8, నవంబర్ 2018, గురువారం

సమస్య - 2840 (భరతుఁడు రామునకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్"
(లేదా...)
"భరతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్"

118 కామెంట్‌లు:

  1. శ్రీ రామ పట్టాభిషేకము:

    మురియుచు రాముని రాకకు
    కురియగ కన్నీరు ధార కోసలమందున్
    విరిసిన మోదము తోడన్
    భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కన్నీటి ధార సరియైన పదమనుకుంటాను!

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అన్నగారికి చెల్లెలి సవరణ... సంతోషం!

      తొలగించండి
    3. అన్నట్టు రేపే కదా 'భగినీ హస్త భోజనం'... అడ్వాన్సుగా సవరణ వడ్డించారు.
      ఆరుగురు అక్క చెల్లెళ్ళున్నా రేపు నాకు వృద్ధాశ్రమం తిండే గతి!

      తొలగించండి
    4. మనసారా " అక్కయ్యా " అనే పిలుపును పొందడం కంటే వేరే అదృష్టం ఏముంది.
      మానసికంగా నాచేతి విందును స్వీకరించాలి తమ్ముడూ.
      దీర్ఘాయుష్మాన్ భవ . దీవించి అక్కయ్య .

      తొలగించండి
  2. వరమని మోదము నొందుచు
    పరమార్ధము తెలుసు కొనగ పరమ ప్రీతిన్
    పరవశ మందున పొంగుచు
    భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్

    రిప్లయితొలగించండి
  3. కరుణించుము నన్నగ్రజ!
    ధరణీపతి వీవె నేను తథ్యము నీ కిం
    కరుడను వినుమని మ్రొక్కగ
    భరతుఁడు రామున, కొసంగెఁ బాదుక లెలమిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      విరుపుతో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  4. తరగని ప్రేమ ను జూ పు చు
    మురియుచు సోదరుని రాక మోదము గూర్పన్
    పుర జనుల oదరు మెచ్చ గ
    భరతుడు రామున కొసం గె బాదు క లెలమిన్

    రిప్లయితొలగించండి
  5. మరియాదా పురుషోత్తము
    డరణ్యపర్వము ముగించి యరుదెంచంగా
    కరుణను రాజ్యము నేలగ
    భరతుడు రామున కొసంగె బాదుక లెలమిన్

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    పరమదయాళువై యొసగె పాదుకయుగ్మము , నేగు దారి దు...
    ర్భరవనభూమి కంటకశిలామయమౌ , పితృ వాక్యపాలనా
    నిరతుని కష్టమున్ దలచి, నిద్రితుడై గని స్వప్నసీమలో
    భరతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన కరుణ రసాత్మకమైన పూరణ! నమోనమః!

      తొలగించండి
    2. శ్రీమతి సీతాదేవి గారికి నమస్సులు ధన్యవాదాలు 🙏

      తొలగించండి
    3. మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. ధరణిని నీ పాదుకలే
      పరిపాలించినవి నేటి వరకు మహాత్మా !
      త్వరనిదె బాధ్యత గొనుమని
      భరతుడు రామునకొసంగె పాదుకలెలమిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  7. సమస్య :-
    "భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్"

    *కందం**

    కరుణా సముద్ర రాముడు
    తిరిగి నయోధ్యకును జేర తిరునాలవలెన్
    పురజనులాహ్వానించగ
    భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్
    ....‌..................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తిరిగి యయోధ్యకును...' అనండి.

      తొలగించండి
  8. వరముమిషగైకగైకొనె
    ధరజావిభువసనములనుధరనేలించన్
    పెరిమనుచెప్పులగొంటని
    భరతుడురామునకొసంగెబాదుకలెలమిన్

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. వరమునెపంబునన్గొనెనువస్త్రములన్తనతల్లికైక సో
    దరునయిపాదుకాద్వయము ధారునినేలగనేలగొంటినీ
    చరణములేశరణ్యములు సాదరస్వాగతమేలుమేలనన్
    "భరతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్"

    రిప్లయితొలగించండి
  11. పరమదయామయా! పతితపావన! దీనజనావనా!భవత్
    కరుణను జూపుమా! యని యకల్మషుడై వినుతించి వేడగా
    భరతుఁడు, భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను, రామమూర్తికిన్
    కరములు మోడ్చి మ్రొక్కి శుభ కామనలం గొని యేగె నాతడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. భరతుడు రామమూర్తియనువారలు చక్కని యన్నదమ్ములా
    యిరువురునంగడిన్ గనిరి యింపగు చెప్పుల రామమూర్తి సం
    బరమున కోరగా కొనెను వాటి ఖరీదును లెక్కపెట్టకన్
    *"భరతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      లౌకిక వ్యక్తుల విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. విరివిగ రామాయణములు
    మరి యన్నిట రాముడిచ్చె; మారుపు కోరెన్
    విరచించెన్ కవి యొకడిటు
    భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్

    🙏🙏🙏🌹🌷🌹

    రిప్లయితొలగించండి


  14. అరి దశకంఠునిన్ దునిమి యా రఘురాముడు తుష్టి మీఱగన్

    ధరణిజ సీత తోడుతను ధారిణి కోసల రాజ్య మేగగన్

    పరవశులై యయోధ్య పుర వాసులు నివ్వగ స్వాగతంబులన్


    భరతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్


    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷


    రిప్లయితొలగించండి
  15. భరతుని పాఠముజెప్పుచు
    గురువడిగిన ప్రశ్నవినుచు గోవిందుడనెన్
    వరమనిభావించదలచి
    భరతుడు రామునికొసంగె పాదుకలెలమిన్
    (పరధ్యసలోగోవిందునిజవాబు)

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2840
    సమస్య :: భరతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్.
    *పాదుకలను భరతుడు రామునికి ఇచ్చినాడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: తండ్రిమాట ననుసరించి శ్రీరాముడు వనవాస దీక్ష చేస్తూ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉండగా భరతుడు రాముని సమీపించి, తిరిగి అయోధ్యకు రావలసినదిగా ప్రార్థించి విఫలుడై, రామపాదుకలను స్వీకరించి, వాటిని తన తలపై ధరించి, అయోధ్యకు సమీపంలో నందిగ్రామంలో ఆ శ్రీరామ పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. రామన్న కోసం పద్నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ఉండినాడు. రఘురాముడు రావణాసుర సంహారం చేసి పుష్పక విమానంలో ప్రయాణించి సీతాదేవితో లక్ష్మణునితో కలసి నందిగ్రామం చేరుకోగా ఇక దివ్యమైన రామరాజ్యం వస్తుంది అని అంటూ ఆ అయోధ్యారామునికి స్వాగతం పలికి భరతుడు రాముని పాదములకు పాదుకలను తొడిగిన సందర్భం.

    శిరమున రామపాదుకల జేర్చిన భక్తుడు, నందిసీమ భా
    సురమతి నన్నకై యెదురుచూచి చతుర్దశ వర్షముల్, మహ
    ద్వర మగు రామరాజ్యమని పల్కుచు, రాముడు వచ్చినంతనే
    భరతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (8-11-2018)

    రిప్లయితొలగించండి
  17. గురువు గారు ఇచ్చిన పూరణ స్ఫూర్తితో వేదాంత దేశికుల వారి శ్లోకం స్ఫురణకు వచ్చింది....
    🙏🙏🙏🌹🌹🌹 గురువు గారికి నమస్కారములతో.....


    పాదపా పాదపా పాదపా పాదపా
    పాదపా పాదపా పాదపా పాదపా
    పాదపా పాదపా పాదపా పాదపా
    పాదపా పాదపా పాదపా పాదపా



    స్థావర జంగమాలకు కలిగే దోషాలను
    తొలగించే అభిషేకతీర్థం కలది పాదుక.
    పరమవ్యూహ విభవాదులందు భగవంతుడు
    ధరించిన పాదుక సంచారం చేత ఇహలోకాలను
    రక్షిస్తుంది. భగవన్నిష్ఠ నిగ్రహానుగ్రహజనకమైన
    పాదుక అవశ్యంగా రక్షింపదగిన మాతాపిత్రాదులను
    రక్షించే వారి పట్ల శుభాన్నీ, రక్షించే దక్షత కలిగి
    ఉన్నా రక్షింపక ఉపేక్షించే వారి విషయమై
    అఏశుభాన్నీ సంకల్పిస్తుంది. భగవదనుభవ శీలురైన
    సాధుజనుల శమదమాది గుణాలను వృద్ధి పరచేది
    ఇంద్రాది లోకపాలకులను రక్షించే భగవత్పాదుకయే.
    స్వాశ్రితజనవిరోధులను శోషింపజేసే కిరణాలను కాపాడేదీ
    పాదుకయే - అని భావం. వేదాంతదేశికులవారి పాదుకా సహస్రం....


    Vedanta Desika's best verses in Sanskrit


    Paduka Sahasram



    Paadhapaa Paadhapaa Paadhapaa Paadhapaa

    Paadhapaa Paadhapaa Paadhapaa Paadhapaa |

    Paadhapaa Paadhapaa Paadhapaa Paadhapaa

    Paadhapaa Paadhapaa Paadhapaa Paadhapaa || (Chitra Paddathi, 939)

    The PaadhukA Purifies all movables and immovables of sins by means of its ablution water. The PadukAs take care of the beings in the leela vibhUthi as well as those (MukthAs and NithyAs) of SrI Vaikunta. The PaadhukA does good to those dutiful persons who kindly take care of their parents as their duty and abandons those people, who forsake this duty. The PadukAs enhance the worth, stock of self-restraint and equanimity in the fortunate ones given to the drink of the nectar of the LOrd's delectable qualities. The PadukAs dry up by its radiations, the enemies of its devotees and helps all, like Indhra to discharge their respective duties of their respective offices.

    నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం....

    రిప్లయితొలగించండి


  18. కరముల మోడ్చి నమస్సుల
    భరతుఁడు రామున కొసంగెఁ, బాదుక లెలమిన్
    శరణనుచు తలపయినిడుకొ
    ని రాజ్యమును గాచి రాముని పదముల నిడెన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిన్న మీ జీమెయిల్ కు ఒక సందేశం పంపాను. మీరు చూసారో లేదో అని క్రింద ఇస్తున్నాను.
      మన ప్రభాకర శాస్త్రి గారు 'శంకరాభరణం సమస్యలు - సరదా పూరణలు' అనే పేరుతో 116 వృత్త పూరణలతో ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించడానికి సంకల్పించారు. మొత్తం కార్యభార్యాన్ని నాపైన మోపారు.
      సాధారణంగా కవులు వెనుక అట్టమీద తమ ఫోటో, వివరాలు ముద్రించుకుంటారు. కాని శాస్త్రి గారికి అది ఇష్టం లేదు. వెనుక అట్టమీద నా పేరు, మీ పేరు, తమ మనుమరాలు 'ఇషానీ' పేరు ఉండాలని కోరుకుంటున్నారు.
      నేనెలాగూ ఆ పుస్తకానికి పీఠిక వ్రాస్తున్నాను. అందులో నుండి నాలుగైదు వాక్యాలను వెనుక అట్టమీద ప్రకటించి నా పేరు వేసుకుంటాను. నాలుగైదు వాక్యాల్లో ఇషానీ అభిప్రాయం కూడా తీసికొని అక్కడ ఆమె పేరుతో ప్రకటిస్తాను.
      ఇక మిగిలింది మీరు... శాస్త్రి గారికి మీరంటే ప్రత్యేక అభిమానం. మీ యిద్దరి సంభాషణలు హాస్యస్ఫోరకంగా, ఆహ్లాదజనకంగా ఉంటాయి. మీరు వారి గురించి నాలుగైదు వాక్యాలు వ్రాసి పంపితే వాటిని వెనుక అట్టమీద ప్రకటించి 'జిలేబీ' అన్న పేరును ఉట్టంకించాలని నా ఆలోచన.
      దయచేసి నా కోరికను మన్నించవలసిందిగా మనవి. వీలైతే రేపటి వరకు పంపించండి.
      ధన్యవాదాలు.
      మీ
      కంది శంకరయ్య

      తొలగించండి
    2. శాస్త్రి గారు వ్రాసిన ఆటవిడుపు సరదా పూరణలన్నీ మీకీ అంకితమిచ్చారు...

      తొలగించండి

    3. కంది వారికి
      జీపీయెస్ వారికి !!!!

      నమో నమః ! దీనికి తగుదునా అన్న సంశయం వస్తోంది!


      నమో నమః


      జిలేబి

      తొలగించండి
    4. వారి సమస్యాపూరణల వైవిధ్యాన్ని గురించి, వ్యక్తిత్వాన్ని గురించి మీ అభిప్రాయాన్ని సంక్షిప్తంగా తెలియజేయండి.

      తొలగించండి
    5. శంకరాభరణం లో రెండేళ్ళ క్రితం అడుగు పెట్టిన మరునాటినుంచీ నేటి వరకూ నాకు జిలేబి గారే చేదోడు వాదోడు. నిజం చెప్పాలంటే ఇచ్చటి సత్కవులను చూసి భయపడిన నాకు స్ఫూర్తి నిచ్చినది జిలేబి గారే...

      వచనం కష్టమైతే కందం ఉన్నదిగా చిన్నది 😊

      నమో నమః

      తొలగించండి
    6. శంకరాభరణం బ్లాగులో నున్న మూడువేలకు చేరబోయే సమస్యలకు ఒక్కొక్కదానికే వైవిధ్యమైన పూరణలు సత్కవులు రచియించి ఉన్నారు. నాకు తెలిసినంత వరకూ వీనిలో కొన్నింటిని ఏరి "శంకరాభరణ బృహత్సమస్యా పూరణలు" లాటి ఒక గ్రంధం ప్రచురించాలని గురువు గారి కోరిక. కానీ ఇది అన్నివిధాలా చాలా పెద్ద పని.

      అందువలన ఇచ్చటి కవిమిత్రులు ఎవరికి వారే వారికి నచ్చిన పూరణలు ఎన్నుకొని పుస్తకములను ప్రచురించినచో శంకరయ్య గారికి ఒక విధముగా శ్రమ తగ్గుతుందని నా ఉద్దేశ్యము.

      నమస్సులు!

      తొలగించండి

    7. కందమైతే సావేజిత :)

      కంది వారు రెడీ జిలేబి

      నాపై దయయుంచి ఈ మర్యాద నొసంగిన జీపీయెస్ వారికి కందివారికి నమస్సులు




      ఆటవెలదుల సయాటల
      నేటి కతల తేటగీతి నేర్పుల వృత్తా
      ల్ధాటిగ వేసిరి కందపు
      ఝాటీ అయ్యైటి గురువు శాస్త్రీజి ! నమో


      నెనరులతో
      జిలేబి :)

      తొలగించండి

    8. శార్దూలం వేయకపోతే నామనసొప్పదు కాబట్టి :)



      జీపీయెస్ మన నేటి గాధల భళా జీరాడు వృత్తంబులో
      చాపాచార్యుని మేటి శైలిని తమాషాచూడ రండీయనన్
      స్థాపించారు! జిలేబులివ్వి! సరదా సాహిత్యమై,వేడిగా
      తాపీగా మన దేశ నేతల సదా తాకెన్ సుతారమ్ముగా!


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    9. బ్రహ్మాండం! కంది వారి e-mail కు పంపండి...నమో నమః

      తొలగించండి
    10. రాబోయే మీ పుస్తకానికి నేను మత్తేభం వ్రాస్తాను తప్పకుండా..

      తొలగించండి


    11. జీపీయెస్ వారు

      శంకరాభరణ మెగా సమస్యాపూరణల కూర్పు‌ కంది వారు వేస్తే నే బాగుంటుంది. నభూతో భవిష్యత్తు కు చాలెంజ్ గా (always if some one in future can beat that mega book most welcome )


      జిలేబి

      తొలగించండి


    12. మరొక్కటి


      ఆటవిడుపుల, సయాటగ
      నేటి కతల, భరతదేశ నేతల వృత్తా
      ల్ధాటిగ భళీ పసందుగ
      ఝాటీ ఝుళిపించిరి ప్రొఫెసరు శాస్త్రీజీ!


      జిలేబి




      తొలగించండి
  19. అరులను దునిమిన రాముడు
    శరనిధి దాటియు నయోధ్య శరవేగమునన్
    దరలగ వడి నెదురేగియు
    భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్

    రిప్లయితొలగించండి


  20. కరముల మోడ్చి వందనము గావిచి కోరననుంగు తమ్ముడా
    భరతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తి! కి
    న్కరవయు లేక కాననమునన్గడి పెన్పది పైన నాల్గువ
    త్సరములు తోడు లక్ష్మణుడు,జానకి,దీవెన తండ్రియానయై

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కావించి' అనవలసింది 'కావిచి' అన్నారు.

      తొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పరపున రావణు నడచిన
    గరిమను బొందుచు నయోథ్యకన్నయె వ్రాలన్
    మురిపెముతో నెదురేగిన
    భరతుడు రామున కొసంగె బాదుక లెలమిన్

    రిప్లయితొలగించండి
  22. సరి మీరు వచ్చువరకును
    నిరతము సింహాసనమ్ము నివియేయుంతున్
    సరెయనుమని తా మ్రొక్కగ
    భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్.

    రిప్లయితొలగించండి
  23. 1పాదపా పాదపా
    పాదపా పాదపా
    .పాదపా= స్థావరాలను, అపాదపా... జంగమాలను, ఆ పాద... పొందుతున్న, పాప...పాపాలను, అత్... నశింపచేసే, అపా... అభిషేక జలం కలిగినట్టిది
    2. పాద, పా... లీలా విభూతి యైన ప్రకృతి మండలాన్ని రక్షించేది
    3. అపాద, పా.... పాద భిన్నమైన నిత్య విభూతిని కాపాడేది.
    4. పాదపా పాదపా పాద.... పాద సంబంధులైన వారు పాదులు, అంటే పదాధికారులైన ఇంద్రాదులను; ప.... రక్షించే; అ.. విష్ణువు యొక్క; పాద... చరణాలను; పా... కాపాడే పాదుక

    5. పాదపా పాదపా
    పాదపా పాదపాపాత్ , పాద.... రక్షింపదగిన మాతా పిత్రాదులను; పాపాత్... మిక్కిలి రక్షించే వారి విషయమై, అపాపాత్... మిక్కిలి రక్షకుకులునూ కాని వారి విషయమై, అపాపాత్... శుభాన్ని కల్పించేది; అపాప+అత్...సుకృతాన్ని నశింపజేసెది.
    6. అపాపాదపాపా .. అ... విష్ణువును, పాపా.. మిక్కిలి పానం చేసే (అనుభవించే) సత్పురుషులను; ద... శోధించే శమదమాది గుణాలను; పాప.... పునః పునః వృద్ధి యగునట్లు కాపాడేదీ
    7. ఆదపాపాదపా! ఆద.. (ఆశ్రితులను) ఖండించే వారిని; పా.. శుష్కింప జేసే; పాద... కిరణాలను; పా... కాపాడేది పాదుకా

    భావం ప్రసాదించిన వారు..‌ కె.వి. రాఘవాచార్య.... Father of retired I AS officer and Telangana government advisor Ramana Chary

    పాదుకా సహస్రం.... రంగనాథుని (రాముని) పాదుకల మీద ఒక్క రాత్రిలో వేయి శ్లోకాలు వేదాంత దేశికుల వారు రాసారు...


    రిప్లయితొలగించండి
  24. మరిమరి కోరెద నగ్రజ
    కరుణించి యయోధ్యనేల కదలుమటంచున్
    చరణముల వ్రాలి వేడెను
    భరతుడు రామున, కొసంగె బాదుక లెలమిన్

    రిప్లయితొలగించండి


  25. అరయన్ గైకొని తా పా
    దరక్షలను నేలెనతడు దయతో రాజ్య
    మ్మరయ, తిరిగిరాగ వెసన్
    భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  26. దురమున రావణ వటరుల
    నిరసించి, జగమున శాంతి నిలుపి మరల దా
    శరథి పురము కేతెంచగ,
    భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్.

    రిప్లయితొలగించండి
  27. (అరణ్యవాసానికి వెళ్లుతున్న రామన్నకు లక్ష్మన్న పాదసేవ )
    అరమర లేనివాడు ; సము
    దంచితసాత్వికసంయుతుండునున్ ;
    నరుదగు కీర్తిమంతుడును ;
    నా రఘురాము డరణ్యసీమకున్
    దరలుచునుండ , లక్ష్మణుడు
    దత్పదసేవనభవ్యభావసం
    భరతుడు ; భ్రాతృవత్సలత
    బాదుక లిచ్చెను రామమూర్తికిన్ .

    రిప్లయితొలగించండి
  28. భరతుడు కాదండీ, శ్రీరామక్షేమలాభరతుడు - లక్ష్మణుడు

    స్థిరముగ తాను భాతృపద సేవను నిర్మల బుద్ధి నూనియే
    వరసతి వీడి, భోగములు వద్దని, కానల నున్నకాలమున్
    హరిణముఁ గొట్టఁబోవు తరి నాతురతన్ గొని రామ-భద్ర-లా
    భరతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్

    [ఆతురతన్ గొని -> పాదుకలకు అన్వయము ]

    రిప్లయితొలగించండి
  29. గండూరి లక్ష్మీనారాయణ గారి పూరణ....

    దురమున రావణాసురుని ధూర్తుని పీచ మడంచి సీతతో
    తిరిగి యయోద్య జేరగను ధీ మతి రాముని జేరి వేడి శ్రీ
    చరణయుగాంబుజంబులను సన్మతితోడను దాకి భక్తితో
    భరతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్.

    రిప్లయితొలగించండి
  30. వర మిడు పాదుకలను ని
    న్నరసెద నన రామచంద్రుఁ డానందమునన్
    వర సోదరుండు వేఁడఁగ
    భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్

    [రాముఁడు = రామ వర్ణము (నలుపు) వాఁడు,ఇచట భరతుఁడు]


    నిరతము రాజ్య మేల నవనీ పతి రా వన వాస సిద్ధినిన్
    వర రఘు రాముఁ డంతట నవార్యము న్యాస ధరా తలార్ప ణా
    బిరతుఁడు మాండవీ ధవుఁడు వీరవరేణ్యుఁడు సత్యసంధుఁ డా
    భరతుఁడు భ్రాతృ వత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాదుకే తే తు రామస్య గృహీత్వా భరత స్స్వయమ్
      చరణాభ్యాం నరేంద్రస్య యోజయామాస ధర్మవిత్ రా. 6. 130. 52,53

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  31. ఇరుసత వరుసములు గడిచి
    తిరముగ వనవాసదీక్ష దీరగ సతితో
    నరుదెంచిన రాముని గని
    భరతుడు రామున కొసంగె బాదుకలెలమిన్!!!

    రిప్లయితొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    1984 ఆంధ్ర ప్రదేశ్ coup:

    కరమున రామ పాదుకలు గమ్మున లాగుచు పారద్రోలగా
    పరుగిడ నందమూరుడట బస్సున వేగమె బెంగుళూరుకున్
    తిరుగిట రాగ ధామమున తీర్థము జల్లుచు నెత్తిపైననున్
    భరతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్

    రిప్లయితొలగించండి
  33. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్

    సందర్భము: రామ కథ కొత్త దేమీ కాదు. రాముడు వనవా సానంతరం అయోధ్యకు తిరిగి వచ్చాక భరతుడు రాము డిచ్చిన పాదుకలను తిరిగి రామునికే అప్పగించాడు.. అదీ విషయం. కాని దానినే కొత్తకోణంలో చెప్పే ప్రయత్నం ఇది.
    ఈ పద్యంలో అన్నీ గోప్యములు.. ఊహ్యములు.. మార్మికములు.. అదీ విశేషం. శబ్ద సౌందర్యం వదలి పెట్టలేదు. అదీ విశేషం.
    *భారము తీరెను..* తరుగని భారము.. సామాన్యంగా.. సామాన్యులచేత తగ్గని భారము.. అవతార పురుషులచేత మాత్రమే తగ్గే భారము.
    ఏ మా భారము?.. అంటే భూ భారము. అది తీరెను...
    *తీరము జేరెను..* అంటే శోక సముద్ర తీరము జేరెను.. ఏమి శోకము?.. అంటే సతీ వియోగ శోకము.. అది సముద్రం వంటిది. దాని తీరం చేరెను..
    ఎవరు?.. అంటే రాముడు.. ఆ తీరము.. అయోధ్య.. అనేది. ఆ తీరము స్థిరమైనది.. సరియైనది.. చేరుకోదగినది.. అయోధ్య ఎవరిచేతా ధ్వంస మొనర్ప బడినది కాదు గదా లంకవలె!..
    *సారము మీరెను..* వర జని.. అంటే శ్రేష్ఠమైన జన్మ. అంటే అవతారము.. అవతార పురుషుని జన్మ..
    ఆ జన్మయొక్క సారము.. శ్రేష్ఠత్వము.. అతిశయించెను. అంటే లోక కంటకుడైన రావణుని సంహరించాక ఆ శ్రేష్ఠత్వ మేమిటో లోకమునకు తెలిసెను.
    అయోధ్యకు వచ్చిన తర్వాత జరిగే దేమిటి? భరతుడు రామునికి తిరిగి పాదుక లీయడమే!అంటే రాజ్యాన్ని తిరిగి అప్పగించడమే!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    *తరుగని భారము తీరెను..*

    *తిరమగు సరియగు నయోధ్య*
    *తీరముఁ జేరెన్..*

    *వర జని సారము మీరెను..*

    *భరతుఁడు రామున కొసంగెఁ*
    *బాదుక లెలమిన్*

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    8.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  34. అరయుము రాముని తమ్ముడె
    భరతుడు,రామునకొసంగెబాదుకలెలమిన్
    భరతుడు భక్తిని గొలుచుచు
    బురమున్వేంచేయుదనదుపూర్వోద్భవుకున్

    రిప్లయితొలగించండి
  35. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పరపుగ రావణాసురుని భండనమందు వధించి బిమ్మటన్
    స్ఫురతర కీర్తిమంతులగు ప్రోడలతోడ నయోథ్య కేగుదెం
    చు రఘుపతిన్ నుతించి నతి చొక్కముగా నదురంటి తుష్టితో
    భరతుడు భాతృవత్సలత బాదుక లిచ్చెను రామమూర్తికిన్

    రిప్లయితొలగించండి
  36. అయోధ్యకు తిరిగి వచ్చిన రామునితో...భరతుడు..

    కం॥
    పరుగెత్తి జింక వైపుకు,
    బరువెత్తియు వారధికిని పాదము కందెన్
    మరువగ లేనన్న!యనుచు
    భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్

    రిప్లయితొలగించండి
  37. అరయుమురాజ్యపాలననుహర్షముతోడనుదానుజేసెగా
    భరతుడుభ్రాతృవత్సలత,బాదుకలిచ్చెనురామమూర్తికిన్
    బరమపదంబులిచ్చునవి,ప్రాణముగంటెనుహెచ్చుచూచునా
    భరతునిభ్రాతృవత్సలతవాసికికెక్కెనులోకమంతకున్

    రిప్లయితొలగించండి
  38. భరియించెను రాజ్యము దు
    ర్భర వేదన తోడ రామ పాదుకలనె తా
    వరమని , రాముడు రాగా
    భరతుడు రామునకు నిచ్చె పాదుక లెలమిన్ .
    (రాముని పాదుకలు భరతుని వద్ద ఉన్నాయి. ఆయన రాగానే తిరిగి అయన చెప్పులు ఆయన కిచ్చేశాడు. దీనిలో సమస్య ఏమీ లేదు కదా? ఇలా చెప్పేశాను)

    రిప్లయితొలగించండి
  39. డా.పిట్టా సత్యనారాయణ
    ధర సింహాసన పూజల
    నరసిన బంగారు ముద్ర(కాలిముద్రలు॥పాకోళ్ళు)లారామునకున్
    వర యభిషేకాత్పూర్వమె
    భరతుడు రామున కొసంగె(నందిగనందిగ్రామములో నున్నవి)పాదుక లెలమిన్

    రిప్లయితొలగించండి
  40. డా. పిట్టా సత్యనారాయణ
    మరచెను పట్టు వస్త్రమభిమానము రాముని బంటు తా నయెన్
    పరచెను నంది గ్రామమున బంగరు పాదుక లాసనమ్మునన్
    జరచర నా యయోధ్యనిడ సాగెను వాటిని రాచ ముద్రగా
    భరతుడు భాతృ వత్సలత బాదుక లిచ్చెను రామ మూర్తి కిన్

    రిప్లయితొలగించండి
  41. డా.పిట్టా‌ సత్యనారాయణ
    సమరము కర్మ యోగమున ‌సాగుట గాదని యోగవిద్య లో
    రమణ జరించి రాక్షసవిరాట్లుగ మారిన నేటి సాధువుల్
    రమణిని, శీలసంపదల రక్తిని దోచు కొనన్, జడత్వపున్
    దిమిరము నిండు నెల్లెడల, దీపము లెన్నియు వెల్గుచుండినన్

    రిప్లయితొలగించండి
  42. తరుణియె మూలమయ్యె గద ధారుణి సంపద వీడనాడగన్
    నరయగ నీవులేని పుర మక్కర లేదికనాకటంచనెన్
    భరతుడు, భాతృవత్సలతఁ బాదుక లిచ్చెను, రామమూర్తికిన్
    సురగణ వంద్యునిన్ ఘనుని సూర్య కులాన్వయిఁ గొల్చె భక్తితో

    రిప్లయితొలగించండి
  43. సమస్యా పూరణం:
    సమస్య:
    భరతుఁడు రామున కొసంగెఁబాదుకలెలమిన్!!

    పూరణ:
    నిరతము రాముని తలపులె
    పరవశమొందగ మనమున వాసము విడువన్
    అరయగ రామునయోధ్యకు
    భరతుఁడు రామునకొసంగెఁబాదుకలెలమిన్!!
    -----యెనిశెట్టి గంగా ప్రసాద్
    కామారెడ్డి.

    రిప్లయితొలగించండి
  44. కందం
    తిరిగి యయోధ్యకు రమ్మని
    పరిపరి విధముల పొదువిన వారించఁగనే
    పరిపాలనకని మ్రొక్కఁగ
    భరతుఁడు రామున, కొసంగెఁ బాదుక లెలమిన్

    రిప్లయితొలగించండి
  45. చంపకమాల
    పరవశ మందితిన్ బరమ పావనమౌ తమ రాక వెన్నెలై
    దరిసెన మబ్బ! నీ నదిని దాటఁగఁ జేయఁగఁ గౌగిలించితే
    మురిసితి తమ్ముడై గుహుడ! మోదము దెల్పుడటంచు క్షేమ లా
    భ రతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్

    రిప్లయితొలగించండి