10, నవంబర్ 2018, శనివారం

సమస్య - 2842 (లయమే శాంతిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"లయమె శాంతిఁ గూర్చు నయముగాను"
(లేదా...)
"లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారమయ్యే బండకాడి అంజయ్య గౌడ్ గారి సమస్య)

97 కామెంట్‌లు:

  1. భయమే బాపడె విశ్వనాథుని మదిన్ ప్రార్థించ కైమోడ్చుచున్!

    అయమే యివ్వడె ఫాలనేత్రుని సదా యర్థించ వేవేలగన్ !

    రయమే బ్రోవడె కోవెలేశ్వరుని నారాధించ సద్భక్తి ; నా

    లయమే శాంతిని గల్గ జేయును గదా రంజిల్ల సన్మార్గమై


    ~ ఆకుల శాంతి భూషణ్

    వనపర్తి

    రిప్లయితొలగించండి

  2. దయనే యించుక లేని క్షుద్ర దనుజుల్ దండింప గీర్వాణులన్

    రయమున్ వేల్పులు నాశ్రయింప ఘనుడౌ లక్ష్మీ పతిన్ ! రౌద్రుడై

    లయమే జేసియు దుష్ట దైత్వ గణమున్ రక్షించె లోకాల నా..

    లయమే శాంతిని గల్గ జేయును గదా రంజిల్ల సన్మార్గమై

                 
     ~ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి






                                

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో "వేవేలుగన్"... రెండవ పూరణలో "దయయే యించుక" అనండి.

      తొలగించండి
  3. శయనా గారము నందునన్ మురిపెమౌ సాకారమే కోరికల్
    భయమే దానవ రూపమున్ బలుక సౌభాగ్యమ్ము శోషిల్ల గన్
    నయమే శోభిలు సంతసం బునను నానారూ పముల్ జూపినన్
    లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై

    రిప్లయితొలగించండి
  4. క్షయమొందించు సమస్తపాప పటలిన్, సద్గోష్ఠులం జూపుచున్
    జయముల్ గల్గగజేయు జీవనమునన్, సర్వత్ర సత్కార్యసం
    చయముల్ చేసెడి శక్తినిచ్చు, యశముల్ సంధించు నుర్విన్ శివా
    లయమే శాంతిని గల్గజేయును గదా రంజిల్ల సన్మార్గమై.

    రిప్లయితొలగించండి
  5. మనసు నిండ ప్రేమ మహభాగ్య మనుకొని
    లయమె శాంతిఁ గూర్చు నయము గాను
    ద్వేష భావ మున్న శేషమై పగబూని
    కాటి వరకు వచ్చు కాలు డంట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మహాభాగ్యము'ను 'మహభాగ్య' మనరాదు.

      తొలగించండి
    2. మనసు నిండ ప్రేమ మమకార మొనరించు
      లయమె శాంతిఁ గూర్చు నయము గాను
      ద్వేష భావ మున్న శేషమై పగబూని
      కాటి వరకు వచ్చు కాలు డంట

      తొలగించండి
  6. స్వగతం:

    భయము వీడి భార్య బంధులందరి తోను
    దయను క్షమత వీడి దండమెత్తి
    ప్రియపు భార్య గూడి పెట్లు బెట్టెడియా ప్ర
    లయమె శాంతిఁ గూర్చు నయముగాను :)

    ప్రలయము = ప్రళయము ( ఆంధ్రభారతి)

    రిప్లయితొలగించండి
  7. ఆశుతోషు డౌచు నమలమౌ సద్భక్తి
    దనను గొల్చుచుండు జనుల కిలను
    సిరు లొసంగు కొరకు చేరిన శివుని ని
    లయమె శాంతిఁ గూర్చు నయముగాను.

    రిప్లయితొలగించండి
  8. శంకరాభరణం...
    10, నవంబర్ 2018, శనివారం

    సమస్య

    లయమె శాంతిఁ గూర్చు నయముగాను

    నా పూరణ : ఆ.వె
    *** **** **

    పాప నాశకుండు ఫాలాక్ష దేవుండు

    శిష్ట రక్షకుండు దుష్ట శిక్ష

    కుండు దేవదేవు డుండు ఘనమగు నా

    లయమె శాంతి గూర్చు నయముగాను

    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె.
    మాటలాడ నాకు మానసోల్లాసమే
    మోము సూసి నేను మురిసిపోదు
    నవ్వుల చిరునామ నాప్రియ హృదయని
    లయమె శాంతిగూర్చు నయముగాను

    రిప్లయితొలగించండి
  10. నియతి న్ శంభు ని బూజ సేయు చు సదా నిత్యుఁన్ మహా దేవునిన్
    దయ జూపిoపగ వేడుచున్ స్తవ ము తో దారు ఢ్య భక్తా ళికిన్
    ప్రియ మారoగ పరాత్పరున్ స్మరణ తో ప్రీతిన్ ధరిత్రి న్శివా
    లయమే శాంతి ని గల్గ జేయును గదా రంజిల్లుసన్మార్గమై

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    భయమున్ వీడి *నమశ్శివాయ* యనుమా ! భద్రమ్ముఁ జేకూర్చగాన్
    లయకారుండు దయాంతరంగుడగు నానందస్వరూపుండునౌ !
    జయమున్ గూర్చును , ముక్తినిచ్చును , పునర్జన్మమ్ముఁ ద్రోయున్ ! శివా...
    లయమే శాంతిని గల్గజేయును గదా ! రంజిల్ల సన్మార్గమై !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏 *వందే భారతమాతరమ్* 🙏

      ఆర్ష విద్య యనెడి యమృతమ్ము త్రాగించి
      ధర్మపథము నేర్పి ధైర్యమునిడు !
      మునులు తిరిగినట్టి పుణ్యభారత కువ...
      లయమె శాంతి గూర్చు నయము గాను !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

  12. అదితి సుతుల తతిని ననయము బాధించు

    తపసి జాలమునకు తాపమిడెడు

    దుష్ట దనుజ కులము దునుము కేశవుడు; నా...

    లయమె శాంతి గూర్చు నయముగాను

    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దునుము కేశవుని యా।లయమె...' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  13. అయథార్థానుభవంబునన్ మునిగె! నీ నామార్చ నాదుల్ శివా
    నియతిన్ భక్తిగ జేయుచున్ శివహరా నీవాది దైవంబుగా?
    భయతాపాదులు బాపవేమి? యిక నాథారమ్ము నీతోన నా
    లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై
    🙏🙏🙏🌹🌷🌹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో శివా అని సంబోధించారు. రెండవ పాదంలో 'శివహరా' అన్నారు. శివ, హరా అన్నవి సంబోధన లనుకుంటే పునరుక్తి అవుతుంది. అది సమాసం అనుకుంటే అపార్థదోషం ఉన్నది. కనుక 'శివహరా' అన్నచోట 'పురహరా' అంటే బాగుంటుందని నా సూచన.

      తొలగించండి
    2. శ్రీ గురుభ్యోనమః .... 🙏🙏🙏

      అయథార్థానుభవంబునన్ మునిగె! నీ నామార్చ నాదుల్ శివా
      నియతిన్ భక్తిగ జేయుచున్ పురహరా నీవాది దైవంబుగా?
      భయతాపాదులు బాపవేమి? యిక నాథారమ్ము నీతోన నా
      లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై

      తొలగించండి


  14. సత్వరముగ జనులు సత్యము గాన, జి
    లేబి, మదిని భళి చిలికి పయి గల
    తత్ప రమును గాన, తరముగ నాతని
    లయమె శాంతిఁ గూర్చు నయముగాను!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. డా. పిట్టా సత్యనారాయణ
    ధ్యాన,యోగ,జపము,ధర్మ పద్ధతులను
    కామ, క్రోధ,లోభ గములు దప్ప
    మదము, మత్సరాది మరి మోహమను శత్రు
    లయమె శాంతి గూర్చు నయముగాను

    రిప్లయితొలగించండి
  16. డా. పిట్టా సత్యనారాయణ
    నియతిన్ బాండవులుండ గౌరవులకే నిద్రాస్థితుల్ మృగ్యమై
    జయమున్ బొందగ గోరి రేగ దివికిన్ జాజ్జ్వల్య హృద్వేగియౌ
    నయ సంచాలక ధర్మరాజు కలతన్నా కృష్ణుడే దీర్పడే
    లయమే"శాంతి"ని గల్గ జేయునుగదా రంజిల్ల సన్మార్గమై

    రిప్లయితొలగించండి
  17. లయవిన్యాసపునాట్యభంగిమలుసర్వంబున్ విశాలంబునై
    మయినందంతయు బూడిదన్బులుము తన్మాహాత్మ్యలింగం బునై
    భయమేదొల్గగ ఆంజనేయుడటు కాపాడన్ శుభంబౌ శివా
    లయమేశాంతి ని గల్గజేయునుగదారంజిల్ల సన్మార్గమై
    కొరుప్రోలు రాధాకృష్ణారావు మీర్ పేట్ హైదరాబాద్

    రిప్లయితొలగించండి
  18. సమస్య :-
    "లయమె శాంతిఁ గూర్చు నయముగాను"

    *ఆ.వె**

    తల్లిదండ్రులుండి పిల్లపాపలతోడ
    సంతసమున సాగి జయము గూర్చు
    ప్రేమ పంచు నట్టి పెండ్లామె యున్న ని
    లయమె శాంతిఁ గూర్చు నయముగాను
    .....................✍చక్రి

    రిప్లయితొలగించండి
  19. లయమే యన్న శివైక్యమే గదర! సర్వావస్థలన్ నేర్పుగా
    నియమంబున్ తమ జీవితాంతము సదా నిష్కామ యోగంబునన్
    క్రియలున్ సల్పుచు దేవ దేవుని మదిన్ గీర్తించు జీవాత్మకున్
    *"లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై"*

    రిప్లయితొలగించండి
  20. దయతో జూచుచుపేదసాదలను చిత్తమ్మందు సంప్రీతితో
    భయమున్ వీడి ధరిత్రిపై చనుచు సద్భక్తిన్ జటాజూటునిన్
    లయకారుండగునంబరాంబరుసదా ప్రార్థించుచో, వాని యా
    లయమే శాంతినిఁ గల్గ జేయునుగదా రంజిల్ల సన్మార్గమై

    రిప్లయితొలగించండి
  21. నయమున్ గల్గగ జేయుచున్ మది మనస్తాపమ్ముతగ్గించుచున్
    భయమున్ బాపుచు బంధనమ్ములను సంబాళించుచున్ సర్వదా
    నయగారమ్ముగ భాసిలున్ జగతి కానందమ్ము చేకూర్చు నా
    లయమే శాంతిని గల్గ జేయును గదారంజిల్ల సన్మార్గమై..!!!

    రిప్లయితొలగించండి
  22. పాపభీతితోడ పరితపించినగాని
    మనసు కుదురు లేక చనిన గాని
    బాధభయము దీర్చు పరమాత్ము డుండు నా
    లయమె శాంతి గూర్చు నయము గాను !!!

    రిప్లయితొలగించండి
  23. రిప్లయిలు
    1. పునరావృత్తిరహితమోక్షస్థానశ్రీహరిపదములందు లయమే శాశ్వతశాంతిదాయకము.

      క్రయవిక్రేయఫలప్రదానసదసత్కార్యమ్ములం జేసినన్

      నియతిం గూర్చవు నిత్యవాసమును, జన్మించున్ భవిష్యత్తునన్,

      స్వయమె వ్వాని పదాశ్రయమ్ము పునర్జన్మంబుఁ బోకార్చు, త

      ల్లయమే శాంతిని గల్గజేయును గదా! రంజిల్లసన్మార్గమై.

      కంజర్ల రామాచార్య
      కోరుట్ల.

      తొలగించండి
  24. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2842
    సమస్య :: లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై.
    సృష్టి స్థితి లయలలో ఒకటైన లయము శాంతిని కలిగిస్తుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
    సందర్భం :: పరమ శివుని తత్వమైన లయము ఏ విధంగా శాంతిని కలిగిస్తుంది? అని ఒకరు ప్రశ్నింపగా “ఈ ప్రపంచము బంధనములకు నిలయము. రుద్రభూమి యైన భవాలయము ఎటువంటి భేదములూ లేకుండా సమభావాన్ని కలిగియుండాలని బోధించి వైరాగ్యాన్ని తద్వారా శాంతిని అదించగల దేవాలయం ఔతుంది” అని జాషువా మహాకవి తన పద్యరత్నాలలో చక్కగా తెలియజేసి యున్నారు. కాబట్టి శివుడు నివసించే యీ భవాలయమే మనకు భేదములను వైరములను తొలగిస్తుంది. ఈ రుద్రభూమియే మనకు శాంతిప్రదాయకమైన మార్గమును చూపించేదిగా కూడా ఉంటుంది అని విశదీకరించే సందర్భం.

    లయ మేరీతిని శాంతిగూర్చు ననుచున్ ప్రశ్నింపగా, బంధనా
    లయమే యౌను ప్రపంచ మెన్న, ఘన వైరాగ్య ప్రద మ్మైన యా
    లయమే చూడ శ్మశానభూమి యనె లీలన్ జాషువా; యీ భవా
    లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (10-11-2018)

    రిప్లయితొలగించండి
  25. గురువు గారికి నమస్సులు.
    శాస్త్రములను తరచి శ్రద్ధగా చదువగాన్
    సంధ్య వార్చు సమయ సత్య నిష్ఠ
    నాయకుడగు నానంద ప్రకృతిని
    లయమె శాంతి గూర్చు నయము గాను

    రిప్లయితొలగించండి
  26. లయ కారుండును,శైలజాపతి,తపో లౌల్య ప్రదీప్తుండునై
    నయనానందముఁగూర్ప లింగముగ,గణ్యంబైన నందీశ్వరుల్
    దయఁజూపించుచు ఠీవిగా నిలువ,నిత్యానందదంబై,శివా
    లయమే శాంతినిఁగల్గఁజేయునుఁగదా రంజిల్ల సన్మార్గమై

    రిప్లయితొలగించండి
  27. కడుపు గుడగుడమన, కానగ శౌచాల
    యమును తిరిగి తిరిగి యలెసె నేను
    దొరికి చాటు, బాధ తొలగి, దీరగ నావి
    లయమె శాంతిఁ గూర్చు నయముగాను

    రిప్లయితొలగించండి
  28. అభ్యుదయము నడ్డు నన్ని పాపాల
    రంజన జఱచెడి యరాచకాల
    హింస గలుగ జేయు ధ్వంసకారకముల
    "లయమె శాంతిఁ గూర్చు నయముగాను"

    రిప్లయితొలగించండి
  29. భయముజెందవలదు భవరోగమంటిన
    కలతలేల యేల కలవరమ్ము
    మనసునందు నిల్ప మాహేశ్వరుని యాని
    లయమె శాంతిఁ గూర్చు నయముగాను

    రిప్లయితొలగించండి
  30. భయభక్తుల్ గలవారి నేవిధముగన్ బాధింపవే కష్టముల్
    దయతో బ్రోచెడి యమ్మవారు కలుగన్ దారిద్ర్యమే లేదుగా
    జయమున్ బొందగ నంతరంగముననే స్థాపింపనా కాళికా
    లయమే శాంతిని గల్గ జేయును గదా రంజిల్ల సన్మార్గమై

    రిప్లయితొలగించండి
  31. ( సైరంధ్రికి మనశ్శాంతి కలిగిస్తున్న నర్తనశాల )
    కీచకాధము వధ కెంతొ మనమునందు
    తపనపడుచునున్న ద్రుపదసుతకు
    భీమనిర్ణయమగు భామినీనర్తనా
    లయమె శాంతి గూర్చు నయముగాను .

    రిప్లయితొలగించండి
  32. జయమున్గల్గునుబాధలున్దొలగునాశాజ్యోతితానైశివా
    లయమేకాంతినిగల్గజేయునుగదారంజిల్లసన్మార్గమై
    వియదాకాశముజూడగాబొదలునావిశ్వాత్మురూపంబుసూ
    లయకారున్గొలువంగనత్తఱినిఫాలాక్షుండెయిచ్చున్సిరుల్

    రిప్లయితొలగించండి


  33. భయమేలన్ సఖి! పెండ్లయెన్ గద! పతిన్! భార్యామణీ ప్రేయసీ
    ప్రియుడన్! రావె శుభాంగి ! కొమ్మ! భువిలో ప్రేయస్సులన్గాంచి నా
    శ్రయమున్ గోరుచు నీశుచెంత చెలిమిన్ సంపర్కమై చూడ నా
    లయమే శాంతిని గల్గ జేయునుగదా రంజిల్ల‌ సన్మార్గమై!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  34. నయగారంబుల తోడు గాను రమణీ నారీమణీ నా జిలే
    బియ! సాకారము జేసుకొందమిక శోభిల్లన్ రతిన్, మాధురీ
    శయనాగార మిదే శుభాంగి సుఖమౌ సంపర్కముల్గాన నా
    లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  35. వయసాయెన్ సయి వల్లకాడు బిలిచెన్ వార్ధక్యవేళాయెరా
    భయమాయెన్ గద జీవితమ్మన, ప్రభూ ప్రారబ్ధకర్మల్ వెసన్
    నియతిన్ గుర్తుకు తెచ్చె నీదు పదముల్ నేవీడకన్ నీకెడన్
    లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  36. ఆకాశవాణి హైదరాబాదు:
    (గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి పూరణ)

    భయమౌ చుండగ దేహధారణము భీభత్సంపు సంసారమున్
    నయగారమ్మున దైవచింతనము నానందమ్ముగా కూర్చగా
    నయమౌచుండగ క్రోధ కామములు నానా రీతి వృత్తుల్..మనో
    లయమే శాంతిని గల్గ జేయును గదా రంజిల్ల సన్మార్గమై...


    రిప్లయితొలగించండి
  37. పుస్తకమ్మె గొప్ప బోధకుం డు నిజము
    దాని మించు సంపదలవి లేవు..
    చింత మదిని కలుగ చేరెద పుస్తకా
    లయమె; శాంతి గూర్చు నయము గాను

    రిప్లయితొలగించండి
  38. హర హర శివ యనుచు న భవు సంస్మరణ ము
    ప్రతి దినము ను సల్పి భక్తి పర వ
    శులుగ జనులు వెడల సుర వంద్యు రుద్రునా
    లయ మె శాంతి గూర్చు నయము గాను

    రిప్లయితొలగించండి
  39. ఈర్ష్యభావమదియయిసుమంతజూపక
    యత్తమామలయెడరక్తిగలని
    లయమెశాంతిగూర్చునయముగానుభువిని
    శివుడుకాచునెపుడుసిరులనిచ్చి

    రిప్లయితొలగించండి
  40. లయము లేని వాడ లయకారుడా నీ ని
    లయమెచటర? పితృ వనమున? ,శైల
    నిలయమా? ననుగన నీవెరా నీతోను
    లయమె శాంతిఁ గూర్చు నయముగాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లయము లేని వాడ లయకారుడా నీ ని
      లయమెచటర? పెతరులపుడమి? గిరి
      నిలయమా? ననుగన నీవెరా నీతోను
      లయమె శాంతిఁ గూర్చు నయముగాను

      తొలగించండి
  41. నియమ నిష్ఠ లందు నిరుప మానమగుచు
    మాయ చేసి నట్లు మనసులోని
    భయము లన్ని తొలగి భక్తిని పెంచు నా
    లయమెశాంతి గూర్చు నయముగాను
    - ముద్దు రాజేంద్ర ప్రసాద్

    రిప్లయితొలగించండి
  42. కలి యుగమ్ము లోనఁ గాంతుమె సుఖమును
    రేవగళ్ళు వంత లావరించు
    నరుగ నర వరేణ్యు లమర లోకమ్ములు
    లయమె శాంతిఁ గూర్చు నయముగాను


    నియమ క్షీణుఁడు రావణుండు వర మౌనివ్రాత విద్రావణుం
    డు యథాజాతుఁడు రాక్ష సాన్వయుఁడు దుష్టుండున్ జగత్కంటకుం
    డు యశఘ్నుండు కులాంతకుండు దశ కంఠుం బంప ఘో రాంతకా
    లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై

    రిప్లయితొలగించండి


  43. నేటి ఆకాశ వాణి సమస్యా పూరణ లింకు :)


    https://varudhini.blogspot.com/2018/11/10th-nov-2018.html


    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  44. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వయసే మీరగ గాన లేక నెటు నా భార్యామణిన్ మాలులో
    భయమౌచుండగ వెంటవెంటనిక నే పారంగ శోకమ్ముతో...
    నయమై పోవును కేటరేక్టు వినుమా నామాటయన్ లోచనా
    లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై....

    http://gpsastry.blogspot.com/2011/09/1-something-vision.html?m=0

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. Only GPS can write such lively satires :) kudos !


      జిలేబి

      తొలగించండి
    2. WoW!!!

      Thank you! By the way, after my wife passed away and my Daughter-in-Law became my guardian angel 6 years back, I was made to undergo surgery in both my blind eyes...as young now as my 8-year-old Ishani...

      తొలగించండి
  45. కోరు వరము లిచ్చు కొంగుబంగారమై
    నిలిచియుండు దేవుడిలను గుడిని
    ముక్తి పథముఁ గోరు మోక్షగామి కిక నా
    లయమె శాంతి గూర్చు నయము గాను

    రిప్లయితొలగించండి
  46. నియమమ్మేదియు లేదు ముక్తి పథము నన్వేషింపగా గాంచరో
    భయమున్ దీర్చెడు వాడొకండనుచు విశ్వాసమ్ముతో నా నిరా
    మయుడైనట్టి పరాత్పరున్ గొలువ సన్మార్గమ్ము గా నెంచెడా
    లయమే శాంతిని గల్గజేయునుగదా రంజిల్ల సన్మార్గమై.

    రిప్లయితొలగించండి
  47. జనన మరణ భయము జన్మించ మనమున
    కర్మ బంధనముల గాల్చగాను
    గరళకంఠు గొల్వ కరుణను నిజమనో
    లయమె శాంతి గూర్చు నయముగాను!

    రిప్లయితొలగించండి
  48. సవరణతో...
    ..............��శంకరాభరణం��...............
    ..................����‍♂సమస్య��‍♀....................
    "లయమె శాంతిఁ గూర్చు నయముగాను"

    సందర్భము: ఈనాడు టివి ఫ్రిజ్ సెల్లు కారు ఒకటేమిటి రక రకాల వస్తువులను సేకరించడంలోను, కొనడంలోను ఆధునిక మానవుడు తన శక్తి యుక్తు లన్నీ వెచ్చిస్తూ అనేక శ్రమలకు గురి యౌతున్నాడు.
    ఇ దంతా సుఖ మనుకుంటున్నాడు. కాని సుఖ భ్రాంతియే నన్న యథార్థాన్ని గ్రహించలేకపోతున్నాడు. అప్పులలో కూరుకొనిపోయి తిప్పలు పడుతున్నాడు. అశాంతికి లోనవుతున్నాడు.
    అనవసరమైన అతివేలమైన వస్తు సంచయేచ్ఛ గురించి ఈ పద్యంలో పేర్కొనబడింది.
    ఆటవెలది సమస్యను తేటగీతిలో పూరించడం మరో విశేషం..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఆనందమే గాని యవనిలో వస్తువుల్
    కావలసిన వౌనె! కానె కావు
    పరిమిత వస్తువుల్ పరిపూర్ణ మానంద
    మీయంగ జాలునే మేదినిపయి!
    మనసు మరలినంత మనకును వస్తువుల్
    ప్రియములౌ.. నటులగా కప్రియములె
    నిజము తర్కింప ననిత్య వస్తువులతో
    సంబంధముననే యశాంతి గలుగు..
    నొక సమస్య వెంబడి మరియొక సమస్య..
    ధరణి దుఃఖాలయ మశాశ్వతమ్ము భవము..
    భయ నిదానము; శివుని యాలయమె శాంతిఁ
    గూర్చు నయముగాను. శివుని
    గొలుచు కొనుడు.

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    10.11.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  49. భావగీతములకు జీవసంగీతాన
    సరిగమపదనిస విశాలమైన
    మనసునందు కలతమటుమాయమునుజేయు!
    లయమె శాంతిగూర్చు!నయముగాను!

    రిప్లయితొలగించండి
  50. ఎంత భక్తి యున్న కాంతనపహరించె
    ఆత్మ లింగ మొందె ఆర్ద్ర తోను
    ఎన్ని యున్న లాభ మేమిరా అరివర్గ
    లయమె శాంతిఁ గూర్చు నయముగాను

    రిప్లయితొలగించండి
  51. వయసే మూలము భోగలాలసకు పాపమ్మంచు భావింపకన్
    ప్రియురాలే తన కిష్ట దైవమవగన్ ప్రేతాత్మలే పెద్దలన్
    మయికమ్మందున మున్గు వారికిల కామమ్మొక్కటే ముఖ్యమై
    లయమే శాంతిని గల్గజేయును గదా రంజిల్ల సన్మార్గమై

    రిప్లయితొలగించండి
  52. పనుల భారమందు తనువలసిన వేళ
    పడక టింట నిదుర పట్టనపుదు
    కలికి ప్రేమ జూపి కౌగిలించినచాలు
    లయమె శాంతి గూర్చు నయము గాను.

    రిప్లయితొలగించండి
  53. పై య్యధికారుల పౌషము,పెరిగిన కార్యాలయపు పని, కరుగు చున్న
    శక్తి, పెరగనట్టి సంబళము, ఋణదాతల పోరు,నిత్యముద్వర్తనమ్ము ,
    తెలియని యలజడి, తెమలని యోచన తో, శయ్య చేర సంతోషమిడెడు
    గృహిణి, లయమె శాంతి గూర్చు నయము గాను, ముదముగ పెదవుల ముద్దులనిడి

    సరస ముగ తలను నిమిరి, వెరవగ వల
    దనుచు మాటల చెప్పుచు, వెనుక నేను
    గలనని సతి ధైర్యమునిడ ,కష్ట మంత
    మరచి సంతస మొందును మగడు నెపుడు


    లయము కౌగిలి

    రిప్లయితొలగించండి
  54. సత్వ గుణము గలిగి సత్యసాయిని దల్చి
    నిత్యపూజజేయ నిక్కముగను
    మనసె మందిరమవ మౌనమేతగినదౌ
    లయమె శాంతిఁ గూర్చు నయము గాను!!
    -----యెనిశెట్టి గంగా ప్రసాద్
    కామారెడ్డి

    రిప్లయితొలగించండి
  55. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అయమున్ గూర్చెడి నీతి ధర్మముల నావర్తించు సచ్చీలత
    న్నియమమ్మెంచుచు భక్తితో సతము నీశానున్ ప్రశంచించుచున్
    దయనే గోరుచు నిత్యమీవరిగి తాదాత్మ్యంబు నొందున్ శివా
    లయమే శాంతిని గల్గజేయును సదా రంజిల్ల సన్మార్గమై

    రిప్లయితొలగించండి
  56. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నీతి వర్తనమ్ము నెగజూపకుండుచు
    భయము భక్తి గలిగి భ్రమణ మొందు
    భాగవతులకెల్ల పరమేశ్వరుని శివా
    లయమె శాంతిగూర్చు నయముగాను

    రిప్లయితొలగించండి
  57. సుతుడైన ప్రహ్లాదుడు వైరి శ్రీహరిని భజించడంతో అశాంతికి గురైన హిరకశిపుని మనోగతం...

    మత్తేభవిక్రీడితము

    భయమే చూపక వైరి యన్న మనకున్ బ్రహ్లాదుఁడా శ్రీహరిన్
    నియతిన్ గొల్చును భక్తిఁ! దండ్రియగు నన్నేమాత్రమున్ దల్చడే!!
    నియమింతున్ గురుకోటి నాదు భజనల్ నేర్పిం చగన్, బోధనా
    లయమే శాంతిని కల్గజేయును గదా రంజిల్ల సన్మార్గమై

    రిప్లయితొలగించండి
  58. భయమింతైనను గల్గనీక గురువుల్ పాండిత్యమున్ జూపకన్
    నియమాలున్నను లేనియట్లుగనే నేర్పించు వారున్ననా
    రయ విద్యార్థులకా బడే ధరణిలో రమ్యంబునౌ; ఈ సదా
    లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై

    రిప్లయితొలగించండి
  59. జయమున్ గూర్పగ గద్దెనెక్కి జనులన్ సాంతమ్ముగా దోచుచున్
    భయమొక్కింతయు లేక యేలుబడిలో భారమ్ముగా మారుచున్
    నియమాలన్నియు దుంగలో గలుపునా నీచమ్మునౌ పాలనా
    లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై !

    రిప్లయితొలగించండి