ఒకడు రాఘవుడనే వానితో "రెండేసి తిథులు ఒకేసారి వస్తున్నాయి.. దేనిని పాటించాలో.. చిత్రంగా ఉంది.. అమాస నియమం పాటిస్తే పాడ్యమేమో.. అని సందేహం... పూజ వ్యర్థమేమో.. అనే ఆవేదన.. గా ఉంది అని పలుకుతున్నట్లు భావన.. (నియమాలు అంత లోతుగా తెలియవు పాపం)
రాఘవ ! మాసయుగ్మముల రాక తిథిద్వయమేర్పడంగ నెం... తో ఘన చిత్రమయ్యె గనుమోయి ! యమాసయు పాడ్యమీతిథుల్ మోఘములౌచు వచ్చెనొక పూటయె ., ఫాల్గుణమాసమందునన్ మాఘము సంక్రమించినది., మార్గశిరంబునఁ గార్తికంబనన్ !
డా.. పిట్టా సత్యనారాయణ మేఘము గర్భము దాల్చ ద మోఘము మన పాప పంక్తి ముగిసె ఋతుగతుల్ యీ ఘన సైక్లోన్లే సరి మాఘము సంక్రమణమయ్యె మార్గశిరమునన్(పుణ్యాత్ములున్న చోట సస్యానుకూల వర్షములు కురిసి,దేశం సుభిక్షంగా,క్షేమంగా ఉంటుంది)
(మాఘకవి వ్రాసిన శిశుపాలవధ కావ్యానికి "మాఘము " అని ప్రఖ్యాతి కలిగింది . మార్గశిరమాసంలో రచింపబడిన ఆ మహాకావ్యానికి లేఖకుడు మాఘుని శిష్యుడు కార్తికేయుడు. కనుక మాఘానికి మరోపేరు కార్తికంగా భావన)
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2844 సమస్య :: మాఘము సంక్రమించినది మార్గశిరమ్మున కార్తికం బనన్. *మార్గశిరమాసంలో కార్తీకమాసం అని అంటూ ఉండగా మాఘమాసం వచ్చింది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: వృత్రాసురుడు ఇంద్రుని చంపదలచి యజ్ఞం చేస్తూ *ఇంద్ర శత్రు ర్వర్ధస్వ* అనే మంత్ర వాక్యంలో ఉదాత్త స్వరమును అంతమునందు ఉచ్చరించకుండా ఆది యందు ఉచ్చరించినాడు. అందువలన స్వర దోషం కారణంగా విరుద్ధఫలితం సిద్ధించి ఇంద్రునికి బదులుగా వృత్రుడే మరణించాడు అని పెద్దలు చెబుతారు. నేను మార్గశిర మాసంలో పూజ చేస్తూ సంకల్పం చెప్పుకొనేటప్పుడు మాసం పేరును తప్పుగా పలికినాను. మార్గశిరము అని చెప్పకుండా పొరపాటున కార్తీకము అని చెప్పినాను. కాబట్టి మార్గశిరంలో కార్తికము అని ఉచ్చరించినందువలన నాకు దోష నామ అఘము (పాపము) సంక్రమించినది అని ఒక భక్తుడు విచారిస్తున్న సందర్భం.
శ్రీ ఘన యజ్ఞకర్తగ విశిష్టత వృత్రు డపస్వరోక్తి పా పౌఘము నంది చచ్చె నని యందురు పెద్దలు, పూజలోన పా పౌఘము గల్గ మాసమును పల్కితి వేఱుగ, నాకు దోషనా మాఘము సంక్రమించినది మార్గశిరమ్మున కార్తికం బనన్. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (12-11-2018)
ఈ రోజు శంకరా భరణము సమస్య కప్పను గని పాము కలత చెందె సమస్య ఆట వెలది పాదము
నా పూరణము సీసములో
వినాయక చవితి రోజున కుడుములు మొదలగు పిండి వంటలు తిని భుక్తాయసముతో ఇల్లు చేరి తల్లి తండ్రులకు సాష్టాంగ నమస్కారము చేయ బోవ పొట్ట ఇబ్బంది పడుచుండ చంద్రుడు పక పక మని నవ్వు తాడు. అప్పుడు వినాయకుని పొట్ట పగిలి పోతుంది . అది చూచి శివుని మెడలోని సర్పరాజు బాధ పడి మెడ పైకి ఎగ బాకి జటలో దాగిన చంద్రుని పైకి భయంకరముగా బుసలు కొట్టుచ్చుండ చంద్రుడు వణకెను అన్న భావన
ఆ ఘన చంద్ర శేఖరుడు హాయిని సంఖ్యలు కూడుచుండగా శ్లాఘము చేయుచున్ కవిత శస్త్రము లస్త్రము లెక్కుపెట్టుచున్ లాఘవ రీతినెన్నికలు లాగగ ముందుకు ముక్కుపట్టుచున్ మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్
అంతా గురువు గారిదీ, మీదీ దయ. ఇటీవల, రెండేళ్ళ క్రితం నేను శంకరాభరణంలో చేరిన క్రొత్తల్లో పుటలు చదివి వృత్తములు పూరించుచున్నాను...రోజుకు ఐదు తక్కువ లేకుండా. అప్పట్లో మీరు నాకిచ్చిన చేయూత మరువజాలనిది. కానీ ప్రయత్నం లేక నా పురాణ, వ్యాకరణ, సంస్కృత జ్ఞానములు సున్నా...కాలక్షేపం బటాణీని.
రాఘవు డనువా డొక్కడు
రిప్లయితొలగించండివాఘోరా నదికి జేరి పామరు డగుటన్
మేఘములు క్రమ్మ ననుకొనె
మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్.
మూర్తి గారూ,
తొలగించండిపామర వాక్యంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మేఘము కురియగ నరుసము
రిప్లయితొలగించండిరాఘవ రాముడు దాటె రయమున జలధిన్
లాఘవ మునవైద్యుని ప్రతిభ
మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ, మూడవ పాదాలలో గణదోషం. "రాఘవ రాముండు... లాఘవమున వెజ్జు ప్రతిభ..." అనండి.
మేఘము కురియగ నరుసము
తొలగించండిరాఘవ రాముండు దాటె రయమున జలధిన్
లాఘవ మునవెజ్జు ప్రతిభ
మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్
ఆఘాత్యము జేసి మురిసి
రిప్లయితొలగించండిమేఘములు కురిసి వెలియగ మే నెలలోనే
రాఘవ రాముని దయతో
మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్ :)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిరాముని దయ ఉంటే కాని దేమున్నది? మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వెలయగ' టైపాటు!
టైపాటు కాదు సార్! పొరపాటే!
తొలగించండినిన్నటి function లో మీరు నాతో చాలా సేపు ముచ్చటించుట మహదానందము!
__/\__
దాదాపు కార్యక్రమం చివరి వరకు ఉన్నారు. కాని ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు.
తొలగించండికోడలి ఆజ్ఞను శిరసావహించి late Kate కాకుండా జారుకొంటిని :)
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఒకడు రాఘవుడనే వానితో "రెండేసి తిథులు ఒకేసారి వస్తున్నాయి.. దేనిని పాటించాలో.. చిత్రంగా ఉంది.. అమాస నియమం పాటిస్తే పాడ్యమేమో.. అని సందేహం... పూజ వ్యర్థమేమో.. అనే ఆవేదన.. గా ఉంది అని పలుకుతున్నట్లు భావన.. (నియమాలు అంత లోతుగా తెలియవు పాపం)
రాఘవ ! మాసయుగ్మముల రాక తిథిద్వయమేర్పడంగ నెం...
తో ఘన చిత్రమయ్యె గనుమోయి ! యమాసయు పాడ్యమీతిథుల్
మోఘములౌచు వచ్చెనొక పూటయె ., ఫాల్గుణమాసమందునన్
మాఘము సంక్రమించినది., మార్గశిరంబునఁ గార్తికంబనన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరాఘవు వీక్షణం బునను రాయిని మార్చెను నాతిగా యటన్
రిప్లయితొలగించండిలాఘవ మందునన్ జలధి లంకన జేయగ ప్రాభవం బునన్
మేఘము వర్షమున్ కురియ మేలగు నంచును మానవా ళికిన్
మాఘము సంక్రమిం చినది మార్గశి రంబునఁ గార్తికం ననన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్షమించాలి
తొలగించండి" కార్తికం బనన్ "
డా.. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిమేఘము గర్భము దాల్చ ద
మోఘము మన పాప పంక్తి ముగిసె ఋతుగతుల్
యీ ఘన సైక్లోన్లే సరి
మాఘము సంక్రమణమయ్యె మార్గశిరమునన్(పుణ్యాత్ములున్న చోట సస్యానుకూల వర్షములు కురిసి,దేశం సుభిక్షంగా,క్షేమంగా ఉంటుంది)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గతుల్ + ఈ' అన్నపుడు యడాగమం రాదు.
రాఘవ! నీకిది తగునె య
రిప్లయితొలగించండిమోఘముగాఁ జెప్పు పద్యము నటంచును నా
కీ ఘప్రాస నిడుట? యే
మాఘముసంక్రమణమయ్యె మార్గశిరమునన్?
రిప్లయితొలగించండికంది వారికి రాఘవ లారెన్స్ రిటార్టు :)
రాఘవ లారెన్సట తా
జాఘని కి సవరము జేర్చి సదనములోనన్
లాఘవముగ చెప్పెను పో!
"మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్"!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ (రిటార్ట్) పూరణ బాగున్నది. అభినందనలు.
(మాఘకవి వ్రాసిన శిశుపాలవధ కావ్యానికి "మాఘము "
రిప్లయితొలగించండిఅని ప్రఖ్యాతి కలిగింది . మార్గశిరమాసంలో రచింపబడిన
ఆ మహాకావ్యానికి లేఖకుడు మాఘుని శిష్యుడు కార్తికేయుడు. కనుక మాఘానికి మరోపేరు కార్తికంగా భావన)
మాఘమహాకవీంద్రుడదె
మంజులభంగి రచించు కావ్యమే
" మాఘము " గన్ బ్రశస్తి గనె ;
మార్గశిరంబున బూర్ణమాయెలే ;
యా ఘనకావ్యలేఖకుడు
నా కవిశిష్యుడు కార్తికేయుడే ;
" మాఘము " సంక్రమించినది
"మార్గశిరం " బున "గార్తికం " బనన్ .
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
లాఘవమున శాస్త్రజ్ఞుల
రిప్లయితొలగించండిమోఘపు సృష్టి యొనర్చియు మోదము గూర్ప న్
మేఘము లావృత మయ్యె ను
మాఘము సంక్రమణ మయ్యె మార్గ శి ర మునన్
రెండవ పాదం లో సృష్టి యొనరించి అని సవరణ చేయ డ మైనది
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిరాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిమాఘమునన్ వివాహములు మార్గశిరంబున మార్గళీ వ్రతాల్
యే ఘడియన్ ముహూర్తములు యిప్పుడు పెళ్ళెటులన్న దృక్కుల
న్నాఘ సుమేఘపంక్తిబడి(ఆఘమేఘాలమీద అనే జాతీయం)నందరు గావలెనన్న ద్రిప్పిరో(శాస్త్ర దృక్
మాఘము(marriage season)సంక్రమించినది మార్గశిరంబున కార్తికంబునన్!
డా.పిట్టా నుండి
రిప్లయితొలగించండిఆర్యొ, 3వ పాదం చివర closing bracket ) తప్పినది,అది టైపాటు.
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాఘుని బోలిన కవియట !
రిప్లయితొలగించండియేఘడియలు తెలియకున్న నేమార్చెడి యా
రాఘవుడను వాడు పలికె
"మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2844
సమస్య :: మాఘము సంక్రమించినది మార్గశిరమ్మున కార్తికం బనన్.
*మార్గశిరమాసంలో కార్తీకమాసం అని అంటూ ఉండగా మాఘమాసం వచ్చింది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: వృత్రాసురుడు ఇంద్రుని చంపదలచి యజ్ఞం చేస్తూ *ఇంద్ర శత్రు ర్వర్ధస్వ* అనే మంత్ర వాక్యంలో ఉదాత్త స్వరమును అంతమునందు ఉచ్చరించకుండా ఆది యందు ఉచ్చరించినాడు. అందువలన స్వర దోషం కారణంగా విరుద్ధఫలితం సిద్ధించి ఇంద్రునికి బదులుగా వృత్రుడే మరణించాడు అని పెద్దలు చెబుతారు.
నేను మార్గశిర మాసంలో పూజ చేస్తూ సంకల్పం చెప్పుకొనేటప్పుడు మాసం పేరును తప్పుగా పలికినాను. మార్గశిరము అని చెప్పకుండా పొరపాటున కార్తీకము అని చెప్పినాను. కాబట్టి మార్గశిరంలో కార్తికము అని ఉచ్చరించినందువలన నాకు దోష నామ అఘము (పాపము) సంక్రమించినది అని ఒక భక్తుడు విచారిస్తున్న సందర్భం.
శ్రీ ఘన యజ్ఞకర్తగ విశిష్టత వృత్రు డపస్వరోక్తి పా
పౌఘము నంది చచ్చె నని యందురు పెద్దలు, పూజలోన పా
పౌఘము గల్గ మాసమును పల్కితి వేఱుగ, నాకు దోషనా
మాఘము సంక్రమించినది మార్గశిరమ్మున కార్తికం బనన్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (12-11-2018)
కోట వారూ,
తొలగించండి'దోషనామ + అఘము'తో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండిఈ రోజు శంకరా భరణము సమస్య
రిప్లయితొలగించండికప్పను గని పాము కలత చెందె సమస్య ఆట వెలది పాదము
నా పూరణము సీసములో
వినాయక చవితి రోజున కుడుములు మొదలగు పిండి వంటలు తిని భుక్తాయసముతో ఇల్లు చేరి తల్లి
తండ్రులకు సాష్టాంగ నమస్కారము చేయ బోవ పొట్ట ఇబ్బంది పడుచుండ చంద్రుడు పక పక మని నవ్వు
తాడు. అప్పుడు వినాయకుని పొట్ట పగిలి పోతుంది . అది చూచి శివుని మెడలోని సర్పరాజు బాధ పడి
మెడ పైకి ఎగ బాకి జటలో దాగిన చంద్రుని పైకి భయంకరముగా బుసలు కొట్టుచ్చుండ చంద్రుడు వణకెను
అన్న భావన
(బెణకప్ప = వినాయకుడు )
చవితి దినమున పూజల నందు కొని భక్తు
లిచ్చిన కుడుములు మెచ్చు చు తిని,
కొన్ని వాహనమున కునిడి కొన్ని తన చే
తను బట్టి మంద గమనమున తన
మాతా పితురులకు జోత నిడు సమయ
మందు పొట్ట పగుల, మ్రగ్గిన బెణ
కప్పను గని పాము కలత చెందె,శివుని
గళమును వదలి, వికటముగ హసి
తము నిడి, జటలో దాగిన తమ్మి దాయ
చెంత చేరి, కాంతాళము చెంగళిoచ
బుసలు కొట్టుచు ,బీకర విసపు కీల
లనిడి దండెత్త వగచె విలాసి యపుడు
పూసపాటి కృష్ణ సూర్య కుమార్ బంధ కవి గుంటూరు
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండికందపాద సమస్యకు మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారు నిన్నటి పూరణము ఒక్కసారి చూడండి
రిప్లయితొలగించండిమాఘుడువ్రాసినకావ్యము
రిప్లయితొలగించండిమాఘము,సంక్రమణమయ్యెమార్గశిరమున
న్మాఘము,కావ్యముదలపన
మోఘముగావ్రాయబడుటముదముగనుండెన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిప్రకామాఘము -
ప్రకామ -అధిక
అఘ - దుఃఖము
ప్రకామాఘము - అధికమైన దుఃఖము
ఋతువులు మారి పోతే దుఃఖదాయకమే
అలాంటి అధికమైన దుఃఖము సంక్రమించినది
దు
జాఘనిరాయుడంట మన జానకి మాతను గాంచె లంకలో!
మా ఘన సార్వ భౌమ! వినుమా!అనుమానమదేల సీతయే
రాఘవ! రావణాసురుని రచ్చకుదీయుచు చంపుమీ! ప్రకా
మాఘము సంక్రమించినది మార్గ శిరంబునఁ గార్తికం బనన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిహమ్మయ్య! ప్రకామాఘము సరి యే అన్నమాట !
జిలేబి
అద్భుతం! తీసుకోండి మూడు వీరతాళ్ళు...
తొలగించండికానీ వృత్తంలో జిలేబి లేదుగా...ఇంకొకటి వ్రాయండి...
తొలగించండిఅయ్యబాబోయ్ ! జీపీయెస్ వారు
దీనికే తల ప్రాణం జాఘని కొచ్చింది :) నా వల్ల కాదండి :)
జిలేబి
గురువు గారు మాసములూ ఋతువులూ తారుమారు చేశారు కాబట్టి "ఘ-గ" ప్రాస మైత్రి చెల్లును...
తొలగించండిరాఘవ!న్యాయమేయిదియరాయలుసెప్పుటయివ్విధంబుగన్
రిప్లయితొలగించండిమాఘముసంక్రమించినదిమార్గశిరంబునగార్తికంబనన్
మాఘముకార్తికంబునకుమార్గశిరంబునకున్నదేయెటన్
నీఘనప్రాసయేయగునునించుకబంధములెంచిచూడగన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దేవిక
రిప్లయితొలగించండి-----
మాఘము నందు పుత్రుని వివాహమె సేయగ నిర్ణయంబవన్
మాఘము కంటె ముందుగను మాన్యుల కోర్కె దీర్చ తండ్రియే
తా ఘనమౌ విధిన్ జరిపె మార్గశిరంబున రేయి వెల్గులన్
మాఘము సంక్రమించినది మార్గశిరంబున గార్తికంబనన్ !
దేవిక గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నిర్ణయించగన్... మాన్యుల కోరిక...' అనండి.
దేవిక
తొలగించండి----
ధన్యవాదాలు గురువుగారూ! సవరించుకుంటాను.
ఆ ఘనుడౌ సంస్కృతకవి
రిప్లయితొలగించండిమాఘుడు వ్రాసెనొక కృతియె మానిని వినుమా!
యా ఘనమౌ కావ్యమ్మది
మాఘము సంక్రమణమయ్యె మార్గశిరమునన్
మాఘుడు వ్రాసినట్టి మహి మాన్విత కావ్యమమోఘ గ్రంథమౌ
రిప్లయితొలగించండిమాఘము సంక్రమించినది మార్గశిరంబున, గార్తికంబునన్
మేఘన చెప్పగా విని సమీక్షను వ్రాయగ నెంచినాను గా
దే ఘనతన్ నెఱంగితిని ధీమతి యైన కవీంద్రుఁ మెచ్చితిన్
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"ఘనతన్ గ్రహించితిని" అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
నిన్నటి సమస్య స్వీకరింప మనవి
పాదము లెక్కువ అయినందున సమస్యాపాదాన్ని తేటగీతి
లోనికి మార్చి పూరించాను . క్ష మిం చ వ ల యు ను .
వానదేవర పై పాట పాడుకొనుచు ,
కుర్ర లొక లావు బెకమును కర్రకు తల
క్రిందుగా గట్టి , మోయు చూరేగి , కడకు
నూరి బయటికి గొనిపోయి పారవేయ -->
వేపమండలతో గట్టి వేయబడిన
కప్పను కనినంతనె పాము కలత జెందె ! !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
గురుమూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్యా పాదాన్ని స్థానభ్రంశం చేయవచ్చు కాని మార్చరాదు.
మాఘము ముందున వచ్చును
రిప్లయితొలగించండిఔఘమ్మున ఫలితమిచ్చు మార్గశిరమ్మౌ
వ్యాఘాతమదేల వినగ
మాఘము సంక్రమణమయ్యె మార్గశిరమునన్!!
దేవిక
రిప్లయితొలగించండి----
రాఘవుడను విద్యార్థియె
మాఘమనియె తడబడుచును మార్గశిరమునున్ ;
మాఘమనిన విని గురువనియె
మాఘము సంక్రమణమయ్యె మార్గశిరమునన్ !
మాఘుడుని యడగ, జెప్పెను
రిప్లయితొలగించండిమేఘములోరవి వెడలెను, మేనా యదియే
ఓ ఘోటము బారదు, యటు
మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్
🙏🙏🙏🌹🌷🌹
ఓఘద సత్కథ మఱి యవ
రిప్లయితొలగించండిదాఘము తీర్పంగ సముచితము నాకు మహౌ
మోఘమ్ము కావ్య రత్నము
మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్
[ఓఘదము = ఉపదేశము నిచ్చునది, మాఘము = మాఘ విరచిత కావ్యము]
దాఘము ప్రేమకై వర వితానమునం దొనరంగ నగ్నికిన్
మోఘము కాక యుండగను మూరి ధరించఁగ భార్య సప్త ఋ
ష్యౌఘ సతీ మతల్లు లట శ్యామ యరుంధతి దక్కఁ దోఁచ భీ
మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్
[భీమ = అఘము = భీమాఘము: మహాపాపము; మార్గ శిరము = (బ్రతుకు) మార్గము యొక్క చివర; కార్తికము = షట్కృత్తికలకు (సప్తర్షుల భార్యలు) సంబంధించినది]
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
ఆ ఘన చంద్ర శేఖరుడు హాయిని సంఖ్యలు కూడుచుండగా
శ్లాఘము చేయుచున్ కవిత శస్త్రము లస్త్రము లెక్కుపెట్టుచున్
లాఘవ రీతినెన్నికలు లాగగ ముందుకు ముక్కుపట్టుచున్
మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్
అలవోకగా ముత్యాల్లా వృత్తాలు జాఱు వాఱు చున్నవి!
తొలగించండిఅంతా గురువు గారిదీ, మీదీ దయ. ఇటీవల, రెండేళ్ళ క్రితం నేను శంకరాభరణంలో చేరిన క్రొత్తల్లో పుటలు చదివి వృత్తములు పూరించుచున్నాను...రోజుకు ఐదు తక్కువ లేకుండా. అప్పట్లో మీరు నాకిచ్చిన చేయూత మరువజాలనిది. కానీ ప్రయత్నం లేక నా పురాణ, వ్యాకరణ, సంస్కృత జ్ఞానములు సున్నా...కాలక్షేపం బటాణీని.
తొలగించండి__/\__
Kameswara Rao Pochirajuజనవరి 26, 2017 11:18 AM
తొలగించండిహ! హ! శాస్త్రి గారు మనసారా నవ్వించారు!
తస్మాదపరిహార్యే౽ర్థే న త్వం శోచితుమర్హసి|
మాఘునికావ్యంబెయ్యది?
రిప్లయితొలగించండిశ్లాఘధనుర్మాసపూజ సవితునకేలా?
ఏఘడియబుట్టెగీతిల?
మాఘముసంక్రమణమయ్యెమార్గశిరమునన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమాఘుడు శిశుపాలవధ న
మోఘముగా సంస్కృతమున మురువగు రీతి
న్నాఘోషించిన గ్రంథమె
మాఘము, సంక్రమణమయ్యె మార్గశిరమునన్
ఆఘనుడచ్యుతుండునని యర్జునఖేదముడించి మోదగం
రిప్లయితొలగించండిగౌఘముకన్నమిన్నయగు గానసుధామృతగీతతత్త్వమా
మోఘమనంతచింతన మపూర్వమఘాంతకమీయ భూమికిన్
మాఘముసంక్రమించినది ;మార్గశిరంబునగార్తికంబనన్
మేఘన నామిక యనెనెటు
రిప్లయితొలగించండిమాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమున ?
న్నోఘన యవధాని బలికె
లాఘవమది సరిగలేక లాహిరి బట్టెన్
ఓఘడియమాఘపూజలు
రిప్లయితొలగించండిఓఘడియన సంకురాత్రి!నోర్పునజూడన్
ఆఘనత సినిమావారిదె
మాఘముసంక్రమణ మయ్యె!మార్గశిరమునన్
బాగుంది మీ పూరణ.అభినంధనలు.
తొలగించండినా ప్రయత్నం :
రిప్లయితొలగించండికందం
మేఘన సాగరులఁ గలుప
మాఘమున ముహూర్తమనెడు మానికి వరుడున్
లాఘవమున దక్షిణ నిడ
మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్
ఉత్పలమాల
మేఘన సాగరుల్ గలిసి మేదిని నొక్కటి గాగ కోరినన్
మాఘ ముహూర్తమున్ దెలుప మార్చఁగ వేడిరి కార్తికంబుగన్
లాఘవమొప్ప దక్షిణలు రంజిల నీయఁగ బాపనయ్యకున్
మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్