7, నవంబర్ 2018, బుధవారం

సమస్య - 2839 (తిమిర మ్మెల్లెడల...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తిమిర మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్"
(లేదా...)
"తిమిరము నిండు నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్"

59 కామెంట్‌లు:

  1. విమలమ్మగు మానసమున
    కమలాక్షుని గొల్చి గొల్చి జ్ఞానము కొరకై
    సమరమ్మున గెల్చు వరకు
    తిమిర మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్ :)

    రిప్లయితొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
    అజ్ఞానాంధకారాన్ని గురించిన చక్కని పూరణతో శుభారంభం చేసారు. బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతా మీ దయ! ఈ పండుగ రోజున న్యస్తాక్షరి వస్తుంది, నాకు సెలవని భావించగ, ఇంత మంచి సమస్య దొరకడం నా భాగ్యమే...

      దీపావళి శుభాకంక్షలు!

      తొలగించండి


  3. గమనింప జిలేబీ! పడ
    తి! మిరమ్మెల్లెడల నిండు, దివ్వెలు వెలుఁగన్
    తమ మది లో జ్ఞానంబుగ
    సమతా దృష్టియు పెరుగన సభ్యత గూడన్


    జ్ఞానదీపావళి
    శుభాకాంక్షలతో
    లేహ్య జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. కాని 'మిరమ్ము'...?

      తొలగించండి

    2. మిర - మర్యాద అని ఆంధ్రభారతి‌ అంటే ను :)

      మర్యాద నిండు ?


      జిలేబి

      తొలగించండి
  4. సమభావము పెంపొందిన
    యమవా సనుతొల గించు నంధుల కైనన్
    మమతను పంచిన చాలును
    తిమిర మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుగన్

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    *అందరికీ దీపావళి శుభాకాంక్షలు*

    ప్రమిదల నూనె వత్తులను ప్రజ్వలనంబొనరించి కాంతులన్
    ప్రమదులు దీపతోరణములన్ సమకూర్చగ , నంధకారమే
    యమరగనేగు తొఱ్ఱల గుహాంతరసీమలకట్టిచోటులన్
    తిమిరము నిండు., నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  6. క్రమతన్ సర్వవిధంబుల
    నమలినసంతోష దీప్తి అన్నివిధాలన్
    శమియించ జగములందున
    తిమిర, మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్"

    రిప్లయితొలగించండి
  7. (58 రోజుల నిరాహారదీక్ష చేసి రాష్త్రసాధనకై అమరజీవి
    అయిన పొట్టి శ్రీరాములు గురించి తెలుగువాడి భావన )
    సమరము జేసినావు గద
    సంకుచితాత్ములు దద్దరిల్లగా ;
    తమకపు భక్తితో తెలుగు
    తల్లికి మల్లెలమాల వైతివా !
    అమరుడవైన నిన్ను గని
    యాంధ్రుల గుండెలలోన నెప్పుడున్
    దిమిరము నిండు నెల్లెడల
    దీపము లెన్నియొ వెల్గుచుండినన్ .

    రిప్లయితొలగించండి


  8. తమ మది కశ్మలమ్ములను, తాసికమాసికలన్, జిలేబి వీ
    డి మనుజు లెల్ల మారక వడిన్ సఖి మత్తుల తేలుచున్న, నీ
    మములను తోసిపుచ్చిన, సమాజవికాసము కోరకున్నచో
    తిమిరము నిండు నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. ప్రమిదలు వెలిగించ తొలగు
    తిమిరమ్మె ల్లేడల; దివ్వె లు వెల్గు న్
    ప్రమదలు కాల్చుటపాసుల
    సుమ నోహర కాంతులీని శోభ లు గూర్ప న్

    రిప్లయితొలగించండి


  10. "సుమతీ!వరసగ వెలిగిం

    పుము దీపమ్ములు; బ్రతుకగు పున్నమి వెలుగుల్

    తిమిరము వెడలి" యని పిలిచి

    తిమి రమ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుగన్



    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷




    రిప్లయితొలగించండి


  11. తమ మది కల్మషముల వీ
    డి మనుజులిక మారకన్ పడిగె బుసబుసలన్
    తమకము తో బతుకన్ , సఖి,
    తిమిరమ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. సమరమున సత్య నరకుని
    సమయించి వ్యధలను తీర్చ సంప్రీతి సతుల్
    ప్రమిదలను పెట్టగ, విరిసెను
    తిమిర మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్

    రిప్లయితొలగించండి
  13. కమలాప్తు డస్తమించగ
    తిమిరమ్మెల్లడల నిండె, దివ్వెలు వెలుగన్
    సమయించు జీకటులవియె
    విమలమ్మగు మానసమున వెలిగించంగన్!

    అందరికీ దీపావళి శుభాకాంక్షలు!💥💥💥

    రిప్లయితొలగించండి


  14. ప్రమదలు ప్రమోదమున దీ

    పములను వెలిగింపగ కడు ప్రమిదెల నందున్

    క్రమముగ నలుదిశల తొలగి

    తిమిరమ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుగన్


    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷




    రిప్లయితొలగించండి


  15. సముచితముగ మానసమున
    తమస్సులు తొలంగ భువియు తనివాఱగనన్,
    ‌కమలా తొలగును కదవే
    తిమిరమ్మెల్లెడల, నిండు దివ్వెలు వెలుఁగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2839
    సమస్య :: తిమిరము నిండు నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్.
    *దీపాలు ఎన్ని వెలుగుతూ ఉన్నా అంతటా చీకటి వ్యాపిస్తుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: పదహాఱువేల మంది స్త్రీలను చెఱపట్టినవాడు, అదితి యొక్క కర్ణకుండలములను వరుణుని ఛత్రమును అపహరించినవాడు, బల గర్వంతో లోకములను పీడించేవాడు అగు నరకాసురుని వధించేందుకు సత్యభామతోపాటు శ్రీకృష్ణుడు ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్లినాడు. యుద్ధంలో నరకుడు మరణించగా అతని భార్య “అయ్యో ఇప్పుడు నేను విధవరాలినయ్యాను. నాకు కష్టాలు మొదలైనాయి. తమ కష్టాలు తొలగిపోయినాయని ప్రజలందఱూ ఆనందంతో వెలిగించిన దీపాలు అంతటా ప్రకాశిసిస్తూ ఉన్నా నా మనస్సులో మాత్రం కష్టమనే చీకటి నిండిపోతూ ఉన్నది కదా” అని విలపించే సందర్భం.

    సమరము జేసె సత్య మనసా వచసా ఘన కర్మణా, భయం
    బమరెను నాకు, నే విధవ నైతిని నాథుని గోలుపోయి, నే
    డమరెను దీపకాంతులు ప్రజావళి గూర్పగ, నా మనమ్మునన్
    తిమిరము నిండు నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (7-11-2018)

    రిప్లయితొలగించండి
  17. కం: అమరుం "డెడిసన్" చేసిన
    చమురే లేనట్టి దివ్వె చక్కగ వెలుగున్
    ప్రమిదల వెలు గేపాటిది !
    "తిమిర మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్"

    రిప్లయితొలగించండి
  18. కం: అమరుం "డెడిసన్" చేసిన
    చమురే లేనట్టి దివ్వె చక్కగ వెలుగున్
    ప్రమిదల వెలు గేపాటిది !
    "తిమిర మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్"

    రిప్లయితొలగించండి
  19. రమణీ రమణులు గూడిరి
    భ్రమలన్ తొలగంగజేయ భ్రాతల్ సుతలున్
    ప్రమిదలు వెలిగించంగా
    తిమిరమ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుగున్!!

    రిప్లయితొలగించండి
  20. satyanarayana@gmail.com
    డా. పిట్టా సత్యనారాయణ
    (పెంజీకటి కవ్వల నెవ్వడు....భాగవతము)
    (కరుణామయ్ కో భాతా హై॥తమ్ కే పర్దే మే ఆనా..హిందీ ఛాయావాద్ రచయిత్రో)
    తిమిరపు వెలుపల గ్లేశపు
    దమియగు పరమేశ్వరుండు దాగిన; వాడే
    రమణుండవ రా, రమ్మని
    తిమిరమ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుగన్

    రిప్లయితొలగించండి
  21. తమమును వీడుచు సాత్విక
    మమరగ మహనీయ రాగ యశమును గనగన్
    ప్రమదపు కాంతులు బాపును
    తిమిరమ్మెల్లెడల; నిండు దివ్వెలు వెలుగన్!

    రిప్లయితొలగించండి
  22. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అమవసి దినమున నరకుడు
    ప్రమథన మొందగ నెలమిని ప్రమదలు రేయిన్
    ప్రమిదల నుంచగ నడగెన్
    తిమిరమ్మెల్లెడల నిండు దివ్వెలు వెలగన్

    రిప్లయితొలగించండి
  23. విమలమ్మౌ సద్గుణములు
    దమ,శమముల గల్గ జేయ ధారుణి లోనన్
    క్రమ రీతిగ దొలగును గద!
    తిమిర మ్మెల్లెడల ;నిండు దివ్వెలు వెలుఁగన్
    **)(**
    ('నిండు' క్రియా శబ్దాన్ని విశేషణంగా మార్చటం జరిగింది.)

    రిప్లయితొలగించండి
  24. శమ్ము దమంబు మోక్షముల సాధన లేమిని యంతరంగమున్
    తిమిరము నిండు, నెల్లెడల దీపములెన్నియొ వెల్గుచుండినన్
    కుములును దీరకే తమిని కూడని కాంక్షల వెంట బర్వుచున్
    భ్రమరము బోలగా దిరుగు భ్రాంతిని, శాంతిని గోలుపోవుచున్!

    రిప్లయితొలగించండి
  25. ...పూజ్య గురుదేవులకు, కవిమిత్రులెల్లరకు దీపావళి శుభాకాంక్షలు.....

    సమరస భావము నెలకొని
    సుమములు విరియగ భువియను సుందర వనిలో
    క్రమముగ దొలగగ నమవస
    తిమిర మ్మెల్లెడల, నిండు దివ్వెలు వెలుగన్!!!

    రిప్లయితొలగించండి
  26. కమనీయమ్ముగ మా యిం
    ట మైమఱచి పాటలం దడరి తమిఁ గనుమా
    ప్రమద మ్మది మీఱఁ బఱచి
    తిమి ర మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్


    ప్రమిదల తో జనవ్రజము పబ్బము సల్పుచు నుండఁ జేతిఁ దా
    కమియును వే మతాబు లవి కాల్చఁ గనుల్ సెదరంగ రోగ దా
    యి మహిని నీ వెలుంగును సహింపఁగ లేక తటిల్లతా ద్యుతిం
    దిమిరము నిండు నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్

    [తిమిరము = నేత్రరోగము]

    రిప్లయితొలగించండి
  27. తిమిరరిపు సమ గురుని యెడ
    తి మిరమ్మెల్లెడల నిండు; దివ్వెలు వెలుఁగన్
    తిమిరము దొలగన్ పద గురు
    సముఖంబునకు, వెలుగు హృది సముచిత జ్యోతుల్

    🙏🙏🙏🌹🌷🌹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమిరారి గురుని వీడగ
      తి మిరమ్మెల్లెడల నిండు; దివ్వెలు వెలుఁగన్
      తిమిరము దొలగన్ పద గురు
      సముఖంబునకు, వెలుగు హృది సముచిత జ్యోతుల్

      తొలగించండి
  28. అమవస చీకటి రాతిరి
    విమలమతులు ప్రమిదెలందు వెలిగించిన దీ
    పములగని పాఱి పోవదె
    తిమిరమ్మెల్లెడల, నిండు దివ్వెలు వెలగన్.

    రిప్లయితొలగించండి
  29. అమవస చీకటిన్ దునుమ యంబురు హాక్షులలంకరించెడిన్
    ప్రమిదెలలోని దీపముల ప్రజ్వల కాంతులు మిన్ను ముట్టగన్
    విమలపు కాంతిగాంచుచును భీతిలి పాఱుచు నంతరింపదే
    తిమిరము, నిండు నెల్లెడెల దీపము లెన్నియొ వెల్గుచుండినన్

    రిప్లయితొలగించండి
  30. అమవసవంటిడెందమున నాత్మనెరుంగనిబాధయొజ్జలే
    సుమనసులన్ సుశీలురజూపగ యోగ్యులు?శెమ్మకింది యా
    తిమిరముదివ్వెవెల్గిడిన తీరదు ధర్మపుసూక్ష్మమెర్గుమా
    తిమిరము నిండు నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్

    రిప్లయితొలగించండి
  31. సమయునెయజ్ఞానతిమిర
    మమలినగురునెరుకదివ్వె మహివెల్గిడకన్!
    సుమనసులదయానుమతిగ!
    "తిమిర మ్మెల్లెడల నిండు: దివ్వెలు వెలుఁగన్"

    రిప్లయితొలగించండి
  32. అమలుడు సూర్యుడు గ్రుంకగ
    తిమిరమ్మెల్లెడలనిండు,దివ్వెలువెలుగన్
    జమురును నిండుగవేయుము
    ప్రమిదలలోరమ్య!నీవు భద్రముసుమ్మా

    రిప్లయితొలగించండి
  33. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కుములుచు నోడిపోవగను కుమ్ముచు కర్చుచు చీటిమాటికిన్
    నములుచు నల్లమందునహ నందన మొందుచు పార్లమెంటులో
    విమలపు జందెముం దొడిగి వీధులు బట్టగ వోట్లకోసమై
    తిమిరము నిండు నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్

    రిప్లయితొలగించండి
  34. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ద్యుమణి పొడతెంచగ చనును
    తిమిరమ్మెల్లెడల; నిండు దివ్వెల వెలుగున్
    సమయించును చీకటిలో
    సమూహనమగు వెఱనంత సాకల్యముగా!

    రిప్లయితొలగించండి
  35. అమలుడు సూర్యుడెప్పుడిలనస్తముజెందునొనప్పుడేగదా
    తిమిరమునిండునెల్లెడల ,దీపములెన్నియొవెల్గుచుండినన్
    జమురునుబోయుచుండుముర,సారెకుసారెకుదప్పకుండగన్
    బ్రమిదలలోన,నిచ్చునవిభాగ్యములెన్నియొవెల్గుచుండుచున్

    రిప్లయితొలగించండి
  36. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  37. నేటి శంకరాభరణము సమస్య

    (తిమిరమ్మెల్లెడల నిండు, దివ్వెలు వెలుఁగన్)

    ఇచ్చిన పాదము కందము

    నా పూరణము సీసము లో

    పర పాలనమ్మేల భరత మాతా? నీదు సంకెలలం ద్రెంచి సంతస మిడు
    దుననుచు పోరాడి ఘనముగా స్వాతంత్ర్యమును తెచ్చి మాకిచ్చి తనువు నొదలి
    వెడలి నావుగ! నిన్నువిడచి మే మీరీతి పండుగ చేతుము? ప్రజల గుండె బరువి
    డగ (తిమిర మ్మెల్లెడల నిండు, దివ్వెలు వెలుఁగంగ) నుపయోగ ములను పొంద

    లేము బాపూజి, దీపావళి మదిలోన
    చీకటిని పార ద్రోలదు, లోక మంత
    యేడ్చు చుండెను, నీలోటు పూడ్చ తరము
    కాద నుచు బాధ పడెనట కొందరపుడు



    రిప్లయితొలగించండి
  38. దపావళిశుభాకాంక్షలుకవిమిత్రులకుగురువర్యులకు
    అమితానందపు వెలుగులె
    తిమిరమెల్లెడల నిండు!దివ్వెలు వెలుగున్
    ప్రమిదల పరమార్థంబున
    కమనీయపు భక్తిభావ కామితమందున్

    రిప్లయితొలగించండి
  39. సమరముభువికితృతీయము
    తిమిర మ్మెల్లెడల ;నిండు దివ్వెలు వెలుఁగన్
    క్షమశమదమయమనియమా
    లమానవులు కృతయుగమునిలకురప్పింపన్

    రిప్లయితొలగించండి
  40. మీకు మీకుటుంబసభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

    సీసము:
    ధరను దాటి ధరలు తారలందున జేరె
    చేరి దించుమ నీవు "తారజువ్వ"!
    రెచ్చగొట్టి కులపు చిచ్చురేపెడివారి
    ముచ్చెలు గాల్చుమా "చిచ్చుబుడ్డి"!
    భూములనేమ్రింగు భూబకాసురులను
    భూచక్రమా! కొట్టి పూడ్చుమమ్మ
    బాబాలగుట్టులే పరికించి "డేరాల"
    బ్రద్దలజేయుమా "బాంబు"! నీవె

    తేటగీతి:
    వెలుగు పూవులనింటింట వేడ్కమీర
    రాల్చు "కాకరపూవొత్తి"! రయముగాను
    మీరలందరు గలియగ మేలుగాను
    పూర్తి "దీపాలపండుగ" పుడమి మీద.

    రిప్లయితొలగించండి
  41. ప్రమిదలు వత్తుల జేరిచి
    సమమగు తైలమ్ముబోసి సరివెలిగించన్
    సముఖమునుండక బారును
    తిమిర, మ్మెల్లెడల నిండుదివ్వెలు వెలుఁగన్.

    రిప్లయితొలగించండి
  42. నా ప్రయత్నం :

    గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు

    కందం
    తమసము నిండి యధర్మపు
    గమనము నెంచఁగ సుతు నరకాసురుఁ గూల్చెన్
    సమరమున సత్య ధర విడ
    తిమిర మ్మెల్లెడల ,నిండు దివ్వెలు వెలుఁగన్

    చంపకమాల
    తమసము నిండి ధర్మమును దప్పుచు నా నరకాసురుండటన్
    శమమును ద్రుంచినంత నల జన్మము నిచ్చిన సత్య పూర్వ జ
    న్మమున, వధించెనే! నిజము మాతగ నా హృదయాంతరమ్మునన్
    తిమిరము నిండు! !నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్

    రిప్లయితొలగించండి


  43. అమవస నిశిలో తొలగెను
    తిమిర మ్మెల్లెడల, నిండు దివ్వెలు వెలుఁగన్
    అమలంబగు కాంతి తతులు
    క్రమముగ నిండెను జగతిన కమనీయముగా.

    రిప్లయితొలగించండి
  44. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    తిమిరము నిండు నెల్లెడల
    దీపము లెన్నియొ వెల్గుచుండినన్

    సందర్భము: విమలమైన విశాలమైన కీర్తి గలవాడు.. ప్రేమ నిండిన వాడు.. దివ్య భావన మనే సరస్సులో రాజ హంస లాంటి వాడు..
    కందన వోలు కలిమూర్తి.. అయ్యో లేడు పాప మని.. నేటి దీపావళి పండుగ నాడు.. ఛాత్రుల గుండెలలో తిమిరం నిండుతున్నది దీపాలు లోకంలో వెలిగిపోతున్నప్పటికీ..

    కందనవోలు=నాగర్ కర్నూల్
    కలి మూర్తి= కపిలవాయి లింగమూర్తి
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    విమల యశో విశాలుడును
    ప్రేమ మయుండును దివ్య భావనా
    కమలిని రాజ హంసయును
    కందనవోల్ కలి మూర్తి లేడు పా
    ప మనుచు నేడు దీపముల
    పండుగ.. ఛాత్రుల గుండెలం దయో!
    తిమిరము నిండు నెల్లెడల
    దీపము లెన్నియొ వెల్గుచుండినన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    7.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  45. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    తిమిర మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్

    సందర్భము: నిండు మనము.. అనగా నిండైన మనస్సు. పరిపూర్ణతను సంతరించుకున్న మనస్సు. నిండు.. అనేది ఇక్కడ విశేషణం. Perfect అని అర్థం.
    మనుజుడు నిండు మనసు కలిగిన సుజనుడైతే ఎదుటివారి విమల.. అన్య.. గుణములను అనగా విమలములకంటె వేరైన.. తప్పుడు గుణాలను క్షమించగలడు.
    ఎలాగంటే నిండైన దివ్వెలు వెలుగుతూ వుంటే ఎల్లెడలా వున్న తిమిరం అనగా చీకటి తొలగిపోతుంది కదా!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    విమ లాన్య గుణము లెంచక
    క్షమియింతురు నిండు మనము
    గలిగిన సుజనుల్..
    విమల రుచు లెసగుఁ.. దొలగును
    తిమిర మ్మెల్లెడల.. నిండు
    దివ్వెలు వెలుఁగన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    7.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి