ప్రభాకర శాస్త్రి గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'సుందర + అభినేత్రి = సుందరాభినేత్రి' అవుతుంది. యడాగమం రాదు. "సుందరి యభినేత్రి" అనండి. నేను ఎక్కువగా (ఇప్పటికి దాదాపు 50 సార్లు) చూసిన సినిమా ఏయెన్నార్, అంజలి నటించిన 'సువర్ణసుందరి'. ఆ తరువాతి స్థానం 'మాయాబజార్'. మూడవ స్థానంలో ఉన్నది 'మిస్సమ్మ'. 6వ తరగతిలో ఉండగా సావిత్రికి ఉత్తరం రాసాను. జవాబు రాలేదనుకోండి!
డా.పిట్టా సత్యనారాయణ ఎందరొ వధువులకని బోన్ సందియమే తండ్రి శకున శాస్త్రము జదివెన్ సందున నడ్డము నేగిన పందిని గని "శంకరుండు","పార్వతి" నెంచెన్ (శంకరుండు॥తండ్రి; పార్వతి అతని కొడుకు పెళ్ళికై ఎంపిక జేయబడిన పెళ్ళిపిల్ల)
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2845 సమస్య :: పందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుడై. సందర్భం :: దేవదానవులు క్షీరసాగరమును మథించగా వచ్చిన అమృతాన్ని నేను పంచుతాను అని ఆవిర్భవించిన జగన్మోహినీ అవతారాన్ని చూచి అందఱూ మైమఱచిపోయారు. ఈ విషయాన్ని విని శివుడు ఆ సుందరి రూపాన్ని తాను చూడగోరగా విష్ణువు మరలా జగన్మోహినీరూపాన్ని ధరించి మనోహరమైన నాట్య భంగిమలో ఉండి ఎటువంటి స్పందన లేకుండా నిశ్చలంగా బంగారు బొమ్మ లాగా కనిపించగా ఆ అతిలోకసుందరిని చూచి ముగ్ధుడైన పరమ శివుడు ఈమెయే నా పార్వతి అని తలపోసినాడని ఊహించి చెప్పే సందర్భం.
అందఱి చిత్తమున్ గలచు, నందఱి నందము నందు మించు, తా నందఱి కామవృద్ధికి మహత్తర రూపిణి యౌచు నిల్చు, నా ముందర నిల్చె నిప్పు డని మోహిని నాట్య విలాస ముద్ర ని ష్పందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుడై. {నిష్పందిని = స్పందన లేకుండా ఉన్నటువంటిది.} ( నాట్య ముద్ర కారణంగా) కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (13-11-2018)
తనమీదనున్న ప్రేమను పరీక్షించ తలచి శంకరుడు పార్వతి వద్దకు పోయి భిక్షను అడిగినప్పుడు పార్వతీ దేవి భక్తితో తనకు నివేదన జేసిన సన్నివేశమును గుర్తు చేసుకుంటూ తిన్నని భక్తికినీ సంతసించి మోక్షాన్ని కలుగ జేయనెంచుతున్నట్లుగా ........
వందన మాచరించి తన వద్ద లభించిన మాంస ఖండముల్ విందుగ జూపి నీకిదె నివేదన మంచనె తిన్నడంత! తాఁ తుందిల సంతసంబునను దోషము నెంచక ముక్తి నిచ్చి పం పం, దినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై
మరో సరదా పూరణ: ఈమధ్యే పంది ప్రధాన పాత్రగా 'అదుగో' అనే సినిమా వచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే విడుదలైనరోజే పోదామని పంతం పట్టి శంకర్రావును బలవంతపెట్టి తీసుకెళ్ళింది ఆయన భార్య పార్వతి. ఇక తర్వాత చూస్కోండి. (దర్శక నిర్మాతలకు క్షమాపణలతో)
విందని మురిసె కిరాతుడు
రిప్లయితొలగించండిపందినిఁ గని;...శంకరుండు పార్వతి నెంచెన్
సుందర యభినేత్రి యనుచు
నందముతో జూసి సిన్మ నాలుగు సారుల్!
(మన కంది శంకరాచార్యులు "దేవదాసు" సినీ నటి సావిత్రి యభిమాని)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సుందర + అభినేత్రి = సుందరాభినేత్రి' అవుతుంది. యడాగమం రాదు. "సుందరి యభినేత్రి" అనండి.
నేను ఎక్కువగా (ఇప్పటికి దాదాపు 50 సార్లు) చూసిన సినిమా ఏయెన్నార్, అంజలి నటించిన 'సువర్ణసుందరి'. ఆ తరువాతి స్థానం 'మాయాబజార్'. మూడవ స్థానంలో ఉన్నది 'మిస్సమ్మ'.
6వ తరగతిలో ఉండగా సావిత్రికి ఉత్తరం రాసాను. జవాబు రాలేదనుకోండి!
__/\__
తొలగించండిసందడి జేయుచు ముందర
రిప్లయితొలగించండిఅందముగా నిలబడెకిటి యవతారమ్మే
బందము వేసిన బ్రమతో
పందినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇం దు గల దెందులేదని
రిప్లయితొలగించండిసందేహ ము లేని వాడు సర్వము నందున్
విందు గ కనుల కు కనపడ
పందిని గని శంక రుండు పార్వతి నెంచెన్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికందివర శంకరార్యా!
సందియ మా లేక ప్రశ్న సంధింపులకో?
దందడి బీజాక్షరమా
"పం", దినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్!
* ఆంధ్ర భారతి ఉవాచ -
పం - విషాలను విరిచే శక్తి కలిగిన, విషాలను హరించ కలిగిన, మంగళకర బీజాక్షరం.
శుభోదయం
జిలేబి
రిప్లయితొలగించండిశంకరుడు అనే అబ్బాయి పార్వతి అనే అమ్మాయి పెండ్లి చూపుల లో టిఫిను ఊతప్పం తిని :)
అందాలమ్మణ్ణిని తా
డెందంబరయంగ చూచి డిగనురుకులతా
తొందరగా భళి నూత
ప్పం దినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అమ్మణ్ణి... అమ్మణి... మా ఆవిడ గుర్తుకు వచ్చింది. (మా బంధువులంతా ఆమెను 'అమ్మణి' అనే పిలుస్తారు).
డా. పిట్టానుండి
తొలగించండిఆర్యా, ఆ ప్లస్ మణి,అమ్మణి కదా,సరదాగా
(పెండ్లిచూపులలో అమ్మాయి పార్వతి అందించిన స్వీటు
రిప్లయితొలగించండితిన్న అబ్బాయి శంకర్ మనోగతం )
అందిన స్వీటు ముదము దో
పం దిని ; గని ; శంకరుండు పార్వతి నెంచెన్
తొందరగనె పెండ్లాడన్
బందుగు లందరి యెదుటను బరిమళహృదితో .
జంధ్యాల వారూ,
తొలగించండిమోదకరమైన మి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికన్నప్ప భక్తితో మాంసమిచ్చునపుడు అతనిలో అన్నపూర్ణయైన పార్వతి ని చూచినాడు శంకరుడు.. అని వ్రాసే సందర్భములో... ఆదిలోనే హంసపాదు..
సుందరమైనభాష., నరసున్నలు నేర్వుము , మాంసమివ్వఁజూ...
పం దిని , చూచి యంచనగ వ్రాసితివీవరసున్న ., వాక్యపుం..
బొందిక మారిపోయినది , మూర్ఖుడ ! తప్పగు నిట్లువ్రాయగా
*పందినిఁ జూచి* శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
చిరుసవరణ... మన్నించండి 🙏
తొలగించండికన్నప్ప భక్తితో మాంసమిచ్చునపుడు అతనిలో అన్నపూర్ణయైన పార్వతి ని చూచినాడు శంకరుడు.. అని వ్రాసే సందర్భములో... ఆదిలోనే హంసపాదు..
సుందరమైనభాష., నరసున్నలు నేర్వుము , మాంసమివ్వఁజూ...
పం దిని , చూచి యంచనగ వ్రాసితివీవరసున్న ., వాక్యపుం..
బొందిక మారి , చిత్రగతిఁ బొందును ! తప్పగు నిట్లువ్రాయగా
*పందినిఁ జూచి* శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికందములను తినువానికి
రిప్లయితొలగించండిసుందరమగు గృహమును తినుచు పరుండుటకా
నందముతోడుత తాఁ జూ
పం, దినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సందేహమేలదేహమ
రిప్లయితొలగించండిమందానందాత్మకమని ,మరుతూపులలో
సుందరెదగిరి,గిరిజరూ
*"పం,దినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్"*
శంకర్జీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొంత అస్పష్టత ఉన్నది. 'సుందరెదగిరి'...?
సుందరి+ఎద=సుందరెద గిరి అనగ పార్వతి హృదయము మేరునగంలా గంభీరము మన్మధుని పూబాణంతో సహనంకోల్పోతాడుశివుడు కాని గిరిజాదేవికాదనిమా అభిమతం తప్పుంపుంటే క్షంతవ్యుణ్ణి.నా లాగే ఈసుందరి అందంగా ఉందన్నట్టు చూపుతో తిని,మనోనిగ్రహాన్ని మనసును చూసి పెళ్లికి ఓకే అన్నాడన్న భావంతో పూరణ
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఎందరొ వధువులకని బోన్
సందియమే తండ్రి శకున శాస్త్రము జదివెన్
సందున నడ్డము నేగిన
పందిని గని "శంకరుండు","పార్వతి" నెంచెన్
(శంకరుండు॥తండ్రి; పార్వతి అతని కొడుకు పెళ్ళికై ఎంపిక జేయబడిన పెళ్ళిపిల్ల)
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిపందులబెంచు (నె)యెర్కలకు బట్టును చచ్చినవారి పుట్టుకల్
సందున"ప్లేగ"(వ్యాధిపేరు)దే ప్రబల జచ్చెను భార్య యదే ముహూర్తపున్
బొందున బంది యీనె నొక బొమ్మను బోలిన యాడ కూన నా
పందిని జూచి "శంకరుడు" పార్వతి(అతని భార్య)గా దలపోసె ముగ్ధుడై
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టా నుండి,ఆర్యా,కృతజ్ఞతలు.స.పూరణలు"ఆరంభ అసాధ్యాలు"గా అచ్చు వేసికోవచ్చునేమో!పందికి శంకరునికి ముడియా!ఎలాగో గట్టెక్కినాము.
తొలగించండిసుందరి యందమున్ గనిన చోద్యము నొందుచు బ్రాంతినొం దగా
రిప్లయితొలగించండిడెందము నందునన్ మెలపు లీలలు పొంగుచు మోహినిన్ గనన్
పొందును కోరగా దరిని పూవిలు కానికి మోదమొం దగా
పందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁ డై
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని సమస్య పరిష్కరింపబడినట్లు లేదు.
కొందఱు దేనిని గని మది
రిప్లయితొలగించండినిందింతురు? ;వని దపమును నిష్ఠగ దానే
పొందుగ జేయుచు నుండగ;
"పందినిఁ గని ; శంకరుండు పార్వతి నెంచెన్"
***)(***
ఎంచెన్ = నుతించెను ; మెచ్చుకొనెను.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిసందుల నెరుకల కులముల
నందగ సంబంధమెంత హా!సహజంబో
పొందగ కట్నము,బలమగు
పంది;నిగని శంకరుండు పార్వతి(కాబోయే వరుడు,వధువులు వరుసగా)నెంచెన్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
పందులను పెంచు వణిజుడు
రిప్లయితొలగించండిహిందూ దేవతల పేర్లు పందులకొసగెన్
మందుడు వాడిట్లనె జత
పందినిఁ గని "శంకరుండు పార్వతి నెంచెన్"
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తెలగాణములో నా సరదా ప్రయత్నము 😊
రిప్లయితొలగించండిఏందిర పిల్లగాడ! అరె! యిట్టులఁ వ్రాస్తివి తప్పు గాదె!
యే
సందుల కల్లు దాగినవొ సైదుల! చిందులు వేస్తివంటె యీ
మందియె బొందఁ బెడ్తరిక! మార్చర పోరడ మందుడా గదే
*"పందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై"*
సమస్యా పాదం మొదట్లో వ్రాస్తే మరింత బాగుంటుందేమో కదా!
🤔
తొలగించండికచరా వారి తెలగాణ ముద్దు బాబు అవార్డు మీకే :)
జిలేబి
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ సరదాగా ఉన్నది. అభినందనలు.
జిలేబి గారూ!
తొలగించండిధన్యవాదాలు..ఇంతకీ ఈ కచరా ఎవరో!?
😃🙏🏻
గురువుగారు...ధన్యవాదాలు
తొలగించండి🙏🏻🙏🏻
రిప్లయితొలగించండిశంకరుడనే అబ్బాయి పెండ్లి చూపులో బుట్టలో పడిన వైనంబనెడు వృత్తము :)
సుందరి చారులోచన! కుచోన్నత కుంకుమరాగ శోణితా
యిందుముఖిన్,జిలేబి సయి యింపుగ పద్యములల్లు చుండెడా
నందిని, గుబ్బలాడి యిడియాప్పము వేయగ నాశతోడునొ
ప్పందినిఁ, జూచి, శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై!
నొప్పందిని - ఒప్ప తిని liked, ate, fell prey :)
జిలేబి
ప్రధమ పాదంలో "సంస్కృతం" వెల్లివిరిసినది సుమా!
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
'ఇడియాప్పము'...?
తొలగించండిఇడియాప్పము తినాలంటే నాయరంగడి కి వెళ్ళాలండి
బహు పసందుగా వుండును :)
http://www.telugufoodrecipes.com/food/recipedetails/2117/idiyappam-kerala-style-recipe.html
జిలేబి
భలే జిలేబి గారూ!
తొలగించండి👌🏻👏🏻🙏🏻
ఇడియాప్పం కూర్మా, ఇడియాప్పం తేంగాయ్ పాల్ భలే కాంబినేషన్లు. బెరీ బెరీ టేస్టీ..
😋😋
జీపీయసు వారికి....
తొలగించండినో కామెంట్ 🐒
పందిరి మంచమునందున
రిప్లయితొలగించండిసుందరి గనుపించలేదు చూపునమెదలన్
విందుగ ఫలహారంజూ
పం?దిని గనిశంకరుండు పార్వతినెంచెన్
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఫలాహారము' సరియైన పదం. "విందుగ ఫలములనే చూ।పం దిని..." అందామా?
రిప్లయితొలగించండిJapan Bechara weds hologram :)
కొందయటన్! హా లో గ్రా
మందమటన్! పెండ్లి యాడె మదిలో నెంచెన్
సుందరి బొమ్మైనను! పా
పం, దినిఁ, గని, శంకరుండు పార్వతి నెంచెన్
https://www.ndtv.com/world-news/2d-characters-cant-cheat-age-or-die-japanese-man-marries-a-hologram-of-hatsune-miku-1945838
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పాపం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
తొలగించండిజపాను వాడు కదా పాపం :)
జిలేబి
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2845
సమస్య :: పందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుడై.
సందర్భం :: దేవదానవులు క్షీరసాగరమును మథించగా వచ్చిన అమృతాన్ని నేను పంచుతాను అని ఆవిర్భవించిన జగన్మోహినీ అవతారాన్ని చూచి అందఱూ మైమఱచిపోయారు. ఈ విషయాన్ని విని శివుడు ఆ సుందరి రూపాన్ని తాను చూడగోరగా విష్ణువు మరలా జగన్మోహినీరూపాన్ని ధరించి మనోహరమైన నాట్య భంగిమలో ఉండి ఎటువంటి స్పందన లేకుండా నిశ్చలంగా బంగారు బొమ్మ లాగా కనిపించగా ఆ అతిలోకసుందరిని చూచి ముగ్ధుడైన పరమ శివుడు ఈమెయే నా పార్వతి అని తలపోసినాడని ఊహించి చెప్పే సందర్భం.
అందఱి చిత్తమున్ గలచు, నందఱి నందము నందు మించు, తా
నందఱి కామవృద్ధికి మహత్తర రూపిణి యౌచు నిల్చు, నా
ముందర నిల్చె నిప్పు డని మోహిని నాట్య విలాస ముద్ర ని
ష్పందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుడై.
{నిష్పందిని = స్పందన లేకుండా ఉన్నటువంటిది.} ( నాట్య ముద్ర కారణంగా)
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (13-11-2018)
కోట వారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండిసందులు గొందులు దిరుగుచు
రిప్లయితొలగించండినెందును రుచ్చములు గనక నేడ్వగ , శివుకున్
విందున పాయసముం జూ
పం , దినిఁ ,గని శంకరుండు పార్వతి నెంచెన్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శివునకున్' అనడం సాధువు.
శంకరుడు అనే యువకుడు తనకు వంటవచ్చిన అమ్మాయే భార్యగ రావలయుననికోరి అమ్మాయి తో వంటచేయించి రుచిచూసి పార్వతి అనే కన్యను పెండ్లియాడాడని యూహించి...........
రిప్లయితొలగించండిఅందరు వలదన్న బహుప
సందుగ వంటలను జేయు జవ్వని యనుచున్
సుందరి చేసిన యూత
ప్పందిని గని శంకరుండు పార్వతినెంచెన్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందముగ నిల్పి భూమినిఁ
తొలగించండిజిందులు వేయుచు మురారి చిత్క్రీడల నం
దందఁ దిరుగు చుండం దొలి
పందినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్
అందియ లల్ల ఘల్లు మన నందము లొల్కు సతీ మతల్లి తా
నం దిడఁ బంచ భక్ష్య పరమాన్నము లింపుగఁ బళ్ళెరమ్మునన్
స్కంద గురుండు విశ్వపతి కల్మష కంఠుఁడు గానఁ దోలుచుం
బందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై
“స్వీయ కుక్షి యో ర్పందిని” అని వ్రాయుటకు నరసున్న యాటంకమైనది!
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅందమ్మగు కనకాంగిని
పొందుగ పెండ్లాడ గోరి పోవగ విందున్
బూంది నొసంగ ముదముదో
పం దిని కని శంకరుండు పార్వతి నెంచెన్
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డెందముపార్వతిమయమై
రిప్లయితొలగించండియందఱిజీవంబులందుయముననుజూడన్
బొందుగనాక్రమమందున
పందినిగనిశంకరుండుపార్వతినెంచెన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యమున'...?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
"ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి
భ్రామయన్సర్వ భూతాని యంత్రారూఢాని మాయయా"
అందరి హృత్తులందునను హాయిగ దాగుచు పర్వశించుచున్
సుందర సత్యరూపిణిగ శోభిలి శాశ్వత నందమొందుచున్
మందిర మధ్యనున్ వెలసి మాయలు జేసెడి మాతృమూర్తిగా
పందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై
:)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పరవశించు' అన్నదానికి 'పర్వశించు' అన్న రూపాంతరం లేదు.
కొందఱుకొంటెవారపుడుకొంటెతనంబునకొట్టిరేగదా
రిప్లయితొలగించండిపందినిజూచి,శంకరుడుపార్వతిగాదలపోసెముగ్ధుడై
యందముతోడభాసిలినయాయమలక్ష్శినిజూచియత్తఱిన్
నందముజూడగానెవరికైననుగల్గునుజిత్తవిభ్రమున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విభ్రము' అన్న పదం లేదు.
రిప్లయితొలగించండికంద పద్య పాదము సీసములో నా పూరణము
తనను బంధించి పాతాళ లోకమున దాచగ తన మొర విని చక్ర ధరుడు
కడలి లోన హిరణ్యకశిపుని పట్టి చంపి తనకు రక్ష కల్పించ, నపుడు
భూదేవి హర్షమ్ము పొంది ఘనముగ నమసముల నిడె పరవశము నొందు
కనులతో (పందినిఁ గని, శంకరుండు పార్వతి నెంచె నె)లమితో, రతిపతి మృతి
చెంద బెదరిన నగజాత సుందర వద
నమును గాంచి నీలగళుడు నగవు మోము
తోడ నాతి గళము పైన త్రాడు గట్టి
బాసవాలు రెదుట నాడె పరిణయమ్ము
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ ఛందో వైవిధ్యంతో బాగున్నది. అభినందనలు.
సుందరమైనది నగరము
రిప్లయితొలగించండిఅందరికానందమయము కాశీపురమౌ
మందమతివేడ్కతోచే
పం,దినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్!!
---యెనిశెట్టి గంగా ప్రసాద్
కామారెడ్డి
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మన్మథుడు వేసిన బాణముల వలన శంకరుని మనస్సు చలించినదని దేవతలు సంతసించు సందర్భము ........
రిప్లయితొలగించండిబృందారక బృందంబుల
మందానందంబు జెందె మరుశరములఁ దై
నందిన యాహారము దో
పం దినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్
తనమీదనున్న ప్రేమను పరీక్షించ తలచి శంకరుడు పార్వతి వద్దకు పోయి భిక్షను అడిగినప్పుడు పార్వతీ దేవి భక్తితో తనకు నివేదన జేసిన సన్నివేశమును గుర్తు చేసుకుంటూ తిన్నని భక్తికినీ సంతసించి మోక్షాన్ని కలుగ జేయనెంచుతున్నట్లుగా ........
వందన మాచరించి తన వద్ద లభించిన మాంస ఖండముల్
విందుగ జూపి నీకిదె నివేదన మంచనె తిన్నడంత! తాఁ
తుందిల సంతసంబునను దోషము నెంచక ముక్తి నిచ్చి పం
పం, దినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అందరి యెదుటను పలికెడి
రిప్లయితొలగించండిచందంబును నేర్వనట్టి ఛాత్రుం డనియెన్
నందిని ననుటకు తడబడి
పందినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్.
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముందరరావణుండెడద మోహముతోగిరిజన్ స్మరించెనే
రిప్లయితొలగించండిమందుముమందబుద్ధులకు మాత స్వరూపముతెల్యవచ్చునా?
నందినిపందిగాదలప నామెపిశాచమయెన్, భ్రమన్ ,వ్యథన్
పందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై
శంకర్ జీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'స్వరూప మెఱుంగవచ్చునా' అనండి.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం
రిప్లయితొలగించండిసుందరుడే! మీయన్నని
పందినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్!!
కుందక, భక్తులనరె మీ
కెందున బేధమ్మని? శివ యీశ్వరు నెంచెన్!!!
సహదేవుడు గారూ
తొలగించండినిజంగా అద్భుతంగా ఉంది మీ పూరణ అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిగండూరి లక్ష్మినారాయణ గారి పూరణ ..
రిప్లయితొలగించండిపందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై
తొందర పాటులో, నది సుదూరము వెళ్ళియు మాయమౌటచే
కుందెను మోస పోతినని, క్రూరులు దైత్యుల మూర్ఖ చర్య తా
నెందు కెరుంగడాయె మరి యీశునకైన మతిభ్రమించునే!
గండూరి వారూ
తొలగించండిమీ పూరణ బాగున్నది అభినందనలు
కంది గురూత్తమా! గిరిజ కాయపు శ్యామల వర్ణమట్లుగా
రిప్లయితొలగించండిపందియు నల్లనైనను భవానికి దానికి పోలికా చిదా
నందుడు విశ్వనాథుడు సనాతనుడద్రిజనేడిపించ తా
*"పందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై"*
ఉత్పలమాల
రిప్లయితొలగించండిపొందితి మీ వరమ్ము నది ముందుగ మీ తలఁ జేయి బెట్టఁగా
నందుమటంచు పై కురుక నాసురు నాపి ప్రలోభ పెట్టుచున్
సుందరి యౌచు నొంచ హరిఁ జుట్టుచు మోవిని దొండపండు చూ
పం దిని జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై
సవరించిన పూరణ
రిప్లయితొలగించండిసుందరి యందమున్ గనిన చోద్యము నొందుచు బ్రాంతినొం దగా
పొందును కోరగా దరిని పూవిలు కానికి మోదమొం దగా
డెందము నందునన్ మెలపు లీలలు పొంగుచు మోహహినిన్ గనన్
పందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁ డై
మరో సరదా పూరణ:
రిప్లయితొలగించండిఈమధ్యే పంది ప్రధాన పాత్రగా 'అదుగో' అనే సినిమా వచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే విడుదలైనరోజే పోదామని పంతం పట్టి శంకర్రావును బలవంతపెట్టి తీసుకెళ్ళింది ఆయన భార్య పార్వతి. ఇక తర్వాత చూస్కోండి.
(దర్శక నిర్మాతలకు క్షమాపణలతో)
తొందరగా ముందుగ పద
మందా సుందరి సినీమ 'అదుగో' చూడన్
చిందులు వేసెను నచ్చక
*"పందినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్"*