితొలగించండి
  46. ప్రస్తుత సందర్భము పొడుపుకథ
    కందము (కవి ఎవరో తెలియదు)

    కరచరణంబులు గల్గియు
    కరచరణవిహీను చేత కడు దుర్బలుడై
    జలచరుడు చిక్కుబడెనని
    శిరహీనుడు సూచి నవ్వె చిత్రము తోడన్ .

    రిప్లయితొలగించండి


  47. పాలు పోసి పోసి పడతులు పెంచగ
    సోమరి తనమున నుసూరు మనుచు
    పిరికిపంద యయ్యె! బెకబెక కూతల
    కప్పను గని పాము గలత జెందె!

    జిలేబి

    రిప్లయితొలగించండి