30, ఏప్రిల్ 2015, గురువారం

శ్రీశ్రీ

నేడు శ్రీశ్రీ జయంతి


మత్తేభమాలిక
ధన శార్దూల నఖ ప్రహృష్ట నర రక్త క్రవ్య దివ్యాంజనా
రుణ రాజీవ సుమమ్ములున్ ప్రకట వర్ణోద్భాసితానంత దు
ర్జన సంపీడిత శ్రామికాళి ధృత ఘర్మాంభోభిషిక్త క్రియా
జనితేందీవరముల్, దయాకలిత విశ్వస్తుత్య సద్భావనా
ఘన సౌగంధ్య మరంద బిందు లహరీ కల్హార సంఘాతముల్
జన చైతన్య మనోజ్ఞ రమ్య కవితా సంచార సమ్మోహితా
ర్జన దిక్పూరిత సద్యశ స్సహిత రాజత్ పుండరీకమ్ములున్
ఘన వర్షానల పీడిత ప్రకర జన్మాసక్త శైవాలముల్
కనిపించున్ భవదీయ దివ్య కవితా కాసార నీరమ్మునన్
ఘన శైలాగ్ర ఝళంఝళత్ రవ ఝరీ గంగాపగా తుల్య గే
య నికాయాశ్రిత వాక్పటుత్వ పద విన్యాసాద్భుత ప్రాస ని
ల్చెను. ఝంఝానిల మారుతమ్మువలె. శ్రీ . శ్రీ . కావ్య మద్దాని నే
మని వర్ణించెద నందు గన్పడు సుధా మాధుర్య గేయమ్ము. హా
యిని కల్గించి రసాను భూతి నిడుచున్ హృద్వీథిలో ప్రీతి ని
ల్పిన యా శైశవగీతి. దుఃఖిత జనాళిన్ గాంచి నీ దివ్య లే
ఖిని చిందించెను యశ్రు తర్పణము దిక్కేలేక అల్లాడు ఆ
మనుజాళిన్ గని నేను సైతము ప్రపంచాగ్నిన్ జ్వలింపంగ వే
తును బాధాంచితమైన ఓ సమిధ, మ్రోతున్ గొంతు పోవంగ పా
వనమౌ యీ భువనంపు ఘోష కనుచున్ బ్రహ్మాండమే చిట్లగా
ధన మత్తేభ దురంత కుంభముల విధ్వస్తమ్ము గావించి వం
చనచే పీడిత కర్షక ప్రజల విశ్వాసమ్మునే దోచు దు
ర్జన భూస్వామ్య మదాంధ వర్తనుల దౌర్జన్యమ్ము ఖండించి జీ
వన వారాశిన బూర్జువా అలలు దుర్వారమ్ములై పేదలన్
అను నిత్యమ్మును ముంచి వేయ కవితా నావన్ ప్రసాదించి వా
రిని మేల్కొల్పిన నిన్ను నెన్న తరమా! శ్రీ. శ్రీ. కవీ! వాక్ఛవీ!

రచన:- శ్రీ మద్దూరి రామమూర్తి గారు

సమస్యా పూరణము - 1661 (పద్యరచన నల్లేరుపై బండినడక)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పద్యరచన నల్లేరుపై బండినడక.

పద్య రచన - 895

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

29, ఏప్రిల్ 2015, బుధవారం

28, ఏప్రిల్ 2015, మంగళవారం

సమస్యా పూరణము - 1660 (పరమశివునితో లక్ష్మియుఁ బవ్వళించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పరమశివునితో లక్ష్మియుఁ బవ్వళించె.
(‘ఆంధ్రామృతం’ బ్లాగునుండి చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో)

పద్య రచన - 893

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

27, ఏప్రిల్ 2015, సోమవారం

సమస్యా పూరణము - 1659 ("అన్నమొ రామచంద్ర!" యని యందరు చచ్చిన రామరాజ్యమే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"అన్నమొ రామచంద్ర!" యని యందరు చచ్చిన రామరాజ్యమే.
(కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో..)

పద్య రచన - 892

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.