8, నవంబర్ 2018, గురువారం

కౌస్తుభ చిత్ర బంధ సీసము


శివ ప్రార్ధన

శ్రీ శృంగి నాదా! గిరిసుత వల్లభ!  శితి
          కంఠ! కాలాంతకా! ఖరువు! హీర!
అర్ధనారీశ్వర! అలరు సాయకు వైరి!
          పంచ వదన! పశుపతి!  మలహర!
విలయ దర్శక! భూరి!జలధి తూణీరుడ!
           కరకంఠ!అనలాంబక!పరమేశ!
ఖట్వాoగి! ఉగ్రాక్ష!కామారి! ముక్కంటి!
            పురభిత్తు! మరుగొంగ! భూతరాట్టు!
అసమ నేత్ర! ఈశానుడ! అచల! శూలి!
పర్వత తనయ మది చోర! భవుడ! పాశు
పతుడ!బేసికంటి! కపర్ది! భద్ర!  నైక
మాయ!   నాకు నొసగుము శమము వినయము

ఈ  పద్యము లోని విశేషము   మధ్య  గడిలోని (పసుపు పచ్చ రంగు గల) అక్షరములు బంధించ బడినవి .
“శ్రీగిరి శిఖర దర్శనము సర్వ పాప నాశనము “   అన్న వాక్యము బందిమ్చబడినది 


                                                            బంధ కవి   పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి